సాధారణంగా అందరికి ఉన్న సమస్య ఋణబాధలు, ఈ ఋణ బాధలు అంటే కేవలం అప్పు సమస్య మటుకే కాదు శత్రువుల నుండి భయం, అనారోగ్యం, ఎదో ఒక మానసిక మైన సమస్యతో బాధపడటం, తరచుగా అవమానాలు ఏదురుకోవడం ,చేసిన కష్టానికి గుర్తింపు లేక పోవడం ఇవన్నీ కూడా ఋణ బాధల కిందకి వస్తుంది...
కుదిరితే జోతీస్కుని కలిసి మీకు పంచమ స్థానంలో అధిపతిగా ఎవరు ఉన్నారో తెలుసుకుని ఆ దేవత స్త్రోత్రం పూజ చేయడం వల్ల మీకు ఋణవిమోచనం కలుగుతుంది.. మీ జాతకంలో పంచమ స్థానంలో ఎవరు అదిదేవతగా ఉన్నారో తెలుసుకుని ఇక్కడ చెప్తున్న పరిహారాలు కూడా చేసుకోవచ్చు....
కుజగ్రహం: సాధారణంగా ఇటువంటి ఋణ బాధలు తొలగడానికి కుజ గ్రహ పూజ లు కుజగ్రహానికి అధిష్టాన దేవత అయిన సుబ్రమణ్యం స్వామి ని ఆరాధిస్తారు. ఎందుకు కుజ గ్రహాన్ని ఆరాధిస్తారు వేరే గ్రాహం పెరు ఎందుకు చెప్పరు అంటే కుజుడు మోక్ష కారకుడు.. మోక్షానికి మార్గం చూపించేవాడు... మోక్షం సిద్దిమ్పచేసే వాడు కుజుడు, మనకు ఉన్న ఋణము నుండి విముక్తి కలగాలి అంటే ఋణ బాధల నుండి మోక్షం పొందాలి అంటే కుజగ్రహాన్ని ఆ కుజుడు అధిష్టాన దేవత అయిన సుబ్రహ్మణ్య స్వామి ని ప్రసన్నం చేసుకోవాలి...
సుబ్రహ్మణ్యం స్వామి ఆరాధన: సుబ్రహ్మణ్యం స్వామి గ్యానానికి కారకుడు, గ్యానం పొందిన వాడు అన్నిటినుండి విముక్తి మార్గం పొందుతాడు.. ఈ సుబ్రహ్మణ్య స్వామి ని మంగళవారం నాడు భక్తి గా పూజించి అద్భుతమైన ఫలితం పొందవచ్చు...
ఋణ బాధలు ఏవైనా కావచ్చు, బాధపడే వాళ్ళు ప్రతి మంగళవారం నాడు తలస్నానం చేసి ఎరుపు రంగు ,ఎరుపు రంగు కలిసిన బట్టులు గాని, ధరించాలి ఎరుపు రంగు బొట్టు కుంకుమ ధరించాలి, సుబ్రమణ్య స్వామి ఫోటో ని అలంకరించాలి గంధం కుంకుమ తో అలకరించండి.. కేవలం ఎరుపు రంగు పుష్పలతో సుబ్రమణ్య స్సామి ని అలంకరించాలి, సుబ్రహ్మణ్యుడు షన్ముఖుడు కనుక ఒకే ప్రమిధలో ఆరు ఒత్తులు విడివిడిగా ఒకే ప్రమిధలో ఆవు నేతితో వెలిగించాలి.. బెల్లం నివేదన చేసి...(ఈ స్వామికి బెల్లం పాయసం అంటే మహా ఇష్టం మంగళవారం నాడు అది నివేదన చేసి ఆ ప్రసాదం మీరు తింటే త్వరగా ఫలితం దక్కుతుంది)
" ఓం శం శరవణనభవ ". ఈ మంత్రాన్ని పసుపు కలిపిన అక్షంతలు స్వామి ఫోటో కి అర్చన చేస్తూ 108 సార్లు చెప్పాలి, ఋణ విమోచన అంగారక స్త్రోత్రం " చదవాలి ,గుడికి వెళ్లి నవగ్రహాలు చుట్టి రావాలి, ఈ విధముగా మంగళవారం రోజు మొదలు పెట్టి ఒక ఆరు రోజులు చేయాలి, తర్వాత ప్రతి మంగళవారం రోజు మటుకు ఇదే విధంగా తలస్నానం చేసి, సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసి గుడికి వెళ్లి నవగ్రహ ప్రదర్శన చేసి రావాలి.. మంగళవారం నాడు మాంసము తినకూడదు.. వీలైతే ఏక భక్తం అల్పాహారం లాంటివి పాటిస్తే ఇంకా మంచిది.
ఇంక రెండో పద్దతి ఋణ విమోచన వినాయక పూజ.....
ఈ ఋణ విమోచన వినాయక పూజకు మీరు ఎటువంటి లోహాన్ని వాడకూడదు కేవలం మట్టితో చేసుకున్న వినాయకుడి విగ్రహం వాడుకోవాలి....
బుధవారం నాడు మొదలు పెట్టి శుక్రవారం వరకు మూడు రోజులు ఈ పూజ చేయాలి.
ఒక చిన్న పీట లాంటిది ఏర్పాటు చేసి వినాయకుడిని అలంకారం చేసి మూడు ఒత్తులు ఒక ప్రమిధలో వేసి ఆవు నేతి తో మూడు ఒత్తులు వెలిగించి..
మూడు ఒత్తులు విడివిడిగా ఒకే ప్రమిధలో వెలగాలి...
బెల్లం పానకం, ఏదైనా పండ్లు నైవేద్యం పెట్టి శుభ్రంగా ఉన్న గరికను తెచ్చుకోవాలి ఆ గరికను కడిగి తుడవాలి అలాంటి సుభ్రమైన గరిక తో.. ముందుగా
1. ఓం గం గణపతియే నమః" అని 108 సార్లు చెప్తూ గరికతో అర్చన చేయాలి..
2.ఓం గణేష ఋణ ఛిoధి నమః " అని 108 సార్లు గరికతో అర్చన చేయాలి.
3. ఓం శ్రీ ఋణ విమోచన గణపతియే నమః " అని గరికతో 108 సార్లు అర్చన చేయాలి..
ఈ మూడు నామాలతో అర్చన చేసి హారతి ఇవ్వాలి.. ఇలా మూడు రోజులు చేశాక ప్రతి బుధవారం రోజు ఉదయం తలస్నానం చేసుకుని ఇలా వారానికి ఒక్క రోజు పూజ చేయాలి మీకు ఉన్న ఋణభాదలు తీరే వరకు.ఋణ బాధలు తీరాక ఆ విగ్రహం మళ్ళీ వచ్చి న వినాయక చవితి సమయంలో మట్టి వినాయకుడితో పాటు పూజ చేసి నిమార్జన చేయాలి.
ఇక ఇంకో ముజ్యమైన సమస్య జీవనోపాది, ఉద్యోగ సమస్య, లేక ఉద్యోగంలో ప్రమోష లేకపోవడం గుర్తింపు లేకపోవడంతో పాటు కష్టానికి తగ్గ ఫలితం లేకపోవడం వీటికి ఒక మంచి పరిస్కార మార్గం లక్ష్మీపూజ......
శుక్రవారం నాడు తలస్నానం చేసి గడపలకు పేరటి గుమ్మం ఉంటే అక్కడ గడపకు కూడా పసుకుంకుమా పువ్వులు అలంకరించి.. లక్ష్మీ దేవి కి తామర పువ్వుని అలంకరించి , బియ్యంపిండి, బెల్లం తో చేసిన చలిబిండి నైవేద్యం పెట్టి ఒకే కుందిలో విడివిడిగా ఐదు ఒత్తులతో అవునేతి తో మటుకే దీపారాధన చేసి అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తర స్త్రోత్రం , కనకధారా స్త్రోత్రం పారాయణం చేసి హారతి ఇవ్వాలి..ఇలా ప్రతి శుక్రవారం నాడు చేస్తే చాలా మంచి ఫలితం వస్తుంది..
గమనిక: ఈ పరిహారాలు ఉదయం పూట చేసేవే, మాంసాహారం పూజ రోజుల్లో నిషేధం, తలస్నానం తప్పని సరి, త్వరగా మంచి ఫలితం రావాలి అనుకునే వారి వారి వీలుని బట్టి 41 మండల పూజ చెలుకోవచ్చు అది ఓపిక కానీ పైన చెప్పిన ప్రకారం ఆచరిస్తే చాలు ముందుగా మీ పరిస్థితి చక్కబడటం మొదలవుతుంది తర్వాత సమస్య కు పరిస్కారం లభిస్తుంది, అన్ని ఋణ బాధలనుండి విముక్తి లభిస్తుంది.. ఆదాయం వచ్చే అవకాశం వస్తుంది.
No comments:
Post a Comment