Translate

Thursday, February 20, 2020

శివ సహస్ర నామాలు ఎలా ఉద్భవించాయి? (ఈనాడు పేపర్ నుండి సేకరణ)

విష్ణు సహస్ర నామాలను గురించి, వాటి విశేషాలను గురించి మహాభారత కథ వివరిస్తుంది. అయితే మళ్ళీ అంతటి శక్తి కలిగిన శివ సహస్ర నామాలు ఎలా ఉద్భవించాయి? దాంతో పాటుగా శ్రీ మహావిష్ణువు చేతిలోకి సుదర్శన చక్రం ఎప్పుడు వచ్చి చేరింది? అనే విషయాలను గురించి వివరించి చెప్పే ఈ కథా సందర్భం శివపురాణం కోటి రుద్ర సంహిత ముప్పై అయిదు, ముప్పై ఆరు అధ్యాయాలలో కనిపిస్తుంది. సర్వ ఆపదల నుండి ముక్తిని పొందటం కోసం శివ రూప ధ్యానం, శివ సహస్రనామ పఠనం ఉపకరిస్తాయని శ్రీ మహావిష్ణువుకు సాక్షాత్తు శివుడే చెప్పాడు. నిత్యం శివ సహస్ర నామాలను పఠించినా, పఠింపచేసినా దుఃఖమనేది ఉండదు. ఆపదను పొందిన వారు శివ సహస్రనామాలను యధావిధిగా వందసార్లు పఠిస్తే శుభం కలుగుతుంది. ఈ స్తోత్రం రోగాలను నాశనం చేసి విద్యను, ధనాన్ని, సర్వ కామనలను నిత్య శివభక్తిని ఇస్తుంది. ఇలాంటి ఉత్తమ ఫలితాలు ఎన్నెన్నో శివ సహస్రనామ పఠితకు దక్కుతాయని శివ సహస్రనామ పఠన ఫలంలో శివుడు చెప్పాడు.

శివ సహస్ర నామాలు ఎలా ఉద్భవించాయి?

శివ సహస్ర నామాలు ఎలా ఉద్భవించాయి?

పూర్వం ఓసారి దేవతలకు, రాక్షసులకు భీకర యుద్ధం ప్రారంభమైంది. ఆ యుద్ధంలో దేవతలు ఎన్నో రకాలుగా బాధలను పొందుతూ ఉండేవారు. చివరకు వారంతా కలిసి శ్రీ మహా విష్ణువు దగ్గరకు వెళ్ళి తమ కష్టాలను తీర్చమని వేడుకొన్నారు. విష్ణువు వారందరికీ ధైర్యం చెప్పి క్షణకాలం పాటు మనస్సులో శివుడిని ధ్యానించాడు. ఆ తర్వాత తాను కైలాసపతిని ఆరాధించి దేవతలకు శత్రువుల బాధలు లేకుండా చేస్తానని విష్ణువు చెప్పి అందరినీ వారి వారి నెలవులకు పంపాడు. ఆ తర్వాత శ్రీమహా విష్ణువు దేవతల జయం కోసం కైలాసానికి వెళ్ళి అక్కడ కుండాన్ని స్థాపించి దానిలో అగ్నిని ప్రతిష్ఠించి, ఆ పక్కన ఓ పార్థివ లింగాన్ని కూడా ప్రతిష్టించి తపస్సుకు ఉపక్రమించాడు. ఎంతకాలానికీ శివుడు ప్రత్యక్షం కాలేదు. దాంతో తన తపస్సును, శివారాధనను మరింత వృద్ధి చేశాడు.

శివ సహస్ర నామాలు ఎలా ఉద్భవించాయి?

హిమాలయాల చెంతనే ఉన్న మానస సరోవరంలో లభించే అరుదైన వెయ్యి కమలాలను తెచ్చి ప్రతి రోజూ భక్తితో పూజ చేస్తూ ఉండేవాడు. దీక్షతో విష్ణువు చేస్తున్న ఆ పూజను పరీక్షించాలనుకొన్నాడు శివుడు. ఓ రోజున విష్ణువు మానస సరోవరం నుండి వెయ్యి పూవులను తెచ్చి ప్రతిరోజూ తాను శివ సహస్ర నామాలతో పూజ చేస్తున్నట్టుగానే ఆ రోజు కూడా పూజకు ఉపక్రమించాడు. శివ సహస్ర నామాలలోని తొమ్మిది వందల తొంభై తొమ్మిది నామాలను పఠిస్తూ అన్ని పూవులతోనూ పూజ చేశాడు. చిట్టచివరి నామం పఠిస్తూ పువ్వు కోసం చూసిన విష్ణువుకు అది కనిపించలేదు. ఎలాగైనా సహస్ర నామాలను పువ్వులతో కలిపి పూజ చేయాల్సిందేనని దీక్ష పట్టిన విష్ణువు కమలాన్ని పోలిన తన కన్నునే శివుడికి అర్పించి పూజ చేయాలని నిర్ణయించుకొన్నాడు. దేవతల కోసం అంతటి త్యాగానికి సిద్ధపడిన విష్ణువును చూసి శివుడు ఎంతో ఆనందించి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. లోకకల్యాణం కోసం గొప్ప త్యాగానికి సిద్ధపడిన విష్ణువుకు ఏ వరమిచ్చినా తక్కువేనని శివుడు అన్నాడు. అప్పటికి రాక్షస సంహారం కోసం తేజో రాశిలాంటి సుదర్శన చక్రాన్ని విష్ణువుకిచ్చి దాంతో దేవతలకు శత్రుపీడను తొలగించమని విష్ణువుకు చెప్పాడు శివుడు. అంతేకాక దీక్షతో శ్రీ మహావిష్ణువు పఠించిన శివ సహస్ర నామాలను ఎవరు పఠించినా వారికి సకల శుభాలు, విజయాలు చేకూరుతాయని పలికి అంతర్ధానమయ్యాడు. ఆ తర్వాత విష్ణువు నిరంతరం సుదర్శన చక్రాన్ని ధరిస్తూ దేవతల శత్రువులను సంహరిస్తూ వారికి శాంతిని కలిగించసాగాడు.ఈ కథా సందర్భంలో పవిత్రమైన శివ సహస్ర నామాలను తొలిగా జపించింది విష్ణువు అని, శివుడు విష్ణువుకు సుదర్శనాన్ని బహూకరించాడని తెలుస్తోంది. వాటితోపాటు శ్రీమహావిష్ణువు నాయకత్వ లక్షణాలు కూడా స్పష్టంగా వర్ణితమయ్యాయి. దేవతలందరికీ మేలు చేయటం కోసం ఎన్ని కష్టాలొచ్చినా నిలబడి చివరకు త్యాగానికి సహితం వెనుకాడక అంతిమంగా విజయాన్ని సాధించాడు విష్ణువు. అలాంటి నాయకత్వ లక్షణాలు ఆదర్శప్రాయమని చాటటమే ఇలాంటి కథల లక్ష్యం.

Tuesday, February 18, 2020

కామాఖ్యా స్తవము


శ్లో|| కామాఖ్యాం కామసంపన్నాం కామేశ్వరీం హరిప్రియాం |
కామనాం దేహిమే నిత్యం కామేశ్వరి నమోస్తుతే ||
కామాఖ్యే వరదే దేవీ నీలపర్వత వాసినీ |
త్వం దేవీం జగతాం మాతా యోనిముద్రే నమోస్తుతే ||
కామేశ్వరీ చ కామాఖ్యాం కామరూప నివాసినీం |
తప్తకాంచనసంకాశాం తాం నమామి సురేశ్వరీం ||
కామాఖ్యే కామదే దేవీ నీలాచలవాసినీ |
కామస్య సర్వదే మాతః మాతృకాసప్త సేవితే ||
జమదగ్నస్య రామస్య మాతృహత్యా విమోచనీ |
పంచ శంకర సంస్థానా భక్తపాలనతత్పరా ||
కళ్యాణ దాయినీ మాతా విప్రదర్శిత నర్తనా | 
హరిక్షేత్రే కామరూపే ప్రసన్నా భవ సర్వదా ||
కామాఖ్యా పరమం తీర్థం కామాఖ్యా పరమం తపః |
కామాఖ్యా పరమో ధర్మః కామాఖ్యా పరమాగతిః |
కామాఖ్యా పరమం విత్తం  కామాఖ్యా పరమం పదం ||

Monday, February 17, 2020

నిత్య పారాయణ శ్లోకాలు


 
🌷ప్రభాత శ్లోకం :🌷
కరాగ్రే వసతే లక్ష్మీ: కరమధ్యే సరస్వతీ !
కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనమ్ !!
 
☘ప్రభాత భూమి శ్లోకం : ☘
సముద్ర వసనే దేవీ పర్వత స్తవ మండలే !
విష్ణుపత్ని సమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే !!
 
🌝సూర్యోదయ శ్లోకం : 🌝
బ్రహ్మస్వరూప ముదయే మధ్యాహ్నేతు మహేశ్వరమ్ !
సాహం ధ్యాయేత్సదా విష్ణుం త్రిమూర్తించ దివాకరమ్ !!
 
🍀స్నాన శ్లోకం : ☘
గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ !
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు !!
 
♨భస్మ ధారణ శ్లోకం : ♨
శ్రీకరం చ పవిత్రం చ శోక నివారణమ్ !
లోకే వశీకరం పుంసాం భస్మం త్ర్యైలోక్య పావనమ్ !!
 
🍀భోజనపూర్వ శ్లోకం : 🍀
బ్రహ్మార్పణం బ్రహ్మ హవి: బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతమ్ !
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన: !!
 
అహం వైశ్యానరో భూత్వా ప్రాణినాం దేహ - మాశ్రిత: !
ప్రాణాపాన సమాయుక్త: పచామ్యన్నం చతుర్విధమ్ !!
 
త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే !
గృమాణ సుముఖో భూత్వా ప్రసీద పరమేశ్వర !!
 
💢 భోజనానంతర శ్లోకం : 💢
అగస్త్యం వైనతేయం చ శమీం చ బడబాలనమ్ !
ఆహార పరిణామార్థం స్మరామి చ వృకోదరమ్ !!

🌷సంధ్యా దీప దర్శన శ్లోకం :🌷
దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ !
దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోఁస్తుతే !!
 
😔నిద్రా శ్లోకం :😔
రామం స్కంధం హనుమంతం వైనతేయం వృకోదరమ్ !
శయనే య: స్మరేన్నిత్యమ్ దుస్వప్న - స్తస్యనశ్యతి !!
 
👍కార్య ప్రారంభ శ్లోకం : 👍
వక్రుతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ: !
నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా !!
 
🌷హనుమ స్తోత్రం : 🌷
మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం పరిష్టమ్ !
వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా సమామి !!
 
బుద్ధిర్భలం యశొధైర్యం నిర్భయత్వ - మరోగతా !
అజాడ్యం వాక్పటుత్వం హనుమత్ - స్మరణాద్ - భవేత్ !!
 
💢శ్రీరామ స్తోత్రం : 💢
శ్రీ రామ రామ రామేతీ రమే రామే మనోరమే 
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే 
 
♨గణేశ స్తోత్రం : ♨
శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణమ్ చతుర్భుజమ్ !
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే !!
అగజానన పద్మార్కం గజానన మహర్ణిశమ్ !
అనేకదంతం భక్తానా - మేకదంత - ముపాస్మహే !!
 
🔯శివ స్తోత్రం : 🔯
త్ర్యం’బకం యజామహే సుగంధిం పు’ష్టివర్ధినమ్ !
ఉర్వారుకమి’ వ బంధ’ నాన్ - మృత్యో’ర్ - ముక్షీయమాఁ మృతా’’త్ !!
 
🕉గురు శ్లోకం : 🕉
గురుబ్రహ్మా గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వర: !
గురు: సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురువే నమ: !!
 
☸సరస్వతీ శ్లోకం :☸
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ !
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా !!
 
 యా కుందేందు తుషార హార ధవళా, యా శుభ్ర వస్త్రావృతా !
యా వీణా వరదండ మండిత కరా, యా శ్వేత పద్మాసనా !!
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్ - దేవై: సదా పూజితా !
సా మామ్ పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా !!
 
🌷లక్ష్మీ శ్లోకం 🌷: 
లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీమ్ !
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురామ్ !
శ్రీమన్మంధ కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరమ్ !
త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్ !!

☘వెంకటేశ్వర శ్లోకం ☘: 
శ్రియ: కాంతాయ కళ్యాణనిధయే నిధయేఁర్థినామ్ !
శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ !!
 
♨దేవీ శ్లోకమ్♨ : 
సర్వ మంగల మాంగల్యే శివే సర్వార్థ సాధికే !
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే !!
 
💢దక్షినామూర్తి శ్లోకం💢 : 
గురువే సర్వలోకానాం భిషజే భివరోగినామ్ !
నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమ: !!
 
☸అపరాధ క్షమాపణ స్తోత్రం☸ : 
అపరాధ సహస్రాణి, క్రియంతేఁహర్నిశం మయా !
దాసోఁయ మితి మాం మత్వా, క్షమస్వ పరమేశ్వర !!
 
కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా 
శ్రవణ నయనజం వా మానసం వాపరాధమ్ !
విహిత మవిహితం వా సర్వమేతత్ క్షమస్వ 
శివ శివ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో !!
 
కాయేన వాచా మనసేంద్రియైర్వా 
బుద్ధ్యాత్మనా వా ప్రకృతే: స్వభావాత్ !
కరోమి యద్యత్సకలం పరస్మై 
నారాయణాయేతి సమర్పయామి !!

Monday, February 10, 2020

పెళ్లికానివారు దర్శించవలసిన క్షేత్రం



తిరుప్పరంకుండం.. తమిళనాడు, సుబ్రమణ్యస్వామి..!

పెళ్లి కావడం లేదు అని మదనపడే వారి సంఖ్య ఎక్కువవుతోంది. 
ఎన్ని చోట్ల ఎన్ని పూజలు చేసినా, 
వ్రతాలు చేసినా ఆ వచ్చే శుభవార్తకై కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటారు ఆ తల్లితండ్రులు. 
ఇందుకు శారీరక మానసిక బాధలు కారణం.

ఇలాంటి వారు తమిళనాడులోని ఒక చోటుకు వెళితే వెంటనే పెళ్లి అవుతుందని చెబుతారు. 
అంతే కాకుండా ఇక్కడ వివాహం చేసుకున్న వారికి 
కలిగే సంతానం ఆరోగ్య వంతంగా, బుద్ధిశాలులుగా ఉంటారని నమ్ముతారు. .

మధురైకు 9 కిలోమీటర్ల దూరంలో..తిరుప్పరంకుండ్రం తమిళనాడులో గల మదురై మీనాక్షి అమ్మవారి దేవాలయానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. 
శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రములలో రెండవది తిరుప్పరంకుండ్రం.

ఈ క్షేత్రములో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ఇంద్రుని కుమార్తె అయిన దేవయాని (దేవసేనా) అమ్మతో కళ్యాణం జరిగింది. 
ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే, 
ఈ ఒక్క క్షేత్రంలోనే సుబ్రహ్మణ్య స్వామి వారు కూర్చుని దర్శనమిస్తారు. 
మిగతా అన్నిచోట్ల స్వామి నిలబడిన మూర్తినే చూస్తాం

ఈ క్షేత్రమునకు సంబంధించిన పురాణము 
ఈ విధముగా ఉంది. 
మన బుజ్జి సుబ్రహ్మణ్యుడి భార్యలు అయిన 
సుందర వల్లి, దేవయానీ అమ్మలు. 
వీరు ఇద్దరు శ్రీ మహా విష్ణువు యొక్క కుమార్తెలు. 
మహా విష్ణువుకి కుమార్తెలు ఏమిటి అని ఆశ్చర్య పోకూడదు. 
మన పురాణములలో చెప్పే వాఖ్యానములకు 
అనేక స్థూల, సూక్ష్మ, కారణ కారణాలు ఉంటాయి. 
అవి మానవులకు ఉండే ప్రాకృతికమైన సంబంధాలుగా చూడకూడదు. 
వాటిలోని సూక్ష్మములను తెలుసుకోవాలని పురాణాలు చెతున్నాయి

అయితే ఒక రోజు సుందరవల్లి, దేవయానీ (అమృత వల్లి) అమ్మలు ఇద్దరూ సుబ్రహ్మణ్యుడి వద్దకు వచ్చి వారిని కళ్యాణం చేసుకోమని అడుగుతారు. 
అప్పుడు స్వామి అమృత వల్లితో 'నిన్ను ఇంద్రుడు తన కూతురిగా పెంచుతాడు. 
తరువాత కాలంలో నిన్ను వివాహం చేసుకుంటాను' 
అని అభయం ఇస్తారు. 
అలాగే సుందర వల్లిని కూడా అనుగ్రహిస్తారు స్వామి.

తరువాత అమృత వల్లి చిన్న ఆడ శిశువుగా మారి ఇంద్రుడిని కలిసి ' నేను శ్రీ మహా విష్ణువు కుమార్తెను, నన్ను పెంచవలసిన బాధ్యత మీకు ఉంది' అని చెప్తుంది. ఈ మాట విన్న ఇంద్రుడు ఎంతగానో సంతోషించి 
వెంటనే తన వద్దనున్న ఐరావతమును ఈ బిడ్డ ఆలనా పాలనా చూడవలెనని ఆజ్ఞాపిస్తాడు. 
ఆ ఐరావతము అమృత వల్లి అమ్మను ఎంతో ప్రేమతో పెంచుతుంది.

ఆమెకు పెళ్ళి చేసుకునే వయసు వచ్చే వరకు 
అన్నీ తానై సాకుతుంది. 
అమృత వల్లిని దేవతల ఏనుగు అయిన ఐరావతము పెంచడం వల్లనే, ఆమెకి దేవయాని అని పేరు వచ్చింది. (తమిళంలో 'యానై' అంటే ఏనుగు). 
అదే విధంగా సుందర వల్లి అమ్మ తరువాత కాలంలో శివముని అనే మునీశ్వరుని యొక్క తేజస్సు వలన అయోనిజగా పుడుతుంది. 
ఆమెను నంబి అనే భిల్ల నాయకుడు (గిరిజన నాయకుడు) పెంచుకుంటారు.

తరువాత కాలంలో ఆమెను సుబ్రహ్మణ్యుడు వివాహం చేసుకుంటారు. 
అది వల్లీ కళ్యాణ ఘట్టం. 
వేరే అఖ్యానంలో వివరిస్తాను.
ఒకానొక సమయంలో పరాశర మహర్షి యొక్క ఆరుగురు కుమారులు శరవణ తటాకములో చేపలుగా ఉండమని శపింపబడతారు. 
వారి యొక్క శాప విమోచనం కొఱకు సుబ్రహ్మణ్యుని ఆరాధించడం మొదలు పెడతారు. 
శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు తిరుప్పరంకుండ్రం వచ్చినప్పుడు వారికి శాప విమోచనం కలుగుతుందని వారికి తెలియచేయబడుతుంది. 
ఈ క్రమంలో తిరుచెందూర్ లో స్వామి సూర పద్మం అనే రాక్షసుడి సంహారం చేసిన తరువాత, 
మొత్తం దేవతలందరినీ రాక్షస బాధల నుంచి విముక్తులను చేసి, ఆ దేవతలందరితో కలిసి, తిరుప్పరంకుండ్రం వస్తారు.

స్వామి యొక్క రాకతో పరాశర మహర్షి కుమారులకు శాపవిమోచనం కలిగి, తిరిగి వారి రూపం వచ్చి, 
వారు స్వామిని ఆ క్షేత్రములో కొలువుండమని ప్రార్ధిస్తారు. వారి ప్రార్ధనకు మెచ్చిన షణ్ముఖుడు అంగీకరించగా, అక్కడ విశ్వకర్మ ఒక చక్కని ఆలయం నిర్మిస్తారు. 
అదే సమయంలో దేవతలకు అధిపతి అయిన ఇంద్రుడు తన కుమార్తె అయిన దేవయానిని పెళ్ళిచేసుకోమని సుబ్రహ్మణ్యుని అర్ధిస్తారు.

అక్కడే ఉన్న బ్రహ్మకి, శ్రీ మహా విష్ణువుకి ఇంద్రుడు 
తన ఈ కోర్కెని తెలియజేస్తాడు .
బ్రహ్మ నారాయణుడు కూడా చాలా సంతోషించి దేవయానిని పెళ్లి చేసుకోమని సుబ్రహ్మణ్యునికి తెలుపుతారు, 
స్వామి అంగీకరిస్తారు. 
అటు పై సుబ్రహ్మణ్య స్వామి వారికి, దేవయాని అమ్మకు కళ్యాణం ఈ తిరుప్పరంకుండ్రం లోనే జరిగింది. 
శివ పార్వతులు, లక్షీనారాయణులు, సరస్వతీ బ్రహ్మలు, సకల దేవతల సమక్షంలో ఈ కళ్యాణం జరిగింది.

అంతే కాకుండా ఇక్కడకు వచ్చిన బ్రహ్మచారులకు త్వరలో వివాహం జరుగుతుందని సకల దేవతలు వరమిస్తారు. 
అంతే కాకుండా ఇక్కడ వివాహం చేసుకున్న సంతతికి మంచి ఆరోగ్యం, బుద్ధిమంతులైన సంతానం కలుగుతుందని చెబుతారు. 
దీంతో ఇప్పటికీ ఎంతో మంది వివాహాలు స్వామి సన్నిధిలో జరుపుకుంటారు. 
రాక్షస సంహారం చేసి వచ్చిన తర్వాత ఇక్కడ స్వామి కళ్యాణం జరగడం వల్ల ఈ క్షేత్రం చాలా చాలా విశేషమైనది.

ఇంకో విశేషము ఏమిటంటే ఈ ఆలయం మొత్తం ఒకే కొండ రాతిని చెక్కి మలచినది.

Wednesday, February 5, 2020

కాశిలో చూడవలసినవి..!


కాశీ లో ప్రవేశించగానే ముందుగా..
కాశీ విశ్వేశ్వరుని తలచుకుని, నమస్కరించుకుని 
కాశీ నేలని తాకి నమస్కరించుకోవాలి. 

బస చేరుకున్న తరువాత ముందుగా..
గంగా దర్శనం..గంగా స్నానం. 
కాలభైరవుని దర్శనం 
కాలభైరవుని గుడి వెనకాల దండపాణి గుడి దర్శనం డుంఠి గణపతి దర్శనం 

కాశీ విశ్వేశ్వరుని దర్శనం 
(ప్రొద్దున 4-00amకి తిరిగి సాయంత్రం 7-30pmకి స్పర్శ దర్శనం ఉంటుంది.)
కాశీ భక్తులు దర్శనానికి వచ్చే దాన్ని బట్టి ఇది మారుతుంటుంది

అన్నపూర్ణ దర్శనం 
భాస్కరాచార్య ప్రతిష్ఠిత శ్రీచక్ర లింగ దర్శనం (అన్నపూర్ణ దేవాలయ ప్రవేశ ద్వారం వద్ద కుడివైపు ఉంటుంది).

కాశీ విశాలాక్షి దర్శనం 
వారాహి మాత గుడి 
ఈ గుడి ప్రొద్దున 8-00 గంటల వరకే తెరిచి ఉంటుంది. లలిత ఘాట్ వద్ద నుండి వెళ్ళవచ్చు. 
లేకపోతే విశాలాక్షి మాత గుడి వెనుకగా 
వారాహి మాత గుడికి అడ్డ దారి ఉన్నది 
ఇది చాలా దగ్గర దారి. ఎవరిని అడిగినా చెపుతారు.
https://chat.whatsapp.com/HBoIsw0DRoLBNVI4Hs0tH3
మణికర్ణికా ఘట్టంలో స్నానం.
(వీలైతే మధ్యాహ్నం 12-00 గంటలకి)
గంగా హారతి - 
దశాశ్వమేధ్ ఘాట్ వద్ద (అస్సి ఘాట్ వద్ద కూడా గంగా హారతి ఇస్తారు)
కేదార్ఘాట్ వద్ద కేదారేశ్వరుని దర్శనం
చింతామణి గణపతి దర్శనం 
అస్సి ఘాట్ వద్ద ఉన్న లోలార్క కుండం లో స్నానం లేక ప్రోక్షణ 
లోలార్కఈశ్వరుని దర్శనం 
దుర్గా మందిరము 
గవ్వలమ్మ గుడి 
తులసీ మానస మందిరము 
సంకట మోచన హనుమాన్ మందిరం. 
తులసీ దాసుకు ఆంజనేయ స్వామి దర్శనం అయిన స్థలం. 
తిలాభాండేశ్వర దర్శనం 

వీలైతే సారనాధ్ స్థూపం బుద్ధ మందిరం - 
ఇది కొంత దూరంగా ఉంటుంది. 
ప్రత్యేకంగా వెళ్ళాలి. ఇది బట్టల షాపింగ్ సెంటర్. 

గంగా నదీ ఘట్టాల దర్శనం - 
అస్సి ఘాట్ నుండి మొదలు పెడితే వరుణ నాదీ సంగమం వద్ద ఉన్న ఆదికేశవ్ మందిరం దాకా వెళ్ళవచ్చు. 

ఆదికేశవ స్వామి దర్శనం చేసుకోవాలి. 
ఇదే విష్ణు మూర్తి ప్రథమంగా భూమి పై అవతరించిన చోటు. 
గుడిలోకి వెళ్లి వస్తామని బోటు అతనితో ముందే మాట్లాడుకోవాలి. 
లేకపోతె నదిలో నుంచే చూపించి వెనక్కి తిప్పుతారు. 

బిందు మాధవుని గుడి - 
ఇది పంచగంగ ఘాట్ వద్ద ఉన్న ఔరంగజేబు కోటకి దగ్గరలో ఉంటుంది. 

ఓంకాళేశ్వర దర్శనం - 
మెయిన్ రోడ్ నుండి కాల భైరవ స్వామి గుడి వైపు కాకుండా Left side రోడ్ లో వెళ్ళాలి. 
రిక్షా అయితే మంచిది. 
ఇవి రెండు మందిరాలు, ఉకారేశ్వరుడు మకారేశ్వరుడు చిన్నగా ఉంటాయి 
కానీ ఇవి రెండూ కూడా స్వయంభూ లింగాలు. 

కృత్తివాసేశ్వర లింగం - 
ఓంకాళేశ్వర స్వామి దర్శనం అయిన తరువాత ఇంకా కొంచం ముందుకు వెళ్ళితే కృత్తివాసేశ్వర లింగం వస్తుంది. ఇది అన్ని కాలలలోను చల్లగా ఉంటుంది. 
స్వయంభూ లింగం. 
కృత్తివాసేశ్వర లింగం దర్శనం అయినా తరువాత 
ఇంకా కొంచం ముందుకు వెళ్ళితే 
మహా మృత్యుంజయలింగం దర్షించుకోవాలి. 

బనారస్ హిందూ విశ్వవిద్యాలయం + అక్కడి నూతన విశ్వనాథ, దుర్గా లక్ష్మి నారాయణ గుడి సముదాయం

వారాణసిలో ఉన్న కొన్ని ముఖ్యమైన శివ లింగాల..
స్థలాలు..
విశ్వేశ్వరుడు - గంగానది ఒడ్డున దశాశ్వమేధ ఘాట్ వద్ద
మంగళేశ్వరుడు - శంక్తా ఘాట్
ఆత్మ విశ్వేశ్వరుడు - శంక్తా ఘాట్
కుక్కుటేశ్వరుడు - దుర్గా కుండ్
త్రి పరమేశ్వరుడు - దుర్గా కుండ్
కాల మాధవుడు - కథ్ కీ హవేలీ
ప్రయాగేశ్వరుడు - దశాశ్వమేధ ఘాట్
అంగారకేశ్వరుడు - గణేష్ ఘాట్
ఆంగనేశ్వరుడు - గణేష్ ఘాట్
ఉపస్థానేశ్వరుడు - గణేష్ ఘాట్
పరమేశ్వరుడు - శంక్తా ఘాట్
హరిశ్చంద్రేశ్వరుడు - శంక్తా జీ
వశిష్టేశ్వరుడు - శంక్తా జీ
కేదారేశ్వరుడు - కేదార్ ఘాట్
నీల కంఠేశ్వరుడు - నీల కంఠా
ఓంకారేశ్వరుడు - చిట్టన్ పురా
కాశేశ్వరుడు - త్రిలోచన్
శ్రీ మహా మృత్యుంజయుడు - మైదాగిన్
శుక్రేశ్వరుడు - కాళికా గలీ

వారాణసి నగరాన్ని ఇతిహాస పురాణాలలో 
అవిముక్తక..
ఆనందకానన..
మహాస్మశాన..
సురధాన..
బ్రహ్మవర్ధ..
సుదర్శన..
రమ్య..
కాశి..అనే వివిధ నామాలతో ప్రస్తావించారు.

ఋగ్వేదంలో ఈ నగరాన్ని "కాశి", "జ్యోతి స్థానం" అని ప్రస్తావించారు. 

స్కాంద పురాణంలోని కాశీఖండంలో ఈ నగర మహాత్మ్యం గురించిన వర్ణన ఉంది. 
ఒక శ్లోకంలో శివుడు ఇలా అన్నాడు
ముల్లోకాలు నాకు నివాసమే.
అందులో కాశీ క్షేత్రం నా మందిరం

గంగా హారతి. గంగామాతకు నదీతీరక్షేత్రాలలో నిర్వహించే ఈ హారతి పవిత్ర కాశీలో కూడా ఘనంగా ప్రతిరోజూ నిర్వహిస్తుంటారు. 
ఈ హారతి దృశ్యాలను ప్రతిరోజూ వేలాది మంది తిలకిస్తుంటారు. 
వీరిలో విదేశీయులు అధికంగా ఉండడం ఒక ప్రత్యేకత. ఈ హారతులను దశాశ్వమేధ్ ఘాటులో నిర్వహిస్తారు కనుక యాత్రీకులు దశాశ్వమేధ ఘాటుకు చేరుకోవడం అవసరం.
అయోధ్య, 
మథుర, 
గయ,
కాశి, 
అవంతిక, 
కంచి, 
ద్వారక 
నగరాలను సప్తముక్తి పురాలని హిందువుల విశ్వాసం

"కాశి, 
కాంచి, 
మాయ, 
ఆయోధ్య, 
ఆవంతిక,
మథుర మరియు 
ద్వారవతి" లు 
సప్త మోక్షపురులు గా పేర్కొనబడ్డాయి.

కాశి, ఆయోధ్య మరియు మథుర మోక్ష క్షేత్రాలు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లో ఉన్నాయి.

ద్వారవతి (ద్వారక) మోక్షపురి గుజరాత్ రాష్ట్రం లో ఉంది.

మాయ (హరిద్వార్) మోక్షపురి ఉత్తరాఖండ్ లేక ఉత్తరాంచల్ రాష్ట్రం లో ఉంది.

ఆవంతిక (ఉజ్జయిని) మోక్షపురి మధ్య ఫ్రదేశ్ రాష్ట్రం లో ఉంది.

కాంచి మోక్షపురి తమిళనాడు రాష్ట్రం లో ఉంది.

కాశి,మాయ, ఆయోధ్య, ఆవంతిక,మథుర మరియు ద్వారవతి మోక్షపురులు ఉత్తర భారతదేశంలో ఉన్నాయి.
కాంచి మోక్షపురి దక్షిణ భారతదేశంలో ఉంది.

దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మోక్షపురి కాంచీపురం.

🙏ఓం నమః శివాయ🙏

భీష్మ ఏకాదశి


భీష్మ ఏకాదశి

భీష్మ పితామహుడు కారణజన్ముడు. శాపవశాత్తు ఈ లోకానికి దిగివచ్చాడు. ఆ కారణంగానే సుదీర్ఘకాలం జీవించాడు. ఆయన వ్యక్తిత్వం రాజస సాత్విక ప్రవృత్తుల కలబోత. భీష్ముడి జీవన గమనంలో ఆ రెండూ తారుమారైన సందర్భాలున్నాయి.
భీష్ముడి అసలు పేరు దేవవ్రతుడు. అస్త్రవిద్యలో గురువైన పరశురాముణ్నే నిలువరించగల మహా పరాక్రమశాలి. అలాంటివాడు తమకు రాజవుతాడని ఆ దేశ ప్రజలు ఎదురుచూశారు. కాని, కథ మలుపు తిరిగింది. సత్యవతిని తన తండ్రికిచ్చి వివాహం చేసేందుకు అనువుగా భీష్మప్రతిజ్ఞ చేసి రాజ్యాధికారాన్ని, సంసార సుఖాన్ని ఆయన త్యాగం చేశాడు. తీరా సత్యవతి సంతానమైన చిత్రాంగద విచిత్రవీర్యుల అకాల మరణం కారణంగా కురువంశంలో మగబిడ్డ లేకుండాపోయాడు. ‘ఎవరి సంతతికి రాజ్యాధికారం సంక్రమించడం కోసం నీవు వివాహం చేసుకోలేదో, ఆ సంతానం మిగలలేదు. వంశాంకురాలనూ అందించలేదు కాబట్టి నీవు శపథం విడిచిపెట్టి పెళ్ళి చేసుకో...’ వంశాన్ని నిలబెట్టు అని సత్యవతే స్వయంగా ప్రాధేయపడింది. భీష్ముడు భీష్మించుకొని కూర్చున్నాడు. విధిలేక సత్యవతి వ్యాస మహర్షిని ప్రార్థించి తన కోడళ్లకు తగిన సంతానాన్ని ప్రసాదించమని కోరింది. ఆ ముని కారణంగా వంశం నిలిచింది.

ఒక మహాతపస్వి లోకహితం కోసం దిగిరాగా లేనిది ఆ పని భీష్ముడివల్ల ఎందుకు కాలేదంటే- ఆయన వ్యక్తిత్వం లోకహితం కోసం రాజీపడలేక పోయింది. అంటే, సాత్విక ప్రవృత్తి అవసరమైనచోట ఆయన రాజసం ఎదురు తిరిగింది.
నిండుసభలో ద్రౌపదికి తీరని అవమానం జరిగినప్పుడు గాని, కౌరవుల మూలంగా ధర్మానికి పలు సందర్భాల్లో హాని కలిగినప్పుడుగాని ఆయన తిరగబడలేదు. రాజస ప్రవృత్తిని లేదా క్షాత్ర ధర్మాన్ని పాటించి, ఆయనే కనుక విల్లుపట్టి నిలబడితే- యుద్ధంతో పనిలేకుండానే ధృతరాష్ట్రుడు సంతానం కుక్కిన పేనుల్లా పడిఉండేవారు. కృష్ణార్జునులకు తప్పిస్తే భీష్మాచార్యుడికి ఎదురునిలిచే సత్తా భూమిమీద ఎవరికీ లేదు. అలా రాజసానికి పెద్దపీట వేయవలసినచోట ఆయన సాత్విక ప్రవృత్తికి పట్టాభిషేకం చేశాడు.

ఈ ప్రవృత్తి గ్రహణంతోపాటు, ఈ కాస్త సందిగ్ధత ఎప్పుడు దూరమైందంటే, నిత్యసత్వ స్థితి ఎప్పుడు చేరువైందంటే... యుద్ధరంగంలో ఆయనకు ‘సు’దర్శన చక్రం దర్శనమిచ్చినప్పుడు! సుయోధనుడి సూటిపోటి మాటలకు ఆగ్రహోదగ్రుడైన ఆ యోధుణ్ని రాజస ప్రవృత్తి నిలువునా ఆవరించి పాండవ పక్షాన్ని ఊచకోత కోస్తుంటే గత్యంతరం లేక కృష్ణుడే చక్రం చేపట్టవలసి వచ్చింది. భీష్ముడిపై కుప్పించి దూకవలసి వచ్చింది. ఆ క్షణంలో భీష్ముడి వ్యక్తిత్వాన్ని రాజస ప్రవృత్తి గ్రహణం పూర్తిగా విడిచిపెట్టింది. ఆయన తిరిగి కృష్ణభక్తుడిగా మారిపోయాడు.

ఆయుధం పట్టనని శపథం చేసిన పరమాత్మ తనకోసం ప్రతిష్ఠను, ప్రతిష్ఠను సైతం విడిచిపెట్టడం భీష్ముణ్ని విస్మయానికి గురిచేసింది. మెరుపు మెరిసినట్లయింది. వెంటనే మోకాళ్లపై కూలబడ్డాడు.‘చక్రాన్ని ఉపసంహరించకు, మహాత్మా... నన్ను సంహరించు’ అని చేతులు జోడించాడు.

తరవాతి కథంతా ‘శాంతిపర్వం’ సాత్విక గుణసంపదకు విజయగర్వం. శర తల్ప గతుడైన ఆ మహానుభావుడి దేహంనుంచి నెత్తురుబొట్లకు బదులుగా ఈ లోకానికి అవసరమైన ఎన్నో ధర్మసూక్ష్మాలు స్రవించాయి. రాజనీతి ప్రవహించింది. నోటి నుంచి లోకాన్ని వణికించే భీకర శంఖధ్వానమో, గంభీర సింహనాదమో కాదు- ఒడ్డుకు చేర్చే విష్ణుసహస్రనామ స్తోత్రం ప్రతిధ్వనించింది. ఆ కారణజన్ముడి పుట్టుకను పునీతం చేస్తూ ఒక పుణ్యతిథి ఆయన పేరిట లోకంలో స్థిరపడింది. అదే భీష్మఏకాదశి!

- ఎర్రాప్రగడ రామకృష్ణ

Saturday, February 1, 2020

సుభాషితం


सुखार्थी त्यजते विद्यां
विद्यार्थी त्यजते सुखम्  ।
सुखार्थिन: कुतो विद्या 
कुतो विद्यार्थिन: सुखम्  ॥

సుఖార్థీ త్యజతే విద్యాం, విద్యార్థీ త్యజతే సుఖం  ।
సుఖార్థినః కుతో విద్యా, కుతో విద్యార్థినః సుఖం  ॥

సుఖాన్ని అర్థించేవాడు విద్యని త్యజిస్తాడు. విద్యని అర్థించేవాడు సుఖాన్ని త్యజిస్తాడు. అనగా, విషయ వాంఛలమీదికి దృష్టి మరలినవానికి, విద్యయందు శ్రద్ధ తగ్గుతుంది. చదువుని విస్మరిస్తాడు.

రథ సప్తమి విశేషం

రథ సప్తమి విశేషం ఇదే!

మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిథి ‘రథ సప్తమి’గా ప్రసిద్ధం. సూర్యరథం దక్షిణాయనం ముగించి, పూర్వోత్తర దిశగా పయనం సాగిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. మాఘ సప్తమి మొదలు, వచ్చే ఆరు మాసాలూ ఉత్తరాయణ పుణ్యకాలం. అదితి, కశ్యప ప్రజాపతి దంపతులకు మహావిష్ణువు సూర్య భగవానుడిగా ఉదయించాడు కాబట్టి, నేడు ‘సూర్య జయంతి’ అని పురాణ గాథలు చెబుతాయి. సూర్యరథానికి కూర్చిన ఏడు గుర్రాలు ఏడు వారాలకు, పన్నెండు చక్రాలు పన్నెండు రాశులకు సంకేతాలు. సూర్యుడి పేరుతో ప్రారంభమయ్యేది భానువారం. శనివారంతో వారాంతమవుతుంది. మేషం నుంచి మీనం దాకా పన్నెండు రాశుల్ని పూర్తిచేయడానికి, సూర్యరథానికి ఒక ఏడాది పడుతుందంటారు. ఒకే సూర్యుడు పన్నెండు రూపాలు, పన్నెండు పేర్లతో ప్రకాశించడాన్ని ఆ విరాట్‌ పురుషుడి నేత్రావధాన ప్రభావంగా పరిగణిస్తారు. వేదవాక్యాన్ని అనుసరించి- ఉత్తరాయణం పుణ్యకాలంలా, ఆ సూర్యకాంతిలో జీవితం సాగడం మహాభాగ్యంగా వర్ణిస్తారు. ఉత్తరాయణ పుణ్యకాలం కోసమే భీష్మాచార్యులు అంపశయ్యపైన ఎదురుచూశారు.

రుగ్వేదంలోని పదో మండలం ఎనభై అయిదో మంత్రమే సూర్యుడి పరంగా చెప్పిన గాయత్రీ మంత్రం! రోజూ ఉదయం సూర్యుడికి ఎదురుగా నిలిచి నమస్కరించే ఆచారం అనాదిగా వస్తోంది. సూర్యోపాసకుల నిత్య జీవితంలో సూర్యనమస్కారాలకు ప్రత్యేక స్థానముంది. ఆరోగ్యాన్ని ప్రసాదించే సూర్యుడికి యోగాభ్యాసం చేసేవారూ పెద్దపీట వేశారు.

రథ సప్తమి విశేషం ఇదే!

రథ సప్తమి నుంచి వాతావరణంలో మార్పు కనిపిస్తుంది. ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతుంది. ఉగాది నాటికి ప్రకృతికాంత సొగసులు సంతరించుకుంటుంది. పంటల పండుగ సంక్రాంతి తరవాత అవతరించే రథం పండుగ ఇది. రథ సప్తమినాడు ముంగిట్లో రథం ముగ్గులు సుందరంగా కనిపిస్తాయి. ఆ ముగ్గుల నడుమ పిడకలు వేసి, సూర్యభగవానుడికి ప్రియమైన పాయసం వండుతారు. పిడకలపైన పాలు పొంగించడాన్ని ‘సిరుల పొంగు’కు సంకేతంగా భావిస్తారు. అప్పటికే రైతులు ధాన్యరాశులను ఇళ్లకు చేర్చి ఉంటారు. ఉదయాన్నే ఇంటిల్లపాదీ స్నానాలు ముగిస్తారు. గాయత్రీ జపం, ఆదిత్య హృదయం, సూర్యాష్టకం, సూర్య సహస్రం వంటి స్తోత్ర పాఠాలు వల్లిస్తూ పూజలు చేయడం రివాజు.

మహావిష్ణువు ప్రతిరూపంగా పూజించే సూర్యభగవానుడికి దేశవిదేశాల్లో ఘనంగా పూజలు నిర్వర్తిస్తారు. రథసప్తమి రోజున అరసవల్లి సూర్యదేవాలయం, కర్ణాటకలోని మైసూరు ఆలయాల వద్ద సూర్యమండల, సూర్యదేవర వూరేగింపులు ఉత్సాహంగా నిర్వహిస్తారు. మంగళూరు వీర వేంకటేశ్వరస్వామి కోవెలలో రథోత్సవం వైభవంగా జరుగుతుంది. తిరుపతి క్షేత్రంలో మలయప్పస్వామిని రథసప్తమి నాడు అలంకరించి- శ్రీదేవి, భూదేవి సమేతంగా సప్త వాహనాలపైన వూరేగిస్తారు. తిరుమాడ వీధుల్లో స్వామి సూర్యప్రభ, చిన శేష, గరుడ, హనుమ, చక్రాసన, కల్పవృక్ష, సర్వభూపాల వాహనాల్ని అధిరోహించి నయనానందంగా విహరిస్తారు. ఏడుకొండలవాడు సప్తవాహనుడై సప్తాశ్వ సూర్యుడిలా ప్రకాశిస్తాడు.

రథ సప్తమి విశేషం ఇదే!

సూర్యుడి దేవాలయాల్లో కోణార్క, విరించి నారాయణ క్షేత్రాలు (ఒడిశా); మొధేరా (గుజరాత్‌) ప్రఖ్యాతమైనవి. విదేశాల్లోనూ సూర్యారాధన సాగుతోంది. అందుకు చైనా, జపాన్‌, ఈజిప్టులు ఉదాహరణలు.

జీవరాశికి ప్రాణశక్తిని, ఉత్తేజాన్ని ప్రసాదించే అధిదేవత సూర్యుడు. సూర్యుడు జ్ఞానమండలం అని సూర్యమండలాష్టకమ్‌ చెబుతుంది. ‘జయాయ జయ భద్రాయ’ అంటుంది ఆదిత్య హృదయం. శరీరయాత్రలో జీవుడు చేసే కర్మలన్నింటికీ సాక్షీభూతుడు సూర్యుడు. బాహ్యప్రపంచాన్ని వెలిగించడంతో పాటు, అంతరంగంలో ఆవరించిన అజ్ఞాన అంధకారాన్ని తొలగించే జ్ఞానదీపం రవిబింబం. ప్రత్యక్ష దైవంగా సూర్యుణ్ని ఆరాధిస్తే పరబ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుందని సాధకుల ప్రగాఢ నమ్మకం. అందుకే సూర్యుడు సూర్యనారాయణ స్వామిగా రథసప్తమినాడు పూజలందుకుంటున్నాడు.