Translate

Monday, March 28, 2022

ఇంట్లో ఎవరైనా మరణిస్తే ఏడాది వరకు పూజలు చేయకూడదా?

బయట వినిపించే మాటల్లో ఇదొకటి. కుటుంబసభ్యులు ఎవరైనా మరణిస్తే, ఏడాది వరకు ఎటువంటి పూజలు చేయకూడదని ప్రచారం చేస్తున్నారు. కొందరైతే కనీసం దీపం కూడా వెలిగించరు, దేవతలందరిని ఒక బట్టలో చుట్టి, అటక మీద పెట్టేస్తారు. సంవత్సరీకాలన్నీ అయిపోయిన తర్వాత మరుసటి ఏడాది దేవుళ్ళ చిత్రపటాలను క్రిందకు దింపి, శుభ్రం చేసి పూజ చేస్తారు. అంటే ఆ వ్యక్తి మరణించిన ఇంట్లో ఏడాది పాటు దీపారాధాన, దైవానికి పూజ, నివేదన ఉండవన్నమాట. ఇది సరైన పద్ధతి కాదు. శాస్త్రం ఇలా చెప్పలేదు. 


దీపం లేని ఇల్లు స్మశానంతో సమానం. దీపం శుభానికి సంకేతం. దీపం ఎక్కడ వెలిగిస్తే అక్కడకు దేవతలు వస్తారు. ప్రతి ఇంట్లోను నిత్యం దీపారాధాన అనేది జరగాలి. మరణం సంభవించిన ఇంట్లో 11 వ రోజు తర్వాత శుద్ధి కార్యక్రమం జరుగుతుంది. 12 వ రోజు శుభస్వీకారం జరుగుతుంది. ఆ కుటుంబం ఆ 11 రోజులు మాత్రమే ప్రత్యేకంగా పూజ చేయకూడదు. అంతవరకే శాస్త్రంలో చెప్పబడింది. అంతేకానీ ఏడాది పాటు దీపం వెలిగించకూడదని, పూజలు చేయకూడదని చెప్పలేదు. నిజానికి సూతకంలో ఉన్న సమయంలో కూడా సంధ్యావందనం చేయాలని, అర్ఘ్యప్రధానం వరకు బాహ్యంలో చేసి, మిగితాది మానసికంగా చేయాలని శాస్త్రం చెప్పింది. ఏడాది పాటు ఆలయాలకు వెళ్ళకూడదని కూడా చెప్పలేదు. మనం నిత్యం ఇంతకముందు ఏదైతే చేస్తున్నామో, అది నిరభ్యంతరంగా కొనసాగించవచ్చు. కొత్త పూజలు అనేవి ప్రారంభించకూడదు. ఇంతకముందు రోజూ ఆలయానికి వెళ్తుంటే, సూతకం అయిన తర్వాత కూడా యధావిధిగా ఆలయదర్శనం చేయవచ్చు. 


మనం నిత్యం అర్చించడం వలన మనం పూజించే చిత్రపటాల్లో దేవతలు వచ్చి కూర్చుంటారు. అలా ఏడాది పాటు వారికి ధూప, దీప, నైవేధ్యాలు మొదలైన ఉపచారాలు చేయకుండా, బట్టలో చుట్టి పక్కన పెట్టడమే తప్పు. అది దోషము, అరిష్టము కూడా. కనుక తప్పకుండా ఇంట్లో నిత్య దీపారాధన, దైవారాధన జరగాలి. ఇంటికి గానీ, ఇంటి సభ్యులకు కానీ ఎలాంటి దోషాలున్నా, వాటిని అన్నిటిని ఆపే శక్తి ఆ ఇంట్లో చేసే దైవారాధనకు ఉంటుంది. కనుక ఎన్నడూ దైవారాధన, దీపారాధన మానకూడదు. ఈ విషయంలో పూజలు  చేయవచ్చు అనేకంటే చేసి తీరాలి అని చెప్పడం సరైన సమాధనం అవుతుందేమో!......(సేకరణ)

ఋణవిమోచనం

సాధారణంగా అందరికి ఉన్న సమస్య ఋణబాధలు, ఈ ఋణ బాధలు అంటే కేవలం అప్పు సమస్య మటుకే కాదు శత్రువుల నుండి భయం, అనారోగ్యం, ఎదో ఒక మానసిక మైన సమస్యతో బాధపడటం, తరచుగా అవమానాలు ఏదురుకోవడం ,చేసిన కష్టానికి గుర్తింపు లేక పోవడం ఇవన్నీ కూడా ఋణ బాధల కిందకి వస్తుంది...
కుదిరితే జోతీస్కుని కలిసి మీకు పంచమ స్థానంలో అధిపతిగా ఎవరు ఉన్నారో తెలుసుకుని ఆ దేవత స్త్రోత్రం పూజ చేయడం వల్ల మీకు ఋణవిమోచనం కలుగుతుంది.. మీ జాతకంలో పంచమ స్థానంలో ఎవరు అదిదేవతగా ఉన్నారో తెలుసుకుని ఇక్కడ చెప్తున్న పరిహారాలు కూడా చేసుకోవచ్చు....

కుజగ్రహం: సాధారణంగా ఇటువంటి ఋణ బాధలు తొలగడానికి కుజ గ్రహ పూజ లు కుజగ్రహానికి అధిష్టాన దేవత అయిన సుబ్రమణ్యం స్వామి ని ఆరాధిస్తారు. ఎందుకు కుజ గ్రహాన్ని ఆరాధిస్తారు వేరే గ్రాహం పెరు ఎందుకు చెప్పరు అంటే కుజుడు మోక్ష కారకుడు.. మోక్షానికి మార్గం చూపించేవాడు... మోక్షం సిద్దిమ్పచేసే వాడు కుజుడు, మనకు ఉన్న ఋణము నుండి విముక్తి కలగాలి అంటే ఋణ బాధల నుండి మోక్షం పొందాలి అంటే కుజగ్రహాన్ని ఆ కుజుడు అధిష్టాన దేవత అయిన సుబ్రహ్మణ్య స్వామి ని ప్రసన్నం చేసుకోవాలి...

సుబ్రహ్మణ్యం స్వామి ఆరాధన: సుబ్రహ్మణ్యం స్వామి గ్యానానికి కారకుడు, గ్యానం పొందిన వాడు అన్నిటినుండి విముక్తి మార్గం పొందుతాడు.. ఈ సుబ్రహ్మణ్య స్వామి ని మంగళవారం నాడు భక్తి గా పూజించి అద్భుతమైన ఫలితం పొందవచ్చు...

ఋణ బాధలు ఏవైనా కావచ్చు, బాధపడే వాళ్ళు ప్రతి మంగళవారం నాడు తలస్నానం చేసి ఎరుపు రంగు ,ఎరుపు రంగు కలిసిన బట్టులు గాని, ధరించాలి ఎరుపు రంగు బొట్టు కుంకుమ ధరించాలి, సుబ్రమణ్య స్వామి ఫోటో ని అలంకరించాలి గంధం కుంకుమ తో అలకరించండి.. కేవలం ఎరుపు రంగు పుష్పలతో సుబ్రమణ్య స్సామి ని అలంకరించాలి, సుబ్రహ్మణ్యుడు షన్ముఖుడు కనుక ఒకే ప్రమిధలో ఆరు ఒత్తులు విడివిడిగా ఒకే ప్రమిధలో ఆవు నేతితో వెలిగించాలి.. బెల్లం నివేదన చేసి...(ఈ స్వామికి బెల్లం పాయసం అంటే మహా ఇష్టం మంగళవారం నాడు అది నివేదన చేసి ఆ ప్రసాదం మీరు తింటే త్వరగా ఫలితం దక్కుతుంది)

" ఓం శం శరవణనభవ ". ఈ  మంత్రాన్ని పసుపు కలిపిన అక్షంతలు స్వామి ఫోటో కి అర్చన చేస్తూ 108 సార్లు చెప్పాలి, ఋణ విమోచన అంగారక స్త్రోత్రం " చదవాలి ,గుడికి వెళ్లి నవగ్రహాలు చుట్టి రావాలి, ఈ విధముగా మంగళవారం రోజు మొదలు పెట్టి ఒక ఆరు రోజులు చేయాలి, తర్వాత ప్రతి మంగళవారం రోజు మటుకు ఇదే విధంగా తలస్నానం చేసి, సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసి గుడికి వెళ్లి నవగ్రహ ప్రదర్శన చేసి రావాలి.. మంగళవారం నాడు మాంసము తినకూడదు.. వీలైతే ఏక భక్తం అల్పాహారం లాంటివి పాటిస్తే ఇంకా మంచిది.

ఇంక రెండో పద్దతి ఋణ విమోచన వినాయక పూజ.....

ఈ ఋణ విమోచన వినాయక పూజకు మీరు ఎటువంటి లోహాన్ని వాడకూడదు కేవలం మట్టితో చేసుకున్న వినాయకుడి విగ్రహం వాడుకోవాలి....
బుధవారం నాడు మొదలు పెట్టి శుక్రవారం వరకు మూడు రోజులు ఈ పూజ చేయాలి.

ఒక చిన్న పీట లాంటిది ఏర్పాటు చేసి వినాయకుడిని అలంకారం చేసి మూడు ఒత్తులు ఒక ప్రమిధలో వేసి ఆవు నేతి తో మూడు ఒత్తులు వెలిగించి.. 
మూడు ఒత్తులు విడివిడిగా ఒకే ప్రమిధలో వెలగాలి...
బెల్లం పానకం, ఏదైనా పండ్లు నైవేద్యం పెట్టి శుభ్రంగా ఉన్న గరికను తెచ్చుకోవాలి ఆ గరికను కడిగి తుడవాలి అలాంటి సుభ్రమైన గరిక తో.. ముందుగా

1. ఓం గం గణపతియే నమః"  అని 108 సార్లు చెప్తూ గరికతో అర్చన చేయాలి..

2.ఓం గణేష ఋణ ఛిoధి నమః " అని  108 సార్లు గరికతో అర్చన చేయాలి.

3. ఓం శ్రీ ఋణ విమోచన గణపతియే నమః " అని గరికతో 108 సార్లు అర్చన చేయాలి..

ఈ మూడు నామాలతో అర్చన చేసి హారతి ఇవ్వాలి.. ఇలా మూడు రోజులు చేశాక ప్రతి బుధవారం రోజు ఉదయం తలస్నానం చేసుకుని ఇలా వారానికి ఒక్క రోజు పూజ చేయాలి మీకు ఉన్న ఋణభాదలు తీరే వరకు.ఋణ బాధలు తీరాక ఆ విగ్రహం మళ్ళీ వచ్చి న వినాయక చవితి సమయంలో మట్టి వినాయకుడితో పాటు పూజ చేసి నిమార్జన చేయాలి.

ఇక ఇంకో ముజ్యమైన సమస్య జీవనోపాది, ఉద్యోగ సమస్య, లేక ఉద్యోగంలో ప్రమోష లేకపోవడం గుర్తింపు లేకపోవడంతో పాటు కష్టానికి తగ్గ ఫలితం లేకపోవడం వీటికి ఒక మంచి పరిస్కార మార్గం   లక్ష్మీపూజ......

శుక్రవారం నాడు తలస్నానం చేసి గడపలకు పేరటి గుమ్మం ఉంటే అక్కడ గడపకు కూడా పసుకుంకుమా  పువ్వులు అలంకరించి.. లక్ష్మీ దేవి కి తామర పువ్వుని అలంకరించి , బియ్యంపిండి, బెల్లం తో చేసిన చలిబిండి నైవేద్యం పెట్టి ఒకే కుందిలో విడివిడిగా ఐదు ఒత్తులతో అవునేతి తో మటుకే దీపారాధన చేసి అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తర స్త్రోత్రం , కనకధారా స్త్రోత్రం పారాయణం చేసి హారతి ఇవ్వాలి..ఇలా ప్రతి శుక్రవారం నాడు చేస్తే చాలా మంచి ఫలితం వస్తుంది..

గమనిక: ఈ పరిహారాలు ఉదయం పూట చేసేవే, మాంసాహారం పూజ రోజుల్లో నిషేధం, తలస్నానం తప్పని సరి, త్వరగా మంచి ఫలితం రావాలి అనుకునే వారి వారి వీలుని బట్టి 41 మండల పూజ చెలుకోవచ్చు అది ఓపిక కానీ పైన చెప్పిన ప్రకారం ఆచరిస్తే చాలు ముందుగా మీ పరిస్థితి చక్కబడటం మొదలవుతుంది తర్వాత సమస్య కు పరిస్కారం లభిస్తుంది, అన్ని ఋణ బాధలనుండి విముక్తి లభిస్తుంది.. ఆదాయం వచ్చే అవకాశం వస్తుంది.

క్షౌర కర్మ

క్షౌర  కర్మను గురించి  శాస్త్రము  ఒక  క్రమ  పద్దతిని  నిర్దిష్టించినది .


అశ్మశ్రూణ్యగ్రే  వాపయతే  అథోపకక్షావథ  కేశానాథ లోమాన్యథ నాఖాని |   . 


అథైతన్మనుర్వప్త్రే   మిథునమపశ్యత్  | 

స శ్మశ్రూణ్యగ్రే అవపత్  | 

అథోపకక్షౌ అథకేశాన్. 


తాత్పర్యము: 

ముందుగా  గడ్డమును  కుడి  ప్రక్కనుండి  ప్రారంభించి  పూర్తి  చేయవలెను . పిమ్మట   మీసములను , కక్షము  (చంకలు) , పిదప  తల  వెంట్రుకలను  కత్తిరించ వలయును  చివరగా  గోళ్ళను  కత్తిరించుకొనవలెనని  విధానము  చెప్పబడినది .  తూర్పు  కాని  ఉత్తర  ముఖముగా  కూర్చొని  చేయించుకోవలెను  


క్షౌరకర్మ  చేయించుకోకూడని  సమయాలు : (తిథులు) 

1) పాడ్యమి 

2) షష్టి 

3) అష్టమి  

4) నవమి  (శుక్ల పక్షము )  

5) ఏకాదశి 

6) చతుర్దశి  

7) పౌర్ణమి  

8) అమావాస్య   

9) జన్మ  నక్షత్రం  ఉన్న  రోజు  

10) సూర్య  సంక్రమణం  నాడు 

11) వ్యతీపాతం  

12) విష్టి  (భద్ర ) 


రోజులు  - సమయములు  -(చెయ్యకూడనివి)

1) శనివారము 

2) ఆదివారము   

3) మంగళవారము  

4) శ్రాద్ధ  దినము  నాడు 

5) ప్రయాణము  చేయబోయే  రోజు  

6) అభ్యంగన  స్నానము  చేసిన  తరువాత  

7) భోజనము  చేసిన  తరువాత  

8) సంధ్యా  సమయాల్లో   ( 5 - 7 am ; 11-13 hrs ; 17 - 19 hrs)  

9) రాత్రి  పూట   

10) మంగళ  కార్యాలు  (వ్రతాలు  లాంటివి )  చేయదలచిన  దినము  

11) మంగళ  కరమైన  కట్టుబొట్టు   ఆభరణాలు  అలంకారములు  చేసుకున్న   పిదప ..

12) యుద్దారంభామున  

13) వైధృతి  యందు   

పైన చెప్పిన రోజులు, సమయాల్లో  క్షౌరకర్మ  కూడదు 


1) ఆదివారము  క్షౌరము  చేయించుకుంటే  - 1 మాసము  ఆయుక్షీణము  

2) శనివారము  క్షౌరము చేయించుకుంటే  - 7 మాసాలు  ఆయుక్షీణము  

3) మంగళవారము  క్షౌరము చేయించుకుంటే - 8 మాసాలు   ఆయుక్షీణము  

ఆయా  దినములకు  చెందిన  అభిమాన  దేవతలు  ఆయు  క్షీణింపచేయుదురు  . 

ఇదే విధముగా ... 

1) బుధవారము క్షౌరము చేయించుకుంటే  - 5 మాసాలు  ఆయువృద్ధి  

2) సోమవారము  క్షౌరము చేయించుకుంటే - 7 మాసాలు  ఆయువృద్ధి  

3) గురువారము  క్షౌరము చేయించుకుంటే - 10 మాసాలు  ఆయువృద్ధి 

4) శుక్రవారము క్షౌరము చేయించుకుంటే - 11 మాసాలు  ఆయువృద్ధి  

ఆయా  దినములయోక్క  అభిమాన   దేవతలు  ఆయు  వృద్ధి  చేయుదురు . 

కొడుకు  పుట్టుక  కోసం  ఆశిస్తున్న  వారు , ఒకే  ఒక్క   కొడుకు  ఉన్నవారు సోమవారము  క్షౌరము  చేయించుకోకూడదు .

అలాగే  విద్య , ఐశ్వర్యం  కోరుకొనే    వారు  గురువారము  క్షౌరము చేయించుకోకూడదు.

Saturday, March 26, 2022

తీక్షణదంష్ట్ర కాలభైరవ అష్టకం (Teekshna Damstra Kalabhairava Ashtakam)

ఓం యంయంయం యక్షరూపం దశదిశివిదితం భూమికం పాయమానం
సంసంసం సంహారమూర్తిం శిరముకుటజటా శేఖరం చంద్రబింబం ।
దందందం దీర్ఘకాయం విక్రితనఖ ముఖం చోర్ధ్వరోమం కరాలం
పంపంపం పాపనాశం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్ ॥ 1 ॥
రంరంరం రక్తవర్ణం కటికటితతనుం తీక్ష్ణదంష్ట్రాకరాలం
ఘంఘంఘం ఘోష ఘోషం ఘ ఘ ఘ ఘ ఘటితం ఘర్ఝరం ఘోరనాదమ్ ।
కంకంకం కాలపాశం దృక దృక దృకితం జ్వాలితం కామదేహం
తంతంతం దివ్యదేహం ప్రణమత సతతం, భైరవం క్షేత్రపాలమ్ ॥ 2 ॥
లంలంలంలం వదన్తం ల ల ల ల లలితం దీర్ఘ జిహ్వా కరాళం
ధుం ధుం ధుం  ధూమ్రవర్ణం స్ఫుట వికటముఖం భాస్కరం భీమరూపమ్ ।
రుంరుంరుం రుండమాలం రవితను నియతం తామ్రనేత్రం కరాళం
నంనంనం నగ్నభూషం ప్రణమత సతతం, భైరవం క్షేత్రపాలమ్ ॥ 3 ॥
వంవంవం వాయువేగం నతజనసదయం బ్రహ్మపారం పరన్తం
ఖంఖంఖం ఖడ్గహస్తం త్రిభువనవిలయం భాస్కరం భీమరూపమ్ ।
చంచంచం చలిత్వాచల చల చలితా చాలితం భూమిచక్రం
మంమంమం మాయి రూపం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్ ॥ 4 ॥
శం శం శం శఙ్ఖహస్తం శశికరధవళం మోక్ష సంపూర్ణ తేజం
మం మం మం మం మహాన్తం కులమకులకుళం మంత్రగుప్తం సునిత్యమ్ ।
యం యం యం భూతనాథం కిలికిలికిలితం బాలకేళిప్రదానం
అం అం అం అంతరిక్షం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్ ॥ 5 ॥
ఖం ఖం ఖం ఖడ్గభేదం విషమమృతమయం కాలకాలం కరాళం
క్షం క్షం క్షం క్షిప్రవేగం దహదహదహనం తప్తసన్దీప్యమానమ్ ।
హౌం హౌం హౌంకారనాదం ప్రకటితగహనం గర్జితైర్భూమికమ్పం
వంవం వం వాలలీలం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్ ॥ 6 ॥
సంసంసం సిద్ధియోగం సకలగుణమఖం దేవ దేవం ప్రసన్నమ్
పంపంపం పద్మ నాధం హరిహర మయనం చంద్ర సూర్యాగ్నినేత్రం |
ఐం ఐం ఐం ఐశ్వర్యనాధం సతత భయహరం పూర్వదేవం స్వరూపం
రౌంరౌంరౌం రౌద్రరూపం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్ ॥ 7 ॥
హం హం హం హంసయానం హసితకలహకం ముక్తయోగాట్టహాసం
ధం ధం ధం నేత్రరూపం శిరముకుటజటాబన్ధ బన్ధాగ్రహస్తమ్ ।
తం తం తంకానాదం త్రిదశలటలటం కామగర్వాపహారం,
భృం భృం భృం భూతనాథం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్ ॥ 8 ॥
ఇత్యేవం కామయుక్తం ప్రపటతి నియతం భైరవస్యాష్టకం
యో నిర్విఘ్నం దు:ఖనాశం సురభయహరణం డాకినీశాకినీనాం |
నశ్యేద్ది వ్యాఘ్రసర్పౌహుత వహసలిలే రాజ్యశంసశ్య శూన్యం
సర్వానశ్యంతి దూరం విపద ఇది బృశం చింతనాత్సర్వసిద్ధం ||
భైరవస్యాష్టకమిదం షాన్మానం యః పఠేనరః
స యాతి పరమం స్థానం యత్ర దేవో మహేశ్వరః ||
సింధూరారుణ గాత్రం చ సర్వజన్మ వినిర్మితం ||
ఇతి తీక్షణదంష్ట్ర  కాలభైరవాష్టకం సంపూర్ణం
నమో భూతనాథం నమో ప్రేతనాథం
నమః కాలకాలం నమః రుద్రమాలమ్ ।
నమః కాలికాప్రేమలోలం కరాలం
నమో భైరవం కాశికాక్షేత్రపాలమ్ ॥
అవమానాలు అపనిందల తో బాధతో నలిగి పోతున్నప్పుడు, జీవనం సమస్యలుగా సాగుతున్నప్పుడు, అగమ్య మార్గాలలో అశాంతి వచ్చినప్పుడు, అనవసర భయాలు మిమ్మల్ని చుట్టిముట్టి నప్పుడు ఈ తీక్షణదంష్ట్ర కాలభైరవాష్టకం నిత్యపఠనం సర్వరక్షాకరమై, సర్వ దోషాల నుండి మిమ్మల్ని కాపాడుతుంది.