Translate

Wednesday, October 6, 2021

దసరా నవరాత్రి ఉత్సవాలు 2021 (మన దేవాలయం లో జరిగే కార్యక్రమాలు)


మొదటి రోజు

బాలా త్రిపురసుందరీ దేవి అలంకారం

07/10/2021 గురువారము, ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి.

"హ్రీంకారాసన గర్భితానల శిఖాం 
సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబర ధారిణీం వరసుధా దౌతాం త్రినేత్రోజ్జ్వలామ్ 
వందే పుస్తక పాశమంకుశ ధరాం స్రగ్భూషితాముజ్జ్వలా౦ 
త్వాం గౌరీం త్రిపురాం పరాత్పర కళాం శ్రీచక్ర సంచారిణీం 

అమ్మవారి రూపాల్లో మొదటి రోజు బాలా త్రిపురసుందరి అలంకారం విశేషంగా చెప్పబడింది. బాల అంటే చిన్నపిల్ల అని అర్ధం. అమ్మవారు మొదట మన ఇంట్లో చిన్నపిల్ల రూపంలో వస్తుంది. మన ఇంట్లో చిన్నపిల్లలు అమ్మవారి బాలాత్రిపురసుందరి ప్రతిరూపాలే. ఈ రోజున అమ్మను కొలిచి ఆమెను ధ్యానిస్తే మన సంతానం ఏ ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంగా, ఉన్నతంగా తీర్చిదిద్దబడతారు. సంతానం లేని వారికి సంతాన సౌభాగ్యం లభిస్తుంది.

గులాబిరంగు చీరలో మనకు దర్శనమిస్తుంది. అమ్మవారికి ఈ రోజు నైవేద్యం కట్టె పొంగలి,

రెండవ రోజు గాయత్రీదేవి అలంకారం
08.10. 2021, శుక్రవారము.

"ముక్తావిద్రుమ హేమనీల ధవళచ్చాయెర్ములైః తీక్షణై: యుక్తామిందు నిబద్ధ రత్న మకుటాం తత్వార్థ వర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాంకుశకశాం శుభ్రం కపాలం గదాం శంఖ చక్ర మదారవింద యుగళం హసైర్వహంతీం భజే"

నవరాత్రుల్లో అమ్మవారు రెండవరోజు గాయత్రీదేవి రూపంలో " మనకు దర్శనమిస్తుంది. గాయత్రీదేవి మనకు సూర్య సంబంధమైన దేవత. ఈమెను కొలవడం వల్ల కుటుంబంలో ఆరోగ్య సంబంధమైన
ఇబ్బందులు ఉండవు. ఈ అమ్మవారు విశేషంగా ఐదు ముఖాలతో మనలను అనుగ్రహిస్తుంది. అమ్మవారు 

నారింజరంగు వస్త్రాలతో సూర్యునికి ప్రతిరూపంగా ' దర్శనమిస్తుంది. 
ఈరోజు అమ్మవారికి నైవేద్యం చిత్రాన్నం.


మూడవరోజు అమ్మవారి అలంకారం అన్నపూర్ణాదేవి.
09.10.2021, శనివారం ఆశ్వయుజ శుద్ధ తదియ/ చవితి

ఉర్వీ సర్వ జయేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ నారీ నీల సమాన కుంతల ధరీ నిత్యాన్నదానేశ్వరీ సాక్షాన్ మోక్షకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

 'అన్నపూర్ణ, | సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే' 
అంటూ కొలిచే ఈ అమ్మ మన అందరికీ ఇంట్లో కొదువ లేకుండా ధాన్యాన్ని సమకూర్చే దేవత. శివుడంతటివాడికే అమ్మయై భిక్ష వేసింది. ఆమె సంతానంలాంటి మనందరం సుఖసంతోషాలతో విలసిల్లాలని మనలను కరుణిస్తుంది. ఈ రోజు | అన్నదానం చేయడం విశేషం.

అమ్మవారు లేత గోధుమరంగు (హాఫ్ వైట్) చీర ధరించి భక్తులను అనుగ్రహిస్తుంది. అదేవిధంగా ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే పదార్థం కొబ్బరి అన్నం.

నాల్గవరోజు | లలితా త్రిపురసుందరీదేవి అలంకారం
10.10.221. ఆదివారము, ఆశ్వయుజ శుద్ధ పంచమి

ప్రాతః స్మరామి లలితా వదనారవిందం బింబాధరం పృథుల మౌక్తిక శోభినాశమ్ ఆకర్షదీర్ఘ నయనం మణికుండలాధ్యం.
మందస్మితం మృగమదోజ్ఞుల ఫాలదేశమ్ "లకార రూపా లలితా, వాణీ లక్ష్మీ నిషేవితా"గా పిలువబడే అమ్మ | నవరాత్రుల్లో ఆరవరోజు లలితా త్రిపురసుందరిగా దర్శనమిస్తుంది. | అమ్మను ఈరోజు సేవిస్తే సర్వ విధ సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. అత్యున్నత " స్థితి లభిస్తుంది. ఈ రోజు అమ్మవారి వ్రతం - ఉపాంగ లలితావ్రతం ఆచరిస్తారు.

అమ్మవారు ఎరుపురంగు చీరను ధరించి మన మనోకామనలను నెరవేరుస్తుంది. ఈరోజు అమ్మకు సమర్పించే నైవేద్యం దధ్యోజనం.

ఐదవ రోజు | మహాలక్ష్మి దేవి అలంకారం
11.10 2021. సోమవారము, ఆశ్వయుజ శుద్ధ షష్టి

లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ధి విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం

నవరాత్రుల్లో విశేషమైన నాలుగవ రోజు మహాలక్ష్మి అమ్మవారుగా దర్శనమిస్తుంది. ఈరోజు అమ్మను ఈ రూపంలో కొలవడం వల్ల అన్ని రకాల సంపదలు లభిస్తాయి. ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, విద్యాలక్ష్మి, విజయలక్ష్మి, సంతానలక్ష్మి, గజలక్ష్మి... వంటి ఎనిమిది రూపాల్లో ఉన్న అష్టలక్ష్ములను కొలిచిన ఫలితం లభిస్తుంది.

ఆకుపచ్చరంగు చీరలో దర్శనమిచ్చే అమ్మ చాలా విశేష అలంకారంతో మనలను కరుణిస్తుంది. ఈరోజు మహాలక్ష్మి అమ్మవారికి సమర్పించే నైవేద్యం అల్లం గారెలు,

ఆరవ రోజు | సరస్వతీదేవి అలంకారం 12/10/2021 ఆశ్వయుజ శుద్ధ సప్తమి (మూలనక్షత్ర సంబంధాన)

ఘంటాశూల హలాని శంఖ ముసలే చక్రం ధనుస్సాయకం హస్తాబ్జెర్దధతీం ఘనాంత విలసత్ శీతాంశు తుల్యప్రభామ్ గౌరీదేహ సముద్భవాం త్రిజగతా మాధారభూతాం మహా పూర్వా మత్ర సరస్వతీ మనుభజే శుంభాది దైత్యార్థినీమ్

ఐదవరోజు పంచమి మూల నక్షత్రం రోజు నవరాత్రుల్లో సరస్వతీదేవి అవతారంలో కొలువై ఉన్న మన త్రిశక్తులు చదువుల తల్లిగా మన పూజలు అందుకుంటుంది. ఈ రోజు అమ్మవారికి అభిషేకం చేసి, పుస్తక పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం మనపై ఉంటుంది. పిల్లలు విద్యా విషయంగా ఎంతో వృద్ధి చెందుతారు.
తెల్లని వస్త్రాలు ధరించి అమ్మ దేదీప్యమానంగా వెలుగుతూ మనకు దర్శనమిస్తుంది. ఈరోజు అమ్మకు శాకాన్నం నైవేద్యంగా సమర్పిస్తారు.


ఏడవ రోజు దుర్గాదేవి అలంకారం
13.10.2021, బుధవారము, ఆశ్వయుజ శుద్ధ అష్టమి

విద్యుద్భామ సమప్రభాం మృగపతి స్కంధ స్థితాం భీషణాం కన్యాభిః కరవాల భేట విలసద్ధస్తాభిరా సేవితాం
హసైః చక్ర గదాసి భేట విశిఖాం చాపం గుణం తర్జనీం చిత్రాణా మనలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే 

దుర్గాదేవి ధైర్యానికి ప్రతీకగా నిలిచి నవరాత్రుల్లో ఏడవవరోజు విశేషంగా దర్శనమిస్తుంది. సింహవాహినియైన అమ్మ మన కార్యాలను నిర్విఘ్నంగా నెరవేర్చడానికి ధైర్యాన్ని అందిస్తుంది. ఈ అమ్మను కొలిస్తే సర్వకార్యసిద్ధి కలుగుతుంది. అటువంటి అమ్మ నవరాత్రుల్లో దుర్గాష్టమినాడు విశేష పూజలందుకుంటుంది.

నెమిలిపింఛం రంగు/ఎరుపు రంగు చీర ధరించి అమ్మ అభయాన్ని కలిగిస్తుంది. అమ్మవారికి నైవేద్యంగా శర్కర పొంగలి సమర్పిస్తారు.

ఎనిమిదరోజు మహిషాసురమర్దనీదేవి అలంకారం
14.10.2021, గురువారము, ఆశ్వయుజ శుద్ధ నవమి

మహిష మస్తక నృత్త వినోదిని స్ఫుట రణన్మణి నూపుర మేఖలా జనన రక్షణ మోక్ష విధాయిని జయతి శుంభ నిశుంభ నిషూదని 

నవరాత్రుల్లో మహర్నవమిగా పేర్కొనే ఎనిమిదవరోజు అమ్మవారు మపహిషాసుర మర్దనిగా అవతారం దాల్చుతుంది. మహిషుడిని సంహరించిన అమ్మ ఆపదల్లో మనకు అండగా ఉంటుంది. దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేసి లోకం సుఖ శాంతులతో విలసిల్లే విధంగా కాపాడుతుంది. ఈరోజు అమ్మను సేవించడంవల్ల మన ఆపదలు, భయాలు అన్నీ తొలగుతాయి.

ముదురు నీలం రంగు వస్త్రాలు ధరించి అమ్మ మహిషాసుర మర్దనిగా మనకు దర్శనమిస్తుంది. ఈ రోజు అమ్మకు సమర్పించే నైవేద్యం పాయసాన్నం.

తొమ్మిదవరోజు కళ్యాణకామేశ్వరి అలంకారం
15.10. 2021, శుక్రవారము, ఆశ్వయుజ శుద్ధ దశమి

మహాకాళీ మహాలక్ష్మీ మహా సారస్వతీ ప్రభా | ఇష్టకామేశ్వరీ కుర్యాత్ విశ్వశ్రీః విశ్వమంగళమ్ || షోడశీ పూర్ణచంద్రాభా మల్లికార్జున గేహినీ | ఇష్టకామేశ్వరీ కుర్యాత్ జగన్నీరోగ శోభనమ్ || జగద్ధాత్రీ లోకనేత్రీ సుధా నిష్యంది సుస్మితా | ఇష్టకామేశ్వరీ కుర్యాత్ లోకం సద్బుద్ధి సుందరమ్ | పరమేశ్వర వాల్లభ్య దివ్య సౌభాగ్య సుప్రభా | ఇష్టకామేశ్వరీ దద్యాత్ మాంగల్యానంద జీవనమ్||

విజయదశమినాడు అధిష్టాన దైవమైన కళ్యాణకామేశ్వరీ అమ్మవారి | రూపంలో మహాకాళీ, మహాలక్ష్మి, మహా సరస్వతులు ముగ్గురు మనకు కన్నుల విందుగా దర్శనమిస్తారు. ఈ అమ్మను సేవిస్తే సమస్త దేవతలను పూజించినట్లే, అమ్మ ముగ్గురమ్మల మూల రూపం. ఈమెను సేవించడం వల్ల సంపద, శక్తి జ్ఞానం సిద్ధించి అన్ని కార్యాలూ విజయవంతమౌతాయి.

 |ఈరోజు అమ్మవారు పసుపుపచ్చని రంగు వస్త్రాలు ధరించి ఆనందస్వరూపిణిగా దర్శనమిస్తుంది. ఈరోజు అమ్మవారికి నివేదించే పదార్థాలు చిత్రాన్నం, లడ్డూలు

No comments: