నిరంతరం సత్యాన్వేషణ జరుపుతూ, అనుక్షణం విద్య గరుపుతున్న నిత్య విద్యార్థుల కోసం ఏర్పాటు చేయబడిన బ్లాగ్ ఇది. ఇందులో నా ఆలోచనలు, భావాలతో పాటు, వివిధ రకాల ఉపయుక్త సమాచారాన్ని పొందుపరుస్తాను, మీ సూచనలు, సలాహాలు సదా అభిలషణీయం. - డా. వేణు మాధవ శర్మ This blog is for the eternal seeker, always striving to learn and grow. I share reflections and insights, blending devotion with wisdom, along with practical guidance for your spiritual and educational path. Dr. M. Venu Madhava Sharma
Translate
Sunday, September 4, 2022
ఏ వ్రేలితో బొట్టు పెట్టాలి
Wednesday, August 24, 2022
శ్రీ అంగారక స్తోత్ర మహామంత్రO
స్కంద ఉవాచ |
ఋణగ్రస్త నరాణాంతు ఋణముక్తిః కథం భవేత్ |
బ్రహ్మోవాచ |
వక్ష్యేహం సర్వలోకానాం హితార్థం హితకామదం |
అస్య శ్రీ అంగారక స్తోత్ర మహామంత్రస్య గౌతమ ఋషిః అనుష్టుప్ ఛందః అంగారకో దేవతా మమ ఋణ విమోచనార్థే జపే వినియోగః |
ధ్యానమ్ |
రక్తమాల్యాంబరధరః శూలశక్తిగదాధరః |
చతుర్భుజో మేషగతో వరదశ్చ ధరాసుతః || ౧ ||
మంగళో భూమిపుత్రశ్చ ఋణహర్తా ధనప్రదః |
స్థిరాసనో మహాకాయో సర్వకామఫలప్రదః || ౨ ||
లోహితో లోహితాక్షశ్చ సామగానాం కృపాకరః |
ధరాత్మజః కుజో భౌమో భూమిజో భూమినందనః || ౩ ||
అంగారకో యమశ్చైవ సర్వరోగాపహారకః |
సృష్టేః కర్తా చ హర్తా చ సర్వదేవైశ్చపూజితః || ౪ ||
ఏతాని కుజ నామాని నిత్యం యః ప్రయతః పఠేత్ |
ఋణం న జాయతే తస్య ధనం ప్రాప్నోత్యసంశయం || ౫ ||
అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సలః |
నమోఽస్తు తే మమాఽశేష ఋణమాశు వినాశయ || ౬ ||
రక్తగంధైశ్చ పుష్పైశ్చ ధూపదీపైర్గుడోదకైః |
మంగళం పూజయిత్వా తు మంగళాహని సర్వదా || ౭ ||
ఏకవింశతి నామాని పఠిత్వా తు తదండకే |
ఋణరేఖాః ప్రకర్తవ్యాః అంగారేణ తదగ్రతః || ౮ ||
తాశ్చ ప్రమార్జయేత్పశ్చాత్ వామపాదేన సంస్పృశత్ |
మూలమంత్రః |
అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సల |
నమోఽస్తుతే మమాశేషఋణమాశు విమోచయ ||
ఏవం కృతే న సందేహో ఋణం హిత్వా ధనీ భవేత్ ||
మహతీం శ్రియమాప్నోతి హ్యపరో ధనదో యథా |
అర్ఘ్యం |
అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సల |
నమోఽస్తుతే మమాశేషఋణమాశు విమోచయ ||
భూమిపుత్ర మహాతేజః స్వేదోద్భవ పినాకినః |
ఋణార్తస్త్వాం ప్రపన్నోఽస్మి గృహాణార్ఘ్యం నమోఽస్తు తే || ౧౨ ||
భూ వరాహ స్తోత్ర మహిమ
ఇల్లు కట్టుకోవాలనే కోరిక, ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ అనేక కారణాల చేత సొంత ఇంటి కల కుదరక పోవచ్చు.సొంత ఇల్లు ఒక్కటే కాదు, స్థలాలు,భూములు,ఇళ్ళు కొనాలన్నా, అమ్మాలన్నా అడ్డంకులు తొలగడానికి ప్రతి రోజు పూజలో భాగంగా , ఈ స్తోత్రమును రోజూ 9సార్లు మండలం (41 days) రోజులు పఠించాలి.
భూ వరాహ స్తోత్రం
ఋషయ ఊచు |
జితం జితం తేఽజిత యజ్ఞభావనా
త్రయీం తనూం స్వాం పరిధున్వతే నమః |
యద్రోమగర్తేషు నిలిల్యురధ్వరాః
తస్మై నమః కారణసూకరాయ తే ౧
రూపం తవైతన్నను దుష్కృతాత్మనాం
దుర్దర్శనం దేవ యదధ్వరాత్మకం |
ఛన్దాంసి యస్య త్వచి బర్హిరోమ-
స్స్వాజ్యం దృశి త్వంఘ్రిషు చాతుర్హోత్రమ్ ౨
స్రుక్తుండ ఆసీత్స్రువ ఈశ నాసయో-
రిడోదరే చమసాః కర్ణరంధ్రే |
ప్రాశిత్రమాస్యే గ్రసనే గ్రహాస్తు తే
యచ్చర్వణంతే భగవన్నగ్నిహోత్రమ్ ౩
దీక్షానుజన్మోపసదః శిరోధరం
త్వం ప్రాయణీయో దయనీయ దంష్ట్రః |
జిహ్వా ప్రవర్గ్యస్తవ శీర్షకం క్రతోః
సభ్యావసథ్యం చితయోఽసవో హి తే ౪
సోమస్తు రేతః సవనాన్యవస్థితిః
సంస్థావిభేదాస్తవ దేవ ధాతవః |
సత్రాణి సర్వాణి శరీరసంధి-
స్త్వం సర్వయజ్ఞక్రతురిష్టిబంధనః ౫
నమో నమస్తేఽఖిలయంత్రదేవతా
ద్రవ్యాయ సర్వక్రతవే క్రియాత్మనే |
వైరాగ్య భక్త్యాత్మజయాఽనుభావిత
జ్ఞానాయ విద్యాగురవే నమొ నమః ౬
దంష్ట్రాగ్రకోట్యా భగవంస్త్వయా ధృతా
విరాజతే భూధర భూస్సభూధరా |
యథా వనాన్నిస్సరతో దతా ధృతా
మతంగజేంద్రస్య స పత్రపద్మినీ ౭
త్రయీమయం రూపమిదం చ సౌకరం
భూమండలే నాథ తదా ధృతేన తే |
చకాస్తి శృంగోఢఘనేన భూయసా
కులాచలేంద్రస్య యథైవ విభ్రమః ౮
సంస్థాపయైనాం జగతాం సతస్థుషాం
లోకాయ పత్నీమసి మాతరం పితా |
విధేమ చాస్యై నమసా సహ త్వయా
యస్యాం స్వతేజోఽగ్నిమివారణావధాః ౯
కః శ్రద్ధధీతాన్యతమస్తవ ప్రభో
రసాం గతాయా భువ ఉద్విబర్హణం |
న విస్మయోఽసౌ త్వయి విశ్వవిస్మయే
యో మాయయేదం ససృజేఽతి విస్మయమ్ ౧౦
విధున్వతా వేదమయం నిజం వపు-
ర్జనస్తపః సత్యనివాసినో వయం |
సటాశిఖోద్ధూత శివాంబుబిందుభి-
ర్విమృజ్యమానా భృశమీశ పావితాః ౧౧
స వై బత భ్రష్టమతిస్తవైష తే
యః కర్మణాం పారమపారకర్మణః |
యద్యోగమాయా గుణ యోగ మోహితం
విశ్వం సమస్తం భగవన్ విధేహి శమ్ ౧౨
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే తృతీయస్కంధే శ్రీ వరాహ ప్రాదుర్భావోనామ త్రయోదశోధ్యాయః | సంపూర్ణం.
Monday, June 13, 2022
శ్రీ శివ సహస్రనామ స్తోత్రం
Tuesday, May 17, 2022
సీతారామస్తోత్రo (హనుమత్ కృతం)
Friday, May 6, 2022
తోటకాష్టకం
విదితాఖిల శాస్త్ర సుధా జలధే
మహితోపనిషత్-కథితార్థ నిధే |
హృదయే కలయే విమలం చరణం
భవ శంకర దేశిక మే శరణమ్ || 1 ||
కరుణా వరుణాలయ పాలయ మాం
భవసాగర దుఃఖ విదూన హృదమ్ |
రచయాఖిల దర్శన తత్త్వవిదం
భవ శంకర దేశిక మే శరణమ్ || 2 ||
భవతా జనతా సుహితా భవితా
నిజబోధ విచారణ చారుమతే |
కలయేశ్వర జీవ వివేక విదం
భవ శంకర దేశిక మే శరణమ్ || 3 ||
భవ ఎవ భవానితి మె నితరాం
సమజాయత చేతసి కౌతుకితా |
మమ వారయ మోహ మహాజలధిం
భవ శంకర దేశిక మే శరణమ్ || 4 ||
సుకృతేஉధికృతే బహుధా భవతో
భవితా సమదర్శన లాలసతా |
అతి దీనమిమం పరిపాలయ మాం
భవ శంకర దేశిక మే శరణమ్ || 5 ||
జగతీమవితుం కలితాకృతయో
విచరంతి మహామాహ సచ్ఛలతః |
అహిమాంశురివాత్ర విభాసి గురో
భవ శంకర దేశిక మే శరణమ్ || 6 ||
గురుపుంగవ పుంగవకేతన తే
సమతామయతాం న హి కోஉపి సుధీః |
శరణాగత వత్సల తత్త్వనిధే
భవ శంకర దేశిక మే శరణమ్ || 7 ||
విదితా న మయా విశదైక కలా
న చ కించన కాంచనమస్తి గురో |
దృతమేవ విధేహి కృపాం సహజాం
భవ శంకర దేశిక మే శరణమ్ || 8 ||
Monday, March 28, 2022
ఇంట్లో ఎవరైనా మరణిస్తే ఏడాది వరకు పూజలు చేయకూడదా?
బయట వినిపించే మాటల్లో ఇదొకటి. కుటుంబసభ్యులు ఎవరైనా మరణిస్తే, ఏడాది వరకు ఎటువంటి పూజలు చేయకూడదని ప్రచారం చేస్తున్నారు. కొందరైతే కనీసం దీపం కూడా వెలిగించరు, దేవతలందరిని ఒక బట్టలో చుట్టి, అటక మీద పెట్టేస్తారు. సంవత్సరీకాలన్నీ అయిపోయిన తర్వాత మరుసటి ఏడాది దేవుళ్ళ చిత్రపటాలను క్రిందకు దింపి, శుభ్రం చేసి పూజ చేస్తారు. అంటే ఆ వ్యక్తి మరణించిన ఇంట్లో ఏడాది పాటు దీపారాధాన, దైవానికి పూజ, నివేదన ఉండవన్నమాట. ఇది సరైన పద్ధతి కాదు. శాస్త్రం ఇలా చెప్పలేదు.
దీపం లేని ఇల్లు స్మశానంతో సమానం. దీపం శుభానికి సంకేతం. దీపం ఎక్కడ వెలిగిస్తే అక్కడకు దేవతలు వస్తారు. ప్రతి ఇంట్లోను నిత్యం దీపారాధాన అనేది జరగాలి. మరణం సంభవించిన ఇంట్లో 11 వ రోజు తర్వాత శుద్ధి కార్యక్రమం జరుగుతుంది. 12 వ రోజు శుభస్వీకారం జరుగుతుంది. ఆ కుటుంబం ఆ 11 రోజులు మాత్రమే ప్రత్యేకంగా పూజ చేయకూడదు. అంతవరకే శాస్త్రంలో చెప్పబడింది. అంతేకానీ ఏడాది పాటు దీపం వెలిగించకూడదని, పూజలు చేయకూడదని చెప్పలేదు. నిజానికి సూతకంలో ఉన్న సమయంలో కూడా సంధ్యావందనం చేయాలని, అర్ఘ్యప్రధానం వరకు బాహ్యంలో చేసి, మిగితాది మానసికంగా చేయాలని శాస్త్రం చెప్పింది. ఏడాది పాటు ఆలయాలకు వెళ్ళకూడదని కూడా చెప్పలేదు. మనం నిత్యం ఇంతకముందు ఏదైతే చేస్తున్నామో, అది నిరభ్యంతరంగా కొనసాగించవచ్చు. కొత్త పూజలు అనేవి ప్రారంభించకూడదు. ఇంతకముందు రోజూ ఆలయానికి వెళ్తుంటే, సూతకం అయిన తర్వాత కూడా యధావిధిగా ఆలయదర్శనం చేయవచ్చు.
మనం నిత్యం అర్చించడం వలన మనం పూజించే చిత్రపటాల్లో దేవతలు వచ్చి కూర్చుంటారు. అలా ఏడాది పాటు వారికి ధూప, దీప, నైవేధ్యాలు మొదలైన ఉపచారాలు చేయకుండా, బట్టలో చుట్టి పక్కన పెట్టడమే తప్పు. అది దోషము, అరిష్టము కూడా. కనుక తప్పకుండా ఇంట్లో నిత్య దీపారాధన, దైవారాధన జరగాలి. ఇంటికి గానీ, ఇంటి సభ్యులకు కానీ ఎలాంటి దోషాలున్నా, వాటిని అన్నిటిని ఆపే శక్తి ఆ ఇంట్లో చేసే దైవారాధనకు ఉంటుంది. కనుక ఎన్నడూ దైవారాధన, దీపారాధన మానకూడదు. ఈ విషయంలో పూజలు చేయవచ్చు అనేకంటే చేసి తీరాలి అని చెప్పడం సరైన సమాధనం అవుతుందేమో!......(సేకరణ)
ఋణవిమోచనం
క్షౌర కర్మ
క్షౌర కర్మను గురించి శాస్త్రము ఒక క్రమ పద్దతిని నిర్దిష్టించినది .
అశ్మశ్రూణ్యగ్రే వాపయతే అథోపకక్షావథ కేశానాథ లోమాన్యథ నాఖాని | .
అథైతన్మనుర్వప్త్రే మిథునమపశ్యత్ |
స శ్మశ్రూణ్యగ్రే అవపత్ |
అథోపకక్షౌ అథకేశాన్.
తాత్పర్యము:
ముందుగా గడ్డమును కుడి ప్రక్కనుండి ప్రారంభించి పూర్తి చేయవలెను . పిమ్మట మీసములను , కక్షము (చంకలు) , పిదప తల వెంట్రుకలను కత్తిరించ వలయును చివరగా గోళ్ళను కత్తిరించుకొనవలెనని విధానము చెప్పబడినది . తూర్పు కాని ఉత్తర ముఖముగా కూర్చొని చేయించుకోవలెను
క్షౌరకర్మ చేయించుకోకూడని సమయాలు : (తిథులు)
1) పాడ్యమి
2) షష్టి
3) అష్టమి
4) నవమి (శుక్ల పక్షము )
5) ఏకాదశి
6) చతుర్దశి
7) పౌర్ణమి
8) అమావాస్య
9) జన్మ నక్షత్రం ఉన్న రోజు
10) సూర్య సంక్రమణం నాడు
11) వ్యతీపాతం
12) విష్టి (భద్ర )
రోజులు - సమయములు -(చెయ్యకూడనివి)
1) శనివారము
2) ఆదివారము
3) మంగళవారము
4) శ్రాద్ధ దినము నాడు
5) ప్రయాణము చేయబోయే రోజు
6) అభ్యంగన స్నానము చేసిన తరువాత
7) భోజనము చేసిన తరువాత
8) సంధ్యా సమయాల్లో ( 5 - 7 am ; 11-13 hrs ; 17 - 19 hrs)
9) రాత్రి పూట
10) మంగళ కార్యాలు (వ్రతాలు లాంటివి ) చేయదలచిన దినము
11) మంగళ కరమైన కట్టుబొట్టు ఆభరణాలు అలంకారములు చేసుకున్న పిదప ..
12) యుద్దారంభామున
13) వైధృతి యందు
పైన చెప్పిన రోజులు, సమయాల్లో క్షౌరకర్మ కూడదు
1) ఆదివారము క్షౌరము చేయించుకుంటే - 1 మాసము ఆయుక్షీణము
2) శనివారము క్షౌరము చేయించుకుంటే - 7 మాసాలు ఆయుక్షీణము
3) మంగళవారము క్షౌరము చేయించుకుంటే - 8 మాసాలు ఆయుక్షీణము
ఆయా దినములకు చెందిన అభిమాన దేవతలు ఆయు క్షీణింపచేయుదురు .
ఇదే విధముగా ...
1) బుధవారము క్షౌరము చేయించుకుంటే - 5 మాసాలు ఆయువృద్ధి
2) సోమవారము క్షౌరము చేయించుకుంటే - 7 మాసాలు ఆయువృద్ధి
3) గురువారము క్షౌరము చేయించుకుంటే - 10 మాసాలు ఆయువృద్ధి
4) శుక్రవారము క్షౌరము చేయించుకుంటే - 11 మాసాలు ఆయువృద్ధి
ఆయా దినములయోక్క అభిమాన దేవతలు ఆయు వృద్ధి చేయుదురు .
కొడుకు పుట్టుక కోసం ఆశిస్తున్న వారు , ఒకే ఒక్క కొడుకు ఉన్నవారు సోమవారము క్షౌరము చేయించుకోకూడదు .
అలాగే విద్య , ఐశ్వర్యం కోరుకొనే వారు గురువారము క్షౌరము చేయించుకోకూడదు.