un_with_face::earth_americas::crescent_moon::star2::triangular_flag_on_post:
॥పల్లవి॥మంగళము గోవిందునకు
జయ మంగళము గరుడ ధ్వజునకును
మంగళము సర్వాత్మకునకు
ధర్మ స్వరూపునకూ జయజయ!!
॥మంగళము॥
॥చ1॥
ఆదికిని నాదైన దేవునకు
అచ్యుతునకు అంభోజ నాభునికి
ఆది కూర్మంబైన జగదాధార మూర్తికిని
వేద రక్షకునకు సంతత వేదమార్గ విహారునకు
బలిభేదికిని సామాదిగాన ప్రియ విహారునకు!!
॥మంగళము॥
॥చ2॥
హరికి పరమేశ్వరునకును
శ్రీధరునకును కాలాంతకునకును
పరమ పురుషోత్తమునకును
బహు బంధదూరునకు సురముని స్తోత్రునకు
దేవాసురగణ శ్రేష్టునకు కరుణాకరునకును
కాత్యాయనీ నుతకలిత నామునకు!!
॥మంగళము॥
॥చ3॥
పంకజాసన వరదునకు
భవపంకవిచ్ఛేదునకు భవునకు
శంకరునకు అవ్యక్తునకు ఆశ్చర్యరూపునకు
వేంకటాచలవల్లభునకు విశ్వమూర్తికి నీశ్వరునకు
పంకజాకుచకుంభ కుంకుమ పంకలోలునకు!!
॥మంగళము॥
No comments:
Post a Comment