Translate

Wednesday, May 29, 2019

విష్ణుపురాణ అంతర్గత ఆదిత్య రహస్యం

విష్ణుపురాణం సూర్య మండలం గురించి కొంత వివరంగా చెబుతుంది. చాలా క్రిప్టిక్ (నిగూఢo) గా ఆ వివరణ వుంటుంది.
సూర్యుడు ఒక ఏడు గుర్రాలు పూన్చిన రధం ఎక్కి మేరు పర్వతం చుట్టూ తిరుగుతూ ఉంటాడు అని, ఆ రధానికి రెండు ఇరుసులు ఉంటాయని, ఒక ఇరుసు 157 కోట్ల యోజనాల దూరం ఉంటుందని ఆ ఇరుసుకు మనకు సంబంధించిన కాల చక్రం బిగించబడి ఉంటుందని, ఆ చక్రానికి మూడు నాభులు ఉన్నాయని 12 అంచులు ఉన్నాయని, ఆ చక్రానికి 6 కడకమ్మలు ఉన్నాయని చెబుతుంది. సూర్యుడు ఎప్పుడూ మేరు పర్వతానికి దక్షిణం వైపుగానే ఉంటాడని చెబుతుంది.

ఒకసారి దీనిమీద మరింత లోతుగా చర్చిద్దాము.
అసలు సూర్యుడు ఏమిటి రధం ఎక్కడం ఏమిటి? నేటి సాంకేతికత పరంగా పురాణం చెబుతోందా? దీని మీద ఋషులు ఎన్నడో వివరణ ఇచ్చారు. మిగిలిన మతాలు, శాస్త్రజ్ఞులు కనుగొనక మునుపు నుండే మనం మనం నివసిస్తున్న ధరను భూగోళం అని వ్యవహరిస్తున్నాం. భూమి గోళాకారంలో ఉందని వేదం చెబుతోంది. దానికి ఉదాహరణకు ఒక్కసారి వరాహ అవతార విగ్రహాలను పరికించండి. కొన్ని వేల ఏళ్ళ క్రితం నుండి శిల్పశాస్త్రంలో ఈ విషయమై చూపుతారు. వరాహ స్వామీ కోర మీద భూమి ఒక గోళంగా చిత్రిస్తారు. ఇది ఎవడో ఒక్కసారి మేలుకుని నెత్తిమీద ఒక పండుదెబ్బతో తెలిసినది కాదు. మనకు ఎన్నటినుండో తెలిసి ఉన్న పరమ సత్యం. అంతేకాక సప్తద్వీపా వసుంధరా అని సంబోదిస్తాము. సప్త ద్వీపములు ఉన్నాయని సప్త మహా సముద్రాలు ఉన్నాయని మనకు ఉగ్గుతో నేర్పిన సత్యము.

మనం ఉదాహరణకు ఒక ట్రైన్లో ప్రయాణిస్తున్నాము అనుకోండి. ఒక ఊరికి దగ్గర పడ్డప్పుడు ఆ ఊరొచ్చింది, ఆ ఊరు వెళ్ళిపోయింది అని అంటాము. వాస్తవానికి ఆ ఊరు ఎక్కడకీ పోదు, రాదు. కేవలం మనం ప్రయాణం చేస్తున్నప్పుడు relative (సంబంధిత) గమనాన్నే చెబుతాము. మనకు తెలుసు శాస్త్రాదారంతో సూర్యుడు అక్కడే ఉంటాడు అని. నక్షత్రాలు అక్కడే ఉంటాయని, కానీ మనకు సమయం లెక్క కట్టడానికి వ్యవహార పరంగా సౌర్య మానం, చంద్ర మానం, సాయణం, నక్షత్రమానం గా ఎన్నో పద్ధతులు ఉన్నాయి. భూమి తన పైనున్న ఆకాశంలో నక్షత్ర మండలాల పరిధులలో సూర్యుని చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఉంటుంది. కానీ ఆ చేసే ప్రదక్షిణం ఒక 23.5 డిగ్రీల కోణంలో చేస్తుంది, అందువలననే మనకు దక్షిణాయానం, ఉత్తరాయణం లో వివిధ రకాలుగా దివారాత్రాలు ఉంటాయి. ఇక్కడ ఉన్న బొమ్మను చూడండి. ఒక cone (శృంగం) న్ని ఒక కోణంలో కత్తిరించినట్టు అయితే ఒక దీర్ఘవృత్తము (ellipse) వస్తుంది. ఆ కోణం యొక్క కోనను మనం ధ్రువపదం అని చెబుతాము. ఆ ధ్రువపదం మనకు రిఫరెన్స్ అన్నమాట. ఆ ధ్రువ పదానికి ఎప్పుడూ దక్షిణంలోనే సూర్యుడు ఉంటాడు. భూమి కూడా సూర్యునికి దీర్ఘ వృత్త మార్గంలోనే ప్రదక్షిణం చేస్తుంది. అందుకే మన భూమి ఒకసారి సూర్యునికి దగ్గరగా, ఒకసారి అత్యంత దూరంగా ప్రయాణం చేస్తుంది. పైన ఉన్న నక్షత్ర మండలం స్థిరంగా ఉంది అని మనం అనుకున్నప్పుడు భూమి ఆయా నక్షత్ర మండల పరిధులలో తిరుగుతుంది. ఆ మండలాన్ని మన ఋషులు 12 భాగాలుగా విభజించారు. ఇప్పుడు మనం భూమిని స్థిరంగా అనుకుని మిగిలినవన్నీ relative గా లెక్క కట్టినట్టు అయితే సూర్యుడు తిరుగుతాడు, పగలు ఉదయిస్తాడు, రాత్రికి అస్తమిస్తాడు. లెక్క కట్టడానికి మనకు సులువు, అందుకే మొట్ట మొదటి relativity గురించి ప్రస్తావన మన జ్యోతిష్య శాస్త్రమే చెబుతుంది.

ఇప్పుడు నిన్న 157 కోట్ల యోజనాలు సూర్యునికి భూమికి ఉన్న దూరం అని చెప్పుకున్నాము. అదే మనం గణించే కాల చక్రానికి ఆధారం. మూడు నాభులు పగలు, సాయం, నిశ(రాత్రి) కి సంకేతాలు, 6 కడకమ్మలు ఆరు ఋతువులకు నిగూఢనిరూపణ అయితే 12 అంచులు పన్నెండు నెలలకు సంకేతార్ధాలు. ఇదే కాక సూర్యుని రధం 36 లక్షల యోజనాల పొడవు అని చెబుతుంది. అలాగే సూర్యుని ఒక ఇరుసుకు నాలుగు గుర్రాలు, మరొక దానికి 3 గుర్రాలు కట్టబద్దాయని, రెండవ ఇరుసు 145 కోట్ల యోజనాలు అని చెబుతుంది. ఒక ellipse కు రెండు focal పాయింట్స్ ఉంటాయి. అవి రెండు ఒకే విలువ వుంటే అది ఒక సర్కిల్ అవుతుంది. ఇక్కడ సూర్యునికి అతి దగ్గరగా వెళ్ళినప్పుడు 147 మిలియన్ కిలోమీటర్లు దూరం ఉంటుంది, దూరంగా వెళ్ళినప్పుడు 152 మిలియన్ కిలోమీటర్లు దూరం. దానికి focal పాయింట్ గణిస్తే sqrt(a**2 – b**2) ఫార్ములా ప్రకారం అది సరిగ్గా 36 మిలియన్ కిలోమీటర్లు, సరిగ్గా వేదం చెప్పిన సూర్యుని రధం పొడవుకు సమానంగా.

కాబట్టి relative స్పీడ్ ఆధారంగా మనకు సూర్యుడు సప్తాశ్వరాధ -ఏడు గుర్రాల (VIBGYOR – ఏడు రంగుల ) రధం మీద మేరువుకు ప్రదక్షిణగా తిరుగుతాడు అని చెబుతారు. చూసే దృష్టి మార్చి చూస్తె మనకు వారు చెప్పిన పరమ సత్యాలు బోధపడతాయి. నేడు మనం కాంతి సంవత్సరం పరంగా గణిస్తున్నాము , మనం మాట్లాడే అంకెలు మారతాయి కానీ ఆ అంకెల ఆవల ఉన్న సత్యం, లోకం మారదుగా.

Tuesday, May 28, 2019

అబద్ధం ఎప్పుడు చెప్పవచ్చు? (సేకరణ-ఈనాడు పేపర్ నుండి)





ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: సనాతన ధర్మంలో సత్యమే ప్రమాణంగా ఉంది. భారతీయసంప్రదాయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అసత్యం చెప్పకూడదని పెద్దలు ప్రవచించారు. అయితే కొన్ని సమయాల్లో అబద్ధం చెప్పవచ్చని ధర్మం పేర్కొంటుంది.
అరణ్యవాసానికి బయలుదేరిన శ్రీరాముడు రథాన్ని అధిరోహించి సీతాలక్ష్మణ సమేతంగా వెళుతుంటాడు. పుత్ర వియోగం భరించలేని దశరధుడు రామున్ని ఆగమని కోరుతాడు. అయితే రథసారథి సుమంతుడిని రథం ఆపకుండా పోనీయమని శ్రీరాముడు ఆదేశిస్తాడు. అయితే రాజునకు ఏమని జవాబివ్వాలి అని సుమంతుడు సంకోచిస్తాడు. దీంతో శ్రీరాముడు ‘‘ నౌశ్రౌషమితి రాజా! సముపాలో లబ్దోపి వక్షిపి’’ అని చెబుతాడు. దీనర్ధం మాట వినపడికూడా వినపడలేదని చెప్పడం. దశరథుని మాటలు విని రాముడు వెనక్కు వెళితే అరణ్యవాసానికి వెళ్లవద్దని కూమారుడిని దశరథుడు ఆజ్ఞాపిస్తాడు. దీంతో దశరథునికి, శ్రీరామునికి అసత్యదోషం కలుగుతుంది. కానీ దశరథుని మాటలు వినపడలేదని సుమంతుడు చెప్పడం వల్ల పెద్దగా ధర్మదోషం ఉండదు. దీని వల్ల రాజు తొలుత ఇచ్చిన ఆజ్ఞను కుమారుడు పాటించే అవకాశం కలుగుతుంది.దీంతో ప్రియమైన అసత్యమే మంచిదని రాముడు భావించాడు.
అసత్యాన్ని పలకకూడదని చెప్పినా కొన్ని సమయాల్లో పలకవచ్చని బలి చక్రవర్తితో శుక్రాచార్యుడు చెబుతాడు. శ్రీమహావిష్ణువు వామనుడి రూపంలో బలిచక్రవర్తి వద్దకు వచ్చి  మూడు అడుగులు కోరుతాడు. వాటిని ఇచ్చేందుకు బలి సిద్ధమవగా అతను వామనుడు కాదని త్రివిక్రముడని బలితో ఈ విధంగా చెప్పాడు.


‘‘వారిజాక్షులందు వైవాహికము లందు 
బ్రాణవిత్తమానభంగమందు
జకిత గోకులాగ్ర జన్మరక్షణ మందు
బొంకవచ్చు నఘము పొందఁ దధిప!’’

చక్రవర్తి.. అసత్యాన్ని చెప్పవద్దని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. కానీ కొన్ని అత్యవసర సమయాల్లో అసత్యాన్ని చెప్పడం ధర్మమార్గం తప్పడం కాదు. 
ఆడవారి విషయంలో, పెండ్లి సందర్భాల్లో, ప్రాణాపాయ పరిస్థితుల్లో , మానభంగం కలుగు సందర్భంలోనూ, భయపడి పరిగెత్తే గోవులను కాపాడుకునేందుకు అసత్యాన్ని చెప్పవచ్చు. ఇప్పుడు నీవు అబద్దం చెప్పడం వల్ల ఎలాంటి పాపమురాదు అని శుక్రుడు సూచిస్తాడు.

Monday, May 27, 2019

ధర్మ మంజూష

"శ్లో" ప్రియేనాతి భృశం హృష్యేత్ అప్రియే నచనం జ్వరేత్,
నముహ్యేదర్ద కృచ్ఛేషు న చ ధర్మం పరిత్యజేత్."

భావము; ప్రియము లభించినప్పుడు అతిమాత్రముగా సంతోషింపకూడదు.

అప్రియము తటస్థించినప్పుడు అతిమాత్రముగా వ్యధనొందకూడదు.

దరిద్రము వచ్చినప్పుడు మనో వైకల్యము నందకూడదు.

ఏది తటస్థించినను ధర్మమును మాత్రము విడువకూడదు.

******************************

Friday, May 17, 2019

ఋణ విమోచన నృసింహ స్తోత్రం

దేవతా కార్య సిద్ధ్యర్థం సభా స్తంభ సముద్భవమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || 1 ||
లక్ష్మ్యాలింగిత వామాంగం భక్తానాం వరదాయకమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || 2 ||
ఆంత్ర మాలాధరం శంఖ చక్రాబ్జాయుధ ధారిణం |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || 3 ||
స్మరణాత్ సర్వపాపఘ్నం కద్రూజవిషనాశనమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || 4 ||
సింహనాదేన మహతా దిగ్దంతిభయనాశనమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || 5 ||
ప్రహ్లాద వరదం శ్రీశం దైత్యేశ్వర విదారిణమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || 6 ||
క్రూరగ్రహైః పీడితానాం భక్తానామభయప్రదమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || 7 ||
వేద వేదాంత యజ్ఞేశం బ్రహ్మ రుద్రాది వందితమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || 8 ||
య ఇదం పఠతే నిత్యం ఋణమోచన సంజ్ఞితమ్ |
అనృణే జాయతే సత్యో ధనం శీఘ్రమవాప్నుయాత్ || 9 ||

శ్రీ నృసింహ జయంతి శుభాకాంక్షలు

ఒక్క నిమిషం .... ఈ మహా మహిమాన్విత స్తోత్రం చదవండి .... ఈ స్తోత్ర మహాత్యం తెలుసుకున్నాక మీకు ఇష్టమైతే రోజూ భక్తితో పటించండి .........

శ్రీ నృసింహ స్వామి వారి ద్వాదశ నామ స్తోత్రం మహా మహిమాన్వితం శక్తివంతం,ఈస్తోత్రాన్ని భక్తిగా పఠిస్తే స్వామివారు మనకు రక్షా కవచంలా ఉండి కాపాడతారు.అతి భయంకర వ్యాధులు రుగ్మతులు నశిస్తాయి,భయంతొలగుతుంది,మీ ఇంట్లో ఉండే వారి కోసం కుడా ఈ స్తోత్రాన్ని పఠిన్చి స్వామి వారి అనుగ్రహం పొందండి ...

శ్రీ నృసింహ ద్వాదశ నామ స్తోత్రం...

ప్రథమంతు మహాజ్వాలో ద్వితీయం తు ఉగ్రకేసరీ ।
తృతీయం తు వజ్రదంష్ట్రశ్చ చతుర్థం తు విశారదః ॥
పంచమం నారసింహశ్చ షష్ఠః కశ్యపమర్దనః ।
సప్తమో యాతుహంతా చ అష్టమో దేవవల్లభః ॥
నవమం ప్రహ్లాద వరదో దశమోऽనంత హస్తకః ।
ఏకాదశో మహారుద్రో ద్వాదశో దారుణస్తదా ॥
ద్వాదశైతాని నామాని నృసింహస్య మహాత్మనః ।
మంత్రరాజ ఇతి జ్ఞాతం సర్వపాప వినాశనమ్ ॥
క్షయాపస్మార కుష్ఠాది తాపజ్వర నివారణం ।
రాజద్వారే మహాఘోరే సంగ్రామే చ జలాంతరే ॥
గిరిగహ్వర అరణ్యే వ్యాఘ్ర చోరామయాదిషు ।
రణేచ మరణేచైవ శమదం పరమం శుభమ్ ॥
శతమావర్తయేద్యస్తు ముచ్యతే వ్యాధి బంధనాత్ ।
ఆవర్తయత్ సహస్రం తు లభతే వాంఛితం ఫలమ్ ॥

ఓం శ్రీ లక్ష్మి నృసింహాయ నమః