Translate

Friday, October 2, 2020

యుగ ప్రమాణము

కృతయుగమునందు 4,000 దివ్య సం॥ + 800ల సంధ్య + సంధ్యాంశముల దివ్య సం॥ మొత్తము = 4,800ల దివ్యసంవత్సరములుండును. ఇదేవిధముగా త్రేతాయుగము 3,000 +6003600 దివ్య సం॥లు, ద్వాపరయుగము 2000+400=2400 దివ్య సం॥లు, కలియుగము 1.000 +20031200 దివ్య సం॥లుగా నుండును. నాలుగు యుగాలు మొత్తము 12,000 దివ్య సం॥. మానవుల యొక్క ఒక సంవత్సరము దేవతలకు ఒక దినముతో సమానము కనుక మానవుల 360 సంవత్సరముల కాలము దేవతలకు ఒక సంవత్సరములు సమానము. ఈ లెక్కప్రకారము కలియుగ కాల ప్రమాణం 4,32,000 సంవత్సరములు (1200×360) ద్వాపరయుగము దీనికి రెండు రెట్లు = 8,64,000 సంవత్సరములు. (2400x360) అట్లే త్రేతాయుగము కలియుగ కాలప్రమాణమునకు మూడు రెట్లు = 1296000 సంవత్సరములు. (3600x360) అట్లే కృతయుగము కలియుగం ప్రమాణమునకు నాలుగు రెట్లు = 1728000 (4800x360).

No comments: