Translate

Sunday, April 19, 2020

జయ మంత్రం (సర్వ కార్య సిద్ధికి చదవాల్సిన మంత్రం)

జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః |
దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః
హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః ||

న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్
శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః |
అర్ధయిత్వా పురీం లంకామభివాద్య చ మైథిలీం
సమృద్ధార్ధో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్ ||

Wednesday, April 8, 2020

హనుమద్ స్తుతి

శ్రీరామ జయరామ జయ జయరామ..!!

”ఉస్త్రారూధ సువర్చలాసహచర ,సుగ్రీవ మిత్రామ్జనా –సూనో ,వాయు కుమార ,కేసరి తనూజా ,అక్షాది దైత్య సంహారా

సీతా శోక హరా ,అగ్ని నందన ,సుమిత్రా సంహవ ,ప్రాణదా –శ్రీ బీమాగ్రాజ శంభు పుత్ర ,హనుమాన్ ,పంచాష్య తుభ్యం నమః ”

”ఖడ్గం ,ఖేటక ,భిండి వాల ,పరశుం ,పాశం ,త్రిశూలం ,ద్రుమాన్
చక్రం ,శంఖ ,గదా ,ఫలం ,కుశ ,సుధా కుమ్భాన్ హలం ,పర్వతం
టంకం ,పుస్తక ,కార్ముక అహి ,డమరుం ,నేతాణి ,దివ్యాయుదా
న్యేవం ,వింశతి ,బాహుభి శ్చ దధతం ,ధ్యాయే హనుమత్ప్రభుం ”

ఏమీ చేయాలి ఏమీ చేయకూడదు ? (హిందూ ధర్మం అనే వాట్సాప్ గ్రూప్ నుండి సేకరణ)


 మనము ఆరాధించే దేవతలే అయినా కొన్ని దేవతా విగ్రహాలు ఇంట్లో ఉంచకూడదు గృహస్థులకు మంచిది కాదు అంటే వాటికి చేయవలసిన విధి విధానం గృహస్థులు చేయలేరు, కొన్ని ఉడటం వల్ల ఏమీ చేసిన చేయక పోయినా ఇంటికి మంచిది అవి ఏంటో చూద్దాము.. 
1. పూజ గది విడిగా లేని వారు పంచముఖ హనుమంతుడి ని పెట్టకూడదు,హనుమంతుడి ఫోటో కానీ విగ్రహం గాని ఏది పూజ గది విడిగా లేని వారు ఉంచకూడదు. 
2. సూర్యుడి విగ్రహం ఇంట్లో పెట్టకూడదు,ఆయనే ప్రత్యక్షంగా కనిపిస్తారు కాబట్టి నేరుగా నమస్కరించాలి. 
3.ఉగ్ర రూపంలో ఉన్న నరసింహ స్వామి ఫోటో గాని విగ్రహం కానీ ఉంచకూడదు, లక్ష్మీ నరసింహ, యోగ నరసింహ, లేదా ప్రహ్లాద అనుగ్రహ నరసింహ స్వామి ఫోటో పెట్టికొని పూజ చేయవచ్చు.. 
4.చేతిలో ఫ్లూట్ ఉన్న కృష్ణుడు విగ్రహం ఇంట్లో ఉండకూడదు, కృష్ణుడి విగ్రహం అవుతో ఉన్న ఫొటో గాని చిన్న పరిమాణంలో విగ్రహం కానీ ఉండవచ్చు... 
5.గవ్వలు ఎందుకు పెట్టాలి పూజ గదిలో అని అడిగారు, మొదటిది చాలామంది బాగా పూజ చేసే వారు పూజ చేయలేక పోతుంటారు, అసలు కళకళ లాడే పూజ గది దుమ్ము కొట్టేస్తున్న పూజ చేయనీయదు, అలాంటి దిష్టి పూజ గదిలోకి ప్రవేశించదు గవ్వలు ఉంటే, సముద్రపు గవ్వలకు ఆ శక్తి ఉంది గవ్వలు లక్ష్మీ దేవికి తోబుట్టువుల, లక్ష్మీ దేవి విగ్రహం ముందు కానీ ఫోటో ముందు కానీ ఒక చిన్న గిన్నెలో(వెండి అయితే మంచిది) బియ్యం, అందులో కొన్ని గవ్వలు వేసి ఉంచాలి, అది అమ్మవారికి చాలా ఇష్టం,ఆడవాళ్లకు పుట్టిల్లు పైన ఉండే మమకారం అలాంటిది, పాలసముద్రం నుండివచ్చిన తల్లి కాబట్టి ఆమె పుట్టింటి వారిని తోడుగా కూర్చోబెట్టి నట్టు, అందుకే అక్కడ ఉన్న గవ్వలు కూడా అమ్మవారి కి ఆ గదికి దిష్టి తగలకుండా కాపుకాస్తాయి.. 
6. కాళికా , ప్రత్యంగిరా దేవి ఫోటోలు పెట్టకూడదు అని అనుకుంటారు ,సంతోషంగా పెట్టచు ఇక్కడ ఫోటోలో ఉన్న ఉగ్ర రూపం మీ కుటుంబానికి ఏ చెడు దగ్గరకు రాకుండా భయపెట్టి తరిమేస్తుంది, కానీ తాంత్రిక పూజలు అలాంటి మంత్రాలు చదవకుండా, స్త్రోత్రం, అష్టోత్తరం తో ఆ ఫోటో కి పూజ చేసుకోవచ్చు.. 
7. విగ్రహం పరిమితి చాలా చిన్నదిగా ఉంటే మీకే మంచిది , పండో పాలో పెట్టి కూడా హారతి ఇస్తే సరిపోతుంది, విగ్రహాల పరిమితి పెద్దదిగా ఉంటే రోజు మహా నివేదన, వారంలో ఒక్కసారి అయినా అబీషేకం, ఉండాలి... పూజ లేకుండా ఉండకూడదు... 
8. ఇంట్లో నటరాజ స్వామి విగ్రహం పెట్టుకోకూడదు, నాట్యం నేర్పే ప్రదేశంలో నిత్యం నాట్య నివేదన జరుగుతుంది కాబట్టి అక్క ఉండవచ్చు..
 9.ఇంటి గుమ్మానికి దిష్టి కోసం అని రాక్షసుల ఫోటోలు పెట్టకూడదు, ఇంటి యజమానికి తరచూ అనారోగ్యం పాలు అవుతుంటారు,వినాయకుడి ఫొటో, కానీ,దిష్టి యంత్రం గాని, కాళీ పాదం ఫోటో కానీ పెట్టడం మంచిది.. 
10. నిత్యం పూజ లో ఉన్న విగ్రహాలు పూజ గది నుండి తీసి వేయాల్సి వస్తే ఆటకపైన పెట్టకుండా సెల్ఫ్ లో ఉంచి హారతి ఇవ్వండి లేకపోతే గుడిలో పెట్టండి.. 
11. ఇంటిలో పూజించే వినాయకుడి విగ్రములో తొండం ఎడమ వైపు ఉండాలి, విద్యాలయాలు, ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ లో ఉండే విగ్రహం కి తొండం కుడి వైపు ఉండాలి..వ్యాపారం చేసే ప్రాంతంలో లో నిల్చున్న వినాయకుడు ఉండాలి. 
12. ఇంట్లో ఎక్కడా లక్ష్మీ దేవి నిల్చుని ఉన్నట్టుగా ఉండకూడదు, లక్ష్మీ దేవి పచ్చరంగు చీరతొ అటూఇటూ ఏనుగులు ఉన్న ఫొటో కి గృహస్థులు పూజించడం చాలా మంచిది.. 
13. పూజ తర్వాత దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యం పూజ ఐయ్యాక వెంటనే తీసేసి ప్రసాదంగా స్వీకరించాలి. మీరు చేసిన పూజకు దేవుని అనుగ్రహం ప్రసాదం రూపంలో మీరు స్వీకరించాలి. 
14.పూజ గదిలో బంగారు విగ్రహాలు పెట్టుకున్న వారిని కూడా చూశాను, ఎంత ఖరీదు అయిన విగ్రహాలు ఉంచినా, పూజ గదిలో గోడకు పసుపు రాసి, వైష్ణవుల అయితే నాంకొమ్ముతో తిరు నామాలు, శైవులు అయితే త్రిపురాండ్రులు(అడ్డనామాలు), శక్తేయులు అయితే పసుపు మధ్యలో గౌరీ తిలకం బొట్టులుగా పెట్టాలి, వైష్ణవుల అయితే తులసి ఆకుతో గాని తమల పాకును గాని గోడకు రద్దీ నామాలు పెడతారు, మీరు ఎంత ఖరీదైన పూజ వస్తువులు ఉంచినా పూజ గది గోడకు ఇలా పెట్టి పూజించడం సాంప్రదాయం , ఇది ఇంకా చాలా కుటుంబాలు ఆచరిస్తున్నారు, చాలా మంది మర్చిపోయారు.. 
15. అప్పుల బాధలు తీరాలి అంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి..ఇంట్లో గొడవలు తగ్గాలి అంటే ఆముదంతో దీపారాధన చేయాలి... నిత్యం లక్ష్మీ కటాక్షం కోసం అవునేతి దీపం పెట్టాలి, శత్రు పీడల, గండాలు ఆస్తి వివాదాలు ఇంట్లో వారి అనారోగ్యం తొలుగుటకు నువ్వుల నూనె తో నిత్యా దీపారాధన చేయాలి. 
16. దేవుడి గుడికి వెళ్ళినప్పుడు గుడి వెనుకభాగం (బలిపీఠం దగ్గర తాకడం కానీ తల అనించడం కానీ చేయకూడదు, చేట్టుకింద వాయు ప్రతిష్ట చేసిన శివలింగాలకు తల ఆనించి డిచ్చి కొటేస్తుంటారు కొందరు , దేవుడి విగ్రహాలకు తలతో డిచ్చి కట్టకండి. 
17. బలిపీటాల దగ్గర అర్చకులు తప్ప ఎవరూ ఏది అక్కడ పెట్ట కూడదు.. గుడిలో దేవుడికి, అర్చకులకు తప్పా ఎవరికి పరస్పర నమస్కారాలు చేయకూడదు. 
18. నవగ్రహాలు తాకి మొక్క కూడదు...
 19. షష్ఠి, అష్టమి, త్రయోదశి నాడు తలకు నూనె అంటుకోకూడదు, రాత్రి పూట తల చిక్కు తీయకూడదు, పెరుగు చేతితో చిలక కూడదు, 
20. నీరు,పాలు, పెరుగు, నైయి కి అంటు ఉండదు.అవి ఎక్కడ నుండి అయినా ఎవరి నుండి అయినా తీసుకోవచ్చు.. 
21. లక్ష్మీ దేవి అనుగ్రహానికి పూజలు ఉన్నాయి, లక్ష్మీ దేవి నివాసం పాలు, లక్ష్మీ స్థానాలు అనేకం ఉన్నాయి.. అలాగే జేష్ఠ దేవి అనుగ్రహం ఎలా పొందాలి జేష్ఠ దేవి నివాసం పులిహోర ,జేష్ఠ దేవి స్థానాలు కూడా అనేకం ఉంటాయి.. పులిహోర చేసి దేవుడికి నివేదన చేస్తే జేష్ఠ దేవి పెట్టె కష్టాలనుండి ఉపశమనం లభిస్తుంది, పులిహోర చేసి పంచి పెడితే జేష్ఠ దేవి శాంతిస్తుంది. అందుకే పెద్దవాళ్ళు వారానికి ఒక్కసారి అయినా ఇంట్లో పులిహోర వండుకునే వాళ్ళు...పంచి పెడితే ఇంకా మంచిది. 
22. రాత్రి పూట ఆహారం తీసుకోకుండా నిద్రపోకూడదు, ఆహారం రుచిగా లేకపోయినా బాగలేదు అంటూ తినకూడదు. తిట్టుకుంటారు వంట చేయకూడదు. తినే వారు కూడా తిట్టుకుంటూ తింటారు.. సంతోషం గా వంట చేస్తే సంతోషం గా తింటారు... 
23.ఎప్పుడూ నిద్రపోతూ ఉండే వాడు, అసలు నిద్రపోకుండా ఉండే వాళ్ళు, ఎప్పుడూ తింటూనే ఉండే వారు, అసలు ఆహారం పైన శ్రద్ద లేకుండా పస్థులు ఉపవాసాలు ఉండే వారు, ఏ కష్టం చేయకుండా ఇతరులపై ఆధార పడి బతికే వాళ్ళు, పంచమహా పాతకం చేసిన వారి కన్నా పెద్ద పాపాత్ములు.. 
24.పచ్చి పాలు నైవేద్యం పెట్టకూడదు, కాచి చల్లారిన పాలు అభిషేకం కి వాడకూడదు..
 25.ధ్యానం చేసుకునే ఆసనం అడ్డంగా వేసుకుని కూర్చో కూడదు, నిలువుగా ఉండాలి. జపమాల చూపుడు వెలుపైన తిప్ప కూడదు మధ్య వేలు తోనే చేయాలి.. 
26. జపానికి వాడే జప మాల మెడలో వేసుకోకూడదు, మెడలో వేసుకున్న మాల జపానికి వాడ కూడదు.. 
27. ఒకరు మెడలో వేసుకున్న రుద్రాక్షలు ఇంకొకరు ధరించ కూడదు.... 
28.దేవుడి దగ్గరకు, పెద్దవాళ్ళు దగ్గరకు ,పిల్లలు ఉన్న ఇంటికి ఒట్టి చేతితో వెళ్లకూడదు...
 29. ఇంట్లో అతిధి ఉన్నప్పుడు వారికి పెట్టకుండా ముందు మీరు తినకూడదు... మొదటి సారి ఎవరైనా ఇంటికి భోజనం కి వచ్చినప్పుడు వారు ఒక్కసారి వడ్డించిన ఆహారంతో లెవకూడదు రెండవ సారి కాస్త అయినా పెట్టుకోవాలి..అలా ఓక్కసారి లేస్తే ఆదిత్యం ఇచ్చిన ఫలితం దక్కదు..
 30.ఇంట్లో పిల్లలు ఇంట్లో వారు తరచూ తిరిగే చోట ఇంటి దైవాన్ని ఫోటో పెట్టాలి, అప్పుడు వస్తూ పోతూ చూసినప్పుడు ఒకసారి ఆ నామం మనసులో తలచుకోవడం అలవాటు అవుతుంది. 
31.అద్దె ఇల్లు వాస్తు మీ జాతకనికి సరిపడక పోవచ్చు అలాంటి వాస్తు దోషాలు పరిహారం గా ఏడు రంగులు కలిసిన wallmat గోడకు డెకరేషన్ గా పెట్టాలి....
 32. ఇంట్లో తరచుగా సాంబ్రాణి వేస్తూ ఉండాలి నెగటివ్ ఎనర్జీ దూరంగా ఉంటుంది.. ఇంట్లో గాలి పురిఫ్య అవుతుంది...

Thursday, April 2, 2020

శ్రీరామనవమి సేకరణ-ఈనాడు పేపర్

రామ  రెండక్షరాలు  శక్తి శరాలు!

రా... మ...

విడివిడిగా అవి రెండక్షరాలే...

కానీ కలివిడిగా పలికితే అది మహాశక్తిమంతం...తారక మంత్రం...

రాముడి బాణమెంత ప్రచండమో, ఆయన నామమంత ప్రసన్నమైందంటారు.

అందుకే రఘురామచంద్రుడే కాదు...

ఆయన పేరు కూడా పూజనీయమైంది, నిత్యస్మరణీయమైంది...

రామ  రెండక్షరాలు  శక్తి శరాలు!

 లేఖ రాసినా ముందుగా ‘శ్రీరామ’ నామాన్ని రాసి, ఆ తర్వాత మిగిలిన విషయాలు రాయడం భారతీయుల సంప్రదాయం. ఏదైనా దుర్వార్త విన్నప్పుడు ‘రామ రామ’ అంటూ చెవులు మూసుకోవటం కూడా చూస్తుంటాం. ఆకలి వేస్తే ‘అన్నమో రామచంద్రా’ అంటారని తెలుగువారి నానుడి. ఏదైనా భయం ఆవహించినా, ఎవరికైనా అభయం ఇచ్చినా ‘శ్రీరామ రక్ష’ అనడం అలవాటు.

‘నాథా! కలియుగంలో మానవులు చాలా అల్పమైన శక్తి కలిగిఉంటారు. విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని కూడా పూర్తిగా పారాయణ చెయ్యలేని అశక్తత వారిది. అలాంటప్పుడు ప్రజలు తరించే మార్గం ఉండదా? మొత్తం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసిన ఫలితాన్ని పొందే సూక్ష్మమైన మార్గం లేదా? అంటూ ఓ రోజున పార్వతీదేవి పరమేశ్వరుడిని ప్రశ్నించింది.’

దానికి శివుడు... లేకేం పార్వతీ...

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే

సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే

‘శ్రీరామ రామ రామ’ అనే ఒక్క నామాన్ని పారాయణ చేస్తే మొత్తం విష్ణు సహస్రనామాలను పారాయణ చేసిన ఫలితం వస్తుందని ఉపదేశించాడు పరమేశ్వరుడు.

‘రామ’ అనే పదాన్ని పలకడంతోనే పాపాలన్నీ తొలగిపోతాయని ‘శ్రీరామ కర్ణామృతం’ ప్రకటిస్తోంది. ‘రా’ అనే అక్షరాన్ని పలికేటప్పుడు మన పెదవులు తెరుచుకుంటాయి. దీనివల్ల మనలో ఉండే ప్రతికూల శక్తులు బయటకు పోతాయి. ‘మ’ అనే అక్షరాన్ని పలికేటప్పుడు పెదవులు మూసుకుంటాయి. దీంతో తిరిగి అవి మనలో చేరకుండా నిరోధానికి గురవుతాయి. అందుకే ఈ మంత్రం అత్యంత శక్తిమంతమైందని చెబుతారు. ఉమా సంహిత కూడా ఇదే విషయాన్ని వివరిస్తుంది.

‘రా శబ్దోచ్చారణే జాతే వక్త్రాత్పాపం విగచ్ఛతి

మకార శ్రవణే జాతే భస్మీభావం గమిష్యతి’

‘రా’ అనే శబ్దం ఉచ్చరించగానే ముఖం నుంచి మనలోని పాపాలు బహిర్గతమవుతాయి. ‘మ’ అనే అక్షరం వినబడగానే అవన్నీ భస్మమవుతాయని చెబుతోంది. ఇదే భావాన్ని భక్త రామదాసు తన దాశరథీ శతకంలో ప్రకటించారు.

‘రామ’ నామం హరి, హరులిద్దరూ ఒక్కటేనన్న సత్యాన్ని విస్పష్టంగా ప్రకటిస్తూ, అద్వైతభావనకు ప్రతీకగా నిలుస్తుంది. ‘రా’ అనే అక్షరం నారాయణ అష్టాక్షరీ మంత్రమైన ‘ఓం నమో నారాయణాయ’లోని ఐదో అక్షరం. అలాగే, ‘మ’ శివపంచాక్షరీ మంత్రమైన ‘ఓం నమశ్శివాయ’ మూడో అక్షరం. ఈ రెండక్షరాల సంయోగమే ‘రామ’ నామం. కాబట్టి, ‘రామ’ నామం శివకేశవ అభేదభావాన్ని ప్రకటిస్తుంది.

నారాయణ అష్టాక్షరీ మంత్రంలో ‘రా’, శివపంచాక్షరీ మంత్రంలో ‘మ’ అనే అక్షరాలు ఆయా మంత్రాలకు జీవాక్షరాలు. ఆ రెండు అక్షరాల సంయోగంతో ఏర్పడిన మహోన్నత మంత్రం ‘రామ’ నామం. ఈ కారణం వల్లనే రామనామం అన్ని మంత్రాల కన్నా పరమోన్నతమైన పవిత్రతను, శక్తిని పొందింది.

రామ  రెండక్షరాలు  శక్తి శరాలు!

కంచి కామకోటి పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి చెప్పిన కథ ఇది.

ఓ అడవిలోకి ప్రవేశించిన కొందరు దొంగలు తాము చేయాలనుకున్న పనుల గురించి ఇలా మాట్లాడుకుంటున్నారు.

వనేచరామః వసుచాహరామః

నదీన్తరామః నభయం స్మరామః

వనే చ రామః (అడవిలో సంచరిద్దాం), వసు చా హరామః (ఈ దారిలో వెళ్ళే ప్రయాణికుల సంపదను దొంగలిద్దాం), నదీం స్తరామః (దొంగిలించాక నదిని దాటేద్దాం), నభయం స్మరామః (భయం గురించిన ఆలోచన కూడా చెయ్యొద్దు) అని అనుకున్నారు.

ఇతీరయంతో విపినే కిరాతా ముక్తింగతాః

రామపదానుషంగాత్‌

దొంగలైనా తమ ఆలోచనలో ‘రామ’ నామాన్ని స్మరించడం వల్ల మరణించాక వారికి మోక్షం కలిగిందట. ఇదీ రామ నామ మహిమ అని చెప్పారాయన.

మహా మంత్రం

* ప్రాచీన సంప్రదాయంలో అంకెను అక్షరాలతో పోల్చి చెబుతారు. ఈ క్రమంలో ‘ర’ అనే అక్షరం 2కు సంకేతం. ‘మ’ 5కు సంకేతం. రామ... అంటే 2x5=10 అవుతుంది. ఒకసారి ‘రామ’ అంటే 10 ఫలితం వస్తుంది. వరుసగా మూడు సార్లు ‘రామ రామ రామ’ అంటే 10x10x10 =1000 అవుతుంది. అంటే ఒక్కసారి ‘శ్రీరామ రామ రామ’ అనే నామాన్ని పలికితే 1000 విష్ణు నామాల్ని పారాయణ చేసిన ఫలితం వస్తుందని భావన.

* ‘రామ’ అనే శబ్దమే ప్రణవంతో సమానం కాబట్టి ఇతర మంత్రాల మాదిరిగా ఈ మంత్రానికి ముందు ఓంకారం కలిపి జపించాల్సిన అవసరం లేదు.

* మన మంత్రశాస్త్రంలో సప్తకోటి మహామంత్రాలు ఉన్నాయి. వీటన్నిటిలో కేవలం రామ మంత్రాన్ని మాత్రమే ‘రామ తారక మంత్రం’ అంటారు. ‘తారకం’ అంటే తరింపజేసేదని భావం. ‘వివేకాన్ని మేలుకొలపడాన్నే తారకం’ అంటారని పతంజలి యోగశాస్త్రం చెబుతోంది. రామ మంత్రం మనిషిలో వివేక వైరాగ్యాలను కలిగించి మనిషిని తరింపజేస్తుంది కాబట్టే ఇది సర్వోన్నతమైందిగా, మంత్రచూడామణిగా వెలుగొందుతోంది.

* ‘రా’ అంటే పరబ్రహ్మ. ‘మ’ అంటే జీవుడు. కాబట్టి ‘రామ’ అనే నామం పరమాత్మలో లీనమైన జీవాత్మను ప్రకటిస్తుంది. శరీరమనే క్షేత్రంలో జీవాత్మరూపంలో దాగి ఉన్న పరమాత్మను దర్శించమనే సందేశాన్నిస్తుంది. 

* పసిబిడ్డల్ని ఉయ్యాలలో వేసి ‘రామా లాలీ మేఘశ్యామ లాలీ’ అంటూ జోకొట్టడం ఆత్మీయతకు ప్రతిరూపం. తుది శ్వాస విడిచిన తర్వాత రుద్రభూమికి పార్ధివదేహాన్ని తీసుకెళుతూ ‘రామ్‌ నామ్‌ సచ్‌ హై’ అంటూ ఉచ్చరించే ఆచారం ఉత్తరాదిలో ఉంది. ఇలా తొలి, తుది శ్వాసల్లో మనిషి తోడుగా ఉండేది కేవలం రామ నామం మాత్రమే.

రామనామ్‌ మణిదీప్‌ ధయ జోహ్‌ రే హరంద్వార్‌

తుసి భీతర్‌ ఛాహే రహు జాం బహం ఉజ ఆర్‌’

మీకు లోపల, బయట వెలుగు కావాలన్న కోరిక ఉంటే జిహ్వ అనే ద్వారం దగ్గర రామ నామం అనే దీపాన్ని వెలిగించండి అంటాడు తులసీదాసు.

భక్త రామదాసు ‘శ్రీరామ నీ నామమెంతో రుచిరా’ అంటూ, ‘పిబరే రామ రసం రసనే పిబరే రామరసం’ అంటూ సదాశివ బ్రహ్మేంద్రుడు, ఇంకా ఎందరో ఎందరెందరో వాగ్గేయకారులు రామ నామంలోని ఔచిత్యాన్ని, ఔన్నత్యాన్ని పొగడుతూ, విశ్లేషిస్తూ, వివరిస్తూ వందలాది కృతులు రచించారు.

-కప్పగంతు రామకృష్ఱ

తీర్చిదిద్దుకోండి...

రామ  రెండక్షరాలు  శక్తి శరాలు!

విశ్వామిత్రుడి యాగ రక్షణ కోసం లక్ష్మణుడితో సహా బయల్దేరిన శ్రీరామచంద్రమూర్తి ఆ యాత్రలో మొత్తం ముగ్గురు స్త్రీలను కలుసుకుంటాడు. వారు తాటక, అహల్య, సీతాదేవి.

తాటక తమోగుణానికి సంకేతం అందుకే గురూపదేశం ప్రకారం ఆమెను సంహరించాడు. అహల్య రజోగుణానికి ప్రతీక. చురుకుదనం, క్రియాశీలత ఆమెను తప్పుదోవ పట్టించాయి. అందుకే రామయ్య రాతిగా పడిఉన్న అహల్యను తిరిగి స్త్రీగా మార్చి సంస్కరించాడు. చివరిగా కలుసుకున్న స్త్రీమూర్తి సీతాదేవి. ఆమె సత్త్వగుణానికి నిలువెత్తు నిదర్శనం. అందుకే స్వయంవరంలో ఆమెను గెలుచుకున్నాడు. ఈ మూడు ఇతివృత్తాల్లో రామచంద్రుడు లోకానికి ఉత్తమ సందేశం ఇచ్చాడు. ఏ వ్యక్తి అయినా సత్త్వరజస్తమో గుణాల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. తనలోని తమో గుణాన్ని నశింపజేసుకోవాలి. రజో గుణాన్ని సంస్కరించుకుని, సత్కార్యాలపై దృష్టి పెట్టాలి. సత్త్వ గుణాన్ని పెంపొందించుకుంటూ, చివరకు గుణాతీత స్థితికి చేరుకోవాలి.

ప్రకృతి ప్రణమిల్లుతుంది

రావణుని చేతికి చిక్కిన సీతమ్మను వెదుక్కుంటూ శ్రీరాముడు అరణ్యంలోని కొండలు, గుట్టలు అన్నీ వెదికాడు. కనిపించిన ప్రతి వారినీ ఆమె జాడ గురించి అడిగాడు. రామయ్య దీనస్థితిని చూసిన లేళ్లు యథాశక్తి ప్రయత్నించి, సీతమ్మను రావణుడు అపహరించి, దక్షిణ దిశగా తీసుకెళ్లాడని సైగలతో చెబుతాయి. ‘సపంథానంతు గచ్ఛంతం తిర్యంచోపి సహాయతే కుపథానంతు గచ్ఛంతం సోదరోపి విముంచతి’... మంచి మార్గంలో ప్రయత్నించే వారికి ప్రకృతి సాయం కూడా అందుతుందని ఈ ఉదంతం చాటింది.

కన్నతల్లి, కర్మభూమి
రామ  రెండక్షరాలు  శక్తి శరాలు!

రామ, రావణ యుద్ధం ముగిసింది. విభీషణుడు లంకాధిపతి అయ్యాడు. తనకు ఇంతటి ఘనత తెచ్చిన రామయ్యను లంకలో ఉండి, పది రోజులు తమ ఆతిధ్యాన్ని స్వీకరించమని విభీషణుడు ప్రార్థించాడు. అందుకు రామయ్య

ఆపి స్వర్ణమయీ లంకా న మే లక్ష్మణ రోచతే

జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ!

‘విభీషణా! లంక, అందులోని భోగాలపై నాకు దృష్టిలేదు. మాతృమూర్తి, మాతృభూమి ఈ రెంటికీ మించింది ఈ లోకంలో లేదు. పద్నాలుగేళ్లుగా వీటికి దూరంగా ఉన్న నా మనసు వెంటనే వారిని చూడాలని ఆరాట పడుతోంది’ అన్నాడు.


ప్రతి ఇల్లూ రామాలయమే!

శ్రీరామ నవమి వచ్చింది...

భద్రాద్రి లేదు...

ఒంటిమిట్టా లేదు...

ఊర్లో రామాలయం లేదు...

చివరికి వీధిలో చలువ పందిరీ లేదు...

మరెలా...

ఇంటినే దేవాలయంలా, మనసే మందిరంలా మార్చేదిలా...

రామ  రెండక్షరాలు  శక్తి శరాలు!

నం ఇంట్లోనే సీతారాములను దర్శించి, అర్చించి, దీవెనలందుకోవాల్సిన సమయమిది. పురోహితులు రాకుండా ఇంట్లో ఆగమ సంప్రదాయం ప్రకారం కల్యాణం జరపడం ఆచరణ సాధ్యం కాదు కాబట్టి అర్చనతో సంతృప్తి చెందాలి. మన ఇంటిలో పూజామందిరంలోనే సీతారాములను కల్యాణ దంపతులుగా అలంకరించి, షోడశోపచారాలతో పూజించుకోవచ్చు.

ఈ సందర్భంగా పూజావేదికపై కలశాన్ని ఏర్పాటు చేసుకొని సంకల్పం చెప్పాలి. ‘స్వస్తిశ్రీ వ్యావహారిక చాంద్రమానేన శ్రీ శార్వరినామ సంవత్సరే ఉత్తరాయణే వసంతరుతౌ చైత్రమాసే శుక్లపక్షే నవమ్యాం బృహస్పతివాసరే పునర్వసు శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ, అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం సమస్త మంగళావాప్త్యర్థం సీతా లక్ష్మణ భరత శతృఘ్న హనుమత్‌ సమేత శ్రీరామచంద్రదేవతాం ఉద్దిశ్య శ్రీరామచంద్రదేవతా ప్రీత్యర్థం యథాశక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూర్వక పూజాం కరిష్యే. శ్రీరామచంద్ర అష్టోత్తర శతనామ పూజాం కరిష్యే...’ అని సంకల్పం చెబుతూ అష్టోత్తర శతనామావళి జపించాలి. అవకాశం లేకుంటే రామనామం జపించినా సరిపోతుంది.


వడపప్పు, పానకము, పండ్లు, కొబ్బరి, వాటితోపాటు మనం ఇంటిలో చేసుకున్న వంటకాలనూ నివేదన చేసి నీరాజనం ఇవ్వాలి. పూజానంతరం ఈ శ్లోకాలను చదువుకోవచ్ఛు●

వేడుక కంటేె భక్తిశ్రద్ధలు ముఖ్యం. అందుకే ఎవరింటిలో వారు నిశ్చల భక్తితో నిరాడంబరంగా కల్యాణ మూర్తులైన సీతారాములను అర్చించుకొని ఆశీస్సులు అందుకోవాలి.

ఆపదా మపహర్తారం

దాతారం సర్వ సంపదాం

లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం

- మల్లాప్రగడ శ్రీమన్నారాయణ