Translate

Monday, August 23, 2021

అష్ట లక్ష్ములు

అష్ట లక్ష్ములు ఎవరు? వారి వలన మనకు లభించే పరమార్థం ఏమిటో వివరంగా తెలుసుకుందాం. 

    అష్ట లక్ష్ములు అనగా ఎనమండుగురు లక్ష్ములు. క్షీరసముద్ర మథనంలో ఉద్భవించింది ఒకే ఒక లక్ష్మీ కదా? మరి ఈ ఎనమo డుగురు ఎవరు. అందరూ కలిస్తే శ్రీ మహాలక్ష్మీ. ఒక్కొక్క కార్యానికి ఒక్కో రూపంతో ఆది శ్రీ మహా లక్ష్మిని మన పెద్దలు విభజించి మనకు చూపించారు. వారెవరో, ఎందులకో చూద్దాం.

1. *ఆదిలక్ష్మీ :-* వైకుంఠంలో శ్రీమన్నారాయణుడితో కొలువుతీరి ఉండేది ఆదిమాత.. అదే ఆదిలక్ష్మి.. ఈ సృష్టికి మూలం నారాయణుడు అని కొందరు.. కాదు అమ్మే అని మరి కొందరి విశ్వాసం.. నిజానికి ఇద్దరిలా కనిపించే వీరు ఇద్దరూ ఒక్కరే! లక్ష్మి దేవి చేతిలో కనిపించే కమలము పవిత్రతకు చిహ్నం.. ఇందిరా దేవి అని కూడా ఈ రూపంలో వీరిని పూజిస్తారు. ఆది లక్ష్మిని ఆరాధించుట వలన సంతోషం, పవిత్రత మనకు లభిస్తాయి.

 *2.ధాన్య లక్ష్మి :-* ధాన్యం అంటే పండించిన పంట అని అర్థం. అంటే ఈ రూపంలో మనం ఈ శక్తిని పూజించుట వలన మన జీవితానికి కావల్సిన అన్ని రకాల పోషకాలు, పండ్లు, ఆహారం మొదలైనవి అన్నీ సుఖంగా పొందుతాం.. అంతే కాకుండా పంటలు సరిగ్గా పండాలి అన్న.. అతి వృష్టి అనావృష్టిని కాపాడుకోవాలి అన్నా ఈ తల్లి అనుగ్రహం ఉండవలసిందే!

 *3.ధైర్య లక్ష్మి :-* కొంతమంది ఎన్ని కష్టాలు .. ఉన్నను  ధైర్యంగా ఎదుర్కొంటారు, మరికొందరు పిరికిగా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు..
     మనకు కావలసిన అన్ని రకాల శక్తి - సామర్ధ్యాలు ఈ అమ్మ వలననే లభిస్తాయి.. పూర్వం ఒక కధ ప్రాచుర్యంలో ఉండేది.. ఒక మహారాజు గ్రహస్ధితి బాగుండక అష్ట లక్ష్ములు ఒక్కొక్కరు ఈయనను విడిచి వెళ్ళి పోతుంటారు.. చివరికి ధైర్యలక్ష్మి వంతు వస్తుంది.. కాని అప్పుడు ఆ రాజు ఈమెని తనని విడచి వెళ్ళవద్దు.. వారందరూ వెళ్ళి పోయినా పర్వాలేదు ఒక్క నీ అనుగ్రహం నాకు ఉంటే చాలు.. మళ్లీ వారందరినీ పొందగలనని విశ్వాసంగా వుంది.. విడచి వెళ్ళవద్దు అని ప్రాధేయ పడతాడు... నిజమే ప్రతి మనిషికి ముఖ్యంగా కావాల్సింది *మానసిక స్ధైర్యమే* .. అది ఉంటే ఎన్ని ఇబ్బందులు అయినా ధైర్యం గా ఎదుర్కోవచ్చు. ఇది ధైర్య లక్ష్మి ప్రాధాన్యత.

 *4.గజలక్ష్మి :-* ఈ అవతారం దేవ దానవులు సముద్ర మధనం సాగించే సమయంలో సముద్రుని కూతురుగా ఈ రూపమ్లో ఉద్భవించినట్లు భాగవతం చెబుతుంది. రెండు ఏనుగులు అమ్మ ప్రక్కన నిలబడి జలధారని వర్షింప చేస్తూంటాయి ఇక్కడ ఏనుగులు మనం గణపతి స్వరూపంగా కూడ భావించవచ్చు.. లక్ష్మి గణపతి స్వరూపమైన ఈ మాతను పూజించుట వలన ఇల్లు, వాహనాలు వంటి భౌతిక సుఖాలు
మనకు ఒనగూడుతాయి.

 *5.సంతాన లక్ష్మీ :-*
 ఏ భార్య భర్తలకైనా తమ కుటుంబానికి కావల్సిన మొదటి సంపద సంతానమే.. అది లేకుంటే జీవితాన్ని నిస్సారం గా గడపవలసి వస్తుంది.. అలాగే కర్మ పరిపక్వత కూడా ఉండదు.. అందుకే ఈ శక్తి ని పూజించి తప్పక ప్రసన్నం చేసుకోవాలి.. అప్పుడే సంతానం పొందడమే కాకుండా వారికి సద్బుద్ధి, ధీర్ఘాయుస్సు లభిస్తాయి.

 *6.విజయ లక్ష్మీ :-* పేరులోనే ఉంది పెన్నిది.. బాహ్య - అంతర్గత మనసుపై విజయం పొందాలని అన్నా.. శారీరకంగా, ఆర్ధికంగా ఇలా జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలపై విజయం పొందాలి అంటే విజయ లక్ష్మి కృప ఉండి తీరవలసిందే!

 *7.ధనలక్ష్మి :-* 
భూమిపై సంపద లేదా ధనం అంటే రూపాయలు బంగారు ఆభరణాలు కాదు.. పకృతిలో ఉండు అన్ని రకాల నదులు, ఫలవంతం అయిన చెట్లు, సమృద్ధిగా కురియు వర్షాలు ఇవ్వన్నీ సంపద క్రిందే వస్తాయి.. కనుక అవన్నీ మనకు ధన రూపంగా మార్చి ఇచ్చేది ఈ దేవతే.

 *8.విద్యాలక్ష్మి :-* పాఠశాలలో, కళాశాల, విశ్వవిద్యాలయల్లో లభించే విద్యే కాదు.. ఏ తరహా విజ్ఞానం కావలన్న ఈమెను ఆశ్రయించ వలసినదే.. ఆధ్యాత్మికం.. భౌతికం ఎందులో ఏ విద్య అయినా మనకు అందులో దక్షత ఏర్పడాలి అంటే ఈ లక్ష్మి దయ మనకు ఉండ వలసిందే. నిజానికి మానవ జన్మ ఎత్తిన ప్రతి మనిషికి తమ జీవితంలో ఏవైతే కోరుకుంటారో అవన్నీ అష్ట లక్ష్ముల ప్రతీకలే!

           అష్ట లక్ష్ములని పూజించడం వలన షోడశ ఫలాలు మనకు లభిస్తాయి అనేది ఎందరో చెప్పిన మాట..షోడశ అంటే 16.. ఇప్పుడు ఆ ఫలాలు ఏమిటో చూద్దాం...

1 కీర్తి, 
2 జ్ఞానం, 
3 ధైర్యం.. 
బలం, 
4 విజయం , 
5 సత్సంతానం
6 యుద్ధ నైపుణ్యం, 
7 బంగారం ఇతర సంపదలు,
8 సంతోషం, 
9 భౌతిక సుఖాలు, 
10 తెలివి తేటలు, 
11 అందం
12 విద్యాభివృద్ధి,
13 ఉన్నత విలువలు.. ధ్యానం,  
14 నీతి నియమాలు, 
15 మంచి ఆరోగ్యం, 
16 దీర్ఘ ఆయుః.

Friday, August 13, 2021

పెళ్లి లో కన్యను గంపలో మేనమామ ఎందుకు తేవాలి,తెస్తారు?

పెళ్లిలో కన్యను గంపలో తెచ్చే ఆచారము కొంత మందికి ఉంటుంది. ఇలా ఎందుకు తేవాలి దీని వెనుక ఉన్న కారణం తెలుసుకుందాం.

:cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom:
ముందుగా అమ్మాయి తో గౌరీ పూజ చేయించి ఆ తరువాత వెదురుతో చేసిన బుట్టలో కొద్దిగా ధాన్యం పోసి ఆ పిల్లని అందులో కూర్చోమని మేనమామలు కలిసి ఆ అమ్మాయిని వివాహ వేదిక మీదకి తీసుకొని వస్తారు.
:cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom:
బుట్టలో ఎందుకు కూర్చుంటోంది అంటే అప్పుడు ఆమె ఒకరికి లక్ష్మి అవుతోంది.అవతలి వారి వద్ద భార్యా స్థానాన్ని పొందుతోంది. పత్నీ స్థానాన్ని పొందుతోంది.
:cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom:
సనాతన ధర్మంలో ఆమె కామపత్ని కాదు. సహధర్మచారిణి.ఆమె ఉంటే తప్ప ఆయనకి ధర్మం నడవదు.అనగా దైవ రుణం పిత్రు రుణం ఋషి ఋణం తీరవు.
:cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom:
అసలు ఆయనకి అభ్యున్నతి లేదు.ఆయనకు ఉన్నటువంటి లక్ష్మి అంటే కేవలం ఐశ్వర్యం కాదు. ఆయన అభ్యున్నతి అంతా ఎవరిమీద ఆధారపడింది అంటే ఆమె మీదే ఆధారపడింది.ఆయన ఒక యజ్ఞం చేయాలి అంటే ఆమె ప్రక్కన ఉండాలి.ఆయన కన్యాదానం చేయాలి అంటే ఆమె ప్రక్కన ఉండాలి. ఆమె లేనినాడు ఆయన ఏమీ చేసుకోలేడు.మరి లక్ష్మియే కదా జీవుడికి!
:cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom:
పైగా ఇల్లాలు కాగానే ఐశ్వర్యం ఆయనది కాదు ఆవిడది.ఐశ్వర్యం అంతా ఆమెకి చెందుతుంది.అందుకే ఆయన వృద్ధి కూడా దేనిమీద ఆధారపడుతుంది అంటే భార్య మీద ఆధారపడుతుంది.ఆమెయే ఆతని లక్ష్మి.
:cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom:
అందుకే లక్ష్మి ఉండే అయిదు స్థానాలలో ఒక స్థానం సువాసిని పాపట ప్రారంభ స్థానం.అక్కడ బొట్టు పెట్టుకు తీరాలి.అక్కడ పెట్టుకున్న బొట్టు భర్తకు కలిసి వచ్చేటట్లుగా చేస్తుంది. లక్ష్మీ స్థానం అది.ఆమె లక్ష్మియై నారాయణుడిని చేరుతోంది. లక్ష్మికి ఒక లక్షణం ఉంటుంది.
:cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom:
ఆమె ‘నిత్యానపాయినీ’. ఆమె ఎన్నడూ విష్ణువును విడిచి పెట్టి ఉండదు.
:cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom:
శ్రీరామ సీత గాఁగ,నిజ సేవక బృందము వీరవైష్ణవా చారజనంబు గాఁగ, విరజానది గౌతమిగా,వికుంఠమున్నార భద్రశైలశిఖరాగ్రము గాఁగ వసించు చేతనో ద్దారకుఁడైన విష్ణుఁడవు దాశరథీ కరుణాపయోనిధీ!
:cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom:
శ్రీమహా విష్ణువు రామచంద్రమూర్తిగా వస్తే ఆమె సీతమ్మగా వస్తుంది.ఆయన కృష్ణ భగవానునిగా వస్తే ఆమె రుక్మిణీ దేవిగా వస్తుంది.ఆయన ఎక్కడ అవతార స్వీకారం చేస్తే ఆమె ఆయన వెంటే వస్తుంది.ఎన్నడూ విడిచిపెట్టదు.అలాగే ఆ పిల్ల ఇక్కడ పుట్టింది.
:cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom:
ఆడపిల్ల – ఆడ అంటే తెలుగులో అక్కడ.అక్కడికి వెళ్ళిపోయే పిల్ల ఇక్కడ పుట్టింది.ఎక్కడో నారాయణుడు ఉన్నాడు వెతుక్కుని వెళ్ళిపోతుంది.
:cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom:
ఇక్కడ లక్ష్మి పుట్టింది.అదృష్టం ఏమిటి? ఆ లక్ష్మిని పెంచి పెద్ద చేస్తున్నాను.ఆ లక్ష్మిని కన్యాదానం చేస్తాను.ఎవరికి? లక్ష్మి ఎప్పుడూ నారాయణునికే చెందుతుంది.అందుకే ఆమె లక్ష్మి గనుక పద్మంలో కూర్చోవాలి.
:cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom:
కాబట్టి వెదురు బుట్ట పద్మానికి సంకేతం.ఎందుకు పద్మంలో కూర్చోవాలి? ఆయనకు లక్ష్మిగా నేను వెళ్ళిన వేళ ఆయనకు కలిసిరావాలి.ఆయన వృద్ధిలోకి రావాలి.ఎన్నో యజ్ఞములు చేయాలి.ఎంతో ధార్మికంగా సంపాదించాలి. ఆయనకి సంతానం కలగాలి.ఆయన సంతోష పడిపోవాలి.ఆయన తండ్రి కావాలి, తాత కావాలి. ముత్తాత కావాలి.ఆయనకు కావలసిన అభ్యున్నతులలో పెద్ద అభ్యున్నతి పితృ ఋణం తీరాలి.తండ్రి ఋణం తాను సంతానాన్ని పొందితే తీరుతుంది.ఆ సంతానం నానుండి రావాలి. ధర్మ ప్రజాపత్యర్థం’ ఆయనకు నాయందున్న కామము ధర్మము చేత ముడిపడి నానుండి సంతానం కలగాలి.ఇన్ని లక్ష్ములకు ఆదిలక్ష్మిని నేనే.నడిచి వెళ్ళకూడదు వేదికమీదకి.లక్ష్మి అంటేనే ఐశ్వర్యం.లక్ష్మిగా ఆమె వేదికమీదకి వెళ్తోంది. నారాయణ మూర్తిని పొందడానికి.పద్మంలో వెళ్ళాలి.
:cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom:
అయ్యా నీ లక్ష్మిని తీసుకువస్తున్నాం.ఈ ప్రేమ ఎవరిది? మా అక్కచెల్లెళ్ళది. మా అక్క చెల్లుళ్ళు కన్న బిడ్డ అని మేనమామలు పరమ పరవశంతో ఆమెను లక్ష్మిగా బుట్టలో పెట్టి తీసుకుని వెడతారు. తీసుకువెళ్ళి బుట్టలోనే ఎదురుగుండా కూర్చోబెడతారు.ఈమె నీ లక్ష్మి.
:cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom:
ఇద్దరూ ఒకటి అయిపోయాక ఇక ఆమె బుట్టలో కూర్చోనక్కరలేదు.నారాయణుడి ప్రక్కన లక్ష్మియే. అందుకు ఒకపీట మీదకి మారిపోతారు ఇద్దరూ. మారేవరకు బుట్టలోనే కూర్చుంటుంది.బుట్టలో కూర్చోబెట్టడం అనేది కేవలం మౌడ్యమైన విషయం కాదు. ఆయన ప్రక్కకి లక్ష్మి చేరుతోంది ఇప్పుడు సుసంపన్నుడు అవుతున్నాడు.అన్ని విధాలా ఆయన వృద్ధిలోకి వస్తాడు అన్న భావనయే ఆమెని బుట్టలో కూర్చోబెట్టి మేనమామలు తీసుకు వెళ్తారు.మేనమామలు ప్రేమైక మూర్తులు.
:cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom:
లక్ష్మిని తీసుకువచ్చారు మా అబ్బాయి కోసం.నా ఇంటికి లక్ష్మి వచ్చింది అంటే నా కోడలు వచ్చింది.నా కోడలు వస్తే నా ఇంటికి లక్ష్మి వచ్చేసిందని గుర్తు.లక్ష్మీదేవి వచ్చింది నా కొడుకు ఇంకా వృద్ధిలోకి వస్తాడు అని పరవశించి పోయేవాడు మగపిల్లవాడి తండ్రి.
:cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom:
అందుకే అయ్యా మీరు ఇంత ఆదరభావంతో పిల్లను తెచ్చారు.లక్ష్మీ దేవిని తెచ్చారు నారాయణుడు అని నా కొడుకుని చూసి. మీరు పదికాలాలు బ్రతకండి అని ఆయుః కారకం కనుక అంచు ఉన్న పంచెల చాపు మేనమామలకి ఇస్తారు.
:cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom:
మేనమామలే ఎందుకు తేవాలి? తెలుగునాట ఒక లక్షణం ఉంది.అక్క చెల్లెళ్ళకి ఆడపిల్ల పుడితే ఒరేయ్ నీకు భార్య పుట్టింది అంటారు.ఎన్నడూ నేను నా మేనకోడలిని ఆ దృష్టితో చూడలేదు.ఆమెను లక్ష్మిగానే చూశాను. నారాయణుడిని చేరుతుంది అనుకున్నాను.భర్తృ భావనతో చూడలేదు.పవిత్రభావంతో ఏ లక్ష్మిగా చూశానో ఆ లక్ష్మిగా నారాయణుడి దగ్గరికి తెచ్చాను అని తెస్తాడు.అది మేనమామ పవిత్ర హృదయానికి ఆవిష్కారం.
:cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom:
అందుకే పెళ్ళి కూతుర్ని బుట్టలో తేవడం మేనమామలు తెస్తే పెళ్ళి అయిపోయాక నిజంగా వాళ్ళు ఐశ్వర్యవంతులు కాకపోయినా ఆమెని నడిపించి కానీ,ఇంకొకలా కానీ వెళ్ళకుండా ఊర్లో ఐశ్వర్యవంతులు ఎవరో వాళ్ళు తమ వాహనం ఇచ్చి పంపించాలి ఆధవా ఎద్దులబండిలో తీసుకు వెళ్తారు.వాహనంలో వెళ్ళాలి తప్ప నడిచి వెళ్ళకూడదు.
:cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom:
ఆడపిల్లని అంత పెద్ద ఎత్తున గౌరవించి లక్ష్మిగా ఆహ్వానించినటువంటి సంస్కృతి మనది._blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom::cherry_blossom:
[7:54:19 Ap:a:v:a:

వివిధ నాగ జాతులు మరియు నాగ జాతి వివరాలు

                                               సర్పరాజు వాసుకి:tulip:

:snakenake::snake::snake::snake::snake::snake::snake::snake:
నాగజాతికి అధిపతి అయిన వాసుకి పేరు మనకు అనేక చోట్ల కనిపిస్తుంది. క్షీరసాగర మధన సమయంలో మంధర పర్వతానికి తాడుగా ఉపయిగించింది ఈ వాసుకి సర్పరాజునే. వాసుకి కద్రువ కుమారుడు. జనమేజయుడు చేస్తున్న సర్పయాగాన్ని మాన్పించడానికి జరత్కారువును ప్రేరేపించిన వారిలో వాసుకి కూడా ఒకటి.

శతానీకుడు

జనమేజయుని కుమారుడు శతానీకుడు. శాతానీకునికి ఇద్దరు భార్యలు. ఇతనికి సంతానం కలగకపోవడంతో శాండిల్య మహాముని ఆధ్వర్యంలో ఇతడు పుత్రకామేష్టి యాగం చేస్తాడు. ఈ యాగం వల్ల సహస్రానీకుడనే పుత్రుడు జన్మిస్తాడు. ఇంద్రుడు రాక్షసులతో యుద్ధం చేయవలసి వచ్చి, ఇతడిని సహాయం కోసం రావలసిందిగా కోరతాడు. రాక్షసులతో జరిగిన యుద్ధంలో శతానీకుడు మరణిస్తాడు. ఇతని భార్యలు సహగమనం చేస్తారు. దేవతలకూ, రాక్షసులకూ జరిగిన యుద్ధాలలో మానవజాతికి చెందినా రాజులు దేవతలకు సహాయం చేయడం సహజమే. పురాణాల ప్రకారం చూసినప్పుడు అలా జరిగిన యుద్దాలలో రాక్షసుల చేతిలో మరణించిన ప్రముఖ రాజు శతానీకుడు.

సంపాతి జటాయువు

జటాయువు ఒక పక్షి. అనూరుడు, శ్యేనిల కుమారుడితడు. సంపాతి సోదరుడితడు. చిన్నతనంలో సోదరురిద్దరూ ఎవరు ఎంత ఎత్తుకు ఎగరగలరో అని పోటీపడి ఇద్దరు సూర్యమండలం వరకూ వెళతారు. సంపాతి రెక్కలు మాడిపోయి ఒకచోట. జటాయువు సొమ్మసిల్లి మరోచోట పడిపోతారు. రావణాసురుడు సీతను అరణ్యం నుంచి అపహరించుకుని వెడుతుండగా, జటాయువు అతనికి అడ్డంపడి, సీతను రక్షించడానికి ప్రయత్నిస్తుంది. జటాయువు రెక్కలను రావణాసురుడు ఖండించడంతో రెక్కలు తెగిన జటాయువు అంత్యక్రియలు రాముడే నిర్వర్తిస్తాడు. జటాయువు మరణించిన తర్వాత అనుకోకుండా వానరులు సంపాతిని కూడా కలుస్తారు. జటాయువు సోదరుడే సంపాతి అని తెలుసుకుంటారు. జటాయువు మరణించాడని తెలుసుకున్న సంపాతి తన కుమారులైన సుపార్శ్వుడు, బభ్రువు, శీఘ్రగుడులను కూడా వానరులకు సహాయంగా పంపుతాడు.

పరీక్షిత్తు

పరీక్షిత్తు అభిమన్యుని కుమారుడు. మహాభారత యుద్ధ సమయంలో అశ్వత్ధామ బ్రహ్మశిరోనామకాస్త్రం ప్రయోగించినప్పుడు, ఆ అస్త్రం ఉత్తర గర్భంలో ఉన్న పరీక్షిత్తును బాధించింది.

గర్భస్థ శిశువు వల్ల కలిగిన బాధకు తాళలేక ఉత్తర శ్రీ కృష్ణుని ప్రార్థించినప్పుడు, అతడు పరీక్షిత్తును కాపాడాడు. గర్భంలో తనకు కనిపించిన దైవము ( శ్రీకృష్ణుడు) లోకమంతా ఉన్నాడా అని పరీక్షించినందువల్ల ఇతనికి పరీక్షిత్తు అని పేరు వచ్చింది.

ఉత్తరుని కుమార్తె ఐరావతిని పరీక్షిత్తు వివాహమాడాడు. ఒకసారి ఇతడు వేటకు వెళ్ళి, ఒక మృగాన్ని వేటాడుతూ ఒక ముని ఆశ్రమానికి చేరతాడు. అక్కడ తపస్సమాధిలో ఉన్న మునిని చూసి, తను వెన్నాడి వచ్చిన మృగమేదని అడుగుతాడు.

తపస్సులో ఉన్న ఆ ముని సమాధానం ఇవ్వకపోవడంతో కోపించిన పరీక్షిత్తు, అక్కడ చచ్చి పడి ఉన్న పాము కళేబరాన్ని ఆ ముని మెడలో వేసి వెళ్ళిపోతాడు. కొద్దిసేపటికి ముని కుమారుడు వచ్చి, తన తండ్రి మెడలో పాము కళేబరం ఉండటం చూసి, ఈ పని చేసిన వాడు ఏడు రోజులలో పామువల్ల మరణిస్తాడు. అని శపిస్తాడు.

చివరకు తపస్సులో ఉన్న ముని జరిగింది తెలుసుకుని, పరీక్షిత్తు వద్దకు వెళ్ళి, తన కుమారుడిచ్చిన శాపం గురించి చెబుతాడు. పాము వల్ల తనకు మరణం సంభవిస్తుందని తెలుసుకున్న పరీక్షిత్తు, ఒక దుర్భేద్యమైన గృహంలో ఉండిపోతాడు.

ఏడవరోజు పాములు మానవరూపంలో వచ్చి, పరీక్షిత్తుకు పండ్లు ఇస్తారు. అందులోని ఒక పండులో ఉన్న తక్షకుడు అనే పాము బయటకు వచ్చి పరీక్షిత్తును కాటు వేయడంతో అతను మరణిస్తాడు. పరీక్షిత్తు కుమారుడు జనమేజయుడు.

రావణుని జయించిన మాంధాత

యవనాశ్వుని కుమారుడు మాంధాత. భ్రుగు మహర్షి దాచి ఉంచిన మంత్ర జలం సేవించినందువల్ల యవనాశ్వుని భార్యకు మాంధాత జన్మిస్తాడు. 12 వ ఏటనే రాజ్యాభిషిక్తుడైన మాంధాత ఎంతో బలవంతుడని తెలుసుకున్న రావణుడు అతనితో యుద్ధం చేయడానికి వచ్చి, ఆ యుద్ధంలో ఓడిపోతాడు. బ్రహ్మ, ఇంద్రుడు వచ్చి మంధాతకు, రావణునికీ సంధి చేయడంతో రావణుడు తిరిగి లంకకు చేరుకుంటాడు. ఇతనికి ముచికుందుడు మొదలైన అనేకమంది కుమారులున్నారు.

కృపుడు

శరద్వంతుని కుమారుడు కృపుడు. అతని చెల్లెలు కృపి. శరద్వంతుడు తపస్సు చేసుకుంటున్న సమయంలో జన్మించిన వీరిద్దరినీ శంతనుడు చేరదీసి పెంచుతాడు. తపస్సు పూర్తయిన శరద్వంతుడు కృపుడికి ధనుర్విద్య నేర్పిస్తాడు. కృపికి ద్రోణాచార్యునితో వివాహం చేస్తాడు. సాత్విక స్వభావం కలిగిన కృపుడు ద్రోణాచార్యునీతో బాటు దుర్యోధనుని కొలువులో ఆచార్యునిగా ఉన్నాడు. ఎన్నడూ దుర్యోధనునికి ఎదురుచెప్పక అతడికి అనువర్తనగా ఉండేవాడు. అయితే మరీ అత్యవసర సమయాలలో మాత్రం హితవచనాలు చెప్పేవాడు. ధనుర్విద్యలో నిపుణుడు అయినప్పటికీ భీష్ముడు, ద్రోణుడు వంటివారి వల్ల ఇతని శౌర్యం పూర్తి స్థాయిలో బయటపడవలసిన అవసరం ఎన్నడూ కలగలేదు.

సగర పుత్రులను భస్మం చేసిన కపిలుడు
భగీరథుని పేరు మనకు తెలుసు. గంగను భూమి మీదకు రప్పించడానికి అతడు చేసిన ప్రయత్నాలకు భగీరథ ప్రయత్నాలని పేరు. ఈ భగీరథ ప్రయత్నానికి పరోక్షంగా కారకుడు కపిలుడు. సగరుడనే రాజు అశ్వమేధ యాగం చేయగా, ఆ యాగాశ్వం పాతాళంలో తపస్సు చేసుకుంటున్న కపిలుని వద్దకు పోతుంది. యాగాశ్వము వెంట వెళ్ళిన సగరపుత్రుల అలికిడికి కపిలుడు కోపంగా కళ్ళు తెరిచి చూడగా, సగరపుత్రులందరూ భస్మమైపోతారు. మరణించిన సగరపుత్రులు పుణ్యలోకాలకు చేరాలంటే ఈ భస్మంపై గంగ ప్రవహించాలనే కపిలుని సూచన మేరకు దిలీపుని కుమారుడైన భగీరథుడు ఎంతో ప్రయత్నం చేసి గంగను భూమి మీదకు తీసుకువస్తాడు.

జనమేజయుడు

వైశంపాయనుడు, భారత కథను జనమేజయునికి వినిపించాడు. అర్జునుని మనుమడైన పరీక్షిత్తు కుమారుడు జనమేజయుడు. తన తండ్రి పాముకాటు వల్ల మరణించాడన్న సంగతి తెలుసుకున్న జనమేజయుడు సర్పజాతిని నిర్మూలించాలనే ధ్యేయంతో సర్పయాగం ప్రారంభిస్తాడు. సర్పయాగం చేస్తున్న సమయంలో పాములన్నీ వచ్చి హోమగుండంలో పడి కాలిపోతుంటాయి. అలా సర్పజాతిని నిర్మూలించాలనుకుంటాడు జనమేజయుడు. అయితే సృష్టిలో సర్పజాతి అంతం కారాదనే ఉద్దేశంతో కొందరు జరత్కారువు అనే ముని వద్దకు వెళ్ళి, ఈ యాగం ఆగిపోయే ఉపాయం ఆలోచించమని కోరతారు. జరత్కారువు తన కుమారుడు ఆస్తీకుని జనమేజయుని వద్దకు పంపగా, అతడు జనమేజయుని వద్దకు వచ్చి, తన విద్యా నైపుణ్యం చూపించి, సర్పయాగం మంచిది కాదని నచ్చజెప్పి, ఆ యాగాన్ని ఆపు చేయిస్తాడు.

బభ్రువాహనుడు

అర్జునుడికి, చిత్రాంగదకు జన్మించిన కుమారుడు బభ్రువాహనుడు. ఇతను పుట్టిన తర్వాత తల్లి దగ్గరే పెరగడంతో అర్జునుడిని ఎన్నడూ చూడలేదు. బభ్రువాహనుడు పెరిగి పెద్దవాడయ్యే కాలానికి ధర్మరాజు అశ్వమేధయాగం చేస్తాడు. యాగాశ్వం వెంట అర్జునుడు రాగా, అతడిని బభ్రువాహనుడు నిలువరిస్తాడు. అర్జునుడికి, బభ్రువాహనుడికి మధ్య జరిగిన యుద్ధంలో అర్జునుడు మరణించగా, పినతల్లి ఉలూచి సలహాతో బభ్రువాహనుడు నాగలోకం వెళ్ళి సంజీవని మణి తీసుకొచ్చి, అర్జునుని పునర్జీవితుడిని చేస్తాడు. అయితే అర్జునుడిని బభ్రువాహనుడు పునర్జీవితుడిని చేసే విషయంలో ఇతర కధనాలు కూడా ప్రచారంలో ఉన్నాయి.

అనూరుడు

రామాయణంలో సంపాతి, జటాయువు అనే పక్షుల పేర్లు కనిపిస్తాయి. రావణాసురుడు సీతని ఎత్తుకుపోయిన తర్వాత ఆమె జాడ గురించి వానరులకు చెప్పింది జటాయువే. ఈ సంపాతి, జటాయువుల తండ్రి అనూరుడు. ఇతను వినత, కశ్యపుల కుమారుడు. కద్రువకు పిల్లలు పుట్టినను తనకు పుట్టకపోవడంతో అండముల విచ్చిన్నం చేసుకుంటుంది వినతి. విచ్చిన్నమైన అండం భాగం నుంచి ఒక శిశువు జన్మిస్తాడు. అతడే అనూరుడు. సగం దేహంతో జన్మించిన అతడు రెండవ అండంలోని మిగిలిన భాగం జన్మించేవరకు దానిని తాకవద్దని, ఆ అండాన్ని విచ్చిన్నం చేసినందుకు కద్రువకు దాసిగా ఉండమని శపిస్తాడు. ఇతని భార్యే శ్యేని.

అనిరుద్ధుడు

కృష్ణునికి అనిరుద్ధుడు మనుమడు. ప్రద్యుమ్నుని కుమారుడితడు. ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుల కథలు ఇంచుమించు ఒకేవిధంగా ఉంటాయి. అనిరుద్ధుడు మొదట రుక్మి మనుమరాలైన రుక్మిలోచనను వివాహమాడతాడు. బాణాసురుని కుమార్తె అయిన ఉష అనిరుద్ధుని రూపాన్ని కలలో చూసి, అతడిని వరిస్తుంది. ఉష చెలికత్తె అనిరుద్ధుడిని మాయా విద్యతో ఉష వద్దకు చేరుస్తుంది. వారికి వజ్రుడనే కుమారుడు జన్మిస్తాడు. అంతఃపురంలోకి ఇతరులు ప్రవేశించాలని తెలుసుకున్న బాణాసురుడు అనిరుద్ధుడిని బంధిస్తాడు. అనిరుద్ధుడి విషయం తెలుసుకున్న ప్రద్యుమ్నుడు, సాత్యకి కృష్ణుడు బాణాసురుడితో యుద్ధం చేసి, అతనిని ఓడించి అనిరుద్ధుడికీ ఉషకు వివాహం చేస్తారు. ప్రద్యుమ్నుడి కథలో అయితే ప్రద్యుమ్నుడు తన గత జన్మలో మన్మధుడు. శంబరాసురుని కుమార్తె మాయావతి. వీరు కూడా వివాహమాడతారు.

ఆహుకుడు

నలుడు పూర్వజన్మలో ఆహుకుడనే భిల్లుడిగా జన్మించాడు. అతడు శివభక్తుడు. అతని భక్తిని పరీక్షించేందుకు శివుడు ఒక ముని రూపంలో అతని వద్దకు వచ్చి, అతని ఇంట్లో తనకు ఆశ్రయమివ్వమని కోరాడు. ఆహుకుడికి, అతని భార్యకు ఉన్న చోటు అతి తక్కువ కావడంతో మునికి, తన భార్యకు ఇంట్లో చోటిచ్చి, తను ఆరుబయట నిద్రించాడు. ఆ సమయంలో ఒక పులి అతడిని చంపేస్తుంది. అతని భార్య సహగమనం చేయబోగా, ఆ ముని ఏదైనా కోరుకోమని ఆహుకుడి భార్యకు చెప్పగా, ఆమె “మీకు తోచింది ఇవ్వ’’మంది. అప్పుడు శివుడు నిజరూపంలో ప్రత్యక్షమై, వచ్చే జన్మలో మీరు నలదమయంతులుగా పుడతారని, వారిమధ్య వియోగం వచ్చినప్పుడు తాను హంస రూపంలో వారిద్దరినీ కలుపుతానని వరమిస్తాడు. ఆ వరప్రభావంతో ఆహుకుడే నలుడిగా జన్మించాడు. అతని భార్య దమయంతిగా పుట్టింది.

తారకాసురుడు

వజ్రాంగుడనే రాక్షసుని కుమారుడు తారకాసురుడు. బ్రహ్మ కోసం తీవ్రమైన తపస్సు చేసిన తారకాసురుడు సృష్టిలో తనకు సమానమైన బలం కలిగిన వీరుడు లేకుండా వరం కోరుకుంటాడు. బ్రహ్మ వరం ఇచ్చిన తర్వాత ఆ రాక్షసుడు విజ్రుంభించి అన్ని లోకాల వారినీ బాధించడం మొదలుపెట్టాడు. చివరికి శివుని కుమారుడే తారకాసురుడిని వధించగలడని బ్రహ్మ చెబుతాడు. శివపార్వతులకు జన్మించిన కుమారస్వామి తారకాసురుడితో యుద్ధం చేసి, ఆ యుద్ధంలో అతడిని సంహరిస్తాడు.

కలియుగం ఎలా ఉంటుంది

:cherrకలియుగం ఎలా ఉంటుంది అన్న పాండవుల ప్రశ్నకు.... కృష్ణ భగవానుని సమాధానం.

ఒకసారి ధర్మరాజు లేని సమయంలో మిగిలిన నలుగురు పాండవులు శ్రీకృష్ణుని కలియుగం ఎలా ఉంటుంది అని అడిగారు.

శ్రీకృష్ణుడు నవ్వి చూపిస్తాను చూడండి అన్నాడు. నాలుగు బాణాలు నాలుగు దిక్కులకు వేసి తలో దిక్కు వెళ్లి ఆ బాణాలను తెమ్మన్నాడు. నలుగురు పాండవులు తలో దిక్కుగా ఆ బాణాలను వెదుక్కుంటూ వెళ్లారు.

అర్జునుడికి బాణం దొరికింది. ఇంతలోనే ఒక మధుర గానం వినిపించి అటు తిరిగాడు. ఒక కోయిల మధురంగా పాడుతూ బ్రతికున్న ఒక కుందేలును పొడచుకు తింటోంది. అర్జునుడు నివ్వెర పోయాడు. తిరిగికృష్ణుడి దగ్గరకు బయలు దేరాడు.

భీముడికి బాణం దొరికిన చోట నిండుగా నీళ్లున్న నాలుగు బావుల మధ్య ఒక ఎండి పోయిన బావి కనిపించింది. ఆశ్చర్య పోయాడు. కృష్ణుడి దగ్గరకు బయలుదేరాడు.

నకులుడికి బాణం దొరికిన చోట ఒక ఆవు అప్పుడే పుట్టిన తన లేగ దూడను గాయాలయ్యేంత విపరీతంగా నాకుతోంది. చుట్టూ వున్న జనం అతి కష్టమ్మీద ఆవు దూడలను విడదీశారు. నకులుడికి ఆశ్చర్యమేసింది. వెనుదిరిగాడు.

ఇక సహదేవుడికి బాణం దొరికిన చోట ఒక పర్వతం పైనుండి ఒక పెద్ద గుండు దొర్లుతూ దారిలో ఉన్న చెట్లను పడవేస్తూ వచ్చి ఒక చిన్న మొక్క దగ్గర ఆగిపోయింది. సహదేవుడికి అర్థం కాలేదు.

నలుగురూ కలిసి శ్రీకృష్ణుని తమ సందేహాలు అడిగారు.

ఆయన చెప్పనారంభించాడు.

కలియుగంలో గొప్ప జ్ఞానులైన వారు కూడా కుందేలును కోయిల పొడుచుకు తిన్న రీతిగా భక్తులను దోచుకుంటారు.

కలియుగంలో అత్యంత ధనికులు కూడా పేదలకు పైసా సాయం చేయరు.

కలియుగంలో ఎలాగైతే ఆవు దూడకు గాయాలయ్యేంతగా నాకిందో తలిదండ్రులు తమ పిల్లలను గారం చేసి వాళ్ల జీవితాల్ని నాశనం చేస్తారు.

కలియుగంలో జనులు మంచి నడవడి కోల్పోయి కొండ మీద నుంచి గుండు దొర్లినట్లుగా పతనం అవుతారు. భగవన్నామమనే చిన్న మొక్క తప్ప ఎవరూ కాపాడ లేరు.

ఉద్ధవ గీత శ్రీమద్భాగవతం...
(సేకరణ).