Translate

Friday, January 31, 2020

రథసప్తమి స్త్నాన శ్లోము

"నమస్తే రుద్ర రూపాయ రసానాం పతయే నమః
అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే ||
యద్యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు|
తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ ||
ఏతజ్జన్మ కృతంపాపం యజ్జన్మాంత రార్జితం |
మనోవాక్కాయజం    యచ్చ జ్ఞాతా జ్ఞాతేచ యే పునః ||
ఇతి సప్త విధం పాపం స్త్నానాన్మే సప్త సప్తికే |
సప్తవ్యాధి సమాయుక్తం హరమాకరీ సప్తమీ ||"

Wednesday, January 22, 2020

ఉగ్ర వారాహీ అమ్మవారి దేవాలయం వారణాశి


వారణాసి భూగృహంలో ఉగ్రవారాహీ విచిత్ర దేవాలయం

మీరు కాశి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఉగ్రవారాహి అమ్మవారి దేవాలయానికి వెళ్ళారా? వెళ్ళకపోతే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి.

కాకపోతే ఈ ఆలయం వేళలు ఉదయం 4:30 నుండి 8:30 వరకు మాత్రమే. కేవలం నాలుగు గంటలు మాత్రమే దర్శనానికి అనుమతి ఇస్తారు. తరువాత మూసేస్తారు. ఎందుకని అనేగా మీ సందేహం!

అమ్మవారు ఆ వారణాసి గ్రామదేవత. చీకటి పడింది మొదలు ఉదయం 3:30 వరకు గ్రామ సంచారం చేసి వచ్చి విశ్రమిస్తుంది. అందువలన అమ్మవారి ఆలయంలో 4 గంటల పాటు పూజ చేసి క్రింద చిత్రంలో చూపిన విధంగా రెండు కన్నాల లో నుండి దర్శనం ఇస్తారు. ఒక కన్నం లో నుండి చూస్తే అమ్మవారి ముఖ భాగం, రెండవ కన్నం లో నుండి చూస్తే పాదాలు దర్శనం ఉంటుంది. అమ్మవారికి పూజ చేసే పూజారి మాత్రం నిమిషాల వ్యవధిలో అలంకరణ హారతి ఇచ్చేసి సెల్లార్ లో నుండి బయటికి వచ్చేస్తాడు. ఆ తరువాత ఆ కన్నాల లో నుండి దర్శనానికి అనుమతి ఇస్తారు. మొన్నీమధ్య జరిగిన ఓ సంఘటన ఇక్కడ చెప్పుకోవాలి.

క్రొత్తగా పెళ్ళైన జంట కొన్ని నెలల క్రితం అన్ని దేవాలయాలు దర్శనం చేస్తూ వారణాసి వచ్చి ఈ దేవాలయాన్ని సందర్శించారు. పూజారి ఎప్పటిలాగే కన్నంలో నుండి చూడమని చెబితే వినలేదు. పైపెచ్చు మూర్ఖపు వాదనకి దిగారు. అమ్మవారు ఉగ్రరూపంలో ఉంటుందా! భక్తులని చూడనివ్వదా! అంటే 
కాదు నాయనా! శాంత కళ, ఉగ్ర కళ అని రెండు ఉంటాయి. శాంత కళతో ఉన్న అమ్మవారిని ఎదురుగా వెళ్లి దర్శనం చేసుకోవచ్చు. ఉగ్ర కళ అంటే దుష్ట సంహరార్థం ఎత్తిన అవతారం. ఆ కళ ని సామాన్యులు తట్టుకోలేరు. నేను వెళితేనే ఆ కళ తట్టుకోలేక త్వరగా ముగించి వచ్చేస్తాను. సూర్యుడిని ఉదయం చూసినట్లు మధ్యాహ్నం చూడలేము. ఉదయం ఉన్నది ఆ సూర్యుడే. మధ్యాహ్నం ఉన్నది ఆ సూర్యుడే కదా అని చూస్తాను అంటే సాధ్యమేనా! కళ్ళు టపాసుల్లా పేల్లిపోతాయ్. దృష్టి పోతుంది. అలాంటిది దుష్ట శిక్షనార్థం ఎత్తిన అవతారాలు చూడాలంటే మన శక్తి సరిపోదు. చూడకూడదు. అని ఎంతో శ్రద్దగా చేబియే వినకుండా చూడనివ్వకపొతే కోర్ట్ కి వెళ్లి మీకు వ్యతిరేకంగా ఆర్డర్ తెచ్చుకుంటాం. అని మొండి పట్టుపట్టారు. దీంతో పోయే కాలం వచ్చినప్పుడు ఇలానే ఉంటుంది ప్రవర్తన అని సెల్లార్ లో ఉన్న అమ్మవారి వద్దకి ఆ కొత్త జంటని తీసుకెళ్ళాడు. క్షణాల వ్యవధిలో పూజారి హారతి వెలిగించి ఇచ్చే లోపు ఇద్దరు కిందపడి మరణించారు

Monday, January 20, 2020

శ్రీ భూ వరాహ స్తోత్రo

ప్రతి ఒక్కరి జాతకం లోనూ చతుర్ధ భావం బాగున్నప్పుడు గృహయోగం, భూమి యోగం కచ్చితంగా ఉంటుంది.లగ్న కుండలి పరిశీలన ద్వారా ఈ విషయం తెలుస్తుంది.ఎవరైనా ఒకరి జాతకంలో గృహయోగం లేదా భూమి యోగం లేదు అని తెలిసినప్పుడు వారి కుటుంబ సభ్యుల జాతకం పరిశీలించి వారి జాతక ప్రకారము భూమి లేదా గృహ నిర్మాణానికి ప్రయత్నించినప్పుడు తప్పకుండా గృహ నిర్మాణం పూర్తి అవుతుంది. సాధారణంగా  గృహ నిర్మాణానికి,భూమి అమ్మకం, కొనుగోలుకు చిన్నచిన్న ఇబ్బందులు ఏర్పడినప్పుడు ఈ భూవరాహ స్తోత్రాన్ని 
ప్రతి రోజు పూజలో భాగంగా ఈ స్తోత్రంని కూడా చేర్చుకోని,
ఈ స్తోత్రమును రోజూ 9సార్లు..
మండలం రోజులు..పఠించాలి.


*శ్రీ భూ వరాహ స్తోత్రం*.

ఋషయ ఊచు |
జితం జితం తేఽజిత యజ్ఞభావనా
త్రయీం తనూం స్వాం పరిధున్వతే నమః |
యద్రోమగర్తేషు నిలిల్యురధ్వరాః
తస్మై నమః కారణసూకరాయ తే || ౧ ||

రూపం తవైతన్నను దుష్కృతాత్మనాం
దుర్దర్శనం దేవ యదధ్వరాత్మకం |
ఛన్దాంసి యస్య త్వచి బర్హిరోమ-
స్స్వాజ్యం దృశి త్వంఘ్రిషు చాతుర్హోత్రమ్ || ౨ ||

స్రుక్తుండ ఆసీత్స్రువ ఈశ నాసయో-
రిడోదరే చమసాః కర్ణరంధ్రే |
ప్రాశిత్రమాస్యే గ్రసనే గ్రహాస్తు తే
యచ్చర్వణంతే భగవన్నగ్నిహోత్రమ్ || ౩ ||

దీక్షానుజన్మోపసదః శిరోధరం
త్వం ప్రాయణీయో దయనీయ దంష్ట్రః |
జిహ్వా ప్రవర్గ్యస్తవ శీర్షకం క్రతోః
సభ్యావసథ్యం చితయోఽసవో హి తే || ౪ ||

సోమస్తు రేతః సవనాన్యవస్థితిః
సంస్థావిభేదాస్తవ దేవ ధాతవః |
సత్రాణి సర్వాణి శరీరసంధి-
స్త్వం సర్వయజ్ఞక్రతురిష్టిబంధనః || ౫ ||

నమో నమస్తేఽఖిలయంత్రదేవతా
ద్రవ్యాయ సర్వక్రతవే క్రియాత్మనే |
వైరాగ్య భక్త్యాత్మజయాఽనుభావిత
జ్ఞానాయ విద్యాగురవే నమొ నమః || ౬ ||

దంష్ట్రాగ్రకోట్యా భగవంస్త్వయా ధృతా
విరాజతే భూధర భూస్సభూధరా |
యథా వనాన్నిస్సరతో దతా ధృతా
మతంగజేంద్రస్య స పత్రపద్మినీ || ౭ ||

త్రయీమయం రూపమిదం చ సౌకరం
భూమండలే నాథ తదా ధృతేన తే |
చకాస్తి శృంగోఢఘనేన భూయసా
కులాచలేంద్రస్య యథైవ విభ్రమః || ౮ ||

సంస్థాపయైనాం జగతాం సతస్థుషాం
లోకాయ పత్నీమసి మాతరం పితా |
విధేమ చాస్యై నమసా సహ త్వయా
యస్యాం స్వతేజోఽగ్నిమివారణావధాః || ౯ ||

కః శ్రద్ధధీతాన్యతమస్తవ ప్రభో
రసాం గతాయా భువ ఉద్విబర్హణం |
న విస్మయోఽసౌ త్వయి విశ్వవిస్మయే
యో మాయయేదం ససృజేఽతి విస్మయమ్ || ౧౦ ||

విధున్వతా వేదమయం నిజం వపు-
ర్జనస్తపః సత్యనివాసినో వయం |
సటాశిఖోద్ధూత శివాంబుబిందుభి-
ర్విమృజ్యమానా భృశమీశ పావితాః || ౧౧ ||

స వై బత భ్రష్టమతిస్తవైష తే
యః కర్మణాం పారమపారకర్మణః |
యద్యోగమాయా గుణ యోగ మోహితం
విశ్వం సమస్తం భగవన్ విధేహి శమ్ || ౧౨ ||

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే తృతీయస్కంధే శ్రీ వరాహ ప్రాదుర్భావోనామ త్రయోదశోధ్యాయః | సంపూర్ణం..!

Thursday, January 16, 2020

తులసి పూజ విధానం,-తులసి దళాలను ఎలా త్రెంపాలి?


తులసీ దయాపూర్ణకలశీ - తులసి పూజ, దళచయనం

కార్తీక మాసం కదా? తులసి పూజ, తులసి వివాహం ఈ నెలలో వచ్చిన విశేషమైన పూజలు. తులశమ్మ విశేషాలు కొన్ని తెలుసుకుందాం.

తులసి - స్వయంగా శ్రీమహాలక్ష్మి స్వరూపం. అందుకే శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. తులాభారంలో సత్యభామ సమర్పించిన సకలసంపదలకు లొంగక, రుక్మిణి సమర్పించిన ఒక్క తులసి దళానికి బద్ధుడైనాడు శ్రీకృష్ణుడు. తులసిని ఎన్నో విధాలుగా స్తుతించారు మన సనాతన ధర్మంలో. తులసిలేని ఇల్లు కళావిహీనమని చెప్పారు. 

మరి తులసి ఇంట్లో ఉన్నప్పుడు ఆ తులసి వద్ద నిత్యం దీపం పెట్టటం మన కనీస ధర్మం. అలాగే తులసి ఎన్నో ఔషధ గుణాలు కలది. మన ఆయుర్వేద శాస్త్ర ప్రకారం తులసి పత్రాలు అమృతముతో సమానము

అనన్యదర్శనాః ప్రాతః మే పశ్యంతి తపోధన
జగత్త్రితయ తీర్థాని తైర్దృష్టాని న సంశయః

ఉదయము నిద్రనుండి లేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును చూసినచో ముల్లోకములలోని సమస్త తీర్థములను దర్శించిన పుణ్యఫలము లభించును అని బ్రహ్మపురాణం చెప్పింది.

తులసిచెట్టు మనుషులను, ఇంటిని, వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది. పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. శారీరిక, మానసిక ఆరోగ్యమునిస్తుంది.

*తులసి పూజ ఎలా చేయాలి?

తులసికోటను, చెట్టును నిత్యము భక్తి శ్రద్ధలతో పూజించాలి. నీళ్లు పోయాలి, ప్రదక్షిణము చేయాలి, నమస్కరించాలి. దీనివలన అశుభాలన్నీ తొలగి శుభాలు కలుగుతాయి. సర్వ పాపప్రక్షాళన జరుగుతుంది. మనోభీష్టాలు నెరవేరుతాయి. 

తులసి వనమున్న గృహము పుణ్యతీర్థంతో సమానమని అనేక పురాణాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం. ఉదయము, సాయంత్రము తులసి కోట వద్ద దీపారాధన చేయటం అత్యంత శుభకరం. తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్టశక్తులు పనిచేయవు.

ఒక చెంబుతో నీళ్లు, పసుపు, కుంకుమలు తీసుకొని తులసి చెట్టు వద్ద నిలుచొని ఈ విధంగా ప్రార్థించి పూజించాలి.

నమస్తులసి కళ్యాణీ! నమో విష్ణుప్రియే! శుభే!
నమో మోక్షప్రదే దేవి! నమస్తే మంగళప్రదే!
బృందా బృందావనీ విశ్వపూజితా విశ్వపావనీ!
పుష్పసారా నందినీ చ తులసీ కృష్ణజీవనీ!

ఏతన్నామాష్టకం చైవ స్తోత్రం నామార్థసంయుతం
యః పఠేత్తం చ సంపూజ్య సోశ్వమేధ ఫలం లభేత్

అని తులసిని ప్రార్థించి, అచ్యుతానంతగోవింద అనే మంత్రాన్ని పఠిస్తూ పూజించాలి. తరువాత క్రింది శ్లోకాన్ని ప్రార్థనా పూర్వకంగా పఠించాలి.

యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాః
యదగ్రే సర్వవేదాశ్చ తులసీం త్వాం నమామ్యహం

అని చెంబులోని నీళ్లను తులసిచెట్టు మొదట్లో పోసి నమస్కరించాలి.

తులసి శ్రీసఖి శుభే పాపహారిణి పుణ్యదే
నమస్తే నారదనుతే నారాయణ మనఃప్రియే

అని తులసికోట లేదా చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేయాలి. దీనివలన కర్మదోషాలన్నీ తొలగుతాయి.

పూజ కోసం తులసీ పత్రాలను ఎలా కోయాలి అన్నదానికి సనాతన ధర్మం ఒక పద్ధతిని తెలియజేసింది. ఆ వివరాలు తెలుసుకుందాం.

తులసీం యే విచిన్వంతి ధన్యాస్తే కరపల్లవాః - పూజ చేయటం కోసం తులసి దళాలను త్రెంపిన చేతులు ఎంతో ధన్యములు అని స్కాందపురణం చెప్పింది.

తులసి చెట్టునుండి దళాలను మంగళ, శుక్ర, ఆది వారములలో, ద్వాదశి, అమావాస్య, పూర్ణిమ తిథులలో, సంక్రాంతి, జనన మరణ శౌచములలో, వైధృతి వ్యతీపాత యోగములలో త్రెంప కూడదు. ఇది నిర్ణయసింధులో, విష్ణుధర్మోత్తర పురాణంలో తెలియజేయబడినది. 

తులసి లేకుండా భగవంతుని పూజ సంపూర్ణం అయినట్లు కాదు. ఇది వరాహ పురాణంలో చెప్పబడింది. కాబట్టి నిషిద్ధమైన రోజులలో, తిథులలో తులసి చెట్టు కింద స్వయంగా రాలి పడిన ఆకులతో, దళములతో పూజ చేయాలి. ఒకవేళ అలా కుదరకపోతే ముందు రోజే తులసి దళములను త్రెంపి దాచుకొని మరుసటి రోజు ఉపయోగించాలి. 

సాలగ్రామ పూజకు మాత్రం ఈ నిషేధము వర్తించదు. సాలగ్రామమున్నవారు అన్ని తిథివారములయందు తులసి దళములను త్రెంపవచ్చు. ఎందుకంటే సాలగ్రామం స్వయంగా విష్ణు స్వరూపం. శ్రీమహావిష్ణువు మందిరంలో వచ్చి ఉన్నప్పుడు ఏ దోషాలూ వర్తించవు. ఇది ఆహ్నిక సూత్రావళిలో చెప్పబడింది. “స్నానము చేయకుండా మరియు పాద రక్షలు ధరించి” తులసి చెట్టను తాకరాదు, దళములను త్రెంపకూడదు. ఇది పద్మపురాణంలో చెప్పబడింది.

 తులసి దళాలను ఎలా త్రెంపాలి?

తులసి ఆకులను ఒక్కొక్కటిగా త్రెంపకూడదు. రెండేసి ఆకులు కలిగిన దళముతో కూడిన కొసలను త్రెంపాలి. అన్ని పుష్పాల కన్నా తులసీ మంజరులు (అంతే తులసికి వచ్చే పుష్పాలు) అత్యంత శ్రేష్ఠమని, ఈ మంజరులను కోసేటప్పుడు వాటితోపాటు ఆకులు తప్పనిసరిగా ఉండాలని బ్రహ్మపురాణం చెప్పింది.

తులసిమొక్కకు ఎదురుగా నిలబడి, రెండు చేతులు జోడించి, కింది మత్రాన్ని చదువుతూ పూజా భావంతో మొక్కను కదిలించకుండా తులసి దళాలను త్రెంపాలి. దీనివలన పూజాఫలం లక్షరెట్లు అధికంగా లభిస్తుంది అని పద్మపురాణం చెప్పింది.

మాతస్తులసి గోవింద హృదయానందకారిణి
నారాయణస్య పూజార్థం చినోమి త్వాం నమోస్తుతే 

తులస్యమృతజన్మాసి సదా త్వం కేశవప్రియా
చినోమి కేశ్వస్యార్థే వరదా భవ శోభనే

త్వదంగసంభవైః పత్రై పూజయమి యథా హరిం తథా కురు కురు పవిత్రాంగి! కలౌ
మలవినాశిని
(ఆహ్నిక సూత్రావళి)

శ్రీహరికి ఆనందాన్ని కలిగించే తులసీ మాతా! నారాయణుని పూజ కొరకు నీ దళములను కోస్తున్నాను. నీకు నా నమస్కారములు. అమృతమునుండి జన్మించిన, ఎల్లప్పుడు శ్రీహరికి ప్రియమైన తులసీమాతా! ఆ కేశవుని పూజ కొరకు నీ దళాలను త్రెంపుతున్నాను. నాకు అభయమునివ్వు శుభకరీ! నీ శరీరమునుండి జన్మించిన పత్రములతో ఆ శ్రీహరిని పూజిస్తాను. కలియుగంలో సమస్త దోషములు తొలగించే పవిత్రమైన శరీరము కల తల్లీ! నేను తలపెట్టిన హరిపూజను సాఫల్యము చేయుము.

పూజ చేసిన తరువాత ఒక తులసీదళాన్ని "అచ్యుతానంతగోవింద" అని స్మరిస్తూ నోట్లో వేసుకొని తినాలి. ప్రతిరోజు భక్తిభావంతో ఒక తులసిదళాన్ని సేవించటం వలన సకల రోగాలు నశిస్తాయి, రాబోయే రోగాలు నిరోధించబడుతాయి.

తులసి

తులసిని స్త్రీ కోయరాదు. పురుషుడే కోయాలి. పూజ మాత్రం ఇరువురూ చేయవచ్చు. పూజించే తులసి మొక్క దళాలను పూజ కోసం తుంచరాదు. పూజకు తులసి దళాలు కావాలంటే విడిగా పెంచే మొక్కలనుంచి తుంచుకోవాలి. కోట కట్టి పూజించే తులసి నుంచి తుంచరాదు.

ఆద్యాత్మిక పరంగా ,ఆరోగ్యపరంగా ఎంతో పేరు గడించడం వలననే తులసి భూలోక కల్ప వృక్షం గా దేవతా వృక్షం గా పేరు పొందింది. భగవంతుని పూజకు తులసి అతి ప్రసస్తము .తులసి గా శ్రీ మహాలక్ష్మి ఏ స్వయముగా అవతరించినట్లు పురాణములు చెబుతున్నాయి .
తులసి విష్ణువు ప్రియురాలు కనుక విష్ణువును తులసి దళాలతో పూజించేటప్పుడు పాదాల వద్దనే తులసి దళాలను వుంచవలెను .

పవిత్ర దినములలో తులసి కోయరాదు. , గోళ్ళతో తుంచ రాదు .సూర్యాస్తమయము తర్వాత తులసి కోయరాదు . మిట్ట మద్యాహ్న్నం ,అర్ధ రాత్రి వేల లో గాని తులసిని త్రుంచ రాదు . ఒకవేళ అలా చేస్తే బ్రహ్మ హత్యాపాతకం చుట్టుకుంటుందని  పురాణాలు చెబుతున్నాయి .

ఎవరి గృహములో తులసి మొక్క వుంటుందో ,వారి గృహం తీర్ధ స్వరూపముగా వుంటుంది. తులసి దళా ల తో శివ కేశవులను పూజించిన వానికి మరల జన్మ ఉండదు, ముక్తిని పొందుతాడు.నర్మదా నదిని చూడడం ,గంగా స్నానము చేయడం,తులసి వనాన్ని సేవిచడం ఈ మూడు సమాన ఫలములను ఇస్తాయి .ఆషాడ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక సుద్ధ పౌర్ణమి వరకు చాత్రుమాస దీక్ష కావున ఈ సమయములో తులసి మొక్కను చోటు మార్చి పాత రాదు.

తులసి సన్నిదానము నందు విష్ట్ను మూర్తి ఏకాంతముగా ఉండును కనుక స్త్రీలు దళములు కోయరాదు .పురుషులు మాత్రమె కోయవలెను .

తులసి ఆకును కోసిన లగాయతు ఒకసంవస్త్సరము ,మారేడు మూడు సం. ,తామర పూలు ఏడు రోజుల వరకు పూజకు పనిచేస్తాయి .

తులసి మాల ఎక్కువుగా రాముడికి ,కృష్ణుడికి అత్యంత ప్రీతి పాత్రమైనది.బుద్ధిని ,మనస్సును ప్రశాంతముగా ఉంచుటకు ఈ మాల ఎంతో ఉపయోగాదాయకం .తులసి మాలను ధరించడం వలన సర్వ పాపాలు నసిస్తాయి.

తులసి చెట్టు ఉన్న మట్టిలోనూ, తులసి చెట్టుమీదా అధికంగా పసుపు,కుంకుమ,అక్షతలు వేయడం వలన అక్కడ ఉన్న పోషకాలు నశించి తులసిచెట్టు ఎక్కువకాలం నిలువదు. కనుక పసుపు, కుంకుమ, అక్షతలు వేయవలసి వచ్చినప్పుడు చెట్టు మొదటిలో కాక, తులసి కోట మొదటిలో వేయడం ఉత్తమం.

స్త్రీలు ఎన్నడూ తులసీ దళాలను కోయరాదు. పురుషులచేతనే కోయించాలి. ఆపురుషులు కూడా బహుళ పక్షంలోని అష్టమీ,చతుర్దశీ, అమావాస్యా తిథులలో గానీ - పౌర్ణమినాడుగానీ – ఉభయ పక్షాలలో ఏకాదశీ,ద్వాదశీ తిథులలోగానీ – ఆది,మంగళ,శుక్రవారాలలో గానీ అస్సలు కోయకూడదు. ద్వాదశినాడు తులసిని తాకకూడదు. తులసీ దళాలను ఒడిలోకి కోయకూడదు. ఆకులోకి కానీ, ఏదైనా పళ్లెంలోకి కానీ కోయాలి. తులసీ దళాలను ఒట్టి నేలమీద ఉంచకూడదు.

Saturday, January 11, 2020

ఇన్ద్రాక్షీస్తోత్రమ్


శ్రీగణేశాయ నమః ।

పూర్వన్యాసః
అస్య శ్రీ ఇన్ద్రాక్షీస్తోత్రమహామన్త్రస్య,
శచీపురన్దర ఋషిః, అనుష్టుప్ ఛన్దః,
ఇన్ద్రాక్షీ దుర్గా దేవతా, లక్ష్మీర్బీజం,
భువనేశ్వరీతి శక్తిః, భవానీతి కీలకమ్ ,
ఇన్ద్రాక్షీప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః ।
కరన్యాసః
ఓం ఇన్ద్రాక్షీత్యఙ్గుష్ఠాభ్యాం నమః ।
ఓం మహాలక్ష్మీతి తర్జనీభ్యాం నమః ।
ఓం మాహేశ్వరీతి మధ్యమాభ్యాం నమః ।
ఓం అమ్బుజాక్షీత్యనామికాభ్యాం నమః ।
ఓం కాత్యాయనీతి కనిష్ఠికాభ్యాం నమః ।
ఓం కౌమారీతి కరతలకరపృష్ఠాభ్యాం నమః ।
అఙ్గన్యాసః
ఓం ఇన్ద్రాక్షీతి హృదయాయ నమః ।
ఓం మహాలక్ష్మీతి శిరసే స్వాహా ।
ఓం మాహేశ్వరీతి శిఖాయై వషట్ ।
ఓం అమ్బుజాక్షీతి కవచాయ హుమ్ ।
ఓం కాత్యాయనీతి నేత్రత్రయాయ వౌషట్ ।
ఓం కౌమారీతి అస్త్రాయ ఫట్ ।
ఓం భూర్భువః స్వరోమ్ ఇతి దిగ్బన్ధః ॥

ధ్యానమ్-
నేత్రాణాం దశభిశ్శతైః పరివృతామత్యుగ్రచర్మామ్బరాం
హేమాభాం మహతీం విలమ్బితశిఖామాముక్తకేశాన్వితామ్ ।
ఘణ్టామణ్డిత-పాదపద్మయుగలాం నాగేన్ద్ర-కుమ్భస్తనీమ్
ఇన్ద్రాక్షీం పరిచిన్తయామి మనసా కల్పోక్తసిద్ధిప్రదామ్ ॥

ఇన్ద్రాక్షీం ద్విభుజాం దేవీం పీతవస్త్రద్వయాన్వితామ్ ।
వామహస్తే వజ్రధరాం దక్షిణేన వరప్రదామ్ ॥

ఇన్ద్రాక్షీం సహస్రయువతీం నానాలఙ్కార-భూషితామ్ ।
ప్రసన్నవదనామ్భోజామప్సరోగణ-సేవితామ్ ॥

ద్విభుజాం సౌమ్యవదనాం పాశాఙ్కుశధరాం పరామ్ ।
త్రైలోక్యమోహినీం దేవీమిన్ద్రాక్షీనామకీర్తితామ్ ॥

పీతామ్బరాం వజ్రధరైకహస్తాం నానావిధాలఙ్కరణాం ప్రసన్నామ్ ।
త్వామప్సరస్సేవిత-పాదపద్మామిన్ద్రాక్షి వన్దే శివధర్మపత్నీమ్ ॥

ఇన్ద్రాదిభిః సురైర్వన్ద్యాం వన్దే శఙ్కరవల్లభామ్ ।
ఏవం ధ్యాత్వా మహాదేవీం జపేత్ సర్వార్థసిద్ధయే ॥

లం పృథివ్యాత్మనే గన్ధం సమర్పయామి ।
హం ఆకాశాత్మనే పుష్పైః పూజయామి ।
యం వాయ్వాత్మనే ధూపమాఘ్రాపయామి ।
రం అగ్న్యాత్మనే దీపం దర్శయామి ।
వం అమృతాత్మనే అమృతం మహానైవేద్యం నివేదయామి ।
సం సర్వాత్మనే సర్వోపచార-పూజాం సమర్పయామి ।
వజ్రిణీ పూర్వతః పాతు చాగ్నేయ్యాం పరమేశ్వరీ ।
దణ్డినీ దక్షిణే పాతు నైరౄత్యాం పాతు ఖడ్గినీ ॥ ౧॥

పశ్చిమే పాశధారీ చ ధ్వజస్థా వాయు-దిఙ్ముఖే ।
కౌమోదకీ తథోదీచ్యాం పాత్వైశాన్యాం మహేశ్వరీ ॥ ౨॥

ఉర్ధ్వదేశే పద్మినీ మామధస్తాత్ పాతు వైష్ణవీ ।
ఏవం దశ-దిశో రక్షేత్ సర్వదా భువనేశ్వరీ ॥ ౩॥

ఇన్ద్ర ఉవాచ ।
ఇన్ద్రాక్షీ నామ సా దేవీ దైవతైః సముదాహృతా ।
గౌరీ శాకమ్భరీ దేవీ దుర్గా నామ్నీతి విశ్రుతా ॥ ౪॥

నిత్యానన్దా నిరాహారా నిష్కలాయై నమోఽస్తు తే ।
కాత్యాయనీ మహాదేవీ చన్ద్రఘణ్టా మహాతపాః ॥ ౫॥

సావిత్రీ సా చ గాయత్రీ బ్రహ్మాణీ బ్రహ్మవాదినీ ।
నారాయణీ భద్రకాలీ రుద్రాణీ కృష్ణపిఙ్గలా ॥ ౬॥

అగ్నిజ్వాలా రౌద్రముఖీ కాలరాత్రిస్తపస్వినీ ।
మేఘస్వనా సహస్రాక్షీ వికటాఙ్గీ జడోదరీ ॥ ౭॥

మహోదరీ ముక్తకేశీ ఘోరరూపా మహాబలా ।
అజితా భద్రదానన్తా రోగహర్త్రీ శివప్రదా ॥ ౮॥

శివదూతీ కరాలీ చ ప్రత్యక్ష-పరమేశ్వరీ ।
ఇన్ద్రాణీ ఇన్ద్రరూపా చ ఇన్ద్రశక్తిః పరాయణా ॥ ౯॥

సదా సమ్మోహినీ దేవీ సున్దరీ భువనేశ్వరీ ।
ఏకాక్షరీ పరబ్రహ్మస్థూలసూక్ష్మ-ప్రవర్ధినీ ॥ ౧౦॥

రక్షాకరీ రక్తదన్తా రక్తమాల్యామ్బరా పరా ।
మహిషాసుర-హన్త్రీ చ చాముణ్డా ఖడ్గధారిణీ ॥ ౧౧॥

వారాహీ నారసింహీ చ భీమా భైరవనాదినీ ।
శ్రుతిః స్మృతిర్ధృతిర్మేధా విద్యా లక్ష్మీః సరస్వతీ ॥ ౧౨॥

అనన్తా విజయాపర్ణా మానస్తోకాపరాజితా ।
భవానీ పార్వతీ దుర్గా హైమవత్యమ్బికా శివా ॥ ౧౩॥

శివా భవానీ రుద్రాణీ శఙ్కరార్ధ-శరీరిణీ ।
ఐరావతగజారూఢా వజ్రహస్తా వరప్రదా ॥ ౧౪॥

నిత్యా సకల-కల్యాణీ సర్వైశ్వర్య-ప్రదాయినీ ।
దాక్షాయణీ పద్మహస్తా భారతీ సర్వమఙ్గలా ॥ ౧౫॥

కల్యాణీ జననీ దుర్గా సర్వదుర్గవినాశినీ ।
ఇన్ద్రాక్షీ సర్వభూతేశీ సర్వరూపా మనోన్మనీ ॥ ౧౬॥

మహిషమస్తక-నృత్య-వినోదన-స్ఫుటరణన్మణి-నూపుర-పాదుకా ।
జనన-రక్షణ-మోక్షవిధాయినీ జయతు శుమ్భ-నిశుమ్భ-నిషూదినీ ॥ ౧౭॥

సర్వమఙ్గల-మాఙ్గల్యే శివే సర్వార్థ-సాధికే ।
శరణ్యే త్ర్యమ్బకే దేవి నారాయణి నమోఽస్తుతే ॥ ౧౮॥

ఓం హ్రీం శ్రీం ఇన్ద్రాక్ష్యై నమః। ఓం నమో భగవతి, ఇన్ద్రాక్షి,
సర్వజన-సమ్మోహిని, కాలరాత్రి, నారసింహి, సర్వశత్రుసంహారిణి ।
అనలే, అభయే, అజితే, అపరాజితే,
మహాసింహవాహిని, మహిషాసురమర్దిని ।
హన హన, మర్దయ మర్దయ, మారయ మారయ, శోషయ
శోషయ, దాహయ దాహయ, మహాగ్రహాన్ సంహర సంహర ॥ ౧౯॥

యక్షగ్రహ-రాక్షసగ్రహ-స్కన్ధగ్రహ-వినాయకగ్రహ-బాలగ్రహ-కుమారగ్రహ-
భూతగ్రహ-ప్రేతగ్రహ-పిశాచగ్రహాదీన్ మర్దయ మర్దయ ॥ ౨౦॥

భూతజ్వర-ప్రేతజ్వర-పిశాచజ్వరాన్ సంహర సంహర ।
ధూమభూతాన్ సన్ద్రావయ సన్ద్రావయ ।
శిరశ్శూల-కటిశూలాఙ్గశూల-పార్శ్వశూల-
పాణ్డురోగాదీన్ సంహర సంహర ॥ ౨౧॥

య-ర-ల-వ-శ-ష-స-హ, సర్వగ్రహాన్ తాపయ
తాపయ, సంహర సంహర, ఛేదయ ఛేదయ
హ్రాం హ్రీం హ్రూం ఫట్ స్వాహా ॥ ౨౨॥

గుహ్యాత్-గుహ్య-గోప్త్రీ త్వం గృహాణాస్మత్కృతం జపమ్ ।
సిద్ధిర్భవతు మే దేవి త్వత్ప్రసాదాన్మయి స్థిరా ॥ ౨౩॥

ఫలశ్రుతిః
నారాయణ ఉవాచ ॥

ఏవం నామవరైర్దేవీ స్తుతా శక్రేణ ధీమతా ।
ఆయురారోగ్యమైశ్వర్యమపమృత్యు-భయాపహమ్ ॥ ౧॥

వరం ప్రాదాన్మహేన్ద్రాయ దేవరాజ్యం చ శాశ్వతమ్ ।
ఇన్ద్రస్తోత్రమిదం పుణ్యం మహదైశ్వర్య-కారణమ్ ॥ ౨ ॥

క్షయాపస్మార-కుష్ఠాది-తాపజ్వర-నివారణమ్ ।
చోర-వ్యాఘ్ర-భయారిష్ఠ-వైష్ణవ-జ్వర-వారణమ్ ॥ ౩॥

మాహేశ్వరమహామారీ-సర్వజ్వర-నివారణమ్ ।
శీత-పైత్తక-వాతాది-సర్వరోగ-నివారణమ్ ॥ ౪॥

శతమావర్తయేద్యస్తు ముచ్యతే వ్యాధిబన్ధనాత్ ।
ఆవర్తన-సహస్రాత్తు లభతే వాఞ్ఛితం ఫలమ్ ॥ ౫॥

రాజానం చ సమాప్నోతి ఇన్ద్రాక్షీం నాత్ర సంశయ ।
నాభిమాత్రే జలే స్థిత్వా సహస్రపరిసంఖ్యయా ॥ ౬॥

జపేత్ స్తోత్రమిదం మన్త్రం వాచాసిద్ధిర్భవేద్ధ్రువమ్ ।
సాయం ప్రాతః పఠేన్నిత్యం షణ్మాసైః సిద్ధిరుచ్యతే ॥ ౭॥

సంవత్సరముపాశ్రిత్య సర్వకామార్థసిద్ధయే ।
అనేన విధినా భక్త్యా మన్త్రసిద్ధిః ప్రజాయతే ॥ ౮॥

సన్తుష్టా చ భవేద్దేవీ ప్రత్యక్షా సమ్ప్రజాయతే ।
అష్టమ్యాం చ చతుర్దశ్యామిదం స్తోత్రం పఠేన్నరః ॥ ౯॥

ధావతస్తస్య నశ్యన్తి విఘ్నసంఖ్యా న సంశయః ।
కారాగృహే యదా బద్ధో మధ్యరాత్రే తదా జపేత్ ॥ ౧౦॥

దివసత్రయమాత్రేణ ముచ్యతే నాత్ర సంశయః ।
సకామో జపతే స్తోత్రం మన్త్రపూజావిచారతః ॥ ౧౧॥

పఞ్చాధికైర్దశాదిత్యైరియం సిద్ధిస్తు