Translate

Sunday, November 29, 2020

తులసి స్తోత్రం


జగద్దాత్రి నమస్తుభ్యం విష్ణోశ్చ ప్రియవల్లభే,
యతో బ్రహ్మోదయో దేవాః సృష్టిస్థిత్యన్తకారిణః

నమస్తులసి కల్యాణి నమో విష్ణుప్రియే శుభే,
నమో మోక్షప్రదే దేవి నమః సమ్పత్పృదాయి కే

తులసీ పాతు మాం నిత్యం సర్వాపద్భ్యోపి సర్వదా,
కీర్తితా వా స్మృతా వాపి పవిత్రయతి మానవమ్

నమామి శిరసా దేవీం తులసీం విలసత్తమామ్,
యాం దృష్ట్వా పాపినో మర్త్యాః ముచ్యన్తే సర్వకిల్బిషాత్

తులస్యా రక్షితం సర్వం జగదేతచ్చరాచరమ్,
యా వినిర్హన్తి పాపాని దృష్ట్వావా పాపిభిర్న రైః

సమస్తులస్యతితరాం యస్యై బద్ధ్వాంజలిం కలౌ,
కలయన్తిసుఖం సర్వం స్త్రియో వైశ్యాస్తథాపరే

తులస్యా నాపరం కించిద్దైవతం జగతీతలే,
యయా పవిత్రతో లోకో విష్ణుసంగేన వైష్ణవః
 
తులస్యాః పల్లవం విష్ణోః శిరస్యారోపితం కలౌ,
ఆరోపయతి సర్వాణి శ్రేయంసి వరమస్తకే

తులస్యాం సకలా దేవా వసన్తి సతతం యతః,
అతస్తా మర్చయేల్లోకే సర్వాన్దేవాన్స మర్చయన్

నమస్తులసి సర్వజ్ఞే పురుషొత్తమవల్లభే
పాహి మాం సర్వపాపేభ్యః సర్వసమ్పత్పృదాయికే

ఇతి స్తోత్రం పురా గీతం పుండరీకేణ ధీమతా,
విష్ణు మర్చయతా నిత్యం శోభనైస్తులసీదలైః

తులసీ శ్రీమహలక్ష్మీర్విద్యా విద్యా యశస్వినీ,
ధర్మా ధర్మాననా దేవీ దేవ దేవమనఃప్రియా

కార్తీక పురాణం పదునాల్గవ అధ్యాయం

అథ శ్రీ స్కాందపురాణే కార్తికమహాత్మ్యే చతుర్దశోధ్యాయః

శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణం పదునాల్గవ అధ్యాయం

వసిష్ఠఉవాచ

పౌర్ణమ్యాంకార్తికేమాసి వృషోత్సర్గం కరోతియః
తస్యపాపాని నశ్యమ్తి జన్మాంతరకృతానిచ!!

తా: వసిష్ఠుడు చెప్పుచున్నాడు, కార్తీకపౌర్ణమిని వృషోత్సర్జనము చెయుటవలన జన్మాంతర పాపములు నశించును. (వృషోత్సర్జనము అనగా ఆంబోతును వదులుట)

యఃకార్తికేవృషోత్సర్గం పౌర్ణమ్యాంపితృతృప్తయే
సంకుర్యాద్విధినా రాజన్ తస్యపుణ్యఫలంశ్రుణు!!
గయాశ్రాద్ధంకృతంతేన కోటివారంనసంశయః
పుణ్యదం మానుషేలోకే దుర్లభం కార్తికవ్రతమ్!!
*తా:* కార్తీకమాస వ్రతము ఈ మనుష్యలోకంలో దుర్లభము, అనగా సులభముగా ముక్తిమార్గమునిచ్చునని భావము, కార్తీకపున్నమి నాడు పితృప్రీతిగా వృషోత్సర్జనమును చేయువానికి కోటిరెట్లు గయాశ్రాద్ధఫలము చెందుతుంది.

యఃకోవాస్మత్కులేజాతః పౌర్ణమాస్యాంతు కార్తికే
ఉత్సృజేద్వృషభంనీలం తేనతృప్తావయంత్వితి
కాంక్షఁతినృపశార్దూల పుణ్యలోకస్థితా అపి!!
పౌర్ణమ్యాం కార్తికేమాసి ఆఢ్యో వాప్యధమోపివా
నోత్సృజేద్వృషభంలోభా త్సయాత్యంధతమోయమాత్!!
పిండదానాద్గయా శ్రాద్ధా త్ప్రత్యబ్దం ప్రతివత్సరే
పుణ్యతీర్థాసంగమనా త్తర్పణాచ్చమహాలయాత్
కార్తికేపౌర్ణిమాస్యాంతు వృషోత్సర్గం వినాగతిః!!
గయాశ్రాద్ధం వృషోత్సర్గం సమమాహుర్మనీషిణః
ప్రశస్తమూర్జెపౌర్ణమ్యాం వృషోత్సర్గస్సుఖప్రదః!!
*తా:* స్వర్గమందున్న పితరులు మనవంశమందు ఎవరైనా కార్తీకపున్నమినాడు నల్లని గిత్తను విడుచునా? ఆ విధముగ ఎవరైనా వృషోత్సర్జనము చేసిన తృప్తిపొందెదము అని కోరుకుంటూంటారు. ధనవంతుడుగానీ, దరిద్రుడుగానీ, కార్తీకపున్నమినాడు లోభమువల్ల వృషోత్సర్గమను ఆంబోతునువిడుచుక్రియను చేయనివాడు యమలోకమున అంధతమిస్రమను నరకమును పొందెదరు. కార్తీకపున్నమి రోజున వృషోత్సర్గమును చేయక, గయాశ్రాద్ధము చేసిననూ ప్రతిసంవత్సరమూ తద్దినము పెట్టిననూ పుణ్యతీర్థములు సేవించిననూ మహాలయము పెట్టిననూ పితరులకు తృప్తిలేదు. గయాశ్రాద్ధమును, వృషోత్సర్జమును సమానమని విద్వామ్సులు చెప్పిరి, కనుక, కార్తికపున్నమి నాడు వృషోత్సర్జనము సుఖమునిచ్చును.

యఃకుర్యాత్కార్తికేమాసి సర్వధర్మాధికం ఫలం
ఋణత్రయాద్విముచ్యేత కిమన్యైర్బహుభాషణైః!!
యోధాత్రీఫలదానంతు పౌర్ణమ్యాంచసదక్షిణం
కురుతె నృపశార్దూల సార్వభౌమోభవేద్ధృవమ్!!
యంకుర్యాద్దీపదానంచ పౌర్ణమ్యాం కార్తికేనఘ
సర్వపాపవినిర్ముక్తో తతో యాంతి పరాంగతిమ్!!
కర్మణామనసావాచా పాపంయస్సమ్యగాచరేత్
తస్యపాపానినశ్యంతి కార్తిక్యాందీపదానతః!!
లింగదానం పౌర్ణమాస్యాం కార్తిక్యాంశివతుష్టయే
ఇహసమ్యక్ఫలం ప్రాప్య సార్వభౌమోభవేద్ధ్రువమ్!!
పాపఘ్నం పుణ్యదంప్రాహుర్లింగదానం మనీషిణః
లింగదానమనాదృత్య యఃకుర్యాత్కార్తికవ్రతం
వజ్రలేపోభవేత్తస్య పాపరాశిర్నసంశయః!!
*తా:* అనేక మాటలేల? కార్తీకపున్నమినందు అన్ని పుణ్యములకంటే అధికమైన ఫలదానముచేయువాడు దేవ-పితృఋణ, ఋషిఋణ, మనుష్యఋణములనుమ్చి విముక్తినొందును. కార్తీకపూర్ణిమనాడు దక్షిణతోకూడి ధాత్రీఫలమును దానమిచ్చినవాడు సార్వభౌముడగును. కార్తీక పూర్ణిమనాడు దీపదానమాచరించినవారు విగతపాపులై పరమపదమునొందెదరు. కార్తీకమాసమమ్దు దీపదానమాచరించువాని మనోవాక్కాయములచేత చేసిన పాపములు నశించును. కార్తీకపున్నమి నాడు లింగదానమాచరించువాడు ఈ జన్మమునందు అనేక భోగములననుభవించి ఉత్తరజన్మమందు సార్వభౌముడగును.  లింగదానము వలన పాపములు శమించి, పుణ్యము గలుగును, కార్తీకమాసమందు లింగదానము చేయక మిగిలిన ధర్మములు చేసినందున పాపములు ఎంత మాత్రమూ కరుగవు.

అనంతఫదంప్రోక్తం దుర్లభం కార్తికవ్రతం
పరాన్నంపితృశేషంచ నిషిద్ధస్యచ భక్షణం
శ్రాద్ధాన్నం తిలదానం చ కార్తికేవం చ వర్జయేత్!!
గణాన్నంవృషలస్యాన్నం దేవలాన్నమసంస్కృతం
వ్రాత్యాన్నంవిధవాన్నంచ కార్తికేషడ్వివర్జయేత్!!
అమాయాం పౌర్ణమాస్యాంచ ప్రత్యబ్దేభానువాసరే
సోమసూర్యోపరాగేచ ఊర్జేననిశిభోజనమ్!!
ఏకదశ్యామహోరాత్రం వ్యతీపాతేచ వైధృతౌ
నిసిద్ధదివసేరాజన్ గృహీయః కార్తికవ్రతే!!
విష్ణోర్దినస్యయత్నేన పూర్వోత్తరదినద్వయే
మాసనక్తవ్రతాధీనో నకుర్యాన్నిశిభోజనమ్
నిషిద్ధదివసేప్రోక్తం ఛాయానక్తంమహర్షిభిః
నక్తవ్రతఫలంతేన న నక్తంనిశిభోజనమ్!!
సర్వపుణ్యప్రదెరాజన్ కార్తికేమాసియఃపుమాన్
నిషిద్ధదివసేచాన్నం భోజనంకురుతేయది
తస్యపాపస్యవిస్తారం కథం తేప్రబ్రవీమ్యహమ్!!
*తా:* కార్తీకవ్రతము అనంత ఫలప్రదము, సామాన్యముగా దొరకనిది కనుక కార్తీకమాసమునందు పరాన్నము భుజించుట, పితృశేషము తినకూడని వస్తువులు తినుట, శ్రాద్ధాన్నము సేవించుట, తిలదానము గ్రహించుట ఈ ఐదూ విడువవలెను. కార్తీకమాసమమ్దు సంఘాన్నము, శూద్రాన్నము, దేవతార్చకుల అన్నము, అపరిశుద్ధాన్నము, కర్మలను విడువుమని చెప్పువాని అన్నము, విధవాన్నమును భుజించరాదు. కార్తీకమాసమందు అమావాస్యయందు, పున్నమియందు పితృదినమందు ఆదివారమందు సూర్యచంద్ర గ్రహణములందు రాత్రిభోజనము నిషిద్ధము.  కార్తీకమాసమందు ఏకాదశినాడు రాత్రింబగళ్ళు, వ్యతీపాత వైధృతి యోగాది నిషిద్ధ దినములందు రాత్రి భోజనము చేయరాదు. మాస నక్తవ్రతము ఆచరించిన వాడు ఈ ఏకాదశికి పూర్వోత్తరదినములందును రాత్రిభుజించరాదు. అప్పుడు ఛాయానక్తభోజనము చేయవలెను కానీ రాత్రిభోజనము చేయరాదు. ఛాయానక్తమే రాత్రిభోజన ఫలమిచ్చును. కనుక రాత్రిభోజనముగూడ దినములందు కార్తీకవ్రతము చేయువాడు ఛాయానక్తమునే గ్రహింపవలెను ఛాయానక్తము అనగా సాయంత్రము తనశరీరమునకు రెండింతలు నీడ వచ్చినప్పుడు భోజనము చేయుట. యిదినిషిద్ధదినములలో గృహస్థులకు, ఎల్లప్పుడు యతి-విధవలకు హితము.  సమస్త పుణ్యములనిచ్చు ఈ కార్తీకమాసమందు నిషిద్ధదినములందు భుజించువారి పాపములు అనంతములగును.

తస్మాద్విచార్యయత్నేన కార్తికవ్రతమాచరేత్
తైలాభ్యంగందివాస్వాపం తథావైకాంస్యభోజనం
మఠాన్నిద్రాంగృహేస్తానం నిషిద్ధేనిశిభోజనం
వేదశాస్త్రవినిమ్దాంచ కార్తికేసప్తవర్జయేత్!!
ఉష్ణోదకేనకర్తవ్యం స్నానంయత్రైవకార్తికే
స్నానంతత్సురయాప్రోక్తం నిశ్చితంబ్రహ్మణాపురా
పటుర్భూత్వాగృహేస్నానం యః కుర్యాదుష్ణవారిణా!!
నదీస్నానం తు కర్తవ్యం తులాసంస్థేదివాకరే
కార్తికేమాసిరాజేంద్ర ఉత్తమంతంప్రచక్షతే!!
తటాకకూపకుల్యానాం జలేవాస్నానమాచరేత్
వినాగంగావినాగోదాం వినాతద్వత్సరిద్వరాం
తటాకకూపకుల్యానాం సుగంగామభివాదయేత్!!
సంప్రాప్యకార్తికంమాసం స్నానం యోనసమాచరేత్
సగచ్చేన్నరకంఘోరం చాండాలీం యోనిమాప్నుయాత్!!
గంగాదిసర్వనదీశ్చ స్మృత్వాస్నానం సమాచరేత్
తతోభివాదనంకుర్యాత్సూర్యమండలగ్ం హరిమ్
కృత్వావిష్ణుకథాందివ్యాం విప్రైస్సార్థంగృహవ్రజేత్!!
*తా:* కావున, విచారణచేసి ప్రయత్నపూర్వకముగా కార్తీక వ్రతమును ఆచరించవలెను, కార్తీకమాసమందు తైలాభ్యంగనము, పగలు నిద్ర, కంచుపాత్రలో భోజనము, మఠములలో నిద్ర, ఇంట్లో స్నానము, నిషిద్ధ దినములందు భోజనము వేదశాస్త్రనింద కూడదు. కార్తీకమాసములో శరీర సామర్థ్యము కొరకు ఇంటిలో వేడినీటి స్నానము చేయుట కల్లుతో స్నానమాచరించుట యని బ్రహ్మ చెప్పెను, శరీరపటుత్వము / ఆరోగ్యము సరి లేనివారు వేడినీటితో స్నానము చేయవచ్చు.   తులయందు సూర్యుడుండగా కార్తీకమందు నదీస్నానమే ముఖ్యము.  ఒకవేళ నది దగ్గరలో లేకున్న చెరువు, కాలువ, బావులందు స్నానము చేయవచ్చు. అప్పుడు గంగా ప్రార్థన చేసి స్నానము చేయవలెను, గంగా గోదావరి మహానదులలో స్నానము చేయునప్పుడు ప్రార్థన అవసరంలేదు. గంగా గోదావరి మొదలైన నదుల సన్నిధిలో లేనప్పుడు తటాక, కూపోదక స్నానము కర్తవ్యము. *కార్తీకమాసమందు ప్రాతస్స్నానమాచరించనివాడు నరకమందు యాతనలను అనుభవించి ఆ తరవాత ఛండాలుడై పుట్టును*. గంగాది సమస్తనదులను స్మరించి స్నానము చేసి సూర్యమండల గతుడైన ఆ శ్రీహరిని ధ్యానించి హరిచరిత్రను విని ఇంటికెళ్లవలెను.


దినాంతె సర్వకర్మాణి సమాప్యవిధినానృప
పాదౌప్రక్షాళ్యచాచమ్య పూజాస్థానం ప్రవేశయేత్
పూజయేదీశ్వరంతత్ర షోడశైరుపచారకైః
పీఠస్థంపూజయేచ్చంభుం కల్పోక్తవిధినాఽనఘ
పంచామృతవిధానేన ఫలతోయైఃకుశోదకైః
స్నాపయేత్పుణ్యసూక్తైశ్చ భక్త్యాగౌరీపతింప్రభుమ్!!
తతశ్చావాహయేద్దేవం శంకరం పరమేశ్వరం
వృషధ్వజాయధ్యానంచ పాద్యంగౌరీప్రియాయచ
అర్ఘ్యంలోకేశ్వరాయేతి రుద్రాయాచమనీయకం
స్నానంగంగాధరాయేతి వస్త్రమాశాంబరాయచ
జగన్నాధాయోపవీతం గంధం కపాలధారిణే
అక్షతానీశ్వరాయేతి పుష్ఫంపూర్ణగుణాత్మనె
ధూమ్రాక్షాయేతి ధూపంవై తేజోరూపాయదీపకం
లోకరక్షాయనైవేద్యం తాంబూలం లోకసాక్షిణే
ప్రదక్షిణంభవాయేతి నమస్కారం కపాలినే!!
*తా:* పగలు చేయవలసిన వ్యాపారాదులు ఇతర పనులు చేసి, సాయంకాలము తిరిగి స్న్నము చేసి  ఆచమించి పూజాస్థానమందు పీఠముపై శంకరుని ఉంచి, పంచామృతములతోనూ, ఫలోదకముతోనూ, కుశోదకముతోనూ మహాస్నానము చేయించి షోడశోపచారములతో పూజించవలెను.శంకరుని ఆవాహన చేసి 
అ) వృషధ్వజాయ ధ్యానం సమర్పయామి
ఆ) గౌరీప్రియాయ పాద్యం సమర్పయామి
ఇ) లోకేశ్వరాయ అర్ఘ్యం సమర్పయామి
ఈ) రుద్రాయ ఆచమనీయం సమర్పయామి
ఉ) గంగాధరాయ స్నానం సమర్పయామి
ఊ) ఆశాంబరాయ వస్త్రం సమర్పయామి
ఋ) జగన్నాధాయ ఉపవీతం సమర్పయామి
ౠ) కపాలధారిణే గంధం సమర్పయామి
ఎ)ఈశ్వరాయ అక్షతాన్ సమర్పయామి
ఏ) పూర్ణగుణాత్మనే పుష్పం సమర్పయామి
ఐ) ధూమ్రాక్షాయ ధూపం సమర్పయామి
ఒ) తేజోరూపాయ దీపం సమర్పయామి
ఓ) లోకరక్షాయ నైవేద్యం సమర్పయామి
ఔ) లోకసాక్షిణే తాంబూలం సమర్పయామి
అం) భవాయ ప్రదక్షిణం సమర్పయామి
అః) కపాలినేనమః నమస్కారం సమర్పయామి 
అని ఈ ప్రకారంగా షోడశోపచారముల చేత శంకరుని పూజింపవలెను. 


ఏతైర్యోనామభిర్భక్త్యా పూజయేద్గిరిజాపతిం
శంభోర్నామసహస్రేణ మాసమేకంనిరంతరం
పూజాం తేచార్పయేదర్ఘ్యం మాసనక్తవ్రతేనృప
*//పార్వతీకాంతదేవేశ పద్మజార్చ్యాంఘ్రిపంకజ*
*అర్ఘ్యం గృహాణదైత్యారె దత్తచేదముమాపతే//*
అర్చయేచ్ఛంకరంభక్త్యా యస్సధన్యోనసంశయః!!
*తా:* పైన చెప్పిన శంకరనామములచే పూజించి ఈ నెలయంతా శివ సహస్రనామములచేత నిత్యము పూజించి పూజావసానమందు ఈ పైన చెప్పిన శ్లోకరూప మంత్రము (" పార్వతీకాంత... ముమాపతే... ") తో అర్ఘ్యము యివ్వవలెను. ఇలా అర్ఘ్యమునిచ్చినవాడు ధన్యుడై ముక్తుడగును. అనుమానము లేదు.


తథావిత్తానుసారేణ దీపమాలార్పణం నృప
దత్వాదానంతువిప్రేభ్యో విత్తశాఠ్యంనకారయేత్!!
ఏవంవిప్రవరైస్సార్థం నక్తంయఃకార్తికవ్రతీ
కురుతేనృపశార్దూల తస్యపుణ్యఫలం శ్రుణు
అగ్నిష్టోమసహస్రాణి వాజపేయశతానిచ
అశ్వమేధసహస్రాణాం ఫలం ప్రాప్నోత్యసంశయః!!
మాసనక్తంచయఃకుర్యాదిత్యేవంవిధినానఘ
పాపమూలోద్ఘాటనంచ తమాహుర్నారదాదయః!!
మాసనక్తం మహత్పుణ్యం సర్వపాపవినాశనం
సర్వపుణ్యప్రదంనౄణాం కార్తికేనాత్రసంశయః!!
యఃకార్తికేచతుర్ధశ్యాం పితౄనుద్ధిశ్యభక్తితః
బ్రాహ్మణంభోజయేద్దేవంప్రీణంతిపితరోఽఖిలాః!!
యఃకార్తికేసితేపక్షే చతుర్దశ్యాంనరేశ్వర
ఔరసఃపితృభక్తోయ%స్తిలైస్సంగతర్పయేజ్జలే
ప్రీణంతిపితరస్సర్వే పితృలోకంగతాఅపి!!
*తా:* తన శక్తికొలది దీపమాలలను సమర్పించి శక్తివంచనలేక బ్రాహ్మణులకు దానమివ్వవలెను. ఈప్రకారము కార్తీకమాసమంతయు బ్రాహ్మణులతో గూడిన నక్తవ్రతమును చేయువాడు వేయి సోమయాగములు నూరు వాజపేయయాగములు వేయి అశ్వమేధయాగములు చేసిన ఫలము బొందును. కార్తీకా మాసములో ఈ ప్రకారము మాసనక్తవ్రతము ఆచరించువాడు పాపములను సమూలముగా పరిహరించుకొనునని నారదాదులు చెప్పిరి. కార్తీకమందు మాస నక్తవ్రతము వలన పుణ్యమధికమగును, సమస్తపాపములు నశించును ఇందులో సందేహములే లేవు. కార్తీకమాసమందు చతుర్దశి పితృదేవతలప్రీతికొరకు బ్రాహ్మణునకు భోజనము పెట్టిన ఎడల పితరులు తృప్తిపొందెదరు. కార్తికమాసమమ్దు శుక్ల చతుర్దశియమ్దు ఔరసపుత్రుడు తిలతర్పణమాచరించినచో పితృలోకవాసులైన పితరులు తృప్తిపొందెదరు.



యఃకుర్యాత్ఫలదానంతు చతుర్ధశ్యాంతుకార్తికే
సతస్యసంతి తేర్హానిర్జాయతేనాత్రసంశయః!!
యఃకుర్యాత్తిలదానంతుచతుర్దశ్యాంతుకార్తికే
ఉపోష్యశంకరంపూజ్య సకైలాసేశ్వరోభవేత్!!
సర్వపాపప్రశమనం పుణ్యదం కార్తికవ్రతమ్
యఃకుర్యాత్సోపిపాపేభ్యో విముక్తోమృతమశ్నుతే!!
ఇదంపవిత్రంపరమమ్ అధ్యాయం యశ్శ్రుణోత్యతః
ప్రాయశ్చిత్తంపరంప్రాహుః పాపానాంనాత్రసంశయః!!
*తా:* కార్తీకమాసమందు చతుర్దశి నాడు ఫలదాన మాచరించువాని సంతతికి విచ్ఛేదము కలుగదు సందేహములేదు. కార్తీకమాసమందు చతుర్దశినాడు ఉపవాసమాచరించి శంకరుని ఆరాధించి తిలదానమాచరించినవాడు కైలాసమునకు ప్రభువగును. సమస్తపాపములను పోగొట్టునదీ, సమస్తపుణ్యములను వృద్ధిపరచునది ఐన కార్తీకవ్రతమును చేయువాడు పాపములు నశించి మోక్షమునొందును. పవిత్రమైన ఈ అధ్యాయమును భక్తితో వినువారు సమస్తపాతకములకు ప్రాయశ్చిత్తము చేసుకొన్నవారగుదురు.

ఇతి శ్రీ స్కాందపురాణే కార్తికమాహాత్మ్యే చతుర్దశోధ్యాయస్సమాప్తః

ఇది స్కాందపురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమనెడు కార్తీక పురాణమందలి పదునాల్గవ అధ్యాయము సమాప్తము.

Saturday, November 28, 2020

కార్తీక పురాణం పదమూడవ అధ్యాయం

అథ శ్రీ స్కాందపురాణే కార్తికమహాత్మ్యే త్రయోదశోధ్యాయః

శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణం పదమూడవ అధ్యాయం

వసిష్ఠఉవాచ
అధేధానీంప్రవక్షెహం ధర్మాన్కార్తిక సమ్భవాన్
ప్రశస్తాత్మాసవైభూప తథాచావశ్యకాంచ్ఛ్రుణు!!

తా:* వసిష్ఠుడు మరల చెప్పనారింభిచెను "  ఓ రాజా, కార్తీక మాసములో చేయదగిన ధర్మములను చెప్పదను  "స్వఛ్ఛమైన మనసుతో " వినుము ఆధర్మములన్నీ ఆవశ్యము ఆచరించవలసినవి" 

సంసారభయభీతస్య పాపభీరోర్నరస్యచ
కార్తికేమాసియత్ప్రోక్తం మత్పిత్రావిధినాపురా
సత్యంబ్రవీమికర్తవ్యాన్ నోచేత్పాపసంభవేన్నృప!!
కన్యాదానంతులాస్నానం శిష్టపుత్రోపనాయనం
విద్యావస్త్రాన్నదానాని ఊర్జెశస్తానిభూపతే!!
విత్తహీనస్య విప్రస్య సూనోశ్చావ్యుపనాయనం
సదక్షిణంసంభారం ఊర్జెదత్వానరోనఘ
తస్యపాపానినశ్యంతి కృతానిబహుళాన్యపి!!
జపేనైకేనగాయత్ర్యా ద్రవ్యదాతుఃఫలంశ్రుణు
అగమ్యాగమనాదీని హత్వాదీనిసహస్రశః
తథాన్యాన్యుగ్రపాపాని భస్మసాద్యాంతిభూమిప!!
గాయత్రీం దేవ దేవస్య పూజాస్వాధ్యాయనార్పణం
ఏతేషామధికం పుణ్యం మయావక్తుంనశక్యతె!!

తా: రాజా! కార్తీక ధర్మములు మాతండ్రియైన బ్రహ్మచే నాకు చెప్పబడినవి, అవి అన్నీ నీకు తెలిపెదను. అన్నియు ఆచరించదగినవే, అవి చేయని పక్షంలో పాపము సంభవిమ్చును. ఇది నిజము, సంసార సముద్రమునుంచి ఊరట కోరుకునేవారు నరకాది భయము గలవారు ఈ ధర్మములను తప్పక చేయవలెను. కార్తీకమాసములో కన్యాదానము ప్రాతస్స్నానము శిష్టుడైన బ్రాహ్మణపుత్రునికుపనయనము చేయించుట విద్యాదానము వస్థ్రధానము అన్నదానము యివి ముఖ్యము. కార్తీకమాసమందు ద్రవ్యహీనుడైన బ్రాహ్మణపుత్రునకు ఉపనయనముచేయించి దక్షిణ యిచ్చిన యెడల అనేక జన్మార్జిత పాపములు నశించును. తన ద్రవ్యమిచ్చి ఉపనయనము చేయించినప్పుడు ఆవటువుచే చేయబడిన గాయత్రి జపఫలమువలన పంచమహాపాతకములు బూదియగును. గాయత్రీజపము, దేవతార్చన, వేదగానము, వీటిఫలము చెప్పుటకు నాకు శక్యముగాదు.

తటాకాయుతనిర్మాణం అశ్వత్థారోపణంశతం
కోటయఃకూపవాపీనాం క్రమాన్నందనపాలనాత్
బ్రహ్మప్రతిష్ఠాపుణ్యస్య కలాంనార్హంతిషోడశీమ్!!
మాఘ్యాంవై మాధవేమాసి చోత్తమంమౌంజిబంధనమ్
కారయిష్యంతిరాజన్ దానందత్వాతుకార్తికే!!
సాధుభ్యశ్శ్రోత్రియేభ్యశ్చ బ్రాహ్మణేభ్యోయథావిధి
తథాతేషాంసుతానాంచ ప్రకుర్యాన్మౌంజిబంధనం
తేనానంతఫలంప్రాహుఃర్మునయోధర్మవిత్తమాః!!
తథాతేషాంవిధానంచ కార్తికేమాసిధర్మవిత్
కుర్యాత్తస్యఫలంవక్తుం కశ్శక్తోదివివాభువి!!
సోపితీర్థానుగమనం దేవబ్రాహ్మణతర్పణమ్
యంకర్మకురుతెవాపి ద్రవ్యదాతుఃఫలంలభేత్!!
మౌంజీవివాహమేకస్య యఃకుర్యాన్మేదినీపతే
దత్వార్థం కార్తికేమాసి తదనంతఫలంస్మృతమ్!!
కన్యాదానంతు కార్తిక్యాం యణుర్యాద్భక్తితోఽనఘ
స్వయంపాపైర్వినిర్ముక్తః పితౄణాం బ్రహ్మణః పదమ్!!

తా: పదివేల చెరువులు తవ్వించిన పుణ్యము, వంద రావి చెట్లు పెట్టించిన పుణ్యము, నూతులు, దిగుడుబావులు వందుకు పైగా తవ్వించు పుణ్యము, వంద తోటలు పెంచుపుణ్యము ఒక బ్రాహ్మణునకుపనయనము చేయించిన పుణ్యములో పదియారవ వంతుకు కూడ సరిపోవు.  కార్తీక మాసందుపనయన దానము చేసి తరవాత మాఘమాసమునకానీ, వైశాఖమునకానీ ఉపనయనము చేయించవలెను. సాధువులు శ్రోత్రియులు ఐన బ్రాహ్మణుల కుమారులకు ఉపనయనము చేయించినచో అనంతఫలముగలదని ధర్మవేత్తలైన మునులు చెప్పిరి. ఆ ఉపనయనమున సంకల్పము కార్తీకమాసమందు చేయవలెను, అలా చేసినచో కలిగెడి ఫలము చెప్పుటకు భూమిపై, స్వర్గంలో ఎవరికీ సామర్థ్యము లేదు. పరద్రవ్యము వలన తీర్థయాత్ర, దేవబ్రాహ్మణులతృప్తిపరచుట చేసిన ఎడల ఆ పుణ్యము ద్రవ్య దాతకే చెందును. కార్తీకమాసమందు ధనమిచ్చి ఒక బ్రాహ్మణునకుపనయనము వివాహము చేయించిన అనంతఫలము కలుగును. కార్తీకమాసమందు కన్యాదాన మాచరించేవారు తాను పాపవిముక్తుడగును, తన పితరులకు బ్రహ్మలోక ప్రాప్తికలుగించినవాడగును.

అత్రైవోదాహరంతీమం పురావృత్తం మహీపతే
తచ్ఛ్రుణుస్సబ్రవీమ్యేవం భక్త్యామైధిలసాదరమ్!!
దావరేబాహుజఃకశ్చిద్దురాత్మావంగదేశగః
సోపినామ్నాసువీరేతి బహుశౌర్యపరాక్రమః
రాజ్ఞన్తస్యమహీపాల భార్యాబాలమృగేక్షణా!!
సోపికాలాత్తుదాయాదై ర్నిర్జితోవనమావిశత్
అర్థాంగ్యాభార్యయాసాకం విచరన్ గహనేవనే
దుఃఖేనమహతాయుక్తో నిర్థనశ్చ మహీపతిః!!
తత్రసాగుర్విణీతస్య భార్యావన్యఫలాశనా
నిర్మలేనర్మదాతీరే పర్ణశాలాం మహీపతి
తతః కాలేప్రసూతాసా కన్యకాంతత్రసుందరీమ్!!
సమరక్షయత్తతోరాజా పూర్వసౌపమనుస్మరన్
వృద్ధింగతారాజకన్యా సుకృతేన పురాకృతా
రూపలావణ్యసంపన్నా నయనోత్సవకారిణీ!!
*తా:* ఓ రాజా! ఈ విషయమై పురాతన కథ ఒకటిగలదు చెప్పెదను సావధానముగా వినుము. ద్వాపరయుగంలో వంగదేశమునందు దుష్టుడైన సువీరుడను ఒక క్షత్రియుడుండెడివాడు. వానికి జింకకన్నులు చూపుల వంటి చూపుగల ఒక స్త్రీ అతనికి భార్యగానుండెను. ఆ రాజు కొంతకాలమునకు దైవయోగమున దాయాదులచేత జయింపబడి రాజ్యభ్రష్టుడై భార్యను తీసుకొని అరణ్యమునందు జీవించుచు చాలా దుఃఖమునొందెను. ఆ అరణ్యమునందు రాజు భార్యయు కందమూలాదులను భక్షించుచు కాలమును గడుపుచుండెను. ఆ విధముగా జీవనము చేస్తుండగా ఆమె గర్భవతియయ్యెను. నర్మదాతీరమందు రాజు పర్ణశాల నిర్మించి వారు ఉండసాగెను, ఆ పర్ణశాలయందు ఆ సుందరి ఒక కూతురిని కనెను. రాజు అరణ్యనివాసము, వనములో దొరుకు ఆహారము ఆసమయంలో సంతానసంభవము కలుగగా సంతాన పోషణకు ద్రవ్యము లేకపోవడం అన్నీ తలచుకుని తన పురాకృతమైన పాపమును స్మరించుచు బాలికను కాపాడుచుండెను. కొంకాలమునకు పూర్వపుణ్యవశము చేటా ఆ బాలిక వృద్దినొంది సౌందర్యముతోనూ లావణ్యముతోనూ అలరారి చూచువారికి నేత్రానందము కలిగించుచునదాయెను.

అష్టవర్షాంమనోరమ్యాం దృష్ట్వాకశ్చిన్మునేస్సుతః
వివాహార్థంమతించక్రే సువీరంసమయాచత!!
తతోవాచతతస్సోపి దరిద్రోహంమునేస్సుత
ద్రవ్యం దేహియధోద్ధిష్టం ఉద్వాహంయదికాంక్షసే!!
ఇతి భూపవచశ్శ్రుత్వా కన్యాసంసక్తమానసః
మునిసూనురువాచేదం రాజానం మిధిలేశ్వర!!
దాస్యామిద్రవిణభూరి రాజన్ తేహంతపోబలాత్
తేనతెరాజ్యసౌఖ్యాని భవిష్యంతి న సంశయః
ఇతిశ్రుత్వావనెరాజా ఓమిత్యాహముదాన్వితః!!
తపశ్చచారతత్తీరే మునిసూనురుదారధీః
తత్రరాజన్బలాద్ద్రవ్యం సమాకర్ష్యహ్యతంద్రితః
తత్సర్వమర్థంనృపతేః ప్రదదేమునిపుత్త్రకః!!
గృహీత్వార్థంవసూన్ రాజా హర్షాల్లబ్ధమనీరధః
వివాహమకరోత్కన్యాం మునేస్తాపసజన్మనః
స్వగృహ్యోక్తవిధానేన కన్యాముద్వాహద్వనేః!!

తా: ఆచిన్నదానికి యుక్త వయస్సు వచ్చినది, మనస్సుకు బహురమ్యముగా ఉన్నది, యిట్లున్న కన్యకనుచూసి ఒక మునికుమారుడు సువీరా నీకూతురుని నాకిచ్చి వివాహము చేయుమని యాచించెను. ఆ మాటవిని ఆ రాజు, నాకూతురిని మునికుమారునికా అని ఆలోచించి, నేను దరిద్రుడను కాబట్టి నేను కోరినంత ధనమిచ్చిన నా కన్యకామణిని నీకిస్తానని చెప్పెను. ఈ మాటవిని ఆకన్యయందు కోరికతో ఆ ముని కుమారుడు సరేయని ఒప్పుకొనెను.  ఓ రాజా నేను తపస్సు చేసి సంపాదిమ్చి బహుద్రవ్యమును నీకిచ్చెదను దానితో నీవు సుఖముగానుండు అని చెప్పి ఆవిధముగానే చేసెను. తరవాత ఆ ముని కుమారుడు నర్మదా తీరమున తపమాచరిమ్చి బహుద్రవ్యమును సంపాదించి ఆ ద్రవ్యమును రాజునకిచ్చెను. ఆ రాజు ఆ ధనమంతయు గ్రహించి ఆనందించి తన కూతురిని ఆ మునికుమారునకిచ్చి తన గృహ్యసూత్రప్రకారముగ పెండ్లి చేసెను.

సవోఢాసాపితత్పార్శ్వం జగామమనుజేశ్వర
కన్యాద్రవ్యేణనిత్యం వై హ్యభూత్సోదరపోషకః!!
పునస్సువీరభార్యాసా ప్రజజ్ఞేకన్యకాంతథా
ద్వితీయాంతనుజాందృష్ట్వా పునర్లబ్ద్వాముదాన్వితః
ఇతఃవరంయధేష్టంమె ద్రవ్యంభూరిభవిష్యతి!!
ఏవం విచిమ్త్యమానేతు పుణ్యేనమహతానృప
అజఆమయతిఃకశ్చిత్స్నానార్థం నర్మదాంప్రతి
పర్ణశాలాంకణీభూపం సభార్యమవలోకయత్!!
తమువాచకృపాసింధుర్యతిఃకౌండిన్యగోత్రజః
కిమర్థమత్రకాంతారేకోభవాన్ వదసాంవ్రతమ్!!
ఏవంబ్రువంతమాహేదం భూపాలంకరుణానిధిం
రాజాహంవంగదేశీయ స్సువీర యితివిశ్రుతః
రాజ్యార్థం తైశ్చదాయాదైర్నిర్జితోస్మివనంగతః!!

తా: ఆ కన్యయు వివాహముకాగానే భర్తవద్దకు చేరెను. రాజు కన్యావిక్రయద్రవ్యముతో తాను తన భార్యయు సుఖముగా జీవించుచుండిరి. రాజు భార్య తిరిగి ఒక కుమార్తెను కనెను. రాజు దానిని చూచి సంతోషించి ఈ సారి కన్యను విక్రయించి చాలా ద్రవ్యమును పొందెఅదని తలచి దానితో ఆజన్మాంతము గడచునని భావించెను. రాజట్లు తలచగా పూర్వపుణ్యవశముచేత ఒక యతీశ్వరుడు స్నానార్థము నర్మదానదికి వచ్చి పర్ణశాలయందున్న రాజును, భార్యను వారి కూతురుని చూచెను. కౌండిన్యసగోత్రుడైన ఆ ముని దయతో వారిని జూచి ఓయీ నీవెవ్వరవు ఈ అరణ్యమున ఏమిజేయుచున్నావు అని అడిగెను. యతి ఇట్లడిగిన మాటవిని రాజు చెప్పుచున్నాడు, అయ్యా నేను వంగదేశమును పాలించుచున్న రాజును నాపేరు సువీరుడు నాదాయాదులు రాజ్యకాంక్ష చేత నన్ను జయించి నారాజ్యమును అపహరించిరి నేని ఈ వనమును చేరి నివసించుచున్నాను

నదారిద్ర్యసమందుఃఖం నశోకఃపుత్రమారణాత్
నచవ్యధానుగమినేన వియోగః ప్రియావహాత్
తస్మాత్తేనై వదుఃఖేన వదవాసంకృతం మయా
శాకమూలఫలాద్యైశ్చ కృతాహారోస్మికాననే!!
కాంతారేస్మిన్తతోజాతా పర్ణగారేతుకన్యకా
తాంప్రాప్తయౌవ్వనాందృష్ట్వా కస్మైవిప్రసుతాయచ
తస్మాద్భూరిధనం విప్ర గృహీతం యన్మయానఘ
నివసామిసుఖంత్వస్మిన్ కిమత్రశ్శోతుమిచ్చసి!!
ఇతిభూపవచశ్శ్రుత్వా పునరాహయతిస్తదా
మూఢవత్కురుషేరాజన్ మహాపాతకసమ్చయమ్!!
కన్యాద్రవ్యేణయోజీవే దసిపత్రంసగచ్ఛతి
దేవాన్ ఋషీన్ పితౄన్ క్వాపి కన్యాద్రవ్యేణతర్పయేత్
శాపందాస్యంతి తేసర్వే జన్మజన్మస్యపుత్రతామ్!!
యఃకన్యాద్రవ్యకలుషాం గృహీత్వావృత్తిమాశ్రయేత్
సోశ్నీయాత్సర్వపాపాని రైరవం నరకం వ్రజేత్!!
సర్వేషామేవపాపానాం ప్రాయశ్చిత్తంవిదుర్భుధాః
కన్యావిక్రయశీలస్య ప్రాయశ్చిత్తంనచోదితమ్!!

తా: దారిద్ర్యముతో సమానమైన దుఃఖము పుత్రమృతితో సమానమైన శోకము భార్యావియోగముతో సమానమైన వియోగదుఃఖము లేవు కాబట్టి ఆ దుఃఖముతో శాకమూల ఫలాదులు భుజింపుచూ ఈ వనమందు నివాసము చేయుచు కాలము గడుపుచున్నాను. ఈ అరణ్యమమ్దు పర్ణశాలలో నాకు కుమార్తెపుట్టినది, దానిని యౌవ్వనము రాగానే ఒక మునికుమారునికి బహుధనమును గ్రహించి వానికిచ్చి వివాహము చేసి ఆ ద్రవ్యముతో సుఖముగా జీవించుచున్నాను. ఇలా రాజు చెప్పగా విని ఆ యతి ’ రాజా! ఎంత పని చేసితివి మూఢుని వలె పాతకములను సంపాదిమ్చుకొంటివికదా! కన్యాద్రవ్యముచేత జీవించువాడు యమలోకమున అసిపత్రవనమనునరకమందు నివసిమ్చును. కన్యాద్రవ్యముచేత దేవఋషి పితరులను తృప్తిచేయుచున్నవానికి వారి ప్రతిజన్మమునందు ఇతనికి పుత్రులు కలుగరని శాపమునిత్తురు. కన్యాద్రవ్యముతో వృత్తిని సంపాదించి ఆవృత్తివల్ల జీవనము చేయుపాపాత్ముడు రౌరవనరకమును బొందును. సమస్తమైన పాతకములకు ప్రాయశ్చిత్తము చెప్పబడియున్ననూ కన్యావిక్రయపాపమునకు ప్రాయశ్చిత్తము ఎక్కడా చెప్పబడలేదు.

కార్తికే శుక్లపక్షేతు ద్వితీయాంకన్యకాంతవ
కన్యాదానం కురుష్వత్వం సహిరణ్యోదకేనచ!!
విజ్ఞాయతేజోయుక్తాయ శుభశీలాయధర్మిణే
కన్యాదానంతుయఃకుర్యాత్కార్రిక్యామ్చశుభేదినే
గంగాదిసర్వతీర్థేషు స్నానదానేనయత్ఫలం!!
అశ్వమేధాదభిర్యాగై రుక్తదక్షిణసంయుతైః
యత్ఫలంజాయతేరాజన్ తత్ఫలంసోపిగచ్చతి!!
ఇత్యేవంగదితంశ్రుత్వా రాజారాజకులేశ్వర
యతింధర్మార్థతత్వజ్ఞం బాహుజఃకృపణోబ్రవీత్!!
కుతోలోకఃకుతోధర్మః కుతోదానం కుతఃఫలః
సుఖభోగైర్వినావిప్రదేహేస్మిన్ సుఖకాంక్షిణీ
పుత్రదారాదయస్సర్వేవాసోలంకరణానిచ
గృహక్షేత్రాణిసర్వాణి దేహాద్యాధర్మసాధనం
ద్వితీయాం మేదుహితరం యోద్రవ్యమ్ భూరిదాస్యతి
తస్యదాస్యేన సందేహః విప్రగచ్ఛయథాసుఖమ్!!

తా: కాబట్టి, ఈ కార్తీక మాసమమ్దు శుక్లపక్షమందు ఈ రెండవ కూతురును కన్యాదానపూర్వకముగా వివాహము జరిపించుము. కార్తికమాసమందు చేసెడి విద్యాతేజశ్శీలయుక్తుడైన వరునకు కన్యాదానం చేసినవాడు గంగాది సమస్తతీర్థములందు స్నానదానములు చేసెడివాడు పొందెడి ఫలము యధోదక్షిణసమేతముగా అశ్వమేధాది యాగములు చేసినవాడు పొందెడి ఫలము బొందును. అని ఈ విధముగా ఆ యతి చెప్పినది విని రాజు ఆ సకలధర్మవేత్తయైన ఆ మునితో యిట్లనెను. బ్రాహ్మణుడా ఇదేమిమాట పుత్రదారాదులు గృహక్షేత్రాదులు వాసోలంకారములున్నందుకు దేహమును సుఖబెట్టి భోగింపవలె, కానీ ధర్మమనగా ఏమిటి? పుణ్యలోకమేమిటి, పాపలోకమేమిటి? ఏదో విధంగా ధనం సంపాదించి భోగించుట ముఖ్యము. నా యీ రెండవ కూతురును పూర్తిగా ద్రవ్యమిచ్చినవానికి యిచ్చి ఆ ద్రవ్యముతో సుఖ భోగములననుభవించుచూ జీవించెదను. నీకెందుకు నీ దారిని నీవు పొమ్ము.

తతోయయౌనర్మదాయాం స్నానార్థంనృపపుంగవ
నృపస్యాస్యగతేకాలే కాంతారేమరణుగతః!!
ఆయయుర్యమదూతాశ్చపాశైరాబధ్యపాపినం
యమానుగాదక్షిణాశాంతతోజగ్ముర్యధాగతమ్!!
తత్రతంసమ్యగాలోక్యయమస్తామ్రారుణేక్షణః
నరకేషువిచిత్రేషు బబాధరవినంధనః
తథాసిపత్రెఘోరేచ పితృభిస్సహపాతయత్!!
సువీరస్యాస్వయెకశ్చిచ్చృతకీర్తిర్మహీపతిః
సర్వధర్మాంశ్చ కారాసౌతధాక్రతుశతానిచ
ప్రచకారస్వకంరాజ్యం ధర్మేణమిధిలేశ్వర
పశ్చాత్స్వర్గంసమాసాద్య సేవ్యమానస్సురేశ్చరై!!
సువీరః కర్మశేషేణ పితృభిర్నరకంగతః
తత్రవ్యచింతయద్ధుఃఖాద్యాతనాహేతుమాత్మనః
పూర్వపుణ్యప్రభావేన యమంప్రాహాతినిర్భయః

తా: ఆమాటవిని యతి స్నానము కొరకు నర్మదానదికి వెళ్ళిపోయెను, తరవాత కొంతకాలమునకు ఆ అడవిలో సువీరుడు చనిపోయెను. అంత యమదూతలు పాశములతో సహా వచ్చి రాజునుగట్టి యమలోకమునకు తీసుకుపోయిరి. అక్కడ యముడు వానిని జూచి కళ్ళెర్రజేసి అనేక నరకములందు యాతనలను బొందించి అసిపత్రమనందు రాజును రాజుపితరులను గూడ పడవేసెను. (అసిపత్రవనము = కత్తులే ఆకులుగాగల దట్టమైన అడవి). ఈ సువీరుని వంశమందు శ్రుతకీర్తియనే వాడొకడు సమస్త ధర్మములను చేసి వందయాగములన్ చేసి ధర్మముగా రాజ్యపాలనము చేఇస్ స్వర్గముబోయి యొంద్రాదులచేత కీర్తింపబడెను. ఈ శ్రుతికీర్తి సువీరుని పాతకవిశేషముల చేత స్వర్గమునుంచి తాను నరకమందు బడి యమయాతనలను పొందుచు ఒకనాడు ఇదేమి అన్యాయము పుణ్యము చేసిన నన్ను యమలోకమునందుంచినారేమని విచారించుకుని ధైర్యముతో ఆయమునితో ఇట్లనెను.

వాక్యంమెశ్రుణుసర్వజ్ఞ ధర్మరాజమహామతే
పాపలేశవిహీనస్య కిమియందుర్గతిర్మమ
సర్వధర్మావృధాయాంతి ప్రోక్తాఃపూర్వమహర్షిభిః
దివ్యంవిహాయనరకాగమనంచనసాంప్రతమ్!!

తా: సర్వమును తెలిసిన ధర్మరాజా! నామనవి వినుమయ్యా,, ఎంతమాత్రము పాపము చేయని నాకు ఈ నరకమెట్లు సంభవించినది. అయ్యో మహా ఋషీశ్వరులు చెప్పిన ధర్మములన్ని పాటించిననూ వృధాయయ్యేఖాడ, స్వర్గమందున్న నాకు నరకమెట్లు కలిగినది?

ఇతిశ్రుత్వాయమఃప్రాహశ్రుతకీర్తి సహామతిం
అస్తికశ్చిద్దురాచారో వంశజస్తుతవాద్యవై!!
సోపినామ్నానువిరేతి కన్యాద్వవ్యేణజీవితం
తేనపాపేనపితరః పుణ్యలోకంగతా అపి
దివశ్చ్యుతాభవంతీహ దుష్టయోనిషుభూతలే!!
ద్వితీయాతనుజాతస్య వర్ధతేమాతృసన్నిధౌ
పర్ణాగారెనృపశ్రేష్ఠ నర్మదాయాస్తటేవనే!!
మత్ప్రసాదాద్భువంగచ్ఛ దేహేనానేనచానఘ
తత్రతిష్ఠంతిమునయస్తేషామేతన్నివేదయ
కన్యాంతాంశ్రుతశీలాయ కార్తికేమాసిభక్తితః 
కన్యాదానంకురుష్వత్వమ్ సహిరణ్యోదకేనచ!!
సర్వాభరణసంపన్నాం యః కన్యాంకార్తికేనఘ
ప్రయచ్ఛతివిధానేన సోపిలోకేశ్వరోభవేత్!!

తా: శ్రుతకీర్తి మాటలు విన్న సమవర్తి చెప్పెను, ’ ఓ శ్రుతకీర్తీ, నీవన్నమాట సత్యమే, కానీ నీ వంశస్థుడైన సువీరుడనువాడొకడు దురాచారుడై కన్యాద్రవ్యముచేత జీవించినాడు. ఆపాపము చేత వాని పితరులైన మీరు స్వర్గస్తులైనను నరకమందు పడిపోయిరి. ఆ తరవాత భూమియందు దుష్టయోనులందు జన్మించెదరు. శ్రుతకీర్తీ! ఆ సువీరునికి రెండవ కుమార్తె నర్మదా తీరంలో తల్లితో కలిసి పర్ణశాలయందున్నది, ఆమెకింకనూ వివాహము జరుగలేదు. కాబట్టి నీవు నాప్రభావము వలన ఈ దేహముతో అక్కడికి పోయి అక్కడనున్న మునులతో ఈ మాటను చెప్పి ఆకన్యను యోగ్యుడైన వరునకుయిచ్చి కార్తీకమాసమున కన్యాదాన విధానముగా పెండ్లి చేయుము. కార్తీక మాసమందు సర్వాలంకారయుక్తయైన కన్యను వరునకిచ్చువాడు లోకాధిపతియగును. 

యతికన్యానజాయేత మౌల్యంవాయఃప్రయచ్ఛతి
దాతుర్గోమిధునం మౌల్యం కన్యాదానంతదుచ్యతె
కన్యాదానఫలంతస్య భవిష్యతినసంశయః!!
కురుత్వం ద్రాక్చవిప్రేభ్యః కన్యామూల్యమ్విధానతః
ప్రీణమ్తిపితరస్సర్వే ధర్మేణానేనసంతతమ్!!
శ్రుతకీర్తిస్తధేత్యుక్త్వా యమంనత్వాగృహంగతః
నర్మదాతీరసంస్థాంచ కన్యాంకనకభూషణాం
కన్యదానంతుకార్తిక్యాం చకారాసౌనృపోత్తమః
కార్తికేశుక్లపక్షేతు విధినేశ్వరతుష్టయే!!
తేనపుణ్యప్రభావేన సువీరో యమపాశతః
విముక్తస్స్వర్గమాసాద్య సుఖేనపరిమోదతే!!
తథైవదశవిప్రేభ్యః కన్యామూల్యందదావసౌ
ప్రయాంతి పితరస్సర్వే పుణ్యలోకం మహీపతే
పాపానియానిచోగ్రాణి విలయంయాంతితత్క్షణాత్
తతస్స్వర్గగతోరాజా శ్రుతకీర్తిర్యథాగతమ్!!
యస్తస్మాత్కార్తికేమాసి కన్యాదానం కరిష్యతి
హత్యాదిపాతకై స్సర్వై ర్విముక్తోనాత్రసంశయః!!
వాణ్యానాసులభంయేపి వివాహార్థం నగేశ్వర
సహియంయేప్రకుర్వంతి తేషాంపుణ్యమనంతకమ్!!
యఃకార్తికేప్రనిష్ఠో విధినాతత్సమాచరేత్
సయాతివిష్ణుసాయుజ్యం సత్యంసత్యంమయోదితం
నాచరేద్యదిమూఢాత్మా రౌరవమ్తుసమశ్నుతె!!
*తా:* అట్లు కన్యాదానము చేయుటకు సంతానము లేనివాడు ఒక బ్రాహ్మణునకు ధనమిచ్చిన ఆ ధనదాతయూ లోకాధిపతియగును, కన్యలు లేనివాడు రెండు పాడియావులనిచ్చి కన్యను తీసుకుని వరునకు యిచ్చి వివాహము చేసినయెడల కన్యాదాన ఫలమునొందును. కాబట్టినీవు వెంటనే పోయి బ్రాహ్మణులకు కన్యామూల్యము యిమ్ము దానిచేత నీపితరులందరు తృప్తినొంది నిత్యము సుఖముపొందుదురు.  శ్రుతకీర్తి యముని మాటవిని అట్లేయని యమునకు వందనమాచరించి నర్మదాతీరమందున్న కన్యకు సువర్ణాభ్హరణభూషితగా చేసి కార్తీకశుక్లపక్షమునందు ఈశ్వరప్రీతిగా విధ్యుక్తముగా కన్యాదానము చేసెను. ఆపుణ్యమహిమచేత సువీరుడు యమపాశవిముక్తుడై స్వర్గమునకుపోయి సుఖముగాయుండెను. తరవాత శ్రుతకీర్తి పదిమంది బ్రాహ్మణ బ్రహ్మచారులకు కన్యామూల్యమును యిచ్చెను దానిచేత వాని పితరులందరు విగతపాపులై స్వర్గమునకు పొయిరి. తానూ యథాగతముగా స్వర్గమును చేరెను. కాబట్టి కార్తీకమాసమున కన్యాదాన మాచరించేవాడు విగతపాపుడగును అందులో సందేహము లేదు. కన్యామూల్యమును యివ్వలేనివాడు మాటతోనైనా వివాహ సహాయమును చేసిన వాని పుణ్యమునకు అంతములేదు. కార్తీకమాసమందు కార్తీకవ్రతమాచరిమ్చువాడు విష్ణుసాయుజ్యమును పొందును. ఇది నిజము, నామాటనమ్ముము ఈ విధముగా కార్తీకవ్రతమాచరించనివారు రౌరవాది నరకములను బొందుదురు.

ఇతి శ్రీ స్కాందపురాణే కార్తికమాహాత్మ్యే త్రయోదశోధ్యాయస్సమాప్తః
ఇది స్కాందపురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమనెడు కార్తీక పురాణమందలి పదమూడవ అధ్యాయము సమాప్తము

కార్తీక పున్నమి తిధి నిర్ణయం

ఈసారి కార్తీక పౌర్ణమి తిధి 29వ తేదీ మధ్యాహ్నం 12.09 నిమిషాల నుండి మరుసటి రోజు మధ్యాహ్నం 2.03 నిమిషాలు వరకు ఉన్నందున భక్తులు కొంత సందేహం వ్యక్తం చేస్తున్నారు... ఏ రోజున కార్తీక పౌర్ణమి జరుపుకోవాలనేది సందేహం....దీనిని మిగులు...తగులు... అని అంటారు
సహజంగా చంద్రునికి సంబంధించిన పండుగలలో వేద నిర్ణయం ప్రకారం...రాత్రులకు ప్రాధాన్యత ఉంటుంది...అంటే దీపావళిని  ఖచ్చితంగా ఆరోజు రాత్రి సమయంలో అమావాస్య తిధి కలిగి ఉన్న రోజున మాత్రమే జరుపుకొని తీరాలి...

అదేవిధంగా పౌర్ణమి కూడా, రాత్రిపూట స్థిరంగా ఉండే తిధిని ప్రామాణికంగా తీసుకుని తీరవలసిందే....

ఇక్కడ ప్రత్యేకించి గమనించవలసిన విషయం ఏమిటంటే... ఇతర పండుగలు జరుపుకుంటున్నట్లు సూర్యోదయంలో ఉన్న తిధికి ప్రాధాన్యత ఇవ్వాలనే అంశాన్ని మనం మరచిపోవాలి...

కృత్తిక నక్షత్రం పౌర్ణమి తిధిలో కలిగి ఉన్న మాసాన్ని కార్తీక మాసం అంటారు. 
నక్షత్ర గమనం ప్రకారం కూడా... ఆదివారం రాత్రి పౌర్ణమి తిధితో కృత్తిక నక్షత్రం కలిసి ఉంటుంది . 
ఆ విధంగా పౌర్ణమి తిధితో... కృత్తిక నక్షత్రం సోమవారం ఉదయం 6:06 వరకు మాత్రమే జత కూడి ఉంటుంది...

కాబట్టి కార్తీక పౌర్ణమి ఖచ్చితంగా 29వ తేదీన... ఆదివారం మాత్రమే జరుపుకుని తీరాలి...

మరుసటి రోజు అంటే సోమవారం రాత్రికి  జరుపుకుంటే రెండవ చంద్రుడు అవుతాడు... కృష్ణపక్షం వచ్చేస్తుంది...

ఉపవాస నియమం ఉన్న... ఉండాలనుకునే వారు మాత్రం 29వ తేదీ ఉపవాస నియమాలు పాటించి...రాత్రిపూట ఒత్తులు వెలిగించుకొని , చంద్రదర్శనం చేసుకుని భోజనం చేయవచ్చు...

ఉపవాస నియమం లేని వారు..
దీపాలు మాత్రమే వెలిగించాలనుకునేవారు 29వ తేదీ రాత్రి లేదా 30వ తేదీ ఉదయం ఆరు గంటల లోపు అంటే సూర్యోదయం కాకముందే ఒత్తులు వెలిగించు కోవచ్చు...

30వ తేదీ సోమవారం కూడాను....మరో లెక్క ప్రకారం కార్తీక మాసం 15వ రోజు కూడా అవుతుంది... కాబట్టి వత్తులు వెలిగించాలి అనుకునేవారికి మాత్రం 30వ తేదీ మధ్యాహ్నం లోపు నిరాహారంగా ఉండి...ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయవచ్చును...

అదేవిధంగా నోములు , తోరాలు ఉన్నవారు కూడా 30వ తేదీ సోమవారం మధ్యాహ్నం లోపు ఆ కార్యక్రమాన్ని చేపట్టవచ్చు... పౌర్ణమి తిధి ఉంటుంది కాబట్టి 29వ తేదీ ఆదివారం సాయంత్రం కూడా నోములు , వ్రతాలు చేసుకోవచ్చు ఆక్షేపణ లేదు...

Friday, November 27, 2020

కార్తీక పురాణం పన్నెండవ అధ్యాయం

అథ శ్రీ స్కాందపురాణే కార్తికమహాత్మ్యే ద్వాదశోధ్యాయః

శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణం పన్నెండవ అధ్యాయం


వసిష్ఠ ఉవాచ:
కార్తిక్యామిందువారస్య మహాత్మ్యం శ్రుణు భూపతే
తస్మాచ్చతగుణంతస్మిన్ వ్రతం సౌరిత్రయోదశీ!!
సహస్రగుణితంతస్మా త్కార్తికేమాసి పౌర్ణిమా
తయా లక్షగుణం ప్రోక్తం మాసస్య ప్రతిపద్దినం!!
తస్మాత్కోటి గుణం రాజన్ అంతిమైకాదశీంవిదుః
తస్మాదనంతగుణితం కార్తికే ద్వాదశీదినమ్!!
*తా:* ఆ వసిష్ఠుడు తిరిగి ఇలా కొనసాగించెను " ఓ రాజా, కార్తీకమాస సోమవార మహాత్మ్యము వినుము, సోమవారముకంటె శనిత్రయోదశీ నూరు రెట్లు, శనిత్రయోదశికంటే కార్తిక పున్నమి వెయ్యిరెట్లు ఫలము, పూర్ణమి కంటె శుక్ల పాడ్యమి లక్ష గుణము అధికము, శుక్ల పాడ్యమి కన్నా బహుళ ఏకాదశి కోటిగుణకము, అంతిమ ఏకాదశి కన్ననూ ద్వాదశి అనంత గుణఫలోపేతము, [పౌర్ణిమాంత మాసముననుసరించు ఔత్తరాహికులు (ఉత్తరభారతీయులు) శుక్ల ఏకాదశినే అంతిమ ఏకాదశిగా గణింతురు, ఆ దినమునే అంబరీషుని చరిత్రను గ్రహింతురు]

అంతిమైకాదశీం మోహాదుపోష్యయదిమందిరె
గీతవాద్యపురాణైశ్చ కుర్యాజ్జాగరణం నరః
ససర్వపాపనిర్ముక్తో విష్ణులోకేవసేచ్చిరమ్!!
తథాపరదినెప్రాప్తె పారణం బ్రాహ్మణైస్సహ
యః కార్తికేమాసి రాజన్ స సాయుజ్యం లభేద్ధరేః!!
కార్తికేయశ్చద్వాదశ్యాం అన్నదానం మహాత్మనే
యః కుర్యాద్రాజశార్దూల సర్వసంపద్వివర్ధతె!!
గంగాతీరెరవిగ్రస్తే కోటి బ్రాహ్మణభోజనాత్
యత్ఫలం లభతేజంతుః తత్ఫలం ద్వాదశీం విదుః!!
ఉపరాగ సహస్రాణి వ్యతీపాతాయుతానిచ
అమాలక్షంతుద్వాదశ్యాః కళాం నార్హంతీషోడశీమ్!!
*తా:* మోహముతోనైనగానీ, ఈ అంతిమ ఏకాదశి ఉపవాసము చేసి, గీత వాద్య పురాణముల పఠనముల చేత జాగరణము చేయువారు సమస్త పాపములనుండి ముక్తులై విష్ణులోకమున చిరకాలముందురు. కార్తీక మాసమున యేకాదశినాడుపవాసముండి, ద్వాదశినాడు బ్రాహ్మణులతో కూడి పారాణము చేసెడివాడు సాయుజ్యముక్తినొందగలడు. కార్తీక మాసమందు ద్వాదశీ తిథినాడు అన్నదానము చేయువానికి సమస్త సంపత్తులు వృద్ధినొందును. సూర్యగ్రహణదినమునందు గంగా తీరమున కోటిబ్రాహ్మణులకు భోజనము పెట్టిన పుణ్యము ద్వాదశీ తిథినాడు ఒక బ్రాహ్మణునకు అన్నము పెట్టిన లభిస్తుంది.  వేయి గ్రహణములు, పదివేల వ్యతీపాతయోగములు లక్ష అమావాస్యలు కలిసిన ఈ కార్తీక ద్వాదశిలో పదహారవ వంతుకూడా కాజాలవు.

అనేక తిథియస్సంతి సదాసత్పుణ్యదాయకా
తాసామనంతగుణితా ద్వాదశీ విష్ణువల్లభా!!
కార్తికే శుక్లపక్షేతు ద్వాదశీ హరిబోధినీ!
తన్యామేకస్య విప్రస్య అస్యదానం కరోతియః
ససర్వసౌఖ్యం లభతే పశ్చాద్విష్ణుపురేనృప!!
కార్తికే మాసిద్వాదశ్యాం దధ్యన్నం దానముత్తమం
యః కుర్యాత్సోపిధర్మేభ్యో హ్యధికం ఫలముచ్యతె!!
నారీ వా పురుషో వా పి కార్తిక్యాం ద్వాదశీదినే
స్వర్ణశృంగీం రౌప్యఖురాం సవత్సాంసుపయస్వినీం!!
గామభ్యర్చ్యవిధానేన దానంయః కురుతేనఘ
యావతీరోమసంఖ్యాస్యా త్తావత్స్వర్గాధిపోభవేత్!!
ద్వాదశ్యాం కార్తికేమాసి వస్త్రదానం కరోతియః
భక్త్యాప్రయత్నతోరాజన్ పాపైః పూర్వార్జితైరసి
విముచ్యవిష్ణుభవనం యాతివాస్త్యత్రసంశయః!!
*తా:*పుణ్యమునిచ్చే తిథులనేకము కానీ, ద్వాదశి హరి ప్రియము, కాబట్టి ఇతర తిథులన్నిటింకటె అధికఫలప్రదము. కార్తీక శుక్ల ద్వాదశినాడు , ఏకాదశి రాత్రి యామముండగనే పాలసముద్రములో శయనించిన శ్రీహరి నిద్రలేచును. కాబట్టి ఆ ద్వాదశి హరిబోధిని అని పిలువబడును. ఆ ద్వాదశినాడు ఒక బ్రాహ్మణునకైన అన్నదానమాచరించువారు ఈలోకంలో భోగాలనుభవిమ్చి అంతములో ఆహరిని పొందెదరు. కార్తీక మాసములో ద్వాదశినాడు పెరుగన్నము దానము చేసిన వారికి సమస్త ధర్మములను ఆచరించడం కంటే అధిక ఫలము లభిస్తుంది. స్త్రీపురుష బేధములేకుండా  కార్తీక శుద్ధ ద్వాదశినాడు పాలిచ్చెడి ఆవుకు బంగారపు కొమ్మును వెండి డెక్కలు చేయిమ్చిపెట్టి పూజించి దూడతో గూడ గోదానమిచ్చిన ఆగోవుకెన్ని వేల వెంట్రుకలుండునో అన్ని వేల యేండ్లు స్వర్గవాసము చేయుదురు. కార్తీక మాసములో ద్వాదశినాడు భక్తితో వస్త్రదానమాచరిమ్చువారు పూర్వజన్మార్జిత పాపములను నశింపజేసుకుని వైకుంఠలోకమునకు పోవును, ఇందులో ఎటువంటి సందేహము లేదు.

ద్వాదశ్యాం కార్తికేమాసి పౌర్ణమ్యాంప్రతిపద్ధినే
యోదీపదానంకురుతె సకాంస్యంచఘృతాదికం
కోటిజన్మార్జితంపాపం తత్క్షణేవిశ్యతి!!
ఫలంయజ్ఞోపవీతంచ స తాంబూలం సదక్షిణం
ద్వాదశ్యాంయేప్రకుర్వంతి తత్ఫలం శ్రుణుభూమిప!!
భుంక్తే హవిపులాన్ భోగాన్ స్వర్గేప్యం తెతుదుర్లభాన్
పశ్చాద్విష్ణుపురంప్రాప్య మోదతేవిష్ణువచ్చిరమ్!!
సువర్ణతులసీదానం ద్వాదశ్యాం కార్తికే నృప
సాలగ్రామంసమభ్యర్చ్య శ్రోత్రియాయకుటింబినే
దానంయః కురుతే భక్త్యా తన్యపుణ్య ఫలంశ్రుణూ!!
చతుస్సాగరపర్యంతం భూదానాద్యత్ఫలంవిదుః
తత్ఫలంసమవాప్నోతి ద్వాదశ్యాంకార్తికస్య్చ!!
అత్రైవోదాహరంతీమ మితిహాసంపురాతనం
శ్రుణ్వతోసర్వపాపఘ్నమ్ తత్సమాసేనమెశ్రుణు!!
*తా:*కార్తీక మాసమందు ద్వాదశి యందు పూర్ణిమయందు పాడ్యమియందు గానీ పంచపాత్రలో ఆవునెయ్యినుంచి దీపము వెలిగించి దానమిచ్చువారికి కోటిజన్మలలో చేయబడీన పాతకములు నశించును. కార్తిక ద్వాదశినాడు ఫలమును యజ్ఞోపవీతమును తాంబూలమును దక్షిణను ఇచ్చువాడు ఈ లోకమునందు అనేక భోగములనుపొంది అంతమన వైకుంఠమందు విష్ణువుతోకూడి చిరకాలముండును. కార్తిక ద్వాదశినాడు బంగారపు తులసీ వృక్షమును సాలగ్రామమును దానము చేయువాడు పొందెడి ఫలము చెప్పెదను వినుము. కార్తిక ద్వాదశినాడు పూర్వోక్తదానము చేసినవాడు నాలుగుసముద్రముల మధ్యనున్న భూమినంతయు దానమిచ్చువాడు పొందెడి ఫలము పొందును. ఈ విషయందు ఒక కథ గలదు చెప్పెదను వినుము. ఈ కథ చదివిన విన్నవారికి సమస్త పాతకములు నశించును.

వైశ్యః కశ్చిద్దురాచారః గోదావర్యాస్తటేశుభే
స్వయంచాపి నభుంజీత దానంవానాణుమాత్రకమ్!!
నోపకారంకృతంతేన యస్యకస్యాపి దేహినః
పరనిందాపరోనిత్యం పరద్రవ్యేషులాలసః!!
కస్యచిద్ధ్విజముఖ్యస్య ఋణం దత్వాధికంధనం
తద్గృహీతంసమాయాతో విస్రంగ్రామాంతరేస్థితం
సమపృచ్ఛతదావైశ్యో ఋణం దేహీతిభూసురమ్!!
సవిప్రవర్యస్తచ్ఛ్రుత్వా విచార్యోవాచతంనృప
ద్రవ్యం దాస్యామిమాసాంతే యేనకేనాపికర్మణా
అతస్థ్సిత్వాఋణంసర్వం గృహీత్వాగంతుమర్హసి!!
యోజీవతిఋణీనిత్యం నిరయంకల్పమశ్నుతె
పశ్చాత్తస్యసుతోభూత్వా తత్సర్వంప్రతిదాస్యతి!!
*తా:*గోదావరీతీరమమ్దు దురాచారవంతుడైన ఒక వైశ్యుడు గలడు. అతడు కొంచెముకూడా దానము చేసెడివాడు కాడు, ధనమును తానూ అనుభవించెడివాడు కాడు. వాడు ఎవరికీ ఉపకారము చేసెడివాడుకాడు, ఎప్పుడూ పరనింద చేస్తూ, పరద్రవ్యంపై ఆసక్తి కలిగినవాడూ.  ఆ వ్యక్తి ఒక బ్రాహ్మణునకు అధికముగా అప్పిచ్చి ఆ ఋణమును తిరిగి పొందడం కొరకు ఆతని ఊరికి వెళ్ళి అతడు గ్రామాంతరంలో ఉన్నాడని తెలిసి అక్కడికి వెళ్ళి ఆ బ్రాహ్మణుని అప్పు తిరిగిమ్మని అడిగెను. ఆ బ్రాహ్మణుడామాట విని ఓ వైశ్యుడా ఈ నెల చివర నీసొమ్మంతయు ఏదోఒక విధముగ తిరిగిచ్చెదను కావున కొంచెము నిదానింపుమని కోరెను.  ఋణమును తీసుకొని తిరిగి ఆ సొమ్ము యివ్వనివాడు నరకమందు యాతనలనుబొంది తిరిగి ఆ ఋణదాతకు కొడుకై పుట్టి వాని సొమ్మును యివ్వవలసి యుండును.

ఏవముక్తెద్విజెవైశ్యః కోపాదారక్తలోచనః
మూఢాద్యదేహిమెద్రవ్యంనోచేత్ఖడ్గేనతాడయే!!
ఆకృష్యకేశానాదాయ దుష్టాత్మాపావధీరయం
తేనాశుపతితంభూమౌవిప్రంపాదావతాడయత్!!
కోపావేశేనపాపాత్మా విప్రం వేదాంతపారగం
ఖడ్గేనైవాహనత్తూర్ణం హరిస్తుహరిణంయథా 
మమారతేనమాతేన బ్రాహ్మణోబంధువత్సలః!!
సతుద్రావతోవేగాత్ భయాద్రాజ్ఞోమహీపతే
పునర్గృహంప్రవిశ్యాఽసౌ బ్రహ్మఘ్నోనిరపత్రవః
ఆయురంతరితేకాలే మరణం సముపాగతః!!
*తా:*బ్రాహ్మణుడిట్లు చెప్పిన మాటను విని ఆ వైశ్యుడు కోపముచేత కళ్ళెర్రజేసి ఓరీ మూఢ బ్రాహ్మణుడా నాధనము నాకిప్పుడే యిమ్ము లేకున్న ఈకత్తితో నిన్ను నరికెదనని దుర్మార్గబుద్ధితో ఆవేదాంతవేత్తయైన బ్రాహ్మణుని జుట్టుపట్టి లాగి క్రింద పడవేసి పాపబుద్దికలవాడైన ఆ వైశ్యుడు తనకాలితో తన్ని కత్తితో కొట్టెను. ఆ బ్రాహ్మణుడు సింహముచేత దెబ్బతిన్న జింకవలె గిలగిలలాడి మృతినొందెను. ఆ తరవాత ఆ వైశ్యుడు రాజదండనమునకు భయపడి అక్కడనుండి పారిపోయి బ్రాహ్మణుని చంపితినన్న సిగ్గులేక సుఖ్గముగా ఇంటనుండి కొంతకాలమునకు మృతినొందెను.

ఆయయుర్యమదూతాశ్చ పాశహస్తాభయంకరాః
కరాళవదనా రాజన్ కృష్ణరాత్రిసమప్రభాః!!
పాశైరాబధ్యతం వైశ్యం యయుర్యమనికేతనం
తస్మింస్తే రైరవేఘోరే విససర్జుర్యమాజ్ఞయా!!
తస్యసూనుర్మహీపాల ధర్మవీరేతివిశ్రుతః
పిత్రార్జితధనం భూరి సదాధర్మపరాయణః!!
కూపోద్యానతటాకాది సేతు బంధనకారకః
వివాహోపనయౌకర్తా యజ్ఞ కేష్వతిలాలసః!!
అన్నదానపరోనిత్యమాతురాణాంద్విజనమనాం
సర్వేషామపివర్ణానాం క్షుధార్తానాంమహీపతే!!
*తా:*భయంకరముఖములుకలిగి అమావాస్య రాత్రి సమానమైన కాంతి కలవారు భయంకరులగు యమదూతలు పాశములను ధరించి వచ్చి ఆ వైశ్యుని యమపాశములచే బంధిమ్చి యమలోకమునకొ తీసుకొనిపోయి అక్కడ భయంకరమైన రౌరవమనే నరకమమ్దు యమాజ్ఞ మీదట బాధించుచుండిరి. రౌరవమనగా రురుమృగపు కొమ్ములచే బాధించెడి నరక నగరము.  ఆ వైశ్యును పుత్రుడు ధర్మపరాయణుడు తండ్రిపోయిన పిమ్మట తండ్రి సంపాదించిన ధనమంతయూ నూతులు, చెరువులు తవ్వించి, ఏరులకు, నదీపాయలకు వంతెనల నిర్మాణము చేసి ఉపనయనములు, వివాహములకు యజ్ఞయాగాదులకు నిత్యమూ బ్రాహ్మణులకు ఆకొన్నవారికి అన్నదానము చేయుచు అన్నిజాతులవారికి ఆకలిగలిగిన వారికి అన్నమ్ పెట్టుచు నిత్యము ధర్మము చేయుచుండెడివాడు.

తస్యచాంతరితేకాలే గృహేతత్పుణ్యయోగతః
నారదఃపర్యటన్ సగాయన్ విష్ణుకీర్తనం
వణిగ్విష్ణ్వర్చనేకాలే ప్రనృత్యన్ పులకాంకితః
*గోవిందనారాయణ కృష్ణవిష్ణో అనంత వైకుంఠ నివాసమూర్తే*
*శ్రీవత్సవిశ్వంభర దేవ దేవ సమస్త దేవేశనమోనమస్తే!!*
నృత్యంతమేవంగృహమాగతం వణిక్సమస్త సంతోషపయోధిమగ్నః
సనామ పాదైమునయె మహాత్మనెహ్యానంద బాష్పోన్నయనస్సదండవత్!!
*తా:*ఇంట్లుండగా, ఒకనాడు ఆ ధర్మవీరుడు హరిని గూర్చి పూజచేయుచుండగా ఆ సమయంలో మహాత్ముడైన నారదమహాముని సమస్తలోకములందు తిరిగుచు ఆనాడు యమలోకమునుంచి బయలుదేరి తనవీణాతంత్రులను మీటుతీ రోమాంచితుడై 
*గోవిందా - నారాయణా*
*కృష్ణ - విష్ణో - అనంతా*
*వైకుంఠ - శ్రీ - నివాసా*
*శ్రీవత్సభూషా - విశ్వంభరా - దేవేశా*
నమస్తే, నమస్తే నమోనమః, అంటూ గానము చేస్తూ వచ్చెను, ఇలా హరికీర్తనము చేయుచూ వచ్చిన నారదుని చూసి ఆ వైశ్యకుమారుడు ఆనంద సాగరంలో డోలలాడుతూ కన్నులవెంట నీరుకారగా మునిపాదములకు సాష్టాంగ నమస్కారము చేసెను.

తంపాదపద్మానమిత దయాళుర్మునిస్తదాతంపరిరభ్యహర్షితః
సప్రాహవైశ్యః పురతః కృతాంజలిః తం విష్ణుమర్ఘ్యాదిభిరర్చ్య తం నృప
భవదాగమనంమహ్యం మునెహ్యత్యంతదుర్లభం
యతార్జితం మయాపూర్వంధర్మమార్గముపాగతం
యన్మయాచరితంత్వద్య ఫలితం తవ దర్శనాత్
సేవాం విధాస్యేవిప్రేంద్ర ప్రాపయెప్రణయేనచ
*తా:*ఆ నారదుడు తన పాదములకు ప్రణమిల్లిన వైశ్య పుత్రుని ప్రీతితో లేవనెత్తి కౌగిలించుకొనెను. ఆ తరవాత వైశ్యుడు నారదమునీశ్వరుని ముందర అంజలిఘటించినవాడై అర్ఘ్యాదులచేత పూజించి. హే నారదమహర్షీ! మీరు మా గృహమునకు వచ్చుట చాలా దుర్లభము. నేను పూర్వపుణ్యమేదియో చేసియుందునేమో మీరు దర్శనమిచ్చినారు. కాబట్టి నాపూర్వపుణ్యమిప్పుడు ఫలించినది. మీకు దాసుడనైన నేనేమి చేయవలెనో తెల్పుము చేసెదను అని అనెగా..

ఇతితస్యవచశ్శ్రుత్వా మందస్మేరముఖాంబుజః
ఉవాచధర్మవీరమ్తమ్ నారదోభగవాన్మునిః
*నారదః:*
ధర్మవీరాద్య మేవాక్యం సావధానమనాశ్శ్రుణు 
కార్తికస్యతుమాసస్య ద్వాదశీ హరివల్లభా
స్నానదానాదికతస్య సదానంతఫలంవిదుః

ఆఢ్యకోవాదరిద్రోవా యతిర్వానస్థఏవవా
బ్రాహ్మణక్షత్రియోవాపి వైశ్యశూద్రోపివాసతీ
సాలగ్రామశిలాదానం యేకుర్వంతిప్రయత్నతః
తులాసంస్థెదినకరెద్వాదశ్యామర్కికేదినే
తేనపాపానినశ్యంతి జన్మాంతరకృతానిచ!!
ధర్మరాజాలయేవైశ్యం పితాతవమృతంగతః
రైరవాఖ్యేమహాఘోరే పచ్యతెనరకాగ్నినా
తస్యపాపవిషుద్ధ్యర్థం ద్వాదశ్యాంకార్తికస్యచ
సాలగ్రామశిలాదానం కురుత్వంమావిలంబితమ్!!
*తా:*వైశ్యుడిలా అన్నమాటలనువిని ఆ నారదముని చిరునవ్వుతోకూడిన ప్రశాంతముఖముతో యిట్లనెను ’ఓ ధర్మవీరా నామాట జాగ్రత్తగా వినుము కార్తీక ద్వాదశినాడు విష్ణుమూర్తికి ప్రియమైనది గనుక ఆరోజున చేసిన స్నానదానాదికములంనంత ఫలప్రదములు. సూర్యుడు తులారాశియందుండగా కార్తీకమాసమందు ద్వాదశితిథినాడు ధనికుడు, పేదవాడు, సన్యాసి-వానప్రస్థుడు-గృహస్థు, బ్రాహ్మణుడు-క్షత్రియుడు-వైశ్యుడు-శూద్రుడు, స్త్రీ-పురుషులు అని బేధములేక సాలగ్రామ దానము ఆచరించి జన్మాంతర కృతపాపములను నశింపజేసుకుందురు. ఓ ధర్మవీరా! విను, నీతండ్రి చనిపోయి యమలోకమమ్దు రౌరవాది బాధలనొందుచున్నాడు. అతని పాపశుద్ధికొరకు కార్తిక ద్వాదశినాడు శీఘ్రముగా సాలగ్రామ శిలాదానము చేయుము.

మునెస్తస్యవచశ్రుత్వా వైశ్యః ప్రాహమునింనృప
గోభూతిలహిరణ్యాది దానానాంయత్ఫలంమునే
నాసీత్తత్ఫలతోముక్తి శ్శిలాదానేనకింభవేత్
శిలాదానం వృధామన్యే నభోజ్యం స చ భక్షణం
నాతః కార్యమ్ మయావిప్ర శిలాదానం చనీచవత్
బహుధాబోధ్యంతం వైశ్యం మునిరంతరధీయత
నకుర్యాద్యధిమూఢాత్మా బోధితోబ్రహ్మసూనునా
సోపి కాలాంతరేతీతె గతాసురభవన్నృప
మహద్వచనమజ్ఞేన హ్యతిక్రమణదోషతః
సాలగ్రామశిలాదాన మనాదృత్య మహీపతే
తేనదోషేణసంజాతో వ్యాఘ్రయోనై త్రిజన్మమ
త్రివారంమర్కటత్వమ్చ పంచవారం వృషస్యచ
దశవారం పునస్త్రీత్వం గతభర్తృత్వమంజసా!!
*తా:*నారదమునీశ్వరుడిట్లు చెప్పిన మాటలు విని ఆ వైశ్యుడిట్లనెను, మునీంద్రా గోదానము, భూదానము, తిలాదానము సువర్ణ దానము మొదలైన మహాదానములచేత దొరకని ముక్తి శిలాదానమువలన ఎలా కలుగుతుంది. శిలాదానము వృధాగా చేయడమెమ్దుకు అది భోజ్యమూకాదు, భక్షణమూకాదు కనుక ఈ రాతిని దానము చేయను. అనెను. నారద మహర్షి ఎంతగా నొక్కి చెప్పినను వైశ్యుడు మూఢుడై సాలగ్రామ దానము చేయుటకు సమ్మతించలేదు. అంత నారదుడంతర్థానమయ్యెను. ఆ తరవాత కొంతకాలమునకు ఆ ధర్మవీరుడు మృతినొంది మహాత్ములమాట వినని దోష్ము వలన నరకబాధలనుభవించి, తరవాత మూడు జన్మలు పులిగానూ, మూడు జన్మలు కోతిగా, అనంతరము ఐదు జన్మలు ఎద్దుగా, ఆ తరవాత పది సార్లు స్త్రీజన్మయెత్తి వైధవ్యమును పొందెను.

జన్మనైకాదశెరాజన్ యాచకస్యసుతాభవత్
తాందృష్ట్వావిప్రశార్దూల స్సురూపాంప్రాప్తయౌవనాం
సమానకులగోత్రాయవివాహమకరోత్పితా
మృతంజామాతరందృష్ట్వా నవోఢాంతనయాంపితా
ఆయయుర్బాందవాస్సర్వే దుఃఖాదాకులితేంద్రియాః
యాచకోపి విచార్యేదం దివ్యదృష్ట్యాతయాకృతం
పూర్వజన్మనిరాజేంద్ర సుకృతందుష్కృతం ద్విజః
విజ్ఞాయాహాధసర్వేభ్యః బంధుభ్యోరాజసత్తమ
*తా:*ఇట్లు పదిజన్మలు గడిచిన పిమ్మట పదకొండవ జన్మమున యాచకునకు కుమార్తెగా జన్మించెను . ఆ తరువాత కొంతకాలమునకు యౌవనము రాగానే తండ్రితగిన వరునకిచ్చి వివాహము చేసెను. కొంతకాలమునకు అల్లుడు మృతిచెందగా ఆ అల్లుని బంధువులందరు వచ్చి చూచి అట్టిబాల్యవైధవ్యమునకు చాల దుఃఖించిరి. యాచకుడు దివ్యదృష్టితో చూచినవాడై ఆచిన్నదాని బాల్యవైధవ్యమునకు కారణమును తెలుసుకొని బంధువులందరికిని కుమార్తెయొక్క పూర్వపుణ్యపాపమును తెలిపెను.

తస్యాఃపాపవిశుద్ధ్యర్థం పితాతంముక్తికారణం
జన్మాంతరార్జితాఘౌఘ నాశహేతుంసుఖప్రదం
సాలగ్రామశిలాదానం కార్తిక్యామిమ్దువాసరే
విప్రంవేదాంతనిరతం సమభ్యర్చ్యవిధానతః
పుణ్యంపాపవిశుధ్యర్థం దాపయామాసభూసురః
పతిరుజ్జీవితస్తేన సుఖేనభువిదంపతీ
స్థిత్వాకాలేసమాయాతి దివంగత్వానుభూయచ
నపుర్భవమభ్యేత్య స్థిత్వాసుతపసోభవత్
పూర్వార్జితేపుణ్యేన తస్యజ్ఞానోదయోభవత్
వర్షె వర్షెచసుకృతం కార్తిక్యామిందువాసరే
సాలగ్రామశిలాదానం తేనముక్తిమవాపసః
*తా:*ఇట్లు చెప్పి తన కూతురుయొక్క  పూర్వ పాపములనాశనము కొరకు సమర్థమగు సాలగ్రామ దానమును కార్తీక మాసమున సోమవారమునందు వేదాంతవేత్తయైన బ్రాహ్మణునకు దానము జేసెను. ఆసాలగ్రామ శిలాదానము చేత కూతురు భర్త తిరిగి జీవించెను, ఆ తరవాత దంపతులిద్దరూ సుఖముగా చిరకాలముండి స్వర్గమునకుబోయి అందు బహుకాలమానందముతో యుండి తిరిగి భూమియందు జన్మించి బ్రాహ్మణుడై పూర్వపుణ్యము చేటా జ్ఞానమును పొందెను. ప్రతి సంవత్సరమూ కార్తీక సోమవారమునందు సాలగ్రామ శిలాదానమాచరించి ఆపుణ్యముతో మోక్షసామ్రాజ్యపదవిని పొందెను.

రౌరవేదుఃఖితస్యాపి ముక్తిరాసీచ్చతత్పితుః
తస్మాద్రాజేంద్రయత్నేన కార్తికేకమలాపతే
సాలగ్రామశిలాదానం తుష్ట్యర్థంనాత్ససంశయః
కోటిజన్మనుయత్పాపం సంచితం పాపిభిస్సదా
తత్పాపనాశహేతుర్వై కార్తికేహరిబోధినీ
సర్వపాపప్రశమనం ప్రాయశ్చిత్తంజగత్త్రయే
సాలగ్రామశిలాదానా త్పరంనాస్తినసంశయః
*తా:*రౌరవ నరకమందున్నవాని తండ్రియగు వైశ్యుడు ఆ సాలగ్రామ దాన మహిమచేతముక్తుడాయెను, కాబట్టి జనకరాజా కార్తీకమందు సాలగ్రామదానముచేత హరిసంతోషించును ఇందులో అనుమానమక్కరలేదు. పాపకర్ములు కోటిజన్మలలో చేసిన పాతకములు కార్తీక శుక్ల ఏకాదశ్యుపవాస ద్వాదశీదానాదులచేత నశించును. కార్తీకమాసమునందు సాలగ్రామ దానమువలన సమస్త పాతకములు నశిమ్చును ఇదియే ముఖ్యమైన ప్రాయశ్చిత్తము. ఇంతకంటె వేరు ప్రాయశ్చిత్తములేదు యిందులో అనుమానము లేదు.

ఇతి శ్రీ స్కాందపురాణే కార్తీకమాహాత్మ్యే ద్వాదశోధ్యాహస్సమాప్తః
ఇది స్కాందపురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమనెడు కార్తీక పురాణమందలి పన్నెండవ అధ్యాయము సమాప్తము.

Thursday, November 26, 2020

కార్తీక పురాణం పదకొండవ అధ్యాయం

అథ శ్రీ స్కాందపురాణే కార్తికమహాత్మ్యే ఏకాదశోధ్యాయః

శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణం పదకొండవ అధ్యాయం

వసిష్ఠ ఉవాచ:
భూయశ్శ్రుణుష్వరాజేంద్ర పుణ్యంకార్తికసంభవం
కార్తిక్యామతసీపుష్పైరర్చయేద్యోజనార్దనం!!
యోదుర్వాగ్రైఃకుశాగ్రైశ్చ పూజయేత్కార్తీకేచ్యుతం
ససర్వపాపనిర్ముక్తో యాతితత్పదమవ్యయమ్!!
యోర్చయేదచ్యుతం భక్త్యా కార్తికేరాజసత్తమ
వస్త్రైర్విచిత్రవర్ణైశ్ఛ సలభేత్ఫలముత్తమమ్!!
కార్తికేమాసియస్స్నాత్వా దీపమాలాభిరర్చయేత్
యశ్శ్రావయేత్పురాణాంశ్చ యం కుర్యాచ్ఛ్రవణం తథా!!
అత్త్రైవోదాహరంతీమ మితిహాసంపురాతనం
పాపఘ్నమహదాశ్చర్య మాయురారోగ్యవర్ధనమ్!!
తా: వసిష్ఠుడు చెప్పుచున్నాడు  "రాజోత్తమా! తిరిగి చెప్పెదను వినుము కార్తీకమాసమందు అవిసెపువ్వులతో హరిని పూజించినచో వాని పాపములు నశించి చాంద్రాయణఫలముగలవాడగురు. కార్తీకమాసమందు గరికతోనూ, కుశాగ్రములతోనూ శ్రీహరిని పూజిమ్చువాడు పాపముక్తుడై వైకుంఠము జేరును. కార్తికమాసమందు చిత్రమైన రంగులతో కూడిన వస్త్రములను హరికి సమర్పించినవాడు మోక్షమునొందును.  కార్తీకమాసమందు స్నానమాచరించి హరిసన్నిధిలో దీపమాలలను సమర్పించేవాడు, పురాణము చెప్పేవాడు, వినువాడు, పాపములన్నీ నశింపచేసుకొని పరమపదమును పొందెదరు. ఈ విషయ్మై ఒక పూర్వకథ గలదు, అది విన్నంతమాత్రమే అనేక పాపములు పోవును, ఆయురారోగ్యములను యిచ్చును, బహుఆశ్చర్యకరముగానూ ఉండును. ఆ కథ చెప్పెదను వినుము,  

కశ్చిత్కళింగ దేశస్థో బ్రాహ్మణోమందరాహ్వయః
స్నానసంధ్యావిహీనస్సన్ పరేషాంభృత్యతాంగతః!!
తస్యభార్యానుశీలాచ పాతివ్రత్యపరాయణా
సర్వలక్షణసంపన్నా నారీణాముత్తమావధూః!!
నాసూయాంకురుతెక్వాపి పతినారాజసత్తమ
సతథాజీవనోపాయం జానీతెసకదాచన
ఖడ్గపాణిశ్చ కాంతారె చౌర్యవిత్తముపాశ్రయన్
పాంథాంనాంబాధతెనిత్యం హత్వావస్తూనివైనృజ!!
గత్వాన్యదేశంబలవాన్ క్రీత్వావస్తూనిస్వశః
తేనోపజీవనంకుర్వన్ కుటుంబభరణాతురః!!
తా: కళింగదేశములో సుందరుడను ఒక బ్రాహ్మణుడు ఉండెను, అతడు స్నాన సంధ్యలను వదిలి ఇతరులకు సేవచేస్తూ కూలిపని చేయుచుండెడివాడు. అతనికి మంచి గుణములు కలిగిన సుశీలయనే పేరు కలిగిన ఒక భార్య ఉండెను ఆమె పతివ్రత, సమస్త సాముద్రిక లక్షణములతో కూడినదై ఆడవారిలో శ్రేష్ఠురాలైయుండెను. ఆ సుశీల భర్త దుర్గుణ పూర్ణుడైనను అతనిమీద ద్వేషభావములేక అతనిని సేవించుచుండెను. ఆ బ్రాహ్మణుడు కూలిపని కష్టమని తలచి చేత ఆయుధము ధరించి అడవి మార్గములో దాగి బాటసారులను కొట్టి వారి ధనములను అపహరించుచుండెడివాడు.

పాథం కంచిద్ధ్విజందృష్ట్వా ఖడ్గపాణిస్సకాననే
తమభ్యెత్యాశుసంగృహ్య వటె బధ్వాహరద్ధనం!!
తందృష్ట్వాలుబ్ధకః కౄరః శూరశ్చాపధరశ్శఠః
స్వయంజగ్రాహతత్సర్వం తౌహత్వాదుషధిర్నృప!!
వ్యాఘ్ర సదాగుహాంతస్థో ప్యాజగానుగుహాద్బహిః
తద్గంథమాఘ్రాయాగత్య వ్యాధందృష్ట్వాగ్రహాన్నృప!!
సోపిఖడ్గేనతంవ్యాఘ్ర మహసత్క్రోధసంయుతః
అన్యోన్యాఘాతదోషేణ కాలస్యాయతవంగతౌ!!
తా: ఒక సారి ఆ బ్రాహ్మణుడు దొంగతనము కొరకు మాటు వేసి ఆ మార్గమున వచ్చు బ్రాహ్మణుని పట్టుకుని అతని సొమ్మంతా అపహరించెను, ఇంతలోనో క్రూరుడైన ఒక కిరాతుడు అచ్చి ఆ యిద్దరు బ్రాహ్మణులను చంపి ఆ ధనమును తాను అపహరించెను. తరవాత గుహలోనుండు ఒక పులి కిరాతుని వాసనచే పసిగట్టి దాడి చేసి వానిని కొట్టెను, ఆ కిరాతుడు తన కత్తితో ఆ పులిని కొట్టెను , ఇద్దరు పరస్పర దాడిలో ఒకేసమయమున చనిపోయిరి.

తావేక కాలేహ్యేకత్ర ద్వౌవిప్రౌవ్యాఘ్రలుబ్ధకౌ
జగ్ముర్మరణమేకత్ర కాలసూత్రంతతఃపరమ్!!
తత్రైవకూపెక్రిమివిష్ఠసంకులే మహాభయధ్వాంత సుతప్త రక్తకే
నిమత్నయామాసురధోపరంతాన్ దుఃఖాన్వితాహ్ పాపభరేణ భూపతే!!
సావిప్రపత్నీ సకలైశ్చ ధర్మైరాచార నిష్ఠాహరిభక్తిసంస్థా
సత్సంగసలాపముపాశ్రితాజనైస్సదాపతిధ్యానపరానరేశ్వర!!
తా: ఇట్లు ఇద్దరు బ్రాహ్మణూళూ, కిరాతుడు, పులి నలుగురు ఒకచోట మృతినొంది యమలోకమును చేరి కాలసూత్రముననుసరించి నరకమును పొందిరి. యమభటులు వారినందరినీ పురుగులతోనూ ఆ మేధ్యముతోనూ కూడినటువంటి భయంకర మైన చీకటిలో తప్తరక్త తటాకమునందు పడవేసిరి. ఓ రాజా! ఆ బ్రాహ్మణుని భార్య సమస్త ధర్మములను చేయుచు ఆచారవంతురాలై హరిభక్తియుతయై సజ్జన సహవాసము చేయుచు నిరంతరము భర్తను ధ్యానించుచుండెను.

అస్యాగృహంయతిఃకశ్చిదాగతోదైవయోగతః
విష్ణుదేవంస్మరన్నుచ్చైః ప్రనృత్యపులకాంకితః!!
విష్ణు భక్త్యామృతంపీత్వా విష్ణుం సర్వత్రచింతకః
రోమాంచితతనుర్భూవ ఆనందాశ్రుకులేక్షణః!!
తా: ఓ రాజా! ఇట్లుండగా దైవ వశము చేత ఒక యతీశ్వరుడు హరినామ స్మరణమున నృత్యము చేయుచు పులకాంకిత శరీరుడై హరినామామృత పానము చేస్తూ సమస్త వస్తువులందు హరిని దర్శించుచు ఆనందభాష్పయుతుడై ఆమె యింటికి వచ్చెను.

తందృష్ట్వా సాచతేభ్యోన్నం దత్వోవాచయతించసా
భవదాగమనంమహ్యం దుర్లభం గృహమేధినాం
గృహీనాస్త్యత్రగేహేస్మిన్ ఏకాకీతత్పరాయణా!!
శ్రుణుభద్రెప్రవక్ష్యామి ముహూర్తమివమందిరె
దినాంతె విష్ణుపురతః పురాణపఠనం మయా!!
కార్యాంతదర్థం దీపస్య వర్తింకృత్వాదదస్వమె
అనేష్యామ్యహమేవాత్ర తైలంతిద్భక్తికారకః
ఇదానీం కార్తికేమాసి పౌర్ణమీవర్తతెశుభా!!
తా: ఆమె ఆ యతిని చూసి భిక్షమిచ్చి అయ్యా యతి పుంగవా మీరు మా యింటికి వచ్చుట చేత నేను తరించితిని, మీ వంటివారి దర్శనము దుర్లభము మాయింటి వద్ద నా భర్తలేడు నేనొకదానినే పతిధ్యానము చేయుచున్నాను. అని చెప్పగా విని ఆ యతీశ్వరుడు ప్రియభాషిణియు శ్యామయునైన ఆమెతో ఇలా అనెను. ’అమ్మాయీ ఈ రోజు కార్తీక పూర్ణిమ, మహాపర్వము ఈ దిన సాయంకాలము హరిసన్నిధిలో మీ యింట్లో పురాణ పఠనము జరుగవలెను, ఆ పురాణముకు దీపముకావలెను, నూనె నాదగ్గర ఉన్నది, కనుక నీవు వత్తిని చేసి యివ్వుము చాలును అని చెప్పెను  

ఇతితస్యవచశ్శ్రుత్వా జాతహర్షాన్వితానృప
గృహసంమార్జనంసమ్య ద్గోమయేనోపలిప్యచ
రంగవల్ల్యాస్వస్తికాద్యైరలంకృత్యతతఃపరమ్
తూలంసంశోధ్యవిధివద్వర్తిద్వయమరిందమ
తేనానీ తేన తైలేన దీపం సావిష్ణ వేర్పయత్!!
తా: యతీశ్వరుని మాటలువిని ఆ చిన్నది సంతోషమునొంది గోమయము తెచ్చి ఇల్లు అలికి చక్కగా అందులో పంచరంగులతో ముగ్గులను బెట్టి ఆ తరవాత దూదిని  శుద్ధిచేసి రెండు వత్తులు చేసి ఆ యతికి సమర్పించినది.
 
దీపాపాత్రం తధావర్తిం స్వయందత్వామహర్షిణా
ప్రజ్వాల్యపావకంభక్త్యా జ్వాలాంచసమయోజయత్!!
తత్ప్రకాశస్థలేయోగీ సమర్చ్యజనార్ధనం
పురాణపఠనంతత్ర చకారాత్మవిశుద్ధయె!!
గృహంగృహంతతోగత్వా జనానాహుయసాసతీ
పురాణశ్రవణార్థంతు శుశ్రావచజనైస్స్వయమ్!!
అనన్యబుద్ధ్యారాజేంద్ర స్వయమేవయథాగతః
పశ్చాదంతరితేకాలే కాలధర్మేణసానృప
మమారవిష్ణుధ్యానేన జ్ఞానేనాత్యంతనిర్మలా!!
తా: ఆ చిన్నది దీపపాత్రను వత్తిని తాను సమర్పించినందుకు చాలా ఆనందమును పొందినది. యతి ఆదీపమును వెలిగించి ఆ దీపము ముందర హరిని పూజించి మనశ్శుద్ధికొరకై పురాణపఠనము ప్రారంభించెను. ఆమె, ప్రతియిమ్టికి వెళ్ళి పురాణశ్రవణమునకు రమ్మని చాలామందిని పిలుచుకువచ్చి వారితో సహా ఏకాగ్రమనస్సుతో పురాణమును వినెను. తరువాత ఆ యతీశ్వరుడు యధేచ్చగా పోయెను, కొంతకాలమునకు హరిధ్యానముచేత జ్ఞానమును సంపాదించుకొని ఆమె మృతినొందెను. 

తదాజగ్ముర్విష్ణుదూతాశ్శంఖచక్రాంబుజశ్రియః
చతుర్భుజారవిమ్దాక్షాః పీతాంబరధరాశ్శుభాః!!
మనోహరేణదివ్యేనవిమానేనార్కవర్చసా
నానాపుష్ఫఫలై స్తద్వదమరోద్యాన సంభవైః!
ప్రవాళముక్తామణిభిర్విచిత్రైర్వస్తుభూషణైః
అలంకృత్యవిమానాగ్ర్యం తన్మధ్యేతాంనివేశ్యాచ!
విష్ణుభక్త్యైర్వినీతైశ్చ కరతాళైశ్చనర్తనైః
జయశబ్దైస్తూయమానాయయుర్వైకుంఠమందిరమ్!!
తా: అంతలో శంఖచక్రాంకితులు, చతుర్బాహుసమన్వితులు, పద్మాక్షులు, పీతాంబరధారులు ఐన విష్ణుదూతలు దేవతల తోటలో ఉన్న పువ్వులతోను, ముత్యాలు, పగడాలతోను అలంకరించిన మాలికలతోను వస్త్రములతోనూ, అలంకరించబడిన విమానము తీసుకువచ్చి సూర్యునివలె ప్రకాశించే ఆ విమానమందు ఆమెను ఎక్కించి జయ జయ ధ్వనులతో కరతాళధ్వనులు చేస్తూ అనేకమంది వెంటరాగా వైకుంఠలోకమునకు బయలుదేరెను. 

తదాతద్గమనెశీలా దృష్ట్వాతన్నిరయాలయం
విష్ణుదూతానువాచేదం విస్మితేనాంతరాత్మనా!!
తిష్ఠంతునిమిషం దేవా నరకేతునిపాతితాః
అత్రాంధకూపెపతితః పతిర్మెమృతిమాగతః
త్రిభిస్స్వయంనిపత్యాధో వదధ్వంమమవైష్ణవాః!!
తా: ఆమె వైకుంఠమునకు పోవు దారిలో మధ్యమార్గమున నరకమును చూసి ఆశ్చర్యమొంది విష్ణుదూతలతో ఇట్లు పలికెను, ఓ విష్ణు దూతలారా! నిమిషమాత్రము ఆగండి, ఈ నరకకూపమందు నాభర్తతో ముగ్గురితో పడియుండుటకు కారణమేమీ? అని అడిగెను.

*విష్ణుదూతాఊచుః :*
పతిస్తవాయం తే మూఢః పరేషాందాసకర్మభిః
చచారచోరవృత్తించ పరవిత్తైకజీవనః!!
వేదమార్గం పరిత్యజ్య దుష్టమార్గేవ్యవస్థితః
తేనకర్మవిపాకేన నిరయం యాతిమంగళే!!
తా: అప్పుడు విష్ణుదూతలు ’ ఓ మంగళా! వీడు నీ భర్త వీడు కూలిచేసి, దొంగతనము చేసి పరధనాపహరణమును చేయుచుండెడివాడు, వేదోక్తమైన ఆచారమును వదిలి దుర్మార్గము చేయుచుండెడివాడు అందువల్ల వీడు నరకమందున్నాడు.’ అని చెప్పెను 

ద్వితీయోయంద్విజన్సుభ్రు మిత్రఘ్నశ్చాతిపాతకః
బాల్యాదారభ్యతన్మిత్రం ప్రాణాదవ్యధికంశుభె
తంహత్వాదద్ధరం హృత్వా దేశాంతరముపాగమత్!
పతిస్తవాశుభాచార స్తద్ధసంస్వయమాహరత్
మార్గేమధ్యాహ్నసమయె కాననేకమలేక్షణే!
తౌహత్వాలుబ్ధక స్తత్ర సోపివ్యాఘ్రేణదంశితః
శార్దూలమపినాభూయోమృతౌతౌ వ్యాఘ్రలుబ్ధకౌ!
నిరయాలయవాసీచ లుబ్ధకోబ్రహ్మహత్యయా
వ్యాఘ్రోయంచ పురాపాపీ బ్రాహ్మణోద్రావిడశ్శుచిః!
ద్వాదశ్యాంతైలభోక్తాసీద్భక్ష్యభక్ష్యవివర్జితః
తేనకర్మవిపాకేన నిరయాలయమాశ్రితమ్!!
తా: ఈ రెండవ బ్రాహ్మణుడు మిత్రద్రోహి, మహాపాతకుడు, ఇతని బాల్యమునుంచి మిత్రుడై యున్నవాని నొకనిని చంపి వాని ధనమును అపహరించి ఇతరదేశమునకు పోవుచుండగా ఈ భర్త చేత హతుడయ్యెను, అట్టి పాపాత్ముడు గనుక ఇతను నరకమందున్నాడు. ఈ మూడవవాడు కిరాతుడు, నీభర్తను ఈ బ్రాహ్మణుని ఈ యిద్దరిని చంపినాడు అందుచేత వీడు నరకమునున్నాడు. ఈ పులి పుర్వజన్మమున ద్రావిడ బ్రాహ్మణుడు యితను ద్వాదశినాడు ఏది తినదగినది ఏది కూడదు అనే విచారణ చేయక నూనెను భుజించినాడు అందుచేత వీడు నరకమునందున్నాడు.

తైరేవముదితాతన్వీ పునస్తానాహభూపతే
కేనపుణ్యేన తేషాంతు కథం ముక్తిర్భవిష్యతి!!
తా: విష్ణుదేవతలు చెప్పిన మాటలు విని ఆమె వారిని " అయ్యా వీరు ఏ పుణ్యం చేత వీరు నరకమునుంచి విముక్తులయ్యెదరు " అని అడిగెను. 

తఊచురిత్థం రాజేంద్ర కార్తికేచరితంత్వయా
ఫలందదన్వపౌరాణశ్రవణస్యశుభాననే
పత్యుఃకార్తికమాసస్య తేనముక్తిర్భవిష్యతి
తత్పురాణస్యయద్వర్తిం తత్పాత్రేయత్సమర్పితం
మృగలుబ్ధకయోస్సామ్యం ధర్మం దేహిశుభాననే
మిత్రఘ్నస్యాపుదుర్బుద్ధెః ద్వైజస్యకుటిలాలకే
యదాహూతం జనానాంచ పురాణశ్రవణోత్సుకా
తత్ఫలం దేహివిప్రస్య కృతఘ్నస్యశుభేక్షణే
తేనతేనప్రభావేన ముక్తింయాంతి నసంశయః!!
తా: ఆ మాటవిని విష్ణు పార్శ్వదులు అమ్మా కార్తీకమాసమందు నీచేత చేయబడిన పుణ్యమందు పురాణశ్రవణఫలము నీ భర్తకు ధారపోయుము, దానితో వాడు ముక్తుడగురు, ఆపురాణశ్రవణార్థమై దీపమునకు నీవు వత్తి  సమర్పించిన పుణ్యమును ఈ కిరాతుడు పులుకు ధారపోయుము దానితో వారు ముక్తులగుదురు. ఆపురాణ శ్రవణార్థమై నీవు ప్రతి ఇంటికి వెళ్ళి జనులను పిలిచి పురాణమును వినిపించిన పుణ్యమును ఈ కృతఘ్నుడగు బ్రాహ్మణునకిమ్ము వాడూ ముక్తుడగును అని చెప్పిరి.

ఇతితేషాంవచశ్శ్రుత్వా విస్మయాకులితేక్షణా
దత్తందత్తంచ యారాజన్ దానంయన్ముక్తికారణం
తదాతేనారకాన్ముక్తా విమానమధిరుహ్యచ
యయుర్విష్ణుపదంసర్వే శసంతప్తాం నరాధిప
శనైసైజ్ఞానగమ్యస్య ముక్తింయాంతి పరంపదం!!

తా: విష్ణుదూతల మాటలు విని ఆశ్చర్యమును పొందినదై ఆ సుశీల ఆయా పుణ్యములను వారికి ధారపోసెను. దాని చేత వారు నరక బాధా విముక్తులై దివ్యవిమానమునెక్కి ఆ సుశీలను కీర్తిస్తూ మహా జ్ఞానులు పొందెడి ముక్తిపదమును పొందిరి.
 
తస్మాత్కార్తికమాసేతు పురాణశ్రవణంయది
కురుతె రాజశార్దూల సయాతిహరిమందిరమ్!!
యైదందివ్యమాఖ్యానం శ్రుణోతిశ్రద్ధయానివతః
కర్మత్రయార్జితం పాపం తత్క్షణాదేవనశ్యతి!!

తా: కాబట్టి, కార్తీకమాసమందు పురాణశ్రవణము చేయువాడు హరిలోకమును పొందును. ఈ ఆఖ్యానాన్ని వినువారు మనోవాక్కాయములచేత సంపాదించబడిన పాపమును నశింపజేసుకొని మోక్షమును పొందెదరు.

ఇతి శ్రీ స్కాందపురాణే కార్తికమహాత్మ్యే ఏకాదశోధ్యాయస్సమాప్త
ఇది స్కాందపురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమనెడు కార్తీక పురాణమందలి పదకొండవ అధ్యాయము సమాప్తము.

Wednesday, November 25, 2020

కార్తీక పురాణము పదవ అధ్యాయం

అథ శ్రీ స్కాందపురాణే కార్తికమహాత్మ్యే దశమోధ్యాయః
శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణం పదవ అధ్యాయం

జనక ఉవాచ:-
కోసావజామిళఃపూర్వం దుష్కృతం కేనసంచితం
కథం తూష్ణీంగతాయామ్యాః కిమూచుస్స్వామి తంవద!!

తా: జనకుడు తిరిగి అడుగనారంభించెను. ఓ మునీశ్వరా! ఈ అజామీళుదూ పూర్వమెవ్వడు? యితడేమి పాపము మూటగట్టుకొనెన్, విష్ణుదూతలు చెప్పిన మాటలను విని, యమభటులు ఎందుకు యూరకున్నారు. యముని వద్దకు వెళ్ళి యేమని చెప్పిరి అంతా సవివరముగా తెల్పుము.


వసిష్ఠ ఉవాచ:-
ఏవంప్రచోదితాయామ్యా దృతంగ త్వాయమాంతికం
యమరాజాయతత్సర్వమాచచక్షురరిందమ!!
పాపిష్ఠంచదురాచారం నిందితం కర్మ చాశ్రితం
తంవిష్ణుదూతావైజగ్ముర్వైకుంఠం విష్ణుమందిరం!!
వయంతత్కార్యకరణాశ్శక్తిహీనాః పునః పునః
తచ్ఛృత్వాకోపతామ్రాక్షః జ్ఞానచక్షుర్దదర్శనః!!
మ్రియమాణస్యదుర్బుద్ధేర్విష్ణునామప్రభావతః
విష్ణుదూతాస్తమాదాయ యయుర్వైకుంఠమందిరం!!
హరినామామృతంచై వ మృతికాలేహ్యజామిళః
ససర్వపాపనిర్ముక్తో విష్ణులోకంగతోఽధునా!!
హరిర్హరతిపాపాని దుష్టచిత్తైరపిస్మృతః
అనిచ్ఛయాపిసంస్పృష్టో దహత్యేవహిపావకః!!
యస్స్మరేద్భక్తిభావేన నారాయణమనామయం
జీవన్ముక్తస్సవిజ్ఞేయః పశ్చాత్త్కైవల్యమశ్నుతె!!
ఇత్యాలోచ్యయతస్తూష్ణీ మాసీద్వైవస్వతోయమః

తా: వసిష్ఠుడు ఇలా చెప్పసాగెను " యమదూతలు, విష్ణుదూతల మాటలువిని వెంటనే యమిని వద్ధకు వెళ్ళి మొత్తం వృత్తాంతమును యమునితో , ’అయ్యా పాపాత్ముడు, దురాచారుడు నిందిత కర్మలు చేయువాడైన అజామిళుని మాతో తెచ్చుటకు వెళ్ళినంతలో విష్ణుదూతలు వచ్చి మమ్మల్ని ధిక్కరించి అతనిని విడిపించుకొని పోయిరి, మేము వారిని ఎదిరంచడానికి అశక్తులమైనాము’ అని చెప్పగా. యముడు కోపించి ఏమిజరిగిందోనని తన జ్ఞాన దృష్టితో చూసి అజామిలుడు దుర్మార్గుడైనను అంతకాలమున హరినామస్మరణము వలన పాపములను నశింపజేసికొని వైకుంఠప్రియుడయ్యెను, అందువలన అతనిని విష్ణుదూతలు స్వీకరించిరి. దుష్టాత్ములైనను మహిమ తెలుసుకొనక హరినామ స్మరణ చేసిన చాలు పాపములు నశించును, కాలవలెనని ఇచ్చలేకున్నా అగ్నిని తాకినప్పుడు అగ్ని కాల్చకమానదు కదా. భక్తితో నారాయణ స్మరణ చేయువాడు జీవన్ముక్తుడై అంతమునందు మోక్షమును పొందును అని యముడు విచారణ చేసి మిన్నకుండెను.

అసావజామిళః పూర్వం విప్రస్సౌరాష్ట్రకేనృప!!
శివాగారార్చకోనిత్యం శివద్రవ్యాపహారకః
అస్త్రపాణిర్దురాచార స్స్నాన హీనో తథాఽశుచిః!!
నమంత్రోనవిధిశ్శంభు మర్చయత్యస్య మానసః
మృడస్యాభిముఖేపాదౌ ప్రసార్యాస్తసదుర్మదః!!
వయస్యైరన్వితో రాజన్ బహుభాషీదురాగ్రహః
రూప యౌవనసంపన్నో నానాలంకారభూషితః!!
తత్రకాచిద్ద్విజసతీ సురూపాప్రాప్తయైవనా
పతిస్తస్యాహిదుఃఖేన దారిద్ర్యేణాతిపీడితః!!
అన్యాన్నంచైవ మాకాంక్షన్ పర్యటన్ పట్టనాదిషు
ఘోషగ్రామాదిసర్వేషు యాచనావృత్తిమాశ్రితః!!

తా: ఈ అజామీళుడు పూర్వమున సౌరాష్ట్రదేశమందు బ్రాహ్మణుడై శివార్చకుడై శివద్రవ్యమును హరించుచు స్నానసంధ్యలను వీడి అన్య మనస్కుడై శ్రద్ధలేకుండా శివుని పూజించెడివాడు. శివునకభిముఖముగా కాళ్ళు చాపుకుని ఉండెడివాడు, మంచియవ్వనంతో ఉండి ఆయుధాలు చేత్తో ధరించి స్నేహితులతో కూడి నానాలంకారములు చేసుకుని ఇష్టం వచ్చినట్లు తిరిగుతూ వాచాలత్వముతో తిరిగెడివాడు. ఆ వూరిలో ఒక బ్రాహ్మణుడుండెను అతనికొకరూపవతి, యౌవనవతి ఐన భార్యకలదు, ఆబ్రాహ్మణుడు కఠిన దారిద్ర్యంచే బాధపడుతూ అన్నముకొరకు పట్టణములు గ్రామములు తిరుగుతూ యాచించుచుండెడివాడు.

కదాచిత్క్షుధయాత్రసోభారవాహోగృహంగతః
ఉవాచ భార్యాంశీఘ్రేణ కురుపాకంతుమంగళే!!
బాధతెమాంక్షుధాశుభ్రు తచ్ఛాంతింకురువారిణా
ఇతితస్యవచశ్శ్రుత్వా చుళీకృత్యాతిదుర్మదా!!
కించిన్నో వాచతం విప్రం గృహకర్మరతాశనైః
చిత్తంవిటజనేసమ్య గాధాయాతీవదుర్మదా!!

తా: ఒకానొకనాడు బ్రాహ్మణుడు సంపాదించిన ధాన్యాదికమును తలమీద ఉంచుకొని ఆకలితో ఇంటికి వచ్చి భార్యతో ’ఓయీ, నాకు బాగా ఆకలిగా ఉంది త్వరగా వంటచేయుము, ముందు మంచినీళ్ళు ఇవ్వు అవి తాగి కొంచెము శాంతించెదను’ అని ఇట్లు భర్త ఎన్నిమాట్లుఅడిగినా ఆ దుర్మద ఐన భార్య అతని మాటలు లెక్కచేయక పనులు చేయుచు జారుని మనసులో ధ్యానించుచుండెను

తాంకర్కశాంతదాదృష్ట్వా యష్టిమాదాయతాడయన్
సాపునః మతిమావిశ్య దృఢంముష్ట్యాహనత్పునః!!
తేనస్వభవనంహిత్వాయయౌగ్రామాంతరంద్విజః
భిక్షాన్నభోజనంకృత్వా చింతయన్మనసానృప!!
సాసాయమశనంకృత్వా హ్యలంకృత్వాసువాససా
తతస్తాంబూలమాదాయ రజకాలయమాగమత్!!
రజకం రూపసంపన్నం రహస్యోవాచసానిశి
కిమత్రాగమనంమూఢే గృహేస్మిన్ కారణం వినా
బ్రాహ్మణీబ్రహ్మకులజా కర్మణానిందితావయం!!
ఏవంవివాదమానౌతు దృష్ట్వాతద్ధర్మచారిణం
కోపరక్తాంతనాసంచ సంరక్తాంబరలోచనం!!
గృహీత్వాముసలం శీఘ్రం తాడయామాసకౌశలాత్
స్నానమాసతయాతంచహిత్వా రాజవథంగతా!!
తత్రేమం దేవలం గుత్వా తస్యసాఫాణిమగ్రహీత్
పశ్చాదాగత్యవేదేన తేవసావ్యరమన్నిశి!!
రాత్రిశేషం తతోనీత్వా బ్రాహ్మణీవ్యభిచారిణీ
పశ్చాత్తావం గతారాజన్ ప్రభాతేపతిమాగమత్!!
పతింసంబోధయా మాస వాక్యైస్సాధుకృపాదయైః
తయాసవాగృహంభూయో గత్వావాత్సీద్యథాసుఖం!!

తా: అంత భర్తకోపించి దండముతో భార్యను కొట్టెను భార్య భర్తను ముష్టితో గుద్దెను. తరవాత భర్త గృహమును విడిచి బైటకుబోయి భిక్షమెత్తుకుని జీవించుచుచు భార్యసంగతిని గూర్చి చింతిచుచుండెను. కానీ, ఈతని భార్య సుఖముగా నుండి రాత్రిభుజించి మంచి చీరె ధరించి తాంబూలము వేసుకొని ఒక రజకుని గురించి ఆలోచించి అతని యింటికి బోయెను.  సుందరుడైన సౌష్టవ పరుడైన ఆ రజకుని చూసి తనతో ఆరాత్రి సంభోగించమనెను, ధర్మాత్ముడైన ఆ రజకుడు ఆమాటలు విని ఓ తల్లీ! నీవు బ్రాహ్మణ స్త్రీవి,  ఇలా అర్థరాత్రివేళ మాయింటికి మీరురావచ్చా? బ్రాహ్మణ వర్ణమునందు పుట్టిన మీకు మాతో సంపర్కము కోరుట తగునా! అని ప్రశ్నించెను, ఆ విధముగా వారిద్దరూ వివాదపడుతుండగా ఆ రజకుడు ఆమెను రోకలితో కొట్టెను, ఆ స్త్రీగూడ అతనిని కొట్టి వానిని విడిచి రాజమార్గమున వెడలెను, అప్పుడు ఇంతకు ముందు చెప్పిన తిరుగుబోతైన శివారాధకుని చూచెను, అంతలో ఆ స్త్రీ వాని పట్టుకుని రతికేళికి పిలిచి వానితో కూడి రాత్రియంతయు వానితో కామకేళి జరిపి తెల్లవారగనే జరిగినవంతయూ తలచి పశ్చాత్తాపమును బొంది భర్తవద్దకు చేరి బ్రతిమాలి వానికూడి సౌఖ్యముగానుండెను.

ఏవమంతరితెకాలే శివాగారార్చకోనృప
గతాసురభవద్రార్జనిరయేయాతనామయే!!
భుక్వాతత్రక్రమాత్పాపం రౌరవాదిషుభూపతే
నపునర్భువమభ్యేత్య సత్యనిష్ఠసుతోభవన్!!
కార్తికేకృత్తికాయోగే సకుర్యాత్స్వామిదర్శనం
సప్తజన్మగతంపాపం హంతిహ్యేతద్ధ్విజన్మనః
పశ్చాద్భూమింగతో రాజన్ భగవన్నామకీర్తనాత్!!

తా: ఆపిమ్మట, కొంతకాలమునకు శివార్చకుడు మృతినొంది యమసదనము చేరి క్రమముగా రౌరవాది నరకదుఃఖములననుభవించి తిరిగి భూమియంది సత్యనిష్ఠుని కొడుకైన అజామిళునిగా జన్మించెను. ఇతనికి కార్తీక పౌర్ణమినాడు శివదర్శనము లభించినది, అంతకాలమున హరినామస్మరణ కలిగినది, ఆ కారణముచేత సప్తజన్మార్జిత పాపజాలములు నశించి మోక్షమును బొందెను.


ఏషావిప్రసతీపాపా కాలధర్మాత్ క్షయం గతా
నరకేయాత నాంభుక్త్వా పునర్భూమిముపాగతా!!
చండాలయోనౌసంజాతా కన్యాకుబ్జేనరేశ్వర
చండాలః కాలశుద్ధ్యర్థం గత్వావిప్రమపృచ్చత!!
సజగాదాంత్యజం రాజన్ పితృగండం భవిష్యతి
శ్రుత్వేత్థంత్వరితో భాగ్యాచ్ఛిశుంనిష్కాస్యదూరతః!!
రాజన్ తత్రద్విజః కశ్చిత్పుత్రహీనోదదర్శతం
శిశుంబాల్యేత్యనాధత్వాద్రోదమానం సమగ్రహీత్!!
దత్వోపమాతృహస్తేచ శూద్ర్యాసమ్యక్ప్రపోషితః
వృద్ధింగతాయాస్త ద్దాస్యావిప్రోయమభవత్పతిః!!

తా: ఆ బ్రాహ్మణికూడా కొంతకాలమునకు మృతిచెంది నరకలోకములందు అనేక యాతనలను పొంది తిరిగి భూమియందు కన్యాకుబ్జమున ఛండాలునకు పుత్రికగా జన్మించెను. ఇది పుట్టిన కాలము మంచిదాయని ఆ ఛండాలుడొకబ్రాహ్మణునడుగగా తండ్రి గండమున పుట్టినదని తెలిసి, ఆ ఛండాలుడా పుత్రికను తీసుకొని పోయి అడవినందుంచెను. అటుగా పోవుచున్న బ్రాహ్మణుడంతలో రోదించుచున్న ఆశిశువును తీసుకొనిపోయి తన యింట్లో దాసీగా ఉన్న స్త్రీకి అప్పగించెను. ఆదాసి ఈమెను పెంచినది, తరవాత ఈమెను అజామీళుడు కూడెను, తరవాత కథ ఇతఃపూర్వం చెప్పినదే.

ఏతత్తేకథితం సర్వం రాజన్ జన్మాంతరార్జితం
యానిపాపాని రాజేంద్ర జన్మాంతరకృతానివై!!
ప్రాయశ్చిత్తాన్యశేషాణి విష్ణుధ్యానం వినానృప
జిహ్వానవక్తియది మాధవనామథేయం చేతశ్చ!!
నస్మరతిమాధవపాదపద్మం శ్రోత్రంకథాంనచశ్రుణోతి
హరేర్నరేంద్రపాపాని తస్యవిలయంతుకధంప్రయాంతి!!
అనన్యచేతాస్సతతం యేస్మరంతిజనార్దనం
లభంతే తేననిర్వాణం నాత్రకార్యావిచారణా!!
తస్మాద్గురుంవాలేశంవా నిహనిష్యతిపాతకం
కార్తికేమాసియత్ప్రోక్తం ధర్మం సూక్ష్మతయానఘ!!
పాపానాందహనెశక్తిరస్తిరాజన్నసంశయం
తస్మాత్కార్తికమాసేతు యోధర్మంనసమాచరేత్
సయాతి నరకం రాజన్ నాత్రకార్యావిచారణా!!

తా: రాజోత్తమా! ఇది నీవడిగిన ప్రశ్నకు సమాధానము, అజామిళుని పూర్వ వృత్తాంతము, పాపములకు ప్రాయశ్చిత్తములు చెయుట హరినామ కీర్తనము వినా గావించిన ఇతర ప్రాయశ్చిత్తములతో ఫలితములుగావు, అనగా పాపప్రాయశ్చిత్తకర్మలు చేసినను హరికీర్తనముచేయుచూ భక్తితో చేయవలెనని అర్థము. ఎవరినాలుక హరినామ సంకీర్తనము చేయదో, మనస్సు హరిపాదపద్మములు స్మరించవో, చెవులు హరిచరిత్రములు వినవో, వాని పాపములు ఎట్లు నశించును? నశించవు! యితర చింతనము మాని హరిని స్మరించు వారు ముక్తినొందెదరు, ఇందుకు సందేహమేలేదు. కాబట్టి కార్తీకమాసమందు ఆచరించెడి ధర్మము సూక్ష్మమైననూ అది పెద్దదైననూ, చిన్నదైననూ పాతకములను నశింపజేయును


ఇదం యం పుణ్యమాఖ్యానం శ్రుణోత్యఘవినాశన
ససర్వపాపనిర్ముక్తో యాతివైకుంఠమందిరమ్!!
య ఇదం పుణ్యమాఖ్యానం శ్రావయేద్వాసమాహితః
తేన పాపానినశ్యంతి విష్ణునాసహమోదతే!!

తా: పాపములను నశింపజేసెడి ఈ కథను విన్నవారు సమస్త పాతక్ములను నశింపజేసి మోక్షమొందెదరు. ఈ కథను వినిపించువారు పాపముక్తుడై వైకుంఠమందు విష్ణువుతో సుఖించును.

ఇతి శ్రీ స్కాందపురాణే కార్తీకమాహాత్మ్యే దశమోధ్యాహస్సమాప్తః
ఇది స్కాందపురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమనెడు కార్తీక పురాణమందలి పదవ అధ్యాయము సమాప్తము

శ్రీ రామరక్షా స్తోత్రం

ఓం అస్య శ్రీ రామరక్షా స్తోత్రమంత్రస్య బుధకౌశిక ఋషిః
శ్రీ సీతారామ చంద్రోదేవతా
అనుష్టుప్ ఛందః
సీతా శక్తిః
శ్రీమాన్ హనుమాన్ కీలకం
శ్రీరామచంద్ర ప్రీత్యర్థే రామరక్షా స్తోత్రజపే వినియోగః

ధ్యానమ్
ధ్యాయేదాజానుబాహుం ధృతశర ధనుషం బద్ధ పద్మాసనస్థం
పీతం వాసోవసానం నవకమల దళస్పర్థి నేత్రం ప్రసన్నమ్
వామాంకారూఢ సీతాముఖ కమల మిలల్లోచనం నీరదాభం
నానాలంకార దీప్తం దధతమురు జటామండలం రామచంద్రమ్

స్తోత్రమ్
చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరమ్
ఏకైకమక్షరం పుంసాం మహాపాతక నాశనమ్

ధ్యాత్వా నీలోత్పల శ్యామం రామం రాజీవలోచనమ్
జానకీ లక్ష్మణోపేతం జటాముకుట మండితమ్

సాసితూణ ధనుర్బాణ పాణిం నక్తం చరాంతకమ్
స్వలీలయా జగత్రాతు మావిర్భూతమజం విభుమ్

రామరక్షాం పఠేత్ప్రాజ్ఞః పాపఘ్నీం సర్వకామదామ్
శిరో మే రాఘవః పాతుఫాలం దశరథాత్మజః

కౌసల్యేయో దృశౌపాతు విశ్వామిత్ర ప్రియః శృతీ
ఘ్రాణం పాతు మఖత్రాతా ముఖం సౌమిత్రివత్సలః

జిహ్వాం విద్యానిధిః పాతు కంఠం భరత వందితః
స్కంధౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నేశకార్ముకః

కరౌ సీతాపతిః పాతు హృదయం జామదగ్న్యజిత్
మధ్యం పాతు ఖరధ్వంసీ నాభిం జాంబవదాశ్రయః

సుగ్రీవేశః కటీపాతు సక్థినీ హనుమత్-ప్రభుః
ఊరూ రఘూత్తమః పాతు రక్షకుల వినాశకృత్

జానునీ సేతుకృత్ పాతు జంఘే దశముఖాంతకః
పాదౌవిభీషణ శ్రీదఃపాతు రామోఽఖిలం వపుః

ఏతాం రామబలోపేతాం రక్షాం యః సుకృతీ పఠేత్
సచిరాయుః సుఖీ పుత్రీ విజయీ వినయీ భవేత్

పాతాళ భూతల వ్యోమ చారిణశ్-చద్మ చారిణః
న ద్రష్టుమపి శక్తాస్తే రక్షితం రామనామభిః

రామేతి రామభద్రేతి రామచంద్రేతి వాస్మరన్
నరో నలిప్యతే పాపైర్భుక్తిం ముక్తిం చ విందతి

జగజ్జైత్రైక మంత్రేణ రామనామ్నాభి రక్షితమ్
యః కంఠే ధారయేత్తస్య కరస్థాః సర్వ సిద్ధయః

వజ్రపంజర నామేదం యో రామకవచం స్మరేత్
అవ్యాహతాజ్ఞః సర్వత్ర లభతే జయ మంగళమ్

ఆదిష్టవాన్ యథాస్వప్నే రామ రక్షా మిమాం హరః
తథా లిఖితవాన్ ప్రాతః ప్రబుద్ధౌ బుధకౌశికః

ఆరామః కల్పవృక్షాణాం విరామః సకలాపదామ్
అభిరామ స్త్రిలోకానాం రామః శ్రీమాన్సనః ప్రభుః

తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ
పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణా జినాంబరౌ

ఫలమూలాసినౌ దాంతౌ తాపసౌ బ్రహ్మచారిణౌ
పుత్రౌ దశరథస్యైతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ

శరణ్యౌ సర్వసత్వానాం శ్రేష్టా సర్వ ధనుష్మతాం
రక్షఃకుల నిహంతారౌ త్రాయేతాం నో రఘూత్తమౌ

ఆత్త సజ్య ధనుషా విషుస్పృశా వక్షయాశుగ నిషంగ సంగినౌ
రక్షణాయ మమ రామలక్షణావగ్రతః పథిసదైవ గచ్ఛతాం

సన్నద్ధః కవచీ ఖడ్గీ చాపబాణధరో యువా
గచ్ఛన్ మనోరథాన్నశ్చ రామః పాతు స లక్ష్మణః

రామో దాశరథి శ్శూరో లక్ష్మణానుచరో బలీ
కాకుత్సః పురుషః పూర్ణః కౌసల్యేయో రఘూత్తమః

వేదాంత వేద్యో యజ్ఞేశః పురాణ పురుషోత్తమః
జానకీవల్లభః శ్రీమానప్రమేయ పరాక్రమః

ఇత్యేతాని జపేన్నిత్యం మద్భక్తః శ్రద్ధయాన్వితః
అశ్వమేథాధికం పుణ్యం సంప్రాప్నోతి నసంశయః

రామం దూర్వాదళ శ్యామం పద్మాక్షం పీతావాససం
స్తువంతి నాభిర్-దివ్యైర్-నతే సంసారిణో నరాః

రామం లక్ష్మణ పూర్వజం రఘువరం సీతాపతిం సుందరం
కాకుత్సం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికం

రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలం శాంతమూర్తిం
వందేలోకాభిరామం రఘుకుల తిలకం రాఘవం రావణారిమ్

రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేథసే
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః

శ్రీరామ రామ రఘునందన రామ రామ
శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ
శ్రీరామ రామ రణకర్కశ రామ రామ
శ్రీరామ రామ శరణం భవ రామ రామ

శ్రీరామ చంద్ర చరణౌ మనసా స్మరామి
శ్రీరామ చంద్ర చరణౌ వచసా గృహ్ణామి
శ్రీరామ చంద్ర చరణౌ శిరసా నమామి
శ్రీరామ చంద్ర చరణౌ శరణం ప్రపద్యే

మాతారామో మత్-పితా రామచంద్రః
స్వామీ రామో మత్-సఖా రామచంద్రః
సర్వస్వం మే రామచంద్రో దయాళుః
నాన్యం జానే నైవ న జానే

దక్షిణేలక్ష్మణో యస్య వామే చ జనకాత్మజా
పురతోమారుతిర్-యస్య తం వందే రఘువందనమ్

లోకాభిరామం రణరంగధీరం
రాజీవనేత్రం రఘువంశనాథం
కారుణ్యరూపం కరుణాకరం తం
శ్రీరామచంద్రం శరణ్యం ప్రపద్యే

మనోజవం మారుత తుల్య వేగం
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం
వాతాత్మజం వానరయూధ ముఖ్యం
శ్రీరామదూతం శరణం ప్రపద్యే

కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం
ఆరుహ్యకవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్

ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహం

భర్జనం భవబీజానామర్జనం సుఖసంపదాం
తర్జనం యమదూతానాం రామ రామేతి గర్జనమ్

రామో రాజమణిః సదా విజయతే రామం రమేశం భజే
రామేణాభిహతా నిశాచరచమూ రామాయ తస్మై నమః
రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య దాసోస్మ్యహం
రామే చిత్తలయః సదా భవతు మే భో రామ మాముద్ధర

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే

ఇతి శ్రీబుధకౌశికముని విరచితం శ్రీరామ రక్షాస్తోత్రం సంపూర్ణం

శ్రీరామ జయరామ జయజయరామ

Tuesday, November 24, 2020

కార్తీక పురాణం తొమ్మిదవ అధ్యాయం

అథ శ్రీ స్కాందపురాణే కార్తికమహాత్మ్యే నవమోధ్యాయః
శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణం తొమ్మిదవ అధ్యాయం

విష్ణుదూతా ఊచుః
భవతాంస్వామినాకింకిం వదథ్వంకధితంయతః
కోర్హోత్రయమదండస్య కేధర్మాఃపుణ్యాపాపకాః!!
నూన మస్మాకమగ్రేతు బౄతసర్వంయమానుగాః
ఇతితైరుదితం శ్రుత్వా ఊచుస్తెయమకింకరాః!!
తా ! విష్ణుదూతలు ఇట్లు పలికిరి. " ఓ యమదూతలారా! మీ ప్రభువు మీతో చెప్పిన మాటలేమిటి మీయమదండనకు ఎవ్వడుతగినవాడు? పుణ్యులనగా ఎవరు? పాతకములనగా ఏమిటి? ఈ విషయాలన్నిటినీ సవిస్తారంగా మాకు చెప్పండి" అనగా యమదూతలు ఇలా చెప్తున్నారు.

*యమదూతా ఊచుః*
శ్రుణుధ్వమవధానేన విష్ణుదూతాస్సునిర్మలాః
*పతంగఃపావకోవాయుర్వ్యోమగావోనిశాపతిః!!*
*సంధ్యాహనీదిశఃకాల ఇతిదేహస్యసాక్షిణః*
ఏతైరధర్మోవిజ్ఞాతస్సనోదండస్యయుజ్యతె!!
తా !  "ఓ విష్ణుదూతలారా! సావధానంగా వినండి. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, ఆకాశము, గోవులు, సంధ్యలు, పగలు, దిక్కులు, కాలము, ఇవి మనిషి పుణ్యపాపములకు సాక్షులు, మేమి వీరి సాక్ష్యాన్ని విచారించి పాపం చేసిన వారిని దండిస్తాం.


*స్వవేదమార్గరహితః శ్రుతిస్మృత్యాదిదూషకః*
*నిందితస్సాధువృత్తానాం సమేదండ్యోనసంశయః!!*
తా !  వేదమార్గాన్ని వదలి ఇచ్ఛాను సారంగా తిరిగుతూ, వేదశాస్త్రాలను దూషిస్తూ సాధుబహిష్కృతుడైన వారిని మేము దండిస్తాము.

*విప్రంచగురుమస్వస్థం పాదాద్యైర్యదితాడయేత్*
*యోమాతాపితరౌద్ద్వేష్టి సదండ్యోనాత్రసంశయః!!*
తా !  బ్రాహ్మణుని, గురువును, రోగిని పాదములచేత తన్నేవారు, తల్లిదండ్రులతో కలహించేవారు అయినవారిని మేము దండిస్తాము.

యోనిత్యమనృతంవక్తి ప్రాణిహింసాపరాయణః
కులాచారపరిభ్రష్టస్సయాతియమమందిరం!!
తా !  నిత్యమూ అబద్ధమాడుతూ జంతువులను చంపుతూ కులాచారము వదిలిన వారిని మేము దండిస్తాము.

దత్తాపహారకోదంభో దయాశాంతివివర్జితః
యంపాపకర్మనిరతస్సయాతిమయమందిరమ్!!
తా !  ఇచ్చిన సొమ్మును తిరిగి తీసుకున్నవారిని, డాంబికులను, దయాశాంతులు లేని వారిని, పాపాత్ములను మేము దండిస్తాము.

పరదారాభిగమనం సభుం కైయమయాతనామ్
యస్సాక్షికంవదేద్ద్రవ్య లోభేనాత్యంతదుష్టధీః!!
తా !  పరుని భార్యతీ క్రీడించువానిని ద్రవ్యమును గ్రహించి సాక్ష్యమును చెప్పేవారిని మేము దండిస్తాము

అహంతుదాససూరేతి సభుంక్తెయమయాతనాం
*మిత్రద్రోహీకృతఘ్నశ్చ సభుంక్తెయమయాతనాం!!*
తా !  నేను దాతనని చెప్పుకొను వారిని, మిత్రద్రోహిని, ఉపకారమును మరచిన వారినీ, అపకారమును చేయువారినీ, మేము దండిస్తాము.

వివాహవిఘ్నంయఃకుర్వాత్సభుంక్తెయమశాసనం
యోవాపరేషామైశ్వర్యం దృష్ట్వానూయేతదుష్టధీః!!
తా !  వివాహమును చెరిపే వారినీ, ఇతరుల సంపదను చూసి అసహ్యపడువారినీ మేము దండిస్తాము.

పరేషామర్భక్తానాంచ సగచ్ఛేద్యమయాతనాం
కన్యాద్రవ్యేణయోజీవేత్తథావార్థుషి కేనచః!!
తా !  పరుల సంతానమును చూసి దుఃఖించేవారిని, కన్యాశుల్కములచేత జీవించే వారిని వడ్డీతో జీవించువారిని మేము దండిస్తాము.

తటాకకూపకుల్యానాం విఘ్నమాచరతేచయః
తథాన్యవిఘ్నకర్తాచ పాతకీచనసంశయః!!
తా !  చెరువును, నూతిని, స్వల్పకాలువలను నిర్మించడాన్ని మాన్పించేవారిని, నిర్మితములైన వాటిని చెరచువారిని మేము దండిస్తాము.

యఃపితౄన్నసముద్దిశ్య శ్రాద్ధం మోహేనవానరః
నిత్యకర్మపరిత్యాగీ సభుంక్తెయమశాసనం!!
తా !  మోహముచేత మాతాపితరుల శ్రాద్ధమును విడిచినవారిని నిత్యకర్మను వదిలిన వారిని మేము దండిస్తాము.

పరపాకపరిత్యాగీ పరపాకరతస్తథా
పితృశేషాన్నభోక్తాచ సభుంక్తెయమయాతనామ్!!
తా !  తాను వండిన అన్నములో ఇతరులకు ఇంతపిసరు కూడా పెట్టక తినేవాణ్ణి, ఎల్లప్పుడూ పరుల అన్నమును మాత్రమే తినేవాణ్ణి, పితృకర్మలయందు భోక్తలు తినివదిలిన ఎంగిలి భుజించువారిని, దండింతుము.

సదదస్వేతియోబౄయా న్నదద్యాద్బ్రాహ్మణేషుచ
శరణాగతహంతాచ సభుంక్తెయమయాతనామ్!!
తా !  ఇతరులు దానము చేస్తుండగా ఆ సమయంలో అడ్డుపడేవారిని, యాచించిన బ్రాహ్మణులకివ్వని వానిని తన శరణుజొచ్చిన వానిని చంపేవానిని మేము దండింతుము.

స్నానసంధ్యాపరిత్యాగీ నిత్యంబ్రాహ్మణనిందకః
బ్రహ్మఘ్నశ్చాశ్వగోఘ్నశ్చ సయాతియమమందిరం!!
తా !  స్నాన, సంధ్యావందనాలను విడిచినవానిని, నిత్య బ్రాహ్మణనింద చేసేవాణ్ణి, బ్రాహ్మణహంతకుణ్ణి, అశ్వ హంతకుణ్ణి, గోహత్య చేసినవాణ్ణి దండింతుము.

ఏవమాదీని పాపాని యమేనోక్తానివైష్ణవాః
యేకుర్వంతియమేలోకె తేన్వభూయంతి యాతనామ్!!
తా !  ఇలా మొదలుగాగల పాతకములను చేయు మనుషులు మా యమలోకమందు మాచేత యాతనలను పొందుతారు

అయంవిప్రాన్వయెజాతో దాసీపతిరజామిళః
అనేనార్జిత పాపానాం సంఖ్యానాస్తినసంశయః!
జన్మప్రభృతిజన్మాంతం పాపమేవముపార్జితం
అయంవైవిష్ణులోకస్య కథమర్హతిదుష్టాధీః!!
ఇతి తేషాంపచశ్శ్రుత్వా విష్ణుదూతాశ్శుచిస్మితాః
మేఘగంభీరయావాచా ఊచుః కిలముఖాంబుజాః!!
తా !   ఈ అజామిళుడు బ్రాహ్మణుని వంశమందు పుట్టి, దాసీ సంగలోలుడై, అది మొదలు జన్మాంతము వరకు పాపములు చేసినవాడు. ఇతని చేత చేయబడిన పాపములకు ఇంత అని మితిలేదు. ఇట్టి విప్రాధముడు మీ విష్ణులోకమునకు ఎలా అర్హుడౌను?" అని ఈ ప్రకారముగా విష్ణుదూతలను ప్రశ్నించినమీదట, విష్ణుదూతలు చిరునవ్వు నవ్వుతూ ఉరుములా అన్నట్లు సమాన గంభీరధ్వనితో ఇట్లనిరి.

విష్ణుదూతా ఊచుః
అహో ఆశ్చర్యమేతద్ధి యద్యూయంమూఢచేతసః
శృణ్వంతుధర్మమర్యాదాం సమాధానేన చేతసా!!
తా ! విష్ణుదూతలిట్లు పలికిరి " అహో ఏమాశ్చర్యము మీరింత మూఢులెట్లైనారు.? ధర్మమర్యాదను మేము చెప్పెదము సావధానంగా వినండి.
  
*యోదుస్సంగపరిత్యాగీ సత్సంగతిముపాశ్రయః*
*బ్రహ్మజ్ఞానంతతీనిత్యం నదండ్యస్సయమేనవై!!*
తా !   దుస్సంగమును విడుచువారు, సత్సంగమును ఆశ్రయించువారు నిత్యము బ్రహ్మచింతనమును చేసేవారు యమదండార్హులు కారు.

*స్నానసంధ్యాదినిరతో జపహోమపరాయణః*
*సర్వభూతదయాయుక్తో నసయాతియమాలయం!!*
తా !   స్నాన సంధ్యావందనాదులాచరించేవారు, జపహోమములాచరించేవారు, సర్వభూతములందు దయావంతులు, యమదండార్హులుకారు.

బ్రహ్మణ్యాధాయకర్మాణి సత్యవాగనసూయకః
జపాగ్ని హోత్రేయః కుత్యాత్ న సయాతియమాలయం!!
తా !   సత్యవంతుడై మాయాదోషరహితుడై, జప అగ్నిహోత్రములను చేయుచూ కర్మలను *సగుణ బ్రహ్మయందుంచినవాడు* యదండార్హుడు కాడు. (బ్రహ్మణ్యాధాయ కర్మాణి.. ఈ శ్లోకములో కర్మలను బ్రహ్మమునందుంచినవాడు అని చెప్పినప్పుడు సగుణ బ్రహ్మమునే చెప్పవలసి ఉండును, నిర్గుణబ్రహ్మమును గూర్చికూడా తెలుసుకొన్నవాడు పూర్ణుడై కర్మరహితుడగును వానికి కర్మాకర్మములతో సంబంధంలేదుకదా! అందుకే సగుణ బ్రహ్మ అని చెప్పవలసి వచ్చింది)

యోన్నదానదాతానిత్యం వారిదానం ప్రయత్నతః
గోదానంచ వృషోత్సర్గం యఃకుర్యాన్నసపాతకీ!!
తా !   నిత్యమూ అన్నదానమో, జలదానమో చేసేవాడు గోదానం చేసినవారు, వృషోత్సర్గం (ఆబోతును వదిలిన వారు) దండార్హులు కారు.

*విద్యాదానంచార్ధికేభ్యః యః కుర్యాద్భక్తిమాన్నరః*
*పరోపకారనిరతః నసయాతియమాలయం!!*
తా ! విద్యకోరినవారికి శ్రద్ధగా విద్యాదానం చేసేవారు, పరోపకారాసక్తి కలిగినవారు, యమదండార్హులు కారు.
 
యేవిష్ణుమర్చయేద్భక్త్యాతస్యాంగేజపముత్తమం
వివాహోపనయౌకర్తా నసయాతియమాలయం!!
తా !   విష్ణువును పూజించేవారు, హరినామ స్మరణచేసేవారు, వివాహము ఉపనయనములు చేసేవారు యమదండార్హులుకారు

*యేనాధమంటపంమార్గే రాసనిర్మాణమేవచ*
*అనాధప్రేతసంస్కారాన్నసయాతియమాలయం!!*
తా !   మార్గమధ్యంలో మణ్టపాలు కట్టించినవారు, ఆటస్థలాలను కట్టించినవారు, దిక్కులేని శవానికి అంత్యేష్టి చేసినవారు, చేయించినవారు యమదండార్హులు కారు.

*సాలగ్రామార్చనంనిత్యం తత్తీర్థంచపిబేన్నరః*
*తస్యదండప్రణామంచ యఃకుర్యాన్నసపాతకీ!!*
తా !   నిత్యమూ సాలగ్రామ అర్చనచేసి ఆ తీర్థాన్ని పానము చేసినవారు, దానికి వందనం చేసేవారు, యమదండార్హులు కారు.

*తులసీమణిమాలాంతు గళేధృత్వార్చయేద్ధరిం*
*సాలగ్రామశిలాంవాపి నసయాతియమాలయం!!*
తా !   తులసి కర్రలతో చేసిన మాలను మెడలో ధరించిన హరిని పూజించే వారు, సాలగ్రామాన్ని పూజించేవారు యమాండార్హులు కారు

*యేషాంగృహేచతులసీ వర్తతేహరిసత్కథా*
*గీతాపాఠపరాయేచ నతేయాంతియమాలయం!!*
తా !    ఇంట్లో తులసి మొక్కలను, వనాన్ని పెంచేవారు, హరి కథాశ్రవణం చేసేవారు, భగవద్గీతాపారాయణం చేసేవారు యమదండార్హులు కారు.

*నిత్యంభాగవతంయస్య లిఖితంపుస్తకంగృహే*
*తిష్ఠతెచార్చయేద్వాపి నసయాతియమాలయమ్!!*
తా !   భాగవతుల సత్కథలు వ్రాసి ఇంట్లో పూజించేవారు ఆ ఇంట్లో ఉన్నవారు యమదండార్హులు కారు.

*తులాసంస్థేదినకరే మకరస్థేచభాస్కరే*
*మేషసంక్రమణేభానౌ స్నానశీలాసయాంత్యధ!!*
తా !   సూర్యుడు మేష, తుల, మకర సంక్రమణంలో ఉండగా తెల్లవారు ఝామునే స్నానమాచరించేవారు యమదండార్హులు కారు.

*రుదాక్షమాలికాంధ్రుత్వా కృతంయేనజపంశుభం*
*దానయోమపరోనిత్యం నసయాతియమాలయం!!*
తా !   రుద్రాక్షమాలికను ధరించి జపదానహోమాదులనాచరించేవారు యమదండార్హులు కారు.

*అచ్యుతానందగోవింద కృష్ణనారాయణావ్యయ*
*ఇతియోవదతేనిత్యం నసయాతియమాలయం!!*
తా !   నిత్యమూ అచ్యుతా, అనంతా, గోవిందా, కృష్ణా, నారాయణా, అవ్యయా, రామా ఇత్యాది హరినామ సంకీర్తనలు చేసేవారు యమదండార్హులు కారు.

యఃకర్ణికాయాంమ్రియతే మరణేహరిముచ్చరన్
సర్వపాపరతోవాపి నసయాతియమాలయం!!
తా !   కాశీక్షేత్రంలో మణికర్ణికా ఘట్టంలో హరి స్మరణ చేస్తూ చనిపోయినవారు, సర్వపాపాలు చేసినవాడైనా యమదండార్హులు కారు

స్త్రీరాజగురుగోహంతా యేచపాతకినఃపరే
నామవ్యాహరణాద్విష్ణోర్మరణేహ్యఘనిష్కృతిః!!
తా !   దొంగ, సురాపానం చేసేవారు, మిత్ర హంతకులు, బ్రాహ్మణహంతకులు, గురుతల్పగతులు, స్త్రీహంతకులు, రాజ, గురు గో హత్యాది మొదలైన పాపములు చేసినా మరణకాలంలో హరిని స్మరిస్తే పాపవిముక్తులౌదురు.

అజ్ఞానాదధవాజ్ఞానా దుత్తమశ్లోకనామయత్
సంకీర్తనాదఘహరం పుంసాందుష్కృతినామపి!!
తా !   తెలిసి కానీ తెలియకకానీ హరినామ సంకీర్తనం చేసినవారు పాపాత్ములైనాసరే ముక్తులగుదురు.
సాంకేత్యంపారిహాస్యంచ స్తోకం హేళనమేవవా
వైకుంఠవామగ్రహణ మశేషాఘనివారణమ్!!
తా !   హరినామమును, సంకేతిస్తూగాని, సంకేతంగాగాని, పరిహాసానికి గానీ, తెలిసికానీ తెలియకకానీ, కొద్దిగాగానీ, ఎక్కువగాగాని, పలికేవారు పాపముక్తులగుదురు.
పతితస్ఖ్సలితోభగ్న స్సదుష్టస్తప్తజాహతః
హరిరిత్యవశేనాహ పుమాన్నార్హతియాతనామ్!!
తా !   క్రింద పడినప్పుడు, తొట్రుపాటు పడినప్పుడు, కొట్టబడినప్పుడు, జ్వరాదులచేత పీడింపబడినప్పుడు, సప్తవ్యసనములచేత పీడింపబడినప్పుడు, వశములో లేనప్పుడౌనా సరే, హరి నామ సంకీర్తన చేసినవారు యమదండనార్హులు కారు.

యచ్చిత్తేసర్వపాపాపి హరినామాన్య శేషతః
పాపానిజన్మాంతరసంచితాని యేనైవతన్నిష్కృతివర్జితాని
పూయంతినామగ్రహణేన విష్ణోర్మనుష్యలోకెదివివాస సంశయః!!
గురూణాంచలఘానాంచ పాపానాంనాశనాయచ
యద్యసౌభగవన్నామ మ్రియమాణస్సమగ్రహీత్
తేనపాపావినశ్యంతి వహ్నౌప్రక్షిప్తతూలవత్!!
ఇత్యుక్త్వాతేయమభటాన్ విష్ణుదూతాన్సుతేజసః
హైమపుష్పకమధ్యస్థ మజామిళమతంద్రితాః!!
అహృత్యజగ్ముర్వైకుంఠం తదాహాజామిళోనృప
నవందేశిరసాదేవం కింకరాన్ దర్శనోత్సుకః!!
అథాజామిళ అకర్ణ్య దూతానాం యమకృష్ణయోః
ధన్యోస్మ్యనుగృహీతోస్మి యుష్మత్సందర్శనాదహం!!
తా !   అనేక జన్మలలో కూడబెట్టిన ప్రాయశ్చిత్తరహితములవలన కొండలలా పేరుకు పోయిన పాపాలన్నీ హరినామ సంకీర్తనచేత నశిస్తాయి. మరణావస్థలో ఉండి హరినామస్మరణ కొద్దిగా చేసినా, అధికంగా చేసినా వాని పాపాలన్నీ అగ్నిలో పడిన దూదివలె నశిస్తాయి." అని విష్ణుదూతలు పలికి అజామిళుని యమదూతలనుండి విడిపించిరి. తరవాత అజామిళుడు విష్ణుదూతలకు నమస్కరించి మీదర్శనం వల్ల మేము తరించాము అనెను. తరవాత విష్ణుదూతలు వైకుంఠమునకు పోయిరి.

అథాజామిళ ఆకర్ణ్య దూతానాంయమకృష్ణయోః
అహో మేపరమంకష్టం యదభూదచితాత్మనః!!
ధిజ్ఞ్మాంవిగర్హితం సద్భిః దుష్కృతంకిలకజ్జలం
హిత్వాబాలాంసతీంయోహం సురాపామసతీమిమాం!!
వృద్ధావనాధౌపితరౌ నాన్యగోద్ధూత పాపినౌ
అయోయమాధునాత్యక్తావనభిజ్ఞే ననీచవత్!!
సోహం వ్యక్తంపతిష్యామి నరకేభృశదారుణే
ధర్మఘ్నాః కామినోయ విందంతి యమయాతనామ్!!
తా !   తరవాత అజామిళుడు యమదూత విష్ణుదూతల సంవాదమును విని ఆశ్చర్యపడి అయ్యో ఎంతకష్టాన్ని పొందాను. ఆత్మ హితం చేసుకోలేకపోయాను ఛీ ఛీ నాబ్రతుకు సాధు సజ్జనులచేత నిందింపబడేది అయ్యింది కదా! పతి వ్రతయైన భార్యను వదిలి కల్లుతాగుతూ మాంసముతింటూ తిరిగెడి ఈ దాసీ దానిని స్వీకరించాను. వృద్ధులై నాకంటే వేరు దిక్కులేని పుణ్యాత్ములైన నా తల్లిదండ్రులను నీచుడ్నై విడిచాను కదా! అయ్యో ఎంత ధర్మహంతనైనాను. కాముకుణ్ణై నిరంతరమూ అనుభవించే నరకానికి నేను నిశ్చయంగా వెళ్తాను.

కిమదంస్వప్నంహోస్విత్ మయాదృష్టమిహాద్భుతం
వాక్వద్యయాతితమ్యాస్తె  కృష్ణఘోరాసిపాణయః!!
ఫూరామయాకృతేనైవ భాన్యంపుణ్యేసకర్మణా
అన్యధామ్రియమాణస్య విస్మృతిర్వృషలోపతే
వైకుంఠనామగ్రహణం హిహ్వావక్తుమిహార్హతి!!
క్వచాహుకితవఃపాపోబ్రహ్మఘ్నోనిరపత్రపః
క్వచనారాయణేత్యేవ భగవన్నామమంగళం!!
తా !   ఇదేమి ఆశ్చర్యము ఇది స్వప్నమా! ఆ విచ్చుకత్తులను ధరించిన యమభటులెటుపోయిరి? నేను పూర్వ జన్మమందు పుణ్యమాచరించినవాడను కాబట్టే దాసీదానితో జీవించిన నాకు మరణ సమయంలో హరినామ స్మృతి ఎలా కలిగింది. నా నాలుక హరినామాన్నెట్లు గ్రహించింది. పాపాత్ముడనైన నేనెక్కడ అంత్యకాలమందలి స్మృతి ఎక్కడ? సిగ్గువిడిచి బ్రాహ్మణులను చంపేనేనెక్కడ? మంగళుడైన నారాయణుడెక్కడ?

ఇత్యుక్త్వాభగవద్భక్తి మాలంబ్యాత్మావమాత్మని
తతస్సాయుజ్యపదవీం లేభేయన్నామకీర్తనాత్
నారాయణేతియన్నామ జగదచ్యుతరక్షణం
యాతివిష్ణోఃపదంరాజన్ నిర్ధూతాశేషకిల్బిషః
తా !   అజామిళుడిట్లు విచారిమ్చి నిశ్చలమైన మనసుతో భక్తిని పొంది జితేంద్రియుడై కొంతకాలము జీవించి తరవాత సాయుజ్యముక్తిని పొందెను. కాబట్టి నారాయణ నామకీర్తనము చేసేవారు సమస్తపాతకముక్తులై వైకుంఠలోకాన్ని పొందెదరు. ఇందుకు సందేహములేదు." అని మహర్షి పలికెను.

ఇతి స్కాందపురాణే కార్తిక మహాత్మ్యె నవమోధ్యాయస్సమాప్తః

ఇది స్కాందపురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమనెడు కార్తీక పురాణమందలి తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.


Monday, November 23, 2020

కార్తీక పురాణం ఎనిమిదవ అధ్యాయం

అథ శ్రీ స్కాందపురాణే కార్తికమహాత్మ్యే అష్టమోధ్యాయః
శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణం ఎనిమిదవ అధ్యాయం

రాజోవాచః-
మచ్చిత్తే2ధికసందేహో వర్తతెబ్రహ్మనందన
తన్నాశయాద్యమెబౄహి తద్వక్ష్యామితవప్రభో!!
త్వత్తోమయాశ్రుతంవిప్రసూక్ష్మధర్మస్యలక్షణం
తధావిధం పాతకంచ నిమ్దితం విబుధాదిభిః!!
బహుపాపరతానాంచ వర్ణ సంకరకారిణాం
ఆచారహితానాంచ దుర్జనానాం మహామతే!!
ప్రాయశ్చిత్తైస్తుపూయం తె త్రయీవిద్యాదిసంభవైః
కృత్వా గురూణి పాపాని మానవాదుష్టబుద్ధయః!!
ధర్మలేశేనతే సర్వే కథంయాంతి హరెః పదం
తా! రాజు ఇలా అడుగుతున్నాడు . "ఓ వశిష్ఠ మహామునీ! నా మనసులో పెద్ద సందేహమొకటి కలిగింది. దాన్ని మీకు తెలుపుతాను, దయతో ఆ సందేహాన్ని సశింపచేయండి. మీరు నాకు ధర్మ సూక్ష్మమును చెప్పారు. పాతకములలో గొప్ప పాతకాలు చెప్పారు. ఐతే వర్ణ సంకర కారకములైన మహాపాపాలు చేసిన దుర్జనులు వేద వేదాలయందు చెప్పబడిన ప్రాయశ్చిత్త కర్మలవలననే దోషరహితులౌరని ధర్మ శాస్త్రములు పలుకగా మీరు ఈ చిన్న ధర్మముల వలనఏ పరిశుద్ధులౌదురని తదనంతరం హరిలోకానికి చేరుకుంటారనీ చెప్పినారేల? అది ఎలా సంభవించగలదు"

బ్రహ్మన్ బహూని పాపాని గురూణి వివిధానిచ !!
ప్రాయశ్చిత్తవిహీనాని కృత్వాయాంతికథంహరిం
జ్ఞాత్వాసర్వాణ్యనంతాని పాతకాని నరఃక్వచిత్!!
దిష్ట్యోపలబ్ధధర్మేణ కథంయాంతి హరెఃపదం
మహావజ్రనగంకించి న్నఖాగ్రేణమదోయధా!!
కశ్చూర్ణీకురుతె విప్రనకదాచిత్తధాప్యయం
స్వయంగృహాంతరేస్థిత్వాహ్యగ్నౌదత్వాభ్యమజ్ఞనత్!!
జ్వలమ్తమగ్నిమజ్ఞోసి నాచమ్యేచ్చులకోదకాత్
మహానదీప్రవాహేతు స్వయంగత్వాతతః పునః!!
తృణసంగ్రహణం కృత్వా తథాధారోభవేన్నచ
మహాదుర్గంసమారుహ్య తచ్ఛృంగాత్పతితోనరః!!
తదంతరాళతిలకాగ్రాహకేసభవేత్సుఖం
గురుందుష్కృతమాశ్రిత్య హ్యల్పేనసుకృతేనచ!!
సకధంచవిముచ్యేత పాతకేనాత్యసంభవం
ఇదంమమసమాచక్ష్వ శ్రోతౄణాం విస్మయావహమ్!!
కార్తిక్యాంమాఘవైశాఖె ధర్మసూక్ష్మంత్వయోదితం
బహూనిపాతకాన్యేవ హ్యుదితానిత్వయామునె
తత్సర్వంవిలయంకుర్యాత్సోల్పెనైవచసాంప్రతం!!

తా! "హే బ్రహ్మన్! అనేక మహాపాతకాలు చేసి ప్రాయశ్చిత్తములను చేసుకోకుండా ఎలా హరిలోకవాసులవగలరు? అనంతమైన పాతకాలు చేసి ఈ పాపాలు అతి దారుణమైనవని తెలిసీ వీటికి ప్రాయశ్చిత్తాలు చేయించుకోవాలని తెలిసీ అలా చేయక దైవ వశం చేత సంభవిమ్చిన కార్తీక దీపదానాదు పుణ్యములవల వైకుంఠానికి పోవడం ఎలా సంభవిస్తుంది?" అని అడుగుతూ స్వల్ప పుణ్యంచేత అధిక పాపములు నశించడం అనే విషయంలో దృష్టాంతములను చూపుతూ "గండ్రగొడ్డలి మొదలైన ఆయుధాలవల్ల ఖండింపబడని వజ్రపర్వతముని గోటి చివరిభాగము చూర్ణము చేయుటకు శక్యమవుతుందా? తాను ఇంట్లో ఉండి ఇంటి చుట్టూ, పైన నిప్పు పెట్టి ఆ కాలిపోతున్న ఇంటి మధ్యలో ఉండి చేతిలో పురిశెడునీళ్ళు తీసుకొని ఆ మహాగ్నిమీద చల్లినంత ఆఅగ్ని ఆగునా? మహానదీ ప్రవాహంలో కొట్టుకొనిపోతూ గడ్డిపరకను ఆధారంగా చేసుకొని ఒడ్డును చేరుకోగలడా? ఎవరైనా అతి గొప్పనైన పర్వతాన్నెక్కి అక్కడనుంచి క్రిందకి దూకి దారిలో చిన్న లతావితానాంలోని తీగను పట్టుకొని క్రింద పడకుండా ఆగగలరా? ఇలాంటివాటిని చూస్తే అధికమైన మహా ఘోరములైన పాపాలు చేసి స్వల్ప పుణ్యముచేత వాటిని నశింపచేయడం ఎలా వీలౌతుంది? ఆ సంశయాన్ని నాకు నశింపచేయవలసింది. నాకేగాదు ఈ వివరం వింటున్నవారందరికీ కలిగే సందేహాన్ని నివృత్తి జేయండి! కార్తీక, మాఘ, వైశాఖ మాసములందు చేసిన స్వల్ప పుణ్యమే అధిక పాతకములను నశింపజేయును అని మీరు చెప్పారు అది ఎలా సిద్ధిస్తుందో తెలుపగలరు."


*శ్రీ సూత ఉవాచః-*
ఇతిభూపనచశ్శ్రుత్వా మందస్మేరముఖాంబుహః
ఇదమాహప్రహృష్టాత్మా రాజానంవిస్మయాన్వితం!!

తా! శ్రీ సూతమహర్షి  ఇలా చెప్తున్ణారు ’ ఈ ప్రకారంగా రాజు మాటవిని, వసిష్ఠ మునీంద్రుడు చిరునవ్వునవ్వి సంతోషంతో స్వల్పపుణ్యంచేత గొప్పపాపాలెలా నశించును అని ఆశ్చర్యంతో ఉన్న రాజులతో ఇలా పలికెను..

*శ్రీ వసిష్ఠ ఉవాచః-*
శ్రుణురాజన్ ప్రవక్ష్యామి సాధు సాధువిమర్శనం
మయాప్యాలోకితంసర్వం వేదశాస్త్రవిచారణం!!
తత్రధర్మాహ్య సంఖ్యాతాబహుసూక్ష్మతరానృప
దృశ్యం తెహం ప్రవక్ష్యామి త్వంమాకుర్వత్రసంశయం!!
గుణత్రయాన్వితాధర్మాం రాజన్ శాస్త్రేష్వవస్థితాః
సత్వంరజస్తమఇతి గుణాః ప్రకృతిసంభవాః!!
యోధర్మస్సత్వమాలంబ్యాత్తంసూక్ష్మంకవయోవిదుః
ప్రాయశ్చిత్తాన్య శేషాణి తవః కర్మాన్వితానివై!!
రజోన్వితాని రాజేంద్ర భూయోజన్మప్రదానిచ
ఇదంకృతాకృతఫలం యద్ధర్మంప్రోచ్యతెబుధైః
తద్ధర్మంతామసంప్రాహుర్నిష్ఫలంపృథివీపతె!!
తా! వసిష్ఠమహర్శి జనక మహారాజుతో ఇలా పలికెను "ఓ రాజా విను! చాలా మంచి విమర్శ చేసినావు. నేనుగూడా ఇలా విచారించి వేదశాస్త్రపురాణాలను విచారించగా ధర్మములలో సూక్ష్మములున్నట్లు తెలిసింది. అలాంటి సూక్ష్మధర్మములు ఎంత పనైనా చేయగల సమర్థములు. ఒకానొకప్పుడు గొప్ప పుణ్యాలు కూడా స్వల్పమైపోతాయి. ఒకప్పుడు స్వల్పపుణ్యాలు కూడా అధిక ఫలప్రదమౌతాయి. ఈ విషయంలో సందేహం పొందవద్దు. ఇంకా వివరం చెప్తాను సావధానంగా వినండి. అలా భేదమెందుకంటే ధర్మములు గుణత్రయంతో కూడుకొనడంవల్ల స్వల్పములు అధికములు అవుతాయి. సత్వ, రజస్, తామసములని మూడు గుణములు. ఈ మూడు ప్రకృతివలన కలిగినవి, ప్రకృతి అంటే మూల ప్రకృతి అని తెలియగలరు. అందులో సత్వము వలన చేయబడిన ధర్మాన్ని సూక్ష్మమందురు. ప్రాయశ్చిత్తములన్నీ తపస్సు కర్మకాండమంతా రజోగుణమువలన కలిగినవి, తమోగుణమువలన చేసిన ధర్మములన్నీ తామసమనబడును ఇవి నిష్ఫలములు."

తస్మాత్సాత్వికధర్మంతు తే సూక్ష్మంకధితంమయా
లేశంవాజాయతేరాజన్ సమృద్ధిఃకాలయోగతః!!
అ దేశ కాలేయద్దాన మపాత్రేప్రతిపాదితం
విధిహీనమంత్రంచ ధర్మంతత్తామసంవిదుః!!
కాలదేశంసవిజ్ఞాయ ధర్మంయఃకురుతెనృప
తదక్షయఫలంప్రోక్తం ముక్తి హేతుర్నసంశయః!!
యదాధికంవాస్తోకంవా కాలం విజ్ఞాయమానవః
విచారితార్థంకుర్వీత గహనాకర్మపద్ధతిః!!
లభంతేతేనసౌఖ్యాని దుర్లభానిమహీపతే
జ్ఞానేనాప్యధవాజ్ఞానా త్కాలేదేశేచదైవతః
కరోతిఫలమక్షయ్యం జాయతెనాత్రసంశయః!!
కాష్ఠభారాన్ సమాదాయ సన్నివేశ్యనగోపమాన్
తత్రగుంజాఫలంమాత్రమగ్నింనిక్షిప్యతాన్ దహేత్!!
గృహెసంతమసెవ్యాప్తె దీపేనాల్పేనయాద్యుతిః
తమిస్రంవినిహంత్యాశుధర్మోల్పోవాధవానృప!!
యథాకర్తమనీరేతు స్నాత్వాభూయోతినిర్మలే
జలేస్నానేన రాజేంద్ర నిర్మలోజాయతెతథా!!
తా! ఇందులో సత్వగుణముతో చేయబడిన ధర్మాన్ని సూక్ష్మమని నీకు చెప్పాను అది కొంచమైనా కాలయోగమువలన వృద్ధి చెందుతుంది. దేశమనగా పుణ్యక్షేత్రము, కాలమనగా పుణ్యకాలము, పాత్రమనగా యోగ్యుడైన బ్రాహ్మణుడు, ఈ మూడు విధాల యోగ్యతను విచారించక విధి రహితంగా మంత్రరహితంగా చేయు దానాదులు తామసముతో కూడినవి. ఇవి అంత గొప్పనైన పాపనాశక సామర్థ్యము కలది కాదు. దేశకాల పాత్రతలను విచారించి చేసిన ధర్మం అక్షయమై మోక్షహేతువౌతాయి. ధర్మము అధికమో స్వల్పమో కాలాన్నిబట్టి విచారించి నిశ్చయించికోవాలి. కర్మపద్ధతి దిర్విజ్ఞేయము అనగా కర్మ సరణి ఇలాంటిని అని నిర్ణయించుటకు క్లిష్టమైనది. అలా దేశకాల విచారణ చేసి చేసిన ధర్మము వలన సుఖము పొందుతారు. కాబట్టి జ్ఞానముచేతగానీ, అజ్ఞానము చేతగానీ దేశకాలపాత్రత విచారణ చేసి చేసిన ధర్మము అక్షయఫలమునిచ్చును ఇందుకో సందేహంలేదు. అల్పముణ్యం చేత అధిక పాపాలు నశించటంలో దృష్టాంతములు చూపబడుతున్నవి చూడుము. పర్వతమంత ఎత్తులో కట్టెలు పేర్చి అందులో గురువిందగింజ అంత చిన్న అగ్నిహోత్రాన్ని ఉంచితే ఆ కట్టెలన్నీ భస్మరాశిగా మారటంలేదా? ఇల్లంతా చీకటిగా ఉంటే అతి చిన్న దీపము వెలుగు ఇల్లంతా ప్రసరించి చీకట్లను తొలగతోయట్లేదా? చిక్కగా ఉన్న బురదనీటిలో ఎంత స్నానం చేసినా పోని మురికి కొంత స్వచ్చమైన నీటిలో స్నానం చేసినంత ఆ మురికి పోవట్లేదా?

అల్పంవాయేనకేనాపి హ్యజ్ఞానేనాథవాసకృత్
నామసంకీర్తనాద్విష్ణోఃదహ్యతెబహుపాతకాః!!
విష్ణుసంకీర్తనంరాజన్ కీర్తయేజ్ఞానమోహితః
క్షయత్యఘంమహదపి వేణుగుల్మమివానలః!!
పురాకశ్చిద్దురాచారో విప్రసూనురజామిళః
దాసీపతిఃక్రూరకర్మా దాసీసంసర్గలాలసః!!
కన్యాకుబ్జెసత్వనిష్ఠో నామ్నా వై సబహుశ్రుతః
తస్యభార్యాధర్మవతీ సాధ్వీపతిపరాయణా
తస్యచాంతరితెకాలే సంజాతోజామిళస్తదా!!
పూర్వకర్మానురోధేన సోభవత్ప్రాప్తయైవనః
కస్యచిద్ద్విజముఖ్యస్య దుర్మార్గస్యచభూమిప!!
గృహదాసీపతిశ్చాసీత్ పూర్వకర్మానుబంధతః
మాతరంపితరంహిత్వా మదనావేశమోహితః!!
తయాసమంసతన్వంగ్యా పానభోజనభక్షణైః
కామశాస్త్రకలాపైశ్చపరిరంభణచుంబనైః!!
అజామిళస్తయా దాస్యా రేమేకామవిమోహితః
సర్వకర్మాణి సంత్యజ్య వేద శాస్త్రోదితానచ!!
తా! తెలిసి కానీ, తెలియకకానీ చేసిన పాపాపు అధికమైనా స్వల్పమైనా హరినామ సంకీర్తనవలన నశిస్తాయి. మహిమ తెలియక చేయబడినదైనా హరినామ సంకీర్తనచే పాపాలు అగ్ని అంటుకున్న దూదిపింజవలె కాలిపోతాయి. పైన చెప్పిన విషయమై ఒక గాథను చెప్పెదను వినుము ఒకానొక కాలంలో కన్యాకుబ్జమునందు వేదవేదాంగ పారంగతుడు సత్యనిష్ఠుడు ఐనఒక బ్రాహ్మణుడుకలడు, అతనికి పతివ్రతయు ధర్మాత్మురాలు ఐన భార్య కలదు. వారిద్దరికీ చిరకాలానికి ఒక కొడుకు పుట్టెను. అతనికి వారు అజామీళుడని నామకరణం చేసిరి. ఆ అజామీళుడు పెరికి పెద్దవాడైన తరవాత విధివశాత్ దురాచారుడై దాసీభర్తయై, హింసామార్గమున ఆర్జిస్తూ, నిత్యమూ దాసీ సాంగత్యమునందు ఆసక్తి కలవాడై ఉండెను. అటువంటి వాడు తెలియక చేసిన స్వల్ప పుణ్యం చేత అనగా హరినామ సంకీర్తనం వల్ల తరించెను.
ఆ అజామీళుని జీవన విధానమెలాంటిదనిన అజామీళుడు  యౌవనములోకి రాగానే ఒక దుర్మార్గ ఆలోచనతో దాసీతో సంగము చేసి దానియందే ఆసక్తుడై తల్లి దండ్రులను విడిచి కామాతురుడై దాసీతోనే జీవనము సాగిస్తూ వైదిక కర్మలను వదిలి కామశాస్త్ర ప్రవీణుడై ఆలింగన చుంబనాదికామకర్మలందు అమితాసక్తి క్లవాడై ఆదాసీతీనే నిరంతరము గడుపుచుండెను.

చక్రుర్నిష్కాసయాంతత్ర తంతదాబాంధవాఃపరే
పరిత్యజ్య తతోలజ్జాం విప్రసూనుస్సపావధీః!!
తస్మిన్నేవాంత్యజభువం ప్రాప్యతత్సద్మచాశ్రితః
పశుపక్షిమృగాదీనాం హన్త్వాతన్మాంసజీవనః!!
శ్వవాగురికసంయుక్తో వనేహింసాపరాయణః
దాస్యామంచచారాసౌ వనేదుష్టమృగాకులేః!!
కదాచిత్సాలవృక్షేసా మధుదృష్ట్వారుహన్నృప
భగ్న శాఖా2వతద్భూమౌ మరణం సముపాగతా!!
అజామిళస్తతోదృష్ట్వా రాజన్ ప్రాణధనేశ్వరీం
స్వపురస్థ్సాప్యబహుధా విలలాపాకులేంద్రియః
గిరిర్గతె మహారాజన్ తాంవిసృజ్యగృహంగతః!!
తా! ఆ అజామిళుడు కులాచారభ్రష్టుడైనందున అతని బంధువులందరూ అతనిని ఇంటినుంచి వెళ్ళగొట్టగా, ఆ వూరిలోనే ఒక చండాలుని పంచనజేరి అతని ఇంట్లో నివాసముంటూ నిత్యమూ తన ప్రియురాలైన దాసితో కూడి కుక్కలకు ఉచ్చులు వేసి మృగాలను వేటాడేవారిని వెంటబెట్టుకొని అడవికి వెళ్ళి పశు పక్షాదులను, మృగాలను చంపి వాటి మాంసాన్ని భుజిస్తూ కాలం వెళ్ళదీయసాగాడు. ఇలా ఉండగా ఒకనాడు ఆ దాసీది తాగడానికని తాటి చెట్టుఎక్కి ప్రమాదవశాత్తు క్రిందపడి మరణించింది. అది చూసిన అజామీళుడు తనప్రాణం కంటే మిన్న ఐన తన ప్రియురాలు చనిపోవటం చూసి రోదించాడు. ఆశవాన్ని తీసుకొని కొండమీదనుంచి లోయలోకి విసిరి ఇంటికి వెళ్ళిపోయాడు.

తతస్తస్యాన్సుతాతన్వీనురూపాప్రాప్తయౌవనా
తాందృష్ట్వాసచపాపాత్మా తయా రేమెచిరంనృప!!
తస్మాత్సాసుషువేరాజన్ పుత్రాన్ కాలేచవైనృప
క్షీణాయుషోగతాస్సర్వే కనిష్ఠశ్చావశేషితః!!
నారాయణాభిధానంచ చక్రెయుక్తోత్రవర్ణకైః
తిష్ఠన్గచ్చన్ పిబన్ భుంజన్ పర్యటన్ ప్రస్వదన్ సదా
పుత్రపాశేనసంబంద్ధస్తన్నామగ్రహణాతురః!!
తా! అజామిళుడు తరవాత యవ్వనవంతురాలైన దాసి కూతురిని చూసి పాపాత్ముడగుడచే ప్రియురాలి పుత్రిక తన పుత్రిక అనే  నీతిని విడిచి దానితోకూడా చాలాకాలము క్రీడిస్తూ గడిపెను. ఆ దాసీ కూతురుయందు అజామిళునకు కొందరు కొడుకులు పుట్టి మరణించిరి అందులో చిన్నవాడు మాత్రమే బ్రతికెను. అతనికి పూర్వపుణ్య ఫలమున *"నారాయణ"* అను నామకరణము చేసి వల్లమాలిన ప్రేమతో ఆ అజామిళుడు నడుస్తూ, తిరిగుతూ, తింటూ ఏ పని చేసినా పుత్రప్రేమతో నిరంతరము అతని కొడుకు నామ (నారాయణ) స్మరణ చేయసాగెను.

తతః కాలెసమాయాతె మరణె సముపస్థితె
తన్నేతుమాగతారాజన్ యసుదూతాభయంకరాః
రక్తశ్మశ్రుముఖాలోష్ట దండహస్తాసిపాణయః!!
తాన్ దృష్ట్వాభయసంత్రస్త మాత్మానంనేతుమాగతాన్
ఉవాచవాక్యమేతచ్చపుత్రస్నేహపరివుతః!
దూరేక్రీడనకాసక్తం పుత్రం నారాయణాహ్వయం
ద్రావితేన స్వరేణోచైరాజుహావాకులేంద్రియః!!
శ్రుత్వాతన్మ్రియమాణస్య వదనాద్విష్ణుకీర్తనం
తేవిచింత్యతతోదూరం జాతకంపాస్థ్సితానృప!!
తదాజగ్ముర్విమానస్థా విష్ణుదూతాన్సుతేజసః
యమప్రేష్యాన్ విష్ణుదూతా వారయామాసురోజసా
అస్మాకంవశగోయంచ ఊచుస్తే యమకింకరాన్!!
తా! తరవాత కొంతకాలానికి అజామిళునకు కాలవశాత్ మరణము సమీపించినది. అతని జీవుని కొనిపోవుటకుగానూ ఎఱ్ఱని మీసములు, గడ్డములు కలిగి, చేతులలో దండములను, రాళ్ళను, కత్తులను పట్టుకొన్న భయంకరులైన యమదూతలు వచ్చిరి. అజామిళుడు తనను తీసుకొనిపోవ వచ్చిన యమదూతుఅలను చూసి భయపడి పుత్రప్రేమచేత దూరంగా ఆడుకుంటున్న కొడుకుని చూసి భయంతో ఓ నారాయణా నారాయణా అని పిలువసాగెను. దైన్యముతో కూడి నారాయణ నామ సంకీర్తనము మరణకాలమందు అజామిళుడు చేయగా విని యమదూతలు ఆలోచించి దగ్గరకు వచ్చుటకు సందేహించి దూరంగా పోయి భయంతో చూచుచుండిరి. అంతలో తేజోవంతులైన విష్ణుదూతలు వచ్చి యమదూతలను చూసి ఓయీ యమదూతలారా అజామిళుడు మావాడుకానీ, మీవాడు కాదు అని పలికిరి.

తే సర్వేవిష్ణుపద్రాజన్ పద్మపత్రాయతేక్షణాః
పీతాంబరధరా ముఖ్యాస్సర్వేపుష్కరమాలినః!!
కిరీటినః కుండలినః చారు స్రగ్వన్త్రభూషణాః
చతుర్భుజాశ్చారు రూపా శ్శంఖచక్రభుజశ్రియః!!
దేశం సుమిశ్రితాలోకాన్ కుర్వంతస్స్వేనతేజసా
దృష్ట్వాచ విష్ణుదూతాస్తే మాయావాక్యం సమబ్రువన్
యూయంహిఉతదేవావా కిన్న రాసిద్ధచారిణాః!!
ఇతితేషాంవచశ్శ్రుత్వాతాననాదృత్యపుష్పకే
అజామిళంసన్నివేశ్యగంతుకామావచోబ్రువన్!!
తా! రాజా! ఆ విష్ణుదూతలు పద్మములవలె విశాల నేత్రములు కలవారు, పచ్చని పట్టుపీతాంబరములు ధరించి, పద్మ మాలాలంకృతులై, కిరీటములను ధరించి, కుండలధారులై, మంచి మాలికలు అమోఘ వస్త్రములు ఆభరణములు కలవారై నాలుగు చేతులు కలిగి సుందరదేహులై శంఖచక్రములను ధరించి తమ కాంతి చేత ఆ ప్రదేశమంతా ప్రకాశింపచేసేవారైరి. ఇటువంటి తేజోవంతులైన విష్ణుదూతలను చూసి యమదూతలిట్లడిగిరి. " మీరెవ్వరు? కిన్నరులా? సిద్ధులా? చారణులా? దేవతలా? " అంత యమదూతలను ధిక్కరించి విష్ణుదూతలు అజామిళుని తమ పుష్పక విమానములో ఎక్కించుకొని తమలోకమునకు పోవడానికి బయలుదేరుతూ ఇట్లు పలికిరి.

ఇతి స్కాందపురాణే కార్తిక మహాత్మ్యె అష్టమోధ్యాయస్సమాప్తః
ఇది స్కాందపురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమనెడు కార్తీక పురాణమందలి ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.

Sunday, November 22, 2020

కార్తీక పురాణం ఏడవ అధ్యాయం

అథ శ్రీ స్కాందపురాణే కార్తికమహాత్మ్యే సప్తమోధ్యాయః
శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణం ఏడవ అధ్యాయం

శ్రీ వసిష్ఠ ఉవాచ
పునః కార్తిక మహాత్మ్యం ప్రవక్ష్యామిసమాసతః
తచ్ఛ్రుణుష్వనరశ్రేష్ఠ ప్రసన్నేనాంతరాత్మనా
యః కార్తికేయజేద్భక్త్యా కమలైఃకమలేక్షణం
తస్యగేహేవసేన్నిత్యం కమలానాత్రసంశయః
దేవేశంభక్తియోగేన తులసీజాతిపుష్పకైః
అర్చయేద్యదిమాసెస్మిన్ సచభూయోనజాయతె
కార్తికేబిల్వపత్రేణ విష్ణుంవ్యాపకమీశ్వరం
యఃపూజయేన్నరశ్రేష్ఠ నతుభూయోభిజాయతె
తా! వసిష్ఠ మహామును ఇట్లు చెప్పుచున్నారు. ’ ఓ జనక మహారాజా! వినుము కార్తీక మహాత్మ్యము ఇంకా చెప్పెదను. ప్రసన్న చిత్తుడవై వినుము. కార్తిక మాసమునందు ఎవరు కమలములచేత పద్మపత్రాయతాక్షణుడైనటువంటి శ్రీ హరిని పూజింతురో వారి ఇంట పద్మవాసిని ఐన లక్ష్మీదేవి నిత్యమూ వాసము చేయును. ఈ మాసములో భక్తితో తులసీదళములతోనూ, జాతి పుష్పములైన జాజి, మందార, పున్నాక, చంపక ఇత్యాదులతోనూ శ్రీ హరిని పూజించువాడు తిరిగి భూమిమీద జన్మించడు. ఈ మాసమున మారేడుదళములతో సర్వవ్యాపకుడైన శ్రీహరిని పూజించినవాడు తిరిగి భూమిమీద జన్మించడు.

కార్తికెఫలదానంచ యఃకుర్యాద్భక్తిసంయుతః
పాపానివిలయంయాంతి తమాంసీవారుణోదయె
యోధాత్రీఫలమూలేతు దృష్ట్వావిష్ణుంప్రపూజయేత్
యమస్తంనేక్షితుంశక్తో నాత్ర కార్యావిచారణా
సాలగ్రామార్చనం రాజన్ ఊర్జెమాసి ప్రయత్నతః
తులసీదళైరర్చయేచ్చ యస్సధన్యోనసంశయః
యోవనేభోజనంకుర్యాద్విప్రైస్సార్థంనృపోత్తమ
కార్తికేతేననశ్యంతి మహాపాతకకోటయః
ధాత్రీవృక్షసమీపేతు సాలగ్రామార్చనంనరః
యఃకుర్యాద్రాజశార్దూల కార్తికేబ్రాహ్మణైస్సహ
సవైకుంఠపురంప్రాప్య విష్ణువన్మోదతేచిరం
తా! కార్తీక మాసమందు భక్తితో పండ్లను దానమిచ్చిన వానిపాపములు సూర్యోదయము కాగానే చీకటి తొలగినట్లు నశించును. వుసిరిక కాయలతో ఉన్న వుసిరి చెట్టు క్రింద శ్రీ హరిని పూజించు వానిని యముడు చూడడానికి కూడా శక్తికలిగి యుండడు. కార్తీక మాసమున తులసీ దళములతో సాలగ్రామమును పూజించువాడు ధన్యుడగును, దానిలో సందేహమేలేదు. కార్తికమాసమందు బ్రాహ్మణులతోకూడా వనభోజన మాచరించు వాణి మహాపాతకములన్నీ నశించును. బ్రాహ్మణులతో కూడి వుసిరి చెట్టు దగ్గర సాలగ్రామమును పూజించేవాడు వైకుంఠమునకు పోయి అక్కడ విష్ణుపదమొందును.

యఃకార్తికేమాసి భక్త్యాతోరణం చూతపల్లవై
దామోదరాగ్రెయఃకుర్యాత్సయాతిపరమాంగతిం
కదళీస్తంభపూజాంచ యఃకుర్యాత్కార్తికేహరెః
పుష్పైర్వామంటపంవిష్ణోస్సవైకుంఠేచిరంవసేత్
కార్తిక్యాంకేశవస్యాగ్రెనమస్కుర్వంతియేసకృత్
సర్వపాపవినిర్ముక్తా అశ్వమేధఫలంస్మృతం
కార్తికేతుహరెరగ్రె జపయోమనురార్చనం
యఃకుర్యాద్యాతివైకుంఠం పితృభిస్సహభూమివ
కార్తికేవస్త్రదానంచ యఃకుర్యాత్స్నానశీతలే
సోశ్వమేధాయతానాంచ ఫలంప్రాప్నోత్యసంశయః
తా! కార్తీక మాసములో భక్తితో శ్రీ హరి ఆలయమును మామిడి ఆకులతో తోరణము కట్టినవానికి మోక్షము దొరుకును. శ్రీ హరికి అరటి స్తంభములతో గానీ, పువ్వులతో గానీ మంటపాన్ని నిర్మించి పూజిమ్చినవానికి వైకుంఠమందు చిరకాలవాసము కలుగును. ఈ కార్తీక మాసమందు ఒక్కసారైనా హరి ముందు సాష్ఠాంగ ప్రమాణము చేసినవారు పాపముక్తులై అశ్వమేధయాగఫలాన్ని పొందెదరు. హరి ఎదుట జపము, హోమము, దేవతార్చనము చేయడం వలన పితృగణములతో సహా వైకుంఠానికి పోదురు. ఈ మాసము స్నానము చేసి తడిబట్టతోనున్నవానికి వస్త్రదానము చేయువాడు పదివేల అశ్వమేధయాగములు చేసిన ఫలాన్ని పొందెదడు.

యఃకార్తికేమాసివిష్ణో శ్శికరేధ్వజమర్చయేత్
తేనశ్యంతిపాపాని వాయునాపాంసవోయథా
కార్తిక్యామతసీపుష్పైరర్చయేదచ్యుతంనరః
సితాసితైర్వారాజేంద్ర యజ్ఞాయుతఫలంలభేత్
బృందావనాగ్రెకార్తిక్యాం గోమయేనోవలిప్యచ
స్వస్తికైశ్శంఖపద్మాద్యై ర్యాకుర్యాత్సాహరిప్రియా
తా! కార్తీక మాసమందు విష్ణువుయొక్క ఆలయ శిఖరమందు ధ్వజారోహణము చేయువాని పాపములు గాలికి కొట్టుకొని పోయిన ధూళి వలె నశించును. ఈ మాసములో నల్లవి కానీ తెల్లవి కానీ అవిసిపువ్వులతో శ్రీ హరిని పూజించిన పదివేల యజ్ఞములు చేసిన ఫలము కల్గును. ఈ మాసములో బృందావనమున ఆవు పేడతో అలికి, రంగవల్లులలో శంఖ పద్మాదులను తీర్చిదిద్దిన మగువ శ్రీ హరికి ప్రియురాలగును.

నందాదీపంతు కార్తిక్యామర్పయేద్విష్ణుమందిరే
తత్ఫలస్యచమర్యాదా బ్రహ్మణాపినశక్యతె
నశ్యేదేతద్యదారాజన్ వ్రతభ్రష్టోభిజాయతే
తిలవ్రీహిసమాయుక్తం మునిపుష్పైసమన్వితం
నందాదీపంవిధానేన కార్తీక్యాం విష్ణవేర్పయేత్
తా! కార్తీక మాసమున విష్ణుభగవానుని ఎదుట నందాదీపము అర్పించిన ఫమలునకు ప్రమాణము ఇంతింతని చెప్పుటకు బ్రహ్మకు కూడా శక్యము కాదు. (నందా దీపము అనగా ౧,౬,౧౧ తిథులలో అనగా ప్రతిపత్తిథి, షష్ఠీ తిథి, ఏకాదశీ తిథులందు సమర్పించు దీపము). ఈ నందాదీపము నశించినచో వ్రతభ్రష్టుడగును కాబట్టి నువ్వులతో, ధాన్యముతో, అవిసి పువ్వులతో కలిపి నందాదీపమును శ్రీ హరికి సమర్పించడం వలెను.

యఃకార్తిక్యామర్కపుష్పైరర్చయేద్గిరిజాపతిం
సలబ్ధ్వాపూర్ణమాయుష్యం పశ్చాన్మోక్షమవాప్నుయాత్
తా! కార్తీక మాసమందు శివునికి జిల్లేడు పువ్వులతో అర్చన జరిపినవాడు చిరకాలము జీవించి చివరకు మోక్షమును పొందగలడు.

రాజన్ యః కార్తికెమాసి కేశవాలయమంటపం
అలంకరోతియోభక్త్యా సయాతిహరిమందిరం
మల్లికాకుసుమైర్దేవం మాధవంకార్తికేర్చయేత్
తేననశ్యంతి పాపాని తమస్సూర్యోదయేయథా
తులసీకాష్ఠగంధంతం సాలగ్రామస్యయోర్పయేత్
సర్వపాపవినిర్ముక్తో యాతివిష్ణోఃపరంపదం
యఃకుర్యాత్కార్తికెవిష్ణోర్నర్తనంనర్తకీతథా
జన్మాంతరార్జితంపాపం నాశంయాతినసంశయః
కార్తికేమాసి రాజేంద్ర కేశవాలయమండపం
యఃకుర్యాత్సోపివైకుంఠే విష్ణుసాయుజ్యమవాప్నుయాత్
కార్తికేచాన్నదానంచ యఃకుర్యాద్భక్తిమాన్నరః
తస్యాఘంనశ్యతిక్షిప్రం పవమానాద్యధాఘనః
తా! కార్తీక మందు విష్ణ్వాలయమందు మంటపంలో భక్తితో అలంకరించేవారు హరిమందిర స్థాయిని పొందెదరు. ఈ మాసములో మల్లెపూవులతో శ్రీ హరిని పూజించువాని పాపములు సూర్యోదయానంతరం చీకట్లవలె నశించును. తులసీ గంధముతో సాలగ్రామమును పూజించువాడు పాపముక్తుడై విష్ణులోకాన్ని చేరగలడు. హరి సన్నిధిలో స్త్రీగానీ, పురుషుడుగానీ నాట్యము చేసిన పూర్వజన్మ సంచితమైన పాతకములు కూడ నశించును. ఈ మాసంలో భక్తితో అన్నదానమాచరించువాని పాపములు గాలికి కొట్టబడిన మబ్బులవలె తొలగును.

తిలదానంనదీస్నానం భోజనం బ్రహ్మపత్రకె
కార్తికేచాన్నదానంచ ధర్మమేతచ్చతుష్టయం
నకుర్యాద్యశ్చ కార్తిక్యాం స్నానం దానం నరాధమః
శ్వానయోనిశతంగత్వా చండాలత్వమతఃపరం
నారీవాపురుషోవాపి నకుర్యాత్కార్తికవ్రతం
రాసభీంయోనిమాప్నోతి శ్వానయోనిశతంతథా
తా! కార్తీక మాసమందు తిలాదానము, మహానదీ స్నానము, బ్రహ్మపత్రభోజనము అన్నదానము అను నాలుగు ధర్మములు చేయవలెను. ఈ మాసమందు దానము, స్నానము యథాశక్తిగా చేయనివాడు నూరు జన్మలు కుక్కగా పుట్టి తరవాత చండాలుడగును. స్త్రీగానీ, పురుషుడుగానీ కార్తీక వ్రతమాచరించనివాడు గాడిదగా ముందు జన్మిమ్చి తరవాత నూరు మార్లు కుక్కగా జన్మించును.

కదంబపుష్పైఃకార్తిక్యాపర్చయేద్భక్తవత్సలం
ససూర్యమండలంభిత్వాస్వర్గలోకెవసేచ్చిరం
కేతక్యాకార్తికేమాసి యః పూజయతి భక్తితః
సప్తజన్మభవేద్విప్రోవేదవేదాంగపారగః
సహస్రపత్రైర్యోవిష్ణుపూజాం కుర్యాచ్చ కార్తికే
సమిత్రపదవీంప్రాప్య దీర్ఘాయుష్యమవాప్నుయాత్
అతసీపుష్పమాలాంయో హ్యలంకృత్యతథాస్వయం
స్కంధెధృత్వార్చయేద్విష్ణుం సచస్వర్గాధిపోభవేత్
తా! ఈ మాసములో కడిమి పువ్వులతో శ్రీ హరిని పూజించిన సూర్య మండలమును దాటి స్వర్గలోకమునకు పోవును. మొగలి పువ్వులతో పూజించిన వాడు ఏడుజన్మలు వేద వేదాంగ పారంగతుడైన బ్రాహ్మణుడై జన్మించును. ఈ మాసములో పద్మములతో శ్రీ హరిని పూజించిన సూర్యమండలమందు చిరకాలవాసి అగును. అవిసెపువ్వుల మాలను ధరించి శ్రీ హరినీ అవిసెపువ్వుల మాలిగలతో పూజించేవాడు స్వర్గాధిపత్యాన్ని పొందగలడు.

స్త్రియోమాల్యేనవావిష్ణుం పూజయేత్తులసీదళైః
ససర్వపాతకాన్ముక్తో యాతివిష్ణోః పరంపదం
కార్తికే భానువారేతు స్నానకర్మసమాచరేత్
మాసస్నానేనయత్పుణ్యం తత్పుణ్యంలభతేనృప
ఆద్యేంతి మేమధ్యమేచ దినేయస్స్నానమాచరేత్
మాసస్నానఫలంతేన లభతేనాత్రసంశయః
అథవామాసమాహాత్మ్యం యశ్శ్రుణోత్యఘనాశనం
మాసమేకంనృపశ్రేష్ఠ సముక్తస్సర్వపాతకైః
తా! స్త్రీలు మాలలచేత కానీ తులసీదళాల చేతకానీ, ఈ మాసమందు హరిని పూజిమ్చిన పాపవిముక్తులై వైకుంఠమును పొందెదరు. ఈ మాసంలో ఆదివారం స్నానం చేసిన మాసమంతా స్నానమాచరించిన పుణ్యమును బొందును. ఈ మాసమున శుక్ల ప్రతిపత్తిథినాడు, పూర్ణిమనాడు అమావాస్యనాడు ప్రాతఃస్నానమాచరించిన అశక్తులు పూర్ణఫలము పొందగలరు. అందుకు కూడా శక్తిలేని వారు కార్తీక మాసమందు నెలరోజులూ కార్తీక మాహాత్మ్యము వింటే స్నానఫలము కలిగి పాపములు నశించును.

కార్తికేమాసి యోదీపాన్ దృష్ట్వామోదతియంపుమాన్
తేనపాపానినశ్యంతి నాత్రకార్యావిచారణా
సహాయంకురుతెవిష్ణోః పూజార్థంయం ప్రయత్నతః
కర్మణామనసావాచా సస్వర్గఫలమశ్నుతె
కార్తికేమాసియోభక్త్యాహ్యర్చయేదచ్యుతంనరః
గంధపుష్పైఃసుధూపాద్యైః యాతితత్పదమవ్యయం
కార్తికేకేశవస్యాగ్రే యోజపంసమాచరేత్
సజంబుకోభవేద్భూమౌసప్తజన్మస్వసంశయః
యేప్రదోషేపురాణంతు కార్తికేకేశవాగ్రతః
కుర్వంతినరశార్దూల తేయాంతి హరిమందిరం
కార్తికేమాసిసాయాహ్నే స్తోత్రపాఠపరోనరః
సస్వర్గలోకమాసాద్య ధ్రువలోకమతఃపరం
తా! ఈ మాసములో ఇతరులు సమర్పించిన దీపమును చూసి ఆనందము పొందేవారి పాపములు ఏ సందేహములేకుండా నశించును. ఈ మాసమందు ఇతరులకు హరిపూజకై త్రికరణ శుద్ధిగా సహాయము చేయువాడు స్వర్గమును పొందును. ఈ మాసంలో భక్తితో గంధ పుష్ప ధూప దీపాదులచేత హరిని పూజించివాడు వైకుంఠాన్ని పొందును.

ఇతి స్కాందపురాణే కార్తిక మహాత్మ్యె సప్తమోధ్యాయస్సమాప్తః
ఇది స్కాందపురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమనెడు కార్తీక పురాణమందలి ఏడవ అధ్యాయము సమాప్తము.