Translate

Tuesday, August 27, 2019

తిలకధారణ

స్నానం దానం తపో హోమో దేవతా పితృకర్మచ
తత్సర్వం నిష్ఫలం యాతి లలాటే తిలకం వినా
బ్రాహ్మణాస్తిలకం కృత్వా , కుర్యాత్సంధ్యాన్య తర్పణమ్" !!

పుణ్య స్నానాలు చేసేటప్పుడు, దానం చేస్తునప్పుడు , తపస్సును ఆచరించేటప్పుడు, హోమం చేస్తునప్పుడు, దేవతార్చన చేసే సమయంలో, పిత్రుకర్మలను ఆచరిస్తున్నప్పుడు తప్పనిసరిగా నుదుటున తిలకధారణ చెయ్యాలి, లేకపోతే ఎటువంటి ఫలితాలని ఇవ్వవని , అదేవిధంగా బ్రాహ్మణులు సంధ్యావందనాన్ని చేసేటప్పుడు, తర్పణాలను విడిచేటప్పుడు , తప్పని సరిగా తిలకాన్ని ధరించాలని అర్ధం.

బ్రహ్మవైవర్త పురాణం లో "తిలకధారణ"

మైల / సూతకం (సేకరణ: చింతా గోపీ శర్మ సిద్ధాంతి గారి వాట్సాప్ పోస్ట్ ద్వారా)


మైల, సూతకం అనే విషయాలు ధర్మసింధు అనే గ్రంథంలో వివరించబడ్డాయి. తాశౌచ(పురుడు) మ్రుతాశౌచ(మైల) కాలాలో అందరూ, రజోదర్శన కాలంలో(ముట్టు) స్త్రీలు అస్ప్రుశ్యులుగా భావించబడతారు.

సూతకం రెండురకాలు.. జాతాశౌచం, మృతాశౌచం.
షోడశ సంస్కారాల్లో ఒకటి అశౌచం. చావు సంభవించిన ఇంటిలో నివాసముండడం మంచిది కాదనే నమ్మకంతో సంవత్సరకాలం ఆ ఇంటిని ఖాళీగా ఉంచుతారు. దీన్ని సూతకమని అంటారు.

సూతకం ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉండదు? ఎవరి ఇంట్లో శిశువు జన్మించింది? ఎవరి ఇంట్లో మరణం సంభవించింది? ఆయా ఇళ్ళల్లో నివసించే వారందరికీ మాత్రమే వర్తిస్తుంది. జాతికి, వంశానికి, గోత్రానికి సంబంధం లేదు. వారితో కలిసి కాక దూరంగా ఉండేవారికి వర్తించదు. 

కొత్తగా పెళ్లయిన అమ్మాయికి మేనమామ చనిపోతే మూడు రోజుల పాటు మైల ఉంటుంది. అయితే, అమ్మాయి భర్తకు ఉండదు. ఇది 12 రోజుల లోపు తెలిస్తే ఒక రోజు మైల ఉండును.

మన తెలుగు సంప్రదాయం ప్రకారం బ్రహ్మణ, క్షత్రియ, వైశులకు, మాత్రం తప్పనిసరిగా సంవత్సరికం వరకు గృహప్రవేశాదులు, దైవరాధానులు కూడా నిషిద్ధం. సంవత్సర సూతకం దాటిన తరువాతే వీటిని నిర్వహించే అధికారం ఉంది. ద్వెజీతరాలకు ఈ విషయాలలో కొంత సడలింపు ఉంది. చనిపోయినా మీ పెద్దలకు పితృపక్షంలో సంవత్సరికం చేసే ఆచారం ఉంటే మీరు గృహప్రవేశం చేసుకోవచ్చు. అలా పెద్దలో కలపకపోతే గృహ ప్రవేశం సంవత్సరికం దాటిన తరువాతే చేయడం శ్రేయస్కరం. తప్పనిసరి పరిస్థితి కలిగితే మీ ఆడబిడ్డలు ఎవరైన ఉంటే ఆ దంపతులు మీ వంశికులేవ్వరు కనుక  వారి చేత గృహప్రవేశం  చేయించి, మీ ఇంటిలో సంవత్సర కార్యం తరువాత అ నూతన గృహంలో మీరు నివసించవచ్చు. ఆ సందర్భంలో కూడా గణపతి, నవగ్రహ, వాస్తు హోమాలు నిర్వహించుకొని, మీ ఇష్టదైవ వ్రతం చేసుకుంటే జీవితం సుఖప్రదంగా  ఉంటుంది.

సనాతన ధర్మశాస్త్రాలను స్మృతులు అంటారు. వాటిలో ఈ విషయాలన్నీ నిర్ణయించారు. పురుడుని జాతాశౌచం అంటారు. జాత అశౌచాన్ని దేవాలయ అర్చకులు తప్ప మిగతావారు పెద్దగా పట్టించుకోరు. కొంతమంది పురుడు కలిపేసుకుంటే శుభమని అసలు అశౌచాన్నే పాటించరు. కాని గృహంలో జరుపుకునే ఆరాధనలు ఆ సమయంలో పదోరోజు వరకు పనికిరావు.

తల్లిదండ్రులు మరణిస్తే మృత అశౌచం తీరిపోయాక ఇంట్లో పూజలు మామూలుగానే చేసుకోవాలి. కొందరు ఏడాది దాకా దీపం కూడా పెట్టరాదంటారు. అది తప్పు. దీపారాధన మైల సమయంలో తప్ప ఎప్పుడూ ఆపకూడదు. మామూలుగా ఆలయాలలో దైవదర్శనం దోషం కాదు. అయితే ఉత్సవాలు నిర్వహించడం పనికిరాదు. ఒక వ్యక్తి తన తండ్రితో కలిపి మూడు తరాల వరకు పితృకార్యాలు చేయాలి తాను ఉన్నంతవరకు చేస్తాడు. ఆ తర్వాత మొదటి తరం పోయి ఇతనితో కలిపి మూడుతరాలకు అతని కొడుకు చేస్తాడు.

వివాహం, గృహప్రవేశం ఇతర శుభకార్యాల తరవాత ఆరు నెలల దాకా అదే గృహంలో పితృకార్యాలు చేయవచ్చు. అలాగే కర్మకాండలు జరిగిన గృహంలో వివాహాలు జరగవచ్చు. చనిపోయినవారి కొడుకులకు సంవత్సరం వరకు వివాహం చేయరు. కూతుళ్లకు మాత్రం చనిపోయినవారికి కన్యదాన ఫలం దక్కేందుకు గాను అదే సంవత్సరం వీలైతే వివాహం చేస్తారు. బ్రహ్మచారులకు మైల కాలం తీరిపోయాక ఇక ఏ అశౌచం ఉండదు. అశౌచ సమయాలలో ఏ పారాయణం అయినా బయటకు వినపడకుండా మనసులో చదువుకోవచ్చు. కొత్తవి చదవాల్సిన అవసరం లేదు. భగవన్నామస్మరణ అన్నివేళలా శ్రేయోదాయకమైనదే..

Tuesday, August 20, 2019

అధర్వణ వేదం విశిష్టత (సేకరణ: వాట్సాప్ నుండి)


చతుర్వేదాలలో చివరి వేదం ‘అధర్వణ వేదం’.  చివరివేదం కదా అని ఈ వేదాన్ని చిన్నచూపు చూడరాదు. నిత్య,  నైమిత్తిక కర్మలలో ఈ వేదానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇహానికే కాదు, పరానికి కూడా ప్రాధాన్యత ఇచ్చే వేదం ఈ ‘అధర్వణ వేదం’. యఙ్ఞ, యాగాది క్రతువులలో ఇది బ్రహ్మ గారి వేదం.

ఈ వేదాన్ని ‘అధర్వణాంగిరసులు’ దర్శించిన కారణంగా దీనికి ‘అధర్వణాంగిరసం’ అని మరో పేరు కూడా ఉంది. యఙ్ఞ నిర్వహణానికి బ్రహ్మ, అథ్వర్యుడు, హోత, ఉద్గాత అని నలుగురు ఋత్వక్కులు కావాలి. వీరిలో బ్రహ్మ స్థానాన్ని స్వీకరించే ఋత్వక్కుకు ‘అధర్వవేదం’తో పాటు మిగిలిన మూడు వేదాలు తప్పకుండా తెలిసి ఉండాలి. హోతగా వ్యవహరించేవాడు ఋగ్వేదం అధ్యయనం  చేసి ఉండాలి.

అధ్వర్యుడు యజుర్వేదంలో నిపుణుడై ఉండాలి. ఉద్గాత సామవేదంలో నిష్ణాతుడై ఉండాలి. హోత, అధ్వర్యుడు, ఉద్గత యఙ్ఞ ప్రక్రియలో తెలియక చేసిన పొరపాట్లను, ఎక్కడికక్కడ ‘బ్రహ్మ’ స్థానాన్ని అలంకరించిన ఋత్విక్కు పరిహరిస్తూ యఙ్ఞానికి అంతరాయం రాకుండా కాపాడతాడు. ఈ వేదానికి అంతటి ప్రాముఖ్యత ఉంది.

ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆధిదైవిక విషయాలను ఈ అథర్వణవేదం వివరిస్తుంది. ఈ వేదంలో శారీరక చికిత్సకు సంబంధించిన సూక్తాలు 144 ఉన్నాయి. ఈ సూక్తాలలో మానవ శరీరానికి సంబంధించిన ప్రతి అవయవం యొక్క స్వరూపాన్ని పేరుపేరునా వర్ణించడం జరిగింది. రాజ్యానికి, రాజధర్మానికి సంబంధించిన అనేక విషయాలు 244 సూక్తాలలో చర్చించబడ్డాయి. అనేక విషయాలతో కూడిన సమాజ స్వరూపాన్ని 75 సూక్తలలో వివరించడం జరిగింది. యఙ్ఞ, యాగాదులను గురించి ఎన్నో విశేషాలు ఈ వేదంలో చెప్పబడ్డాయి.

ఈ వేదాన్ని ఆశ్రయించే బృహస్పతి ‘అర్థశాస్త్రం’, చాణక్యుని ‘అర్థశాస్త్రం’, శుక్రాచార్యుని ‘శుక్రనీతి’ అనే గ్రంథాలు వెలువడ్డాయి. అథర్వణవేదానికి సంబంధించిన శాఖల గురించి చాలా అభిప్రాయ భేదాలున్నాయి. పతంజలి, తన మహాభాష్యంలో ఈ వేదానికి పైప్పలాద, స్తౌద, మౌద, శౌనకీయ, జాబల, జలద, బ్రహ్మవద, దేవదశ, చారణావైద్యులనే పేర్లతో తొమ్మిది శాఖలు ఉన్నట్టు పేర్కొన్నాడు. పంచరాత్రంలో సుప్రసిద్ధమైన ‘అహిర్బుధ్న్య సంహిత’లో ఐదు శాఖలు ఉన్నట్లు చెప్పబడింది. అయితే మనకు పైప్పలాద, శౌనక శాఖలు మాత్రమే లభ్యమౌతున్నాయి.

ఈ ‘అధర్వణవేదం’ ‘యేత్రిషప్తాః పరియన్తి’ అనే వాచస్పతి దేవతాకమైన మంత్రంతో ప్రారంభమై  ‘పనాయ్యం తదస్వినా కృతం’ అనే అశ్వినీ దేవతాక మంత్రంతో పూర్తవుతుంది. ఈ వేదంలో ఆయుష్షును, తేజస్సును, కీర్తిని పెంచే మంత్రాలు, వ్యవసాయ, వాణిజ్యాల అభివృద్ధికి తోడ్పడే మంత్రాలు, జీవాత్మ, పరమాత్మ తత్త్వాలను పంచభూతాల స్వరూపాలనూ బోధించే మంత్రాలు, సర్వపాపాలను తొలగించే మంత్రాలు, అంత్యసంస్కారంలో ఉపయోగించే మంత్రాలు తుఫానులు, అతివృష్టులు నివారించేవి వర్షాన్ని కురిపించేవి శత్రునాశనకరమైనవి. ఇలా అనేక మంత్రాలు ఉన్నాయి.

అంతేకాదు జ్వర, అతిసార, అతిమూత్ర, వాత, పిత్త, శ్లేష్మ, విషజ్వర, జలోదర, గండమాల, క్షయ, బొల్లి, కుష్ఠు, మొదలైన వ్యాధుల నివారణకు మందులు, సర్ప, వృశ్చిక విషహరణానికి, సంతానోత్పత్తికి, సుఖప్రసవానికి, శిరస్సు, కన్ను, ముక్కు, చెవి, కంఠాలకు వచ్చే రోగాలకూ ఇలా అనేక అనారోగ్యాలకు మందులు, ఔషధాలు విడివిడిగా చెప్పబడ్డాయి. ఇలా ఈ అథర్వణవేదం, మానవ జీవన భౌతికప్రయోజనాలకు ఉపయోగపడడమేకాక, బ్రహ్మసాక్షాత్కారాన్ని గురించి వివరిస్తుంది. అందుకే ఈ వేదాన్ని ‘బ్రహ్మవేదం’ అని కూడా వ్యవహరిస్తారు. కనుక మానవుని ఆనందమయ జీవనవేదానికి ఈ అధర్వణవేదం ‘బ్రహ్మస్ధానమని’ నిర్ద్వందంగా చెప్పవచ్చు.

ధనం కోరుకునే ఇంట్లో స్త్రీలు ఖచితముగా చేయకూడని పనులు

Fat burning with Vedic Tricks

Sunday, August 18, 2019

Karma Theory & Diabetes

कालाभैरव ब्रह्म कवचं శ్రీ కాలభైరవ బ్రహ్మ కవచం


ఓం పాతు నిత్యం శిరసి పాతు హ్రీం కంఠదేశకే |
వటుః పాతు నాభౌ శాపదుద్ధారణాయ చ || 1 ||

కురుద్వయం లింగమూలే త్వాధారే వటుకః స్వయం చ |
సర్వదా పాతు హ్రీం బీజం బాహ్వోర్యుగలమేవ చ || 2 ||

షడంగసహితో దేవో నిత్యం రక్షతు భైరవః |
ఓం హ్రీం వటుకాయ సతతం సర్వాంగం మమ సర్వదా || 3 ||

ఓం హ్రీం పాదౌ మహాకాలః పాతు వీరా సనో హృదిః |
ఓం హృం  కాలః శిరః పాతు కంఠదేశే తు భైరవః || 4 ||

గణరాట్ పాతు జిహ్వాయామష్టభీః శక్తిభీః సహ  |
ఓం హ్రీం దండపాణిర్గుహ్యామూలే భైరవీసహిత స్తధా || 5 ||

ఓం హ్రీం విశ్వనాధః సదా పాతు సర్వాంగం మమ సర్వదః  |
ఓం హృం అన్నపూర్ణా సదా పాతు చాంసౌ రక్షతు చండికా || 6 ||

అసితాంగః శిరః పాతు లలాటం రురు భైరవః |
ఓం హ్రీం చండభైరవః పాతు వక్త్రం కంఠం శ్రీ క్రోధ భైరవః || 7 ||

ఉన్మత్త భైరవః పాతు హృదయం మమ సర్వదా  |
ఓం హ్రీం నాభి దేశే కపాలీ చ లింగే భీషణ భైరవః || 8 ||

సంహార భైరవః పాతు మూలాధారం చ సర్వదా  |
ఓం హృం బాహుయుగ్మం సదా ఆపద్ భైరవో మమ కేవలం || 9 ||

హంస బీజం పాతు హృదిః సో హం రక్షతు పాదయోః  |
ఓం హ్రీం ప్రాణాపానం సమానం చ ఉదానం వ్యానమేవ చ || 10 ||

రక్షన్తు ద్వారమూలే తు దశదిక్షు సమన్తతః  |
ఓం హ్రీం ప్రణవం పాతు సర్వాంగే లజ్జాబీజం మహా భయే || 11 ||

ఇతి శ్రీ కాలభైరవ బ్రహ్మ కవచం ప్రకీర్తితమ్

సుందరకాండ

సుందరే సుందరో రామః సుందరే సుందరీ కథా
సుందరే సుందరీ సీతా సుందరే సుందరం వనం
సుందరే సుందరం కావ్యం సుందరే సుందరం కపిః
సుందరే సుందరం మంత్రం సుందరే కిం న సుందరం

శ్రీరాముడు సుందరుడు. సీతమ్మ సుందరి. హనుమ సుందరుడు. ఇక కథ, కావ్యం, అశోకవనం, రామ మంత్రం అన్నీ సుందరమే! కానిదిలేదు. అందుకే వాల్మీకి సుందరకాండ అన్నారు.

Thursday, August 15, 2019

హయగ్రీవ శ్లోకము

హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వాదినం
నరం ముంచంతి పాపాని దరిద్ర మివయోషితః
హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదేత్
తస్య నిస్సరతే వాణీ జహ్న కన్యా ప్రవాహవత్
హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో ధ్వనిః
విశోభతేచ వైకుంఠ కవాటోద్ఘాటన ధ్వనిః!!

ఫలశ్రుతిః
శ్లోకత్రయమిదం దివ్యం హయగ్రీవ పదాంకితం
వాదిరాజయతి ప్రోక్తం పఠతాం సంపదప్రదం!!

పై శ్లోకాన్ని శ్రద్దగా ప్రతి రోజు ఉదయం 21 సార్లు లేదా108 సార్లు 41 రోజులు చదివితే అనుకున్న అన్నీ పనులు మరియు విద్యావృద్ది కలుగును

Thursday, August 8, 2019

వరలక్ష్మి వ్రత పూజా విధానం

శ్రీ వర లక్ష్మి పూజ సామగ్రి
పసుపు ................. 100 grms
కుంకుమ ................100 grms
గంధం .................... 1box
విడిపూలు................ 1/2 kg
పూల మాలలు ........... 6
తమలపాకులు............ 30
వక్కలు..................... 100 grms
ఖర్జూరములు..............50 grms
అగర్బత్తి ....................1 pack
కర్పూరము.................50 grms
చిల్లర పైసలు .............. Rs. 30/- ( 1Rs coins )
తెల్ల టవల్ .................1
బ్లౌస్ పీసులు .............. 2
మామిడి ఆకులు............
అరటిపండ్లు ................ 1
ఇతర రకాల పండ్లు ........ ఐదు రకాలు
అమ్మవారి ఫోటోల ......................
కలశము .................... 1
కొబ్బరి కాయలు ............ 3
తెల్ల దారము లేదా నోము దారము లేదా పసుపు రాసిన కంకణం 2............
స్వీట్లు ..............................
బియ్యం 2 kg
కొద్దిగా పంచామృతం లేదా పాలు 100 ML

*పూజా* *సామాగ్రి* :-

దీపాలు ....
గంట
హారతి ప్లేటు
స్పూన్స్
ట్రేలు
నూనె
వత్తులు
అగ్గిపెట్టె
గ్లాసులు
బౌల్స్

శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్నిఆచరించాలి. ఆ రోజున వీలుకాకపోతే తరువాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈవ్రతాన్ని చేయవచ్చు.వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవతయైన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రిసమయంలోచారుమతికి కలలో సాక్షాత్కరించింది. సువాసినులందరూ చేసే ప్రాభవ వ్రతం. “శ్రీ వరలక్ష్మీ నమస్తు వసుప్రదే, సుప్రదే” శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మీవ్రతంతో ధన, కనక, వస్తు,వాహనాది సమృద్ధులకు మూలం. శ్రావణ శుక్రవార వ్రతాలు పాపాలు పోవడంతోపాటు,
లక్ష్మీ ప్రసన్నత కలుగుతాయి.

*వ్రత విధానం* :-
వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి, ఇంటినిశుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటుచేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యపు పిండితో ముగ్గువేసి, కలశం ఏర్పాటుచేసుకోవాలి. అమ్మవారి ఫొటో అమర్చు కోవాలి. పూజాసామగ్రిని అంతా సిద్ధం చేసుకోవాలి. తోరాలు ముందుగానే సిద్ధం చేసుకునిఉంచాలి. అక్షతలు, పసుపు గణపతిని సిద్ధంగా ఉంచు కోవాలి.

*కావలసినవి :-*
పసుపు, కుంకుమ, వాయనం ఇవ్వడానికి అవసరమైన వస్తువులు, ఎర్రటి రవికె వస్త్రం, గంధము, పూలు, పండ్లు, ఆకులు, వక్కలు, తోరములు కట్టుకోవడానికి దారం, టెంకాయలు, దీపపుకుందులు, ఐదువత్తులతో, హారతి ఇవ్వడానికి, అవసరమైన పంచహారతి, దీపారాధనకునెయ్యి, కర్పూరం, అగరువత్తులు, బియ్యం, శనగలు మొదలైనవి.

*తోరం ఎలా తయారుచేసుకోవాలి* :-
తెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపురాసుకోవాలి. ఆ దారానికి ఐదు లేక తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి. అంటేఐదు లేక తొమ్మిది పోగుల దారాన్ని ఉపయోగించి, ఐదు లేక తొమ్మిదో పువ్వులతో ఐదులేక తొమ్మిది ముడులతో తోరాలను తయారుచేసుకుని, పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి, తోరాలను పూజించి ఉంచుకోవాలి. ఆవిధంగా తోరాలనుతయారుచేసుకున్న తరువాత పూజకు సిద్ధంకావాలి.

Tuesday, August 6, 2019

గురు వందనం


ధ్యానమూలం గురోర్మూర్తిః
పూజమూలం  గురోః పదమ్
మంత్రమూలం గురోర్వాక్యం
మోక్షమూలం గురోః కృపా
గురుబ్రహ్మ గురుర్విష్ణుః
గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవేనమః

గురువు యొక్క మూర్తియే ధ్యానానికి మూలం . గురువు యొక్క పదమే పూజకు మూలం . గురువు యొక్క వాక్యమే మంత్రమునకు మూలం . గురువు యొక్క కృపయే మోక్షమునకు మూలం.
గురువు యొక్క రూపములోనే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల రూపాలు మిళితమై ఉంటాయి. అనగా, గురువే బ్రహ్మ-విష్ణు-మహేశ్వరుడు. సాక్షాత్తూ ఆ పరబ్రహ్మ కూడా గురువే. అట్టి గురువునకు వందనాలు