Translate

Tuesday, July 30, 2019

పాకిస్థాన్‌లోని శక్తిపీఠం: హింగ్లాజ్ దేవీ ఆలయం (సేకరణ- ఈనాడు పేపర్ నుండి)




ఇంటర్నెట్‌డెస్క్‌: పురాణ గాథలు, ఆచారాల పరంగా లయకారకుడైన పరమ శివుడి అర్ధాంగి పార్వతిదేవిని ఆరాధించే ఆలయాలు ఉన్న మహిమాన్విత ప్రదేశాలను శక్తి పీఠాలుగా పేర్కొంటారు. అసలు శక్తి పీఠాలు ఎన్ని? మనదేశంలో చాలామందికి తెలిసిన శక్తి పీఠాలు 18. అయితే, ‘ప్రాణేశ్వరీ ప్రాణధాత్రీ పంచాశత్పీఠరూపిణీ’ అని లలితా సహస్రనామావళి 51శక్తి పీఠాలు ఉన్నట్లు చెబుతోంది. పురాణ గ్రంథాలను పరిశీలిస్తే, 108 శక్తి పీఠాలు ఉన్నట్లు తెలియజేస్తున్నాయి. కాళీ పురాణంలో 18 శక్తి పీఠాల గురించి చెబితే, దేవీ భాగవతంలో 66 శక్తి పీఠాలు ఉన్నట్లు చెప్పారు. శక్తి పీఠాలను అర్థం చేసుకోవడానికి పురాణ ప్రాతిపదిక కొంత మేరకు ఉపయోగపడితే, ఉపాసన పరమైన శాస్త్రం మరికొంత ఉంటుంది. యోగశాస్త్రంలోనూ, మంత్రశాస్త్రంలోనూ ఈ శక్తి పీఠాల ప్రస్తావనం ఉంది.  చైతన్యానికి ఆవాసం మానవ దేహం. 51 శక్తులు మన శరీరంలో అంతర్లీనమై ఈ దేహాన్ని నడిపిస్తున్నాయని చెబుతారు. కళ్లు, చెవులు, పాదాలు, చేతులు ఇలా ప్రతిది ఒక శక్తికి ప్రతీక. అవన్నీ కలిసిన దేహమే శక్తి రూపం. 


లంకాయాం శంకరీదేవీ, కామాక్షీ కాంచికాపురే
ప్రద్యుమ్నే శృంగళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే

అలంపురే జోగులాంబా, శ్రీశైలే భ్రమరాంబికా
కొల్హాపురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికా

ఉజ్జయిన్యాం మహాకాళీ, పీఠిక్యాం పురుహూతికా
ఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్యా దక్షవాటికే

హరిక్షేత్రే కామరూపా, ప్రయాగే మాధవేశ్వరీ
జ్వాలాయాం వైష్ణవీదేవీ, గయా మాంగళ్యగౌరికా

వారాణస్యాం విశాలాక్షీ, కాష్మీరేషు సరస్వతీ
అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభమ్

సాయంకాలే పఠేన్నిత్యం, సర్వశతృవినాశనమ్
సర్వరోగహరం దివ్యం సర్వ సంపత్కరం శుభమ్

 

ఇలా దేశంలోని అష్టాదశ శక్తి పీఠాల గురించి మనకు ఈ శ్లోకం తెలియజేస్తుంది. అయితే, 51 శక్తి పీఠాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు అందులో తప్పకుండా ఉండే శక్తి పీఠం హింగ్లాజ్‌ దేవి. ప్రస్తుత పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్‌ రాష్ట్రంలో ఉందీ శక్తి పీఠం. పాకిస్థానీయులు ఈ ఆలయాన్ని నానీ మందిరంగా పిలుస్తారు. 



ఇది పురాణగాథ
దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి (దాక్షాయణి). కైలాస పర్వతంపై నిత్యం ధ్యానంలో ఉండే పరమశివుడిని చూసి మోహిస్తుంది. ఆ లయకారుడినే తన ప్రాణనాథుడిగా భావిస్తుంది. తండ్రి మాటను కాదని, దేవదేవుడిని వివాహమాడుతుంది. తన నిర్ణయానికి విరుద్ధంగా శివుడిని పరిణయమాడటం ఇష్టం లేని దక్షుడు కోపంతో బృహస్పతియాగాన్ని తలపెడతాడు. దేవతలందరినీ ఆహ్వానిస్తాడు కానీ, తన కుమార్తె సతీదేవి, అల్లుడు పరమేశ్వరుడిని మాత్రం పిలవడు. తండ్రి యాగానికి వెళ్తానని సతీదేవి బయలుదేరుతుంది. పిలుపు రాకుండా వెళ్లడం శ్రేయస్కరం కాదని, శివుడు వారించినా, ‘పుట్టింటి వారు ప్రత్యేకంగా పిలవాలా ఏంటీ’ అని ప్రమధగణాలను వెంటబెట్టుకుని యాగానికి వెళ్తుంది. అక్కడ అందరి ముందు శివుడిని దక్షుడు అవమానిస్తాడు. శివనింద సహించలేక సతీదేవి యోగాగ్నిలో భస్మమైపోతుంది. సతీదేవి మరణ వార్త విన్న శివుడు ఆగ్రహంతో ఊగిపోతాడు. ప్రమధ గణాలతో కలిసి శివ తాండవం చేస్తూ దక్షయగ్నాన్ని భగ్నం చేస్తాడు. కానీ, సతీ వియోగ దుఃఖంతో ఆమె మృత శరీరాన్ని అంటిపెట్టుకుని జగద్రక్షణ కార్యాన్ని మానేస్తాడు. దీంతో దేవతలు వెళ్లి, విష్ణుమూర్తికి మొరపెట్టుకుంటారు. దేవతల ప్రార్థన మన్నించిన శ్రీమహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని ఖండాలుగా చేసి, శివుడి కర్తవ్యాన్ని గుర్తు చేస్తాడు. సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలనే శక్తి పీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్ర సాధకులకు ఆరాధాన క్షేత్రాలు అయ్యాయి. వాటిలో శిరో భాగం(బ్రహ్మ రంధ్రం’ హింగోళమనే ప్రదేశంలో పడింది. అదే ఇప్పుడు పాకిస్థాన్‌లో ఉన్న శక్తి పీఠం హింగ్లాజ్‌ దేవి ఆలయం.  ప్రతి శక్తి పీఠంలోను దాక్షాయణీ మాత భైరవుని (శివుని) తోడుగా దర్శనమిస్తుంది.



మరొక స్థల పురాణం ప్రకారం త్రేతాయుగంలో విచిత్రుడు అనే సూర్యవంశానికి చెందిన క్షత్రియ రాజుకు హింగోళుడు, సుందరుడు అనే కుమారులు పుడతారు. వీరు ప్రజలను, రుషులను పీడించి హింసిస్తుంటారు. ఆ రాకుమారుల బారి నుంచి తమను రక్షించవలసిందిగా ప్రజలు శివుడిని ప్రార్థిస్తారు. శివుని ఆజ్ఞానుసారం గణపతి సుందరుడిని సంహరిస్తాడు. దాంతో రెచ్చిపోయిన హింగోళుడు మరింత విజృంభించి ప్రజలను కష్టాలకు గురిచేస్తాడు. బెంబేలెత్తిన ప్రజలు పరాశక్తిని ఆశ్రయిస్తారు. శక్తి అతడిని వెంటాడుతూ ఈ గుహలలో తన త్రిశూలంతో సంహరిస్తుంది. చనిపోయే ముందు హింగోళునికి ఇచ్చిన వరం ప్రకారం ఆ ప్రాంతంలో కొలువై అతడి పేరుతో హింగుళాదేవిగా ప్రసిద్ధి చెందింది.

మరో ఇతిహాసం ప్రకారం పరశురాముడు క్షత్రియ సంహారం చేస్తున్నప్పుడు 12 మంది క్షత్రియులకు బ్రాహ్మణ వేషం వేసి పరశురాముడి బారి నుంచి కాపాడతారు. ఆ క్షత్రియుల సంతతి తరువాతి కాలంలో బ్రహ్మ క్షత్రియులుగా పిలువబడుతున్నారు. ఈ బ్రహ్మక్షత్రియుల కులదేవత హింగుళాదేవి.

మరో కథనం ప్రకారం దధీచి మహర్షి రత్నసేనుడు అనే సింధుదేశ రాజును పరశురాముడి బారి నుంచి రక్షించడానికి ఆశ్రయమిస్తాడు. దధీచి ఆశ్రమంలో లేని సమయం చూసి పరశురాముడు రత్నసేనుడిని సంహరిస్తాడు. రత్నసేనుడి కుమారులను బ్రాహ్మణ వటువులుగా భావించి వదిలివేస్తాడు. వారిలో జయసేనుడు సింధు రాజ్యానికి వెళ్లి పరిపాలన కొనసాగించాడు. పరశురాముడు అతడిని మట్టుపెట్టడానికి వచ్చినప్పుడు దధీచి మహర్షి ప్రసాదించిన హింగుళా దేవీ మంత్ర ప్రభావంతో కాపాడబడతాడు. ఈ దేవి జయసేనుడిని కాపాడటమే కాక పరశురాముని క్షత్రియవధను నిలిపివేయమని ఆజ్ఞాపిస్తుంది. ఇక రామాయణం ప్రకారం, రావణ వధ తర్వాత రాముడు బ్రహ్మ హత్యదోష నివారణ కోసం హింగ్లాజ్ దేవిని సందర్శించాడని చెబుతారు.



ఎక్కడ ఉంది
భారత స్వాతంత్ర్యానంతరం ముస్లిం మెజార్టీ ఉన్న ప్రాంతంగా పాకిస్థాన్‌ ప్రత్యేక దేశంగా ఆవిర్భవించింది. అయితే, వేదకాలం నుంచి ఆ ప్రాంతమంతా భారత దేశంలో అంతర్భాగం. అక్కడ కూడా హిందూమతం దేదీప్యమానంగా వెలిగింది. ఎన్నో హిందూ ఆలయాలు అక్కడ ఉన్నాయి. అయితే, ఇప్పుడు ఆ దేశం మొత్తం జనాభాలో హిందూ జనాభా 1.5శాతం మాత్రమే. దేశ విభజన తర్వాత చాలా తక్కువ మంది మాత్రమే అక్కడ ఉండిపోయారు. అయినా, ఇప్పటికీ పలు హిందూ ఆలయాలు పాకిస్థాన్‌లో ఉన్నాయి. వాటిలో హింగ్లాజ్‌ దేవి ఆలయం ఒకటి. హింగ్లాజ్‌ దేవిని ముస్లింలు బీబీ నానీగా పిలుస్తారు. పలువురు ముస్లింలు హింగ్లాజ్‌ దేవిని పూజిస్తారు కూడా. పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్‌ తూర్పు ప్రాంతానికి పశ్చిమ ప్రాంతానికి మధ్యలో హింగ్లాజ్‌ దేవి ఆలయం ఉంది. కరాచీ నుంచి 250కి.మీ. ప్రయాణించాల్సి ఉంటుంది. రోడ్డు మార్గం ద్వారానే ఆలయానికి చేరుకోవాలి.



వసంత కాలంలో జాతర
ఏటా ఏప్రిల్ మాసంలో నాలుగు రోజులపాటు ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ సమయంలో సాధువులు, హఠయోగులు హింగ్లాజ్‌ దేవిని కొలుస్తారు. అనేక మంది భక్తులు ఉత్సవాల సందర్భంగా ఈ దేవతను కొలిచి మొక్కు బడులు చెల్లించుకుంటారు. స్థానిక ముస్లింలు ఈ ఉత్సవాలను నానీకీ హజ్ అని పిలుస్తారు. హింగ్లాజ్‌ దేవి ఉత్సవాలు జరిగే సమయంలో భక్తులు పాదయాత్రగా వెళతారు. ఎందుకంటే ఎడారి ప్రాంతాన్ని తలపించే ఆ రహదారి గుండా వెళ్తే అక్కడ వీచే వేడి గాలులు శరీరాన్ని తాకి చేసిన పాపాలను పోగొడతాయని వారి నమ్మకం. అలా పవిత్రమైన దేహంతో అమ్మవారిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని భావిస్తారు. ఒకప్పుడు కేవలం కాలినడకన మాత్రమే అక్కడకు వెళ్లాల్సి వచ్చేది. ఆ తర్వాత ఒంటెలు, గాడిదలపై ప్రయాణించి ఆలయానికి చేరుకునేవారు. 2004 తర్వాత ప్రభుత్వం ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కల్పించడంతో వాహనాల్లో నేరుగా దేవి ఆలయానికి చేరుకోవచ్చు. అయితే, సంప్రదాయం పాటించే వారు ఇప్పటికీ హింగ్లాజ్‌ దేవి ఆలయానికి నడిచి వెళ్తారు. అలా ఆలయ సమీపానికి చేరుకున్న భక్తులు అక్కడ ప్రవహించే హింగ్లోజ్‌ నదిలో స్నానమాచరించి దేవిని దర్శించుకుంటారు. 

హింగ్లాజ్‌ దేవిని దర్శించుకున్న తర్వాత భక్తులు అక్కడి సమీపంలో ఉన్న చంద్రగప్‌, కందేవారీ అనే బురదతో కూడిన అగ్నిపర్వతంపైకి వెళ్తారు. ఆ బురదలో పూలు చల్లి, తమ వెంట తెచ్చుకున్న కొబ్బరి కాయలను అందులో ముంచుతారు. బురద అంటిన ఆ కొబ్బరి కాయలను ఇంటిలో పెట్టుకుంటే శుభాలు జరుగుతాయని మరికొందరి నమ్మకం. కొందరు ఆ బురదను శరీరానికి పూసుకుంటారు. మరి కొందరు ఆ బురదతో చిన్న ఇళ్లు కడతారు. అలా చేస్తే వారి సొంత ఇంటి కల నిజమవుతుందని విశ్వాసం. 

హింగ్లాజ్‌ దేవి ఆలయం చుట్టూ గణేశ్‌దేవ, కాళీ మాత, గురుఘోరక్‌ నాథ్‌ ధూని, బ్రహ్మకుధ్‌, తిర్‌కుంద్‌,  గురు నానక్‌రావ్‌, రామ్‌జరోఖా బేతక్‌, అనిల్‌కుద్‌, చౌరాసీ పర్వతం, చంద్రగూప్‌, అఘోరి పూజ తదితర ఆలయాలు, ప్రార్థనా ప్రదేశాలు ఉన్నాయి. 



కర్తార్‌పూర్‌ కారిడార్‌లా..
సిక్కులకు కర్తార్‌పూర్‌ కారిడార్‌లా భారతదేశంలోని హిందువులు హింగ్లాజ్‌దేవిని దర్శించుకోవడానికి కారిడార్‌ను ఏర్పాటు చేయాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. భాజపా మాజీ ఎంపీ తరుణ్‌ విజయ్‌ ఇదే విషయంపై ప్రధాని నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. హింగ్లాజ్‌ దేవి ఆలయానికి కారిడార్‌ను ఏర్పాటు చేస్తే, ఇరుదేశాలు పర్యాటకంగా అభివృద్ధి చెందుతాయని అన్నారు. హింగ్లాజ్‌ దేవిని తమ కులదైవంగా భావించే వాళ్లు భారత్‌లో అనేకమంది ఉన్నారని, అలాంటి వాళ్లు ఆ దేవిని దర్శించుకునే భాగ్యం కలుగుతుందని ఆయన విన్నవించారు. 

గోపీచంద్‌ ‘సాహసం
ఒకప్పుడు హింగ్లాజ్‌దేవి ఆలయం గురించి తెలుగువారికి పెద్దగా తెలియదు. గోపీచంద్‌ కథానాయకుడిగా చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో వచ్చిన ‘సాహసం’ చిత్రం ఈ ఆలయ ఇతివృత్తంగా సాగుతుంది.

ఓం హింగుళే పరమ హింగుళే అమృతరూపిణీ తనుశక్తి
మనః శివే శ్రీ హింగుళాయ నమః స్వాహా 

Tuesday, July 23, 2019

హనుమత్ ప్రార్ధన

అతులిత బలధామం స్వర్ణ శైలాభదేహం
దనుజవన కృశానుం జ్ఞానినామగ్రగణ్యం
సకలగుణనిధానం వానరాణామధీశం
రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి

సాటిలేని బలవంతుడు,బంగారుకొండవంటి దేహంకలవాడు,అశోకవనాన్ని ధ్వంసం చేసినవాడు,జ్ఞానుల్లోమేటి, సుగుణాలపోగు,వానరులలో అధికుడు,రామభక్తుడైన వాయుపుత్రునకు నమస్కారం.

Tuesday, July 16, 2019

గ్రహణం సమయంలో పారాయణం చేయాల్సిన మంత్రములు

యోసౌ వజ్రధరో దేవ: ఆదిత్యానాం ప్రభుర్మత: |
సహస్రనయన: శక్రో గ్రహపీడాం వ్యపోహతు |
ముఖం య: సర్వదేవానాం సప్తార్చిరమితద్యుతి: |
చంద్రోపరాగసంభూతాం అగ్నే: పీడాం వ్యపోహతు|
య: కర్మసాక్షీ లోకానాం ధర్మో మహిషవాహన: |
యమశ్చంద్రోపరాగోత్థాం గ్రహపీడాం వ్యపోహతు |
రక్షోగణాధిప: సాక్షాత్ నీలాంజనసమప్రభ: |
ఖడ్గహస్తోఽతిభీమశ్చ గ్రహపీడాం వ్యపోహతు ||
నాగపాశధరో దేవ: సదా మకరవాహన: |
స జలాధిపతిర్దేవ: గ్రహపీడాం వ్యపోహతు ||
ప్రాణరూపో హి లోకానాం సదా కృష్ణమృగప్రియ: |
వాయుశ్చంద్రోపరాగోత్థాం గ్రహపీడాం వ్యపోహతు ||
యోఽసౌ నిధిపతిర్దేవ: ఖడ్గశూలగదాధర: |
చంద్రోపరాగకలుషం ధనదోఽత్ర వ్యపోహతు |
యోఽసావిందుధరో దేవ: పినాకీ వృషవాహన: |
చంద్రోపరాగపాపాని స నాశయతు శంకర:||
త్రైలోక్యే యాని భూతాని స్థావరాణి చరాణి చ|
బ్రహ్మవిష్ణుర్కరుద్రాశ్చ దహంతు మమ పాతకం

కేతువు వలన కలిగే దోషాలు - శాంతి మార్గాలు ( చింతా గోపి శర్మ సిద్ధాంతి గారి వాట్సప్ నుండి సేకరణ)

కేతువు పార్ధివ నామ సంవత్సరం ఫాల్గుణమాసం శుక్ల పౌర్ణమి అభిజిత్ నక్షత్రంలో బుధవారం జన్మించాడు. కేతువు బూడిద వర్ణంలో రెండు భుజములతో ఉంటాడు. కేతువు వాహనం గ్రద్ద. బ్రహ్మదేవుడికి తాను సృష్టించి జనం అపారంగా పెరగడంతో వారిని తగ్గించడానికి మృత్యువు అనే కన్యను సృష్టించాడు. మానవులకు మరణం ఇచ్చే బాధ్యతను అప్పగించాడు. తనకు మరణం ఇచ్చినందుకు ఆ కన్య దుఃఖించింది. ఆమె కన్నీటి నుంచి అనేక వ్యాదులు ఉద్భవించాయి. అప్పుడు తెల్లని పొగ రూపంలో ఒక పురుషుడు జన్మించాడు. కీలక నామ సంవత్సరం మార్గశిర కృష్ణ అమావాస్య నాడు మంగళ వారం మూలా నక్షత్రంలో కేతువు జననం జరిగింది.

కేతువు రాశి చక్రంలో అపసవ్యదిశలో పయనిస్తుంటాడు. అంటే మేషం నుంచి మీనానికి.. ఇలా పయనిస్తుంటాడు. రాశిలో ఒకటిన్నర సంవత్సరకాలం ఉంటాడు. సూర్యుడిని ప్రదిక్షిణం చేయడానికి 18 సంవత్సరాల సమయం పడుతుంది. రాహువు కేతువులు ఎప్పుడూ ఒకరికి ఒకరు రాశిచక్రం లోని 7వ స్థానంలో సంచరిస్తుంటారు. కేతు మహర్దశాకాలం 7 సంవత్సరాలు. కేతువు ముక్తి కారకుడు. అశ్విని, మఖ, మూలా నక్షత్రాలకు ఆధిపత్యం వహిస్తాడు. ఈ మూడు నక్షత్రాలలో వారికి జన్మించిన ఆరంభ దశ కేతు దశ.

కారకత్వం
కేతువు మోక్షవిజ్ఞాన కారకుడు చపలత్వము, జ్ఞానహీనత, శత్రు బాధలు, దూర ప్రదేశాలు, దేశాలు తిరుగుట, ఉన్మాదము, దృష్టమాంద్యము, కర్రదెబ్బలు, క్షుద్రము మంత్ర ప్రయోగములు మొదలగునవి కలిగినచో కేతువు బలహీనుడని గుర్తించాలి. వేదాంతం, తపస్సు, మోక్షం, మంత్ర శాస్త్రం, భక్తి, నదీస్నానం, మౌన వ్రతం, పుణ్యక్షేత్ర దర్శనం, మోసం, పరుల సొమ్ముతో సుఖించుట, దత్తత మొదలైన వాటిని సూచిస్తాడు.

వ్యాధుల వ్యాప్తి...
కేతువు మృత్యు కారకుడు, భయాన్ని కలిగిస్తాడు, వ్యాధులను కలిగిస్తాడు. రక్తపోటు, అలర్జీ, మతి స్థిమితం లేక పోవుట మొదలైన వ్యాధులకు కారకుడవుతాడు. అజీర్ణం, స్పోటకం, రక్తపోటు, చెముడు, నత్తి, దురదలు, గ్యాస్, అసిడిటీ, వైద్యం, జ్వరం, వ్రణామలను సూచిస్తాడు కేతువు ఏ గ్రహముతో కలిసిన ఆ అవయవమునందు బాధలు కలిగిస్తాడు. రోగ నిర్దారణ సాగదు కనుక చికిత్స జరుగడంలో సమస్యలు సృష్టిస్తాడు.

కేతువు ధ్యానం
లాంగూలయుక్తం భయదంజనానం కృష్ణాంబు భృత్సన్నిభ మేకవీరమ్|
కృష్ణాంబరం శక్తి త్రిశూల హస్తం కేతుం భజేమానస పంకజే హమ్ ||
ఫలాశపుష్ప సంకాశం తారకా గ్రహ మస్తకం |
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్ ||

కేతు మంత్రము
ఓం హ్రీం క్రూం క్రూరరూపిణే కౌతలే ఐం సాః స్వాహా ||

14 9 16
15 13 11
10 17 11
కేతుయంత్రం
సోమవారం రాత్రి చంద్రహోరలో అనగా రాత్రి 8-9 గంటల మధ్యలో ఈ యంత్రం ధరించాలి. ప్రతి రోజు ఉదయమే స్నానం చేసి శుచిగా కేతుధ్యానం 39 పర్యాయాలు చేయాలి. మంత్రజపం 108 మార్లు జపించి, పైన తెలిపిన ప్రకారము యంత్రాన్ని పూజించి ధరించాలి. 10 సోమవారాలు ఉలవలు దానం ఇవ్వాలి.

పరిహారం
కేతుగ్రహ పరిహార పూజా కోసం కంచు ప్రతిమ మంచిది.
అధి దేవత - బ్రహ్మ
నైవేధ్యం - చిత్రాన్నం
కుడుములు - ఉలవ గుగ్గిళ్ళు
ప్రీతికరమైన తిథి - చైత్ర శుద్ధ చవితి
గ్రహస్థితిని పొందిన వారం - బుధవారం
ధరించవలసిన రత్నజ్ఞం - వైడూర్యం
ధరించవలసిన మాల - రుద్రాక్ష మాల
ధరించవలసిన రుద్రాక్ష - నవముఖి రుద్రాక్ష
ఆచరించవలసిన దీక్ష - గణేశ దీక్ష
మండపం - జెండా ఆకారం
ఆచరించ వలసిన వ్రతం - పుత్ర గణపతి వ్రతం
పారాయణం చేయవలసినది - శ్రీ గణేశ పురాణం
కేతు అష్టోత్తర శతనామావళి - గణేశ శతనామావళి
దక్షిణగా ఇవ్వాల్సిన జంతువు - మేక
చేయవలసిన పూజ - విఘ్నేశ్వర పూజ, సూర్యారాధన
దానం చేయవలసిన ఆహార పదార్ధాలు - ఖర్జూరం, ఉలవలు...అందరికి గురుపూర్ణిమా శుభాకాంక్షలు...

Thursday, July 11, 2019

అకాలవర్షం..అతివృష్టి..అనావృష్టి బాధలుతొలగి సుభిక్షంగా ఉండటానికి  చదవాల్సిన స్తోత్రం..

1)చంద్రప్రభం పంకజ సన్నివిష్టం
పాశాంకుశా భీతివరాన్ దధానం|
ముక్తా కలాపాంకితసర్వగాత్రం
ధ్యాయేత్ప్రసన్నం వరుణంసువృష్ట్యై||

2)అపామధిపతే దేవ దయాళో దీనవత్సల|
త్వం వై జలపతిర్భూత్వా సర్వసస్యాభివృధ్ధయే||

3)నిమంత్రితో మహేశానపూర్వంత్రైలోక్యరక్షణే|
అస్మాభిః ప్రార్ధితో నూనమనావృష్షి ప్రపీడితైః||
అద్యత్రైలోక్య రక్షార్ధం అపఃక్షిప్రం ప్రవర్షయ|||

4)పాశవజ్రధరందేవం వరదాభయ పాణినం|
అభ్రారూఢం చ సర్వేశం వృష్ట్యర్ధం ప్రణమామ్యహం||

5)యస్య కేశేషు జీమూతా నద్యస్సర్వాంగ సంధిషు|
కుక్షౌ సముద్రాశ్చత్వారః తస్మై తోయాత్మనే నమః||

6)పుష్కలావర్తకై ర్మేఘైః ప్లావయన్తం వసుంధరాం|
విద్యుద్గర్జన సంభోధతోయాత్మానం నమామ్యహం||

7)ఆయాతు వరుణం శీఘ్రం ప్రాణినాం ప్రాణరక్షకః|
అతుల్య బలవానత్ర సర్వసస్యాభివృధ్ధయే||

8)ఋష్య శృంగాయ మునయే విభండకసుతాయచ|
నమశ్శాంతాధిపతయే సద్య స్సువృష్టి హేతవే||

9)విభండక సుతశ్శ్రీమాన్ శాంతాపతి రకల్మషః|
ఋష్యశృంగ ఇతిఖ్యాతో మహావర్షం ప్రయఛ్ఛతు||

ఇతి వారుణస్తోత్రం సంపూర్ణం..

గోగ్రాసంలో ఏమి పెట్టవచ్చు?

గోగ్రాసంలో  ఏమి పెట్టవచ్చు?

గోవులకు ఆరోగ్యపరంగా ఏది హితమో దానిని పెట్టవచ్చు. మిగిలిన అన్నాలు,  ఉచ్చిష్టాలు, బహిష్టు స్పర్శించినవి గోవునకు పెట్టరాదు. బహిష్టువారి గాలి కూడా సోకరాదు. గోవునకు గ్రాసం పెట్టేటప్పుడు చదవవలసిన మంత్రం-

సౌరభేయా స్సర్వహితాః, సర్వపాపప్రణాశనాః|
ప్రతిగృహ్ణంతు మే గ్రాసం గావస్త్రైలోక్యమాతరః||

-ఈ మంత్రం మార్కండేయ మహాముని చెప్పినది. దీనితో పాటు ఇష్టదేవతా మంత్రాన్ని మనస్సులో జపిస్తూ మేత పెట్టడం మంచిది. తన భోజనానికి ముందు గోవునకు గడ్డి మొదలైనవి ఇచ్చి,  భుజించువాడు సద్గతిని పొందుతాడని శాస్త్రాలు చెబుతున్నాయి.

శ్రీ ఆది శంకరాచార్య విరచిత గురు అష్టకము

సదాశివ సమారంభాం, శంకరాచార్య మధ్యమాం
అస్మదాచార్య పర్యంతం, వందే గురు పరంపరాం.

“నిజమైన గురువుకి సమానమైనదానిని మూడులోకాలలోను చెప్పలేము. పరుసవేది దేన్నైనా బంగారంగా మార్చుతుందేమో కాని ఇంకొక పరుసవేదిగా మార్చదు. కాని ఒక గురువు తన్ను నమ్మి శరణుజొచ్చిన శిష్యుడిని తనంతటివాడిని చేస్తాడు. కాబట్టి గురువు అసమానుడు. అల్ప బుద్ధి కలవాణ్ణి కూడా పండితుణ్ణి చెయ్యగలడు గురువు.

జగద్గురువులైన ఆదిశంకరులు గురువు గురించి చాలా గొప్పగా చెబుతారు. వారు ఒకచోట అడుగుతారు, “ఎన్ని ఉన్నా, మనస్సు గురు పాదములను పట్టుకోకపోతే ఏమిటి దాని ఉపయోగం?” అని. వారి రచించిఅన్ ‘గురు అష్టకం’లో ప్రతి చోట అడుగుతారు. ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? అని. ఎనిమిది శ్లోకములలోను దీన్ని మకుటంగా ఉంచి మనల్ని ప్రశ్నిస్తున్నారు.

శ్రీశంకర భగవత్పాదులు రచించిన గురు అష్టకం శిష్యునికి ఉండాల్సిన ముఖ్యమైన విషయాన్ని ప్రతిపాదిస్తుంది. శిష్యుడికి ఉండాల్సింది గురువు మీద నమ్మకం, విశ్వాసం. మనకు ఎవరిమీద ఐతే గురి కలుగుతుందో వారే గురువు. లోకంలో నిషిద్ధ గురువులు కూడా ఉంటారు. వాళ్ళని పట్టుకోవడం అంటే బురదపాము నోట్లో ఉన్న కప్పవంటి జీవితం అవుతుంది.

                 🚩(గుర్వాష్టకం)🚩

1)శరీరం సురూపం తథా వా కళత్రం
యశశ్చారు చిత్రం ధనం మేరుతుల్యం
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ ॥

మంచి దేహధారుడ్యము, అందమైన భార్య, పేరు ప్రతిష్టలు, మేరు సమానమైన ధనం ఉన్నా, గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?

2)కళత్రం ధనం పుత్రపౌత్రాది సర్వం
గృహం బాంధవాః సర్వ మేతద్ద్విజాతం
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే
తతః కిం తతః కిం తతః కిం తతః కి౦॥

భార్య, ధనము, పిల్లలు, వారి పిల్లలు, ఇళ్ళు, బంధువులు, గొప్ప వంశంలో జన్మ ఉన్నప్పటికి గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?

3)షడంగాదివేదో ముఖే శాస్త్రవిద్యా
కవిత్వాది గద్యం సుపద్యం కరోతి
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే
తతః కిం తతః కిం తతః కిం తతః కి౦॥

ఆరు వేదాంగములు (శిక్ష, చందస్సు, వ్యాకరణం, నిరుక్త, కల్ప, జ్యోతిష్య), నాలుగు వేదాలు, గద్య పద్య రాయగల జ్ఞానం ఉన్నా, గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?

4)విదేశేషు మాన్యః స్వదేశేషు ధన్యః
సదాచారవృత్తేషు మత్తో న చాన్యః
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే
తతః కిం తతః కిం తతః కిం తతః కి౦॥

విదేశాలలో మంచి పేరు, స్వదేశంలో హోదా పలుకుబడి, అందరూ మెచ్చే గుణము, మంచి జీవితం ఉన్నా, గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?

5)క్షమామండలే భూపభూపాలవృందౌ
సదా సేవితం యస్య పాదారవిందమ్
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే
తతః కిం తతః కిం తతః కిం తతః కి౦॥

గొప్ప రాజ్యానికి చక్రవర్తివైనా, రాజులు మహారాజుల చేత సేవింపబడుతున్నా గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?

6)యశో మే గతం దిక్షు దానప్రతాపాత్
జగద్వస్తు సర్వం కరే సత్ప్రసాదాత్
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే
తతః కిం తతః కిం తతః కిం తతః కి౦ ॥

నీ ఖ్యాతి నలుదెశలా వ్యాపించి ప్రపంచమంతా నీ దయాగుణాన్ని ప్రశంచించినా గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?

7)న భోగే న యోగే న వా వాజిరాజౌ
న కాన్తాసుఖే నైవ విత్తేషు చిత్తం
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే
తతః కిం తతః కిం తతః కిం తతః కి౦॥

భోగము, యోగము, ఇష్టము, అగ్నికార్యము, విషయ సుఖము, విత్తములపై నీ మనస్సు విరక్తి పొందినా, గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?

8)అరణ్యే న వా స్వస్య గేహే న కార్యే
న దేహే మనో వర్తతే మే త్వనర్ఘ్యే
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే
తతః కిం తతః కిం తతః కిం తతః కి౦॥

నీ మనస్సు అరణ్యమున ఉన్నా, ఇంట్లో ఉన్న, సమాన్య విషయములపై తిరుగుతూ ఉన్నా గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?

9)అనర్ఘ్యాణి రత్నాది ముక్తాని సమ్యక్
సమాలింగితా కామినీ యామినీషు
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే
తతః కిం తతః కిం తతః కిం తతః కి౦ ॥

వెలకట్టలేని మణులు, రత్నాలు, వజ్రవైఢూర్యాలు సదా నిన్ను అనిగమించే అంటిపెట్టుకునే భార్య ఉన్నా గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?

19)గురోరష్టకం యః పఠేత్పుణ్యదేహీ
యతిర్భూపతిర్బ్రహ్మచారీ చ గేహీ
లభేత్ వాంఛితార్థ పదం బ్రహ్మసంజ్ఞం
గురోరుక్తవాక్యే మనో యస్య లగ్నం ॥

ఫలశ్రుతి:
ఎవరైతే ఈ గుర్వాష్టకాన్ని చెదువుతారో, నేర్చుకుంటారో, మననం చేస్తారో, గురువు చెప్పిన విషయాలను నిత్యం స్మరిస్తూ గురు పాదపద్మములపై మనస్సు లగ్నం చేస్తారో, అటువంటివారు యోగి అయినా, సన్యాసి అయినా, రాజు అయినా, బ్రహ్మచారి అయినా, గృహస్తు అయినా తనికి శాశ్వత పరతత్వమగు పరబ్రహ్మం సిద్ధిస్తుంది.

Tuesday, July 9, 2019

ఇంట్లో కి ధనం, మనశ్శాంతి రావాలంటే..  చింతా గోపి శర్మ సిద్ధాంతి (భువనేశ్వరి పీఠం) గారి వాఁట్సాప్ పోస్ట్ నుండి సేకరణ


ఇంట్లో కి ధనం, మనశ్శాంతి అన్నీ రావాలంటే ఇంటి ప్రధాన గుమ్మం లక్ష్మీ దేవికి నచ్చేట్టు ఉండాలట. ఇంటి ప్రధాన ద్వారం ముందు కొన్ని శుభకరమైన ఏర్పాట్లు ఉంటే లక్ష్మీదేవీ ప్రీతికరమని ఆధ్యాత్మిక శాస్త్రం చెబుతోంది. ఇంతికీ గుమ్మం ముందు ఏమి ఉంటె లక్ష్మి కటాక్షం కలుగుతుందో ఓసారి చూద్దాం.. * ఇంటి ప్రధాన గుమ్మం ముందు శుభ్రంగా ఉండాలి. పొద్దున్నే చీపురుతో శుభ్రపర్చి, నీళ్ళు చల్లి ముగ్గు వేయాలి. ఇది తప్పనిసరిగా చెయ్యాల్సిన పని.
* ఎందుకంటే స్మశానం ముందున ముగ్గు వెయ్యరు. కనుక ఇంటి శుభప్రదంగా ముగ్గు వెయ్యాలి. గుమ్మానికి ఇరుపక్కల సుగంధ ద్రవ్యాలు వెదజల్లే పువ్వులు ఉంచాలి.

లక్ష్మీదేవికి ఇష్టమైన కలువ పువ్వులను గుమ్మానికి అటుఇటూ పెడితే.. అవి రోజూ మార్చి కొత్తవి పెడితే లక్ష్మీదేవి ఇంట్లో తాండవిస్తుంది. ఒకవేల కలువ పువ్వులు దొరకకపోయినా ఏదోఒక పువ్వులు పెడితే మంచిది.
* గుమ్మం కనుక ఈశాన్యం మూల ఉంటె గుమ్మానికి ఉత్తరం వైపు ఒక రాగి చెంబులో కొద్దిగా పువ్వులు వేసి ఉంచాలి. ఇలా చేస్తే మంచి ఫలితం కలుగుతుంది.
* గుమ్మానికి లోపల అంటే ఇంట్లో రాగి చెంబుతో నీళ్ళు తీసుకుని, దానిలో నీళ్ళు నింపి దానిలో 5 రాగి రూపాయల బిళ్ళలు, పచ్చ కర్పూరం, ఒక ఎర్రని పువ్వు వేసి గుమ్మానికి లోపల ఒక పక్కన ఉంచాలి.
* ఇలా చెయ్యడం ద్వారా దరిద్రం పోయి, సమస్యలు, అప్పుల బాధలు తొలగి తొందరగా లక్ష్మీ కటాక్షం కలుగుఅవకాశం ఉంటుంది.
దేవుడి దగ్గర అవాహనాది పూజ సపర్యలు మరియు మంత్ర జపం చేసిన లక్ష్మి యంత్రం పెట్టిన కూడా మంచి శుభఫలములు కలుగును....

నక్షత్ర గాయత్రి

నక్షత్ర గాయత్రి ఏ నక్షత్రం వారు ఆ నక్షత్ర గాయత్రి ని రోజుకు 9 సార్లు పఠించాలి
1.అశ్విని
ఓం శ్వేతవర్ణై విద్మహే
సుధాకరాయై ధిమహి
తన్నో అశ్వినేన ప్రచోదయాత్

2.భరణి
ఓం కృష్ణవర్ణై విద్మహే
దండధరాయై ధిమహి
తన్నో భరణి:ప్రచోదయాత్

3.కృత్తికా
ఓం వణ్ణిదేహాయై విద్మహే
మహాతపాయై ధీమహి
తన్నో కృత్తికా ప్రచోదయాత్

4.రోహిణి
ప్రజావిరుధ్ధై చ విద్మహే
విశ్వరూపాయై ధీమహి
తన్నో రోహిణి ప్రచోదయాత్

5.మృగశిరా
ఓం శశిశేఖరాయ విద్మహే
మహారాజాయ ధిమహి
తన్నో మృగశిర:ప్రచోదయాత్

6.ఆర్ద్రా
ఓం మహాశ్రేష్ఠాయ విద్మహే
పశుం తనాయ ధిమహి
తన్నో ఆర్ద్రా:ప్రచోదయాత్

7.పునర్వసు
ఓం ప్రజా వరుధ్ధై చ విద్మహే
అదితి పుత్రాయ ధిమహి
తన్నో పునర్వసు ప్రచోదయాత్

8.పుష్య
ఓం బ్రహ్మవర్చసాయ విద్మహే
మహాదిశాయాయ ధిమహి
తన్నో పుష్య:ప్రచోదయాత్

9.ఆశ్లేష
ఓం సర్పరాజాయ విద్మహే
మహారోచకాయ ధిమహి
తన్నో ఆశ్లేష: ప్రచోదయాత్

10.మఖ
ఓం మహా అనగాయ విద్మహే
పిత్రియాదేవాయ ధిమహి
తన్నో మఖ: ప్రచోదయాత్

11.పుబ్బ
ఓం అరియంనాయ విద్మహే
పశుదేహాయ ధిమహి
తన్నో పూర్వఫల్గుణి ప్రచోదయాత్

12.ఉత్తరా
మహాబకాయై విద్మహే
మహాశ్రేష్ఠాయై ధీమహి
తన్నో ఉత్తర ఫల్గుణి ప్రచోదయాత్

13.హస్త
ఓం ప్రయచ్చతాయై విద్మహే
ప్రకృప్రణీతాయై ధీమహి
తన్నో హస్తా ప్రచోదయాత్

14.చిత్తా
ఓం మహాదృష్టాయై విద్మహే
ప్రజారపాయై ధీమహి
తన్నో చైత్రా:ప్రచోదయాత్

15.స్వాతి
ఓం కామసారాయై విద్మహే
మహాని ష్ఠాయై ధీమహి
తన్నో స్వాతి ప్రచోదయాత్

16.విశాఖ
ఓం ఇంద్రాగ్నేస్యై విద్మహే
మహాశ్రేష్ఠాయై చ ధీమహీ
తన్నో విశాఖ ప్రచోదయాత్

17 అనూరాధ
ఓం మిత్రదేయాయై విద్మహే
మహామిత్రాయ ధీమహి
తన్నో అనూరాధా ప్రచోదయాత్

18.జ్యేష్ఠా
ఓం జ్యేష్ఠాయై విద్మహే
మహాజ్యేష్ఠాయై ధీమహి
తన్నో జ్యేష్ఠా ప్రచోదయాత్

19.మూల
ఓం ప్రజాధిపాయై విద్మహే
మహాప్రజాధిపాయై ధీమహి
తన్నో మూలా ప్రచోదయాత్

20.పూర్వాషాఢ
ఓం సముద్ర కామాయై విద్మహే
మహాబీజితాయై ధిమహి
తన్నో పూర్వాషాఢా ప్రచోదయాత్

21.ఉత్తరాషాఢ
ఓం విశ్వేదేవాయ విద్మహే
మహాషాఢాయ ధిమహి
తన్నో ఉత్తరాషాఢా ప్రచోదయాత్

22. శ్రవణ
ఓం మహాశ్రేష్ఠాయై విద్మహే
పుణ్యశ్లోకాయ ధీమహి
తన్నో శ్రవణ ప్రచోదయాత్

23.ధనిష్ఠా
ఓం అగ్రనాథాయ విద్మహే
వసూప్రితాయ ధీమహి
తన్నో శర్విష్ఠా ప్రచోదయాత్

24.శతభిషం
ఓం భేషజాయ విద్మహే
వరుణదేహాయ ధీమహి
తన్నో శతభిషా ప్రచోదయాత్

25.పూర్వాభాద్ర
ఓం తేజస్కరాయ విద్మహే
అజరక పాదాయ ధీమహి
తన్నో పూర్వప్రోష్టపత ప్రచోదయాత్

26.ఉత్తరాభాద్ర
ఓం అహిరబుధ్నాయ విద్మహే
ప్రతిష్ఠాపనాయ ధీమహి
తన్నో ఉత్తరప్రోష్టపత ప్రచోదయాత్

27.రేవతి
ఓం విశ్వరూపాయ విద్మహే
పూష్ణ దేహాయ ధీమహి
తన్నో రేవతి ప్రచోదయాత్ ..

అభీష్టసిద్ధికి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము


శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము
అభీష్టసిద్ధికి క్రింద సూచించిన శ్లోకములను రోజు
108 మార్లు జపించవలెను.

పిల్లల క్షేమార్థము తల్లిదండ్రులు జపము చేయవచ్చును:

1. విద్యాభివృద్ధికి :-

14వ శ్లోకం.
సర్వగ సర్వవిద్భాను ర్విష్వక్సేనో జనార్దనః |
వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః ||

2. ఉదర రోగ నివృత్తికి:-

16వ శ్లోకం.
భ్రాజిష్ణు ర్భోజనం భోక్తా సహిష్ణు ర్జగదాదిజః |
అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః ||

3. ఉత్సాహమునకు:-

18వ శ్లోకం.
వేద్యో వైద్య స్సదాయోగీ వీరహా మాధవో మధుః |
అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః ||

4. మేధాసంపత్తికి:-

19వ శ్లోకం.
మహాబుధ్ధి ర్మహావీర్యో మహాశక్తి ర్మహాద్యుతిః |
అనిర్దేశ్య వపుః శ్రీమా నమేయాత్మా మహాద్రిధృక్ ||

5. కంటి చూపునకు:-

24వ శ్లోకం.
అగ్రణీ గ్రామణీ శ్రీమాన్ న్యాయో నేత సమీరణః |
సహస్రమూర్థా విశ్వాత్మ సహస్రాక్ష స్సహస్రపాత్ ||

6. కోరికలిరేడుటకు:-

27వ శ్లోకం.
అసంఖ్యేయో2ప్రమేయాత్మ విశిష్ట శ్శిష్ట క్రుచ్ఛిచిః |
సిద్ధార్థ స్సిధ్ధసంకల్పః సిద్ధిద స్సిధ్ధిసాధనః ||

7. వివాహ ప్రాప్తికి:-

32వ శ్లోకం.
భూతభవ్య భవన్నాధః పవనః పావనో2నలః |
కామహా కామక్రుత్కాన్తః కామః కామప్రదః ప్రభుః ||

8. అభివృద్ధికి:-

42వ శ్లోకం.
వ్యవసాయో వ్యవస్థానః సంస్థాన స్స్థానదో ధ్రువః |
పరర్థిః పరమ స్పష్ట: స్తుష్ట: పుష్ట శ్శుభేక్షణః ||

9. మరణ భీతి తొలగుటకు:-

44వ శ్లోకం.
వైకుంఠ: పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః ప్రుథుః |
హిరణ్యగర్భః శత్రుఘ్నో వ్యాప్తో వాయు రథోక్షజః ||

10. కుటుంబ ధనాభివ్రుద్ధికి:-

46వ శ్లోకం.
విస్తారః స్థావర స్స్తాణుః ప్రమాణం బీజ మవ్యయం |
అర్థో2నర్థో మహాకోశో మహాభోగో మహాధనః ||

11. జ్ఞానాభివ్రుద్ధికి:-

48వ శ్లోకం.
యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్చ క్రతు స్సత్రం సతాం గతిః |
సర్వదర్సీ నివృతాత్మ సర్వజ్ఞో జ్ఞాన ముత్తమం ||

12. క్షేమాభివ్రుధ్ధికి:-

64వ శ్లోకం
అనివర్తీ నివృత్తాత్మ సంక్షేప్తా క్షేమక్రుచ్ఛివః |
శ్రీవత్సవక్షా శ్శ్రీవాస శ్శ్రీపతిః శ్శ్రీమతాం వరః ||

13. నిరంతర దైవ చింతనకు:-

65వ శ్లోకం.
శ్రీద శ్శ్రీశ శ్శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః |
శ్రీధరః శ్రీకర శ్శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః ||

14. దుఃఖ నివారణకు:-

67వ శ్లోకం.
ఉదీర్ణ స్సర్వత శ్చక్షు రనీశ శ్శాశ్వత స్థిరః |
భూశయో భూషణో భూతి ర్విశోక శ్శోక నాశనః ||

15. జన్మ రాహిత్యమునకు:-

75వ శ్లోకం.
సద్గతి స్సత్క్రుతి స్సత్తా సద్భూతి స్సత్పరాయణః |
శూరసేనో యదుశ్రేష్ఠ స్సన్నివాస స్సుయామునః ||

16. శత్రువుల జయించుటకు:-

88వ శ్లోకం.
సులభ స్సువ్రత సిద్ధ శ్శత్రుజి చ్ఛత్రు తాపనః !
న్యగ్రోధో దుంబరో2శ్వత్ఠ శ్చాణూరాంధ్ర నిషూధనః ||

17. భయ నాశనమునకు:-

89వ శ్లోకం.
సహస్రార్చి స్సప్తజిహ్వ స్సప్తైధా స్సప్తవాహనః |
అమూర్తి రణఘో2చింత్యో భయక్రు ద్భయ నాశనః ||

18. మంగళ ప్రాప్తికి:-

96వ శ్లోకం.
సనాత్సనాతన తమః కపిలః కపి రవ్యయః |
స్వస్తిద స్స్వస్తిక్రుత్ స్వస్తి స్వస్తిభుక్ స్వస్తిదక్షిణః ||

19. ఆపదలు తొలగుటకు, లోక కల్యాణమునకు:-

97 & 98వ శ్లోకం.
అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్జిత శాసనః |
శబ్దాదిగ శ్శబ్దసహ శ్శిశిర శ్శర్వరీకరః ||
అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః |
విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః ||

20. దుస్వప్న నాశనమునకు:-

99వ శ్లోకం.
ఉత్తారణో దుష్క్రుతిహా పుణ్యోదుస్వప్న నాశనః |
వీరహా రక్షణ స్సంతో జీవనం పర్యవస్తితః ||

21. పాపక్షయమునకు:-

106వ శ్లోకం.
ఆత్మయోని స్స్వయం జాతో వైఖాన స్సామగాయనః |
దేవకీ నందన స్స్రష్టా క్షితీశః పాపనాసనః |