దణ్డాత్ప్రతిభయం భూయః శాన్తిరుత్పద్యతే తదా |
నోద్విగ్నశ్చరతే ధర్మం నోద్విగ్నశ్చరతే క్రియామ్ ||
భావము:- చేసిన తప్పుకి దండిచబడితే, మళ్ళీ తప్పు చేయడానికి భయపడతారు, అలా తప్పును అరికట్టినట్టౌతుంది. తద్వార ప్రశాంతత నెలకొంటుంది. ప్రశాంతత లేకపోతే, ఉద్వేగములో ధర్మాన్ని ఆచరించలేరు, అలాగే క్రియలు చేయలేరు. కాబట్టి *దండం దశగుణం భవేత్*. శాంతి నెలకొనాలంటే దుష్టులు దండించ బడాలి.
- మహాభారతం - ఆదిపర్వం - అధ్యాయం 41 - శ్లో. 28 - శమీక ఉవాచ
దండం దశ గుణం భవేత్ అంటారు కదా! ఆ దశ గుణాలు ఏవో మీకు తెలుసా? తెలుసుకోవాలనుందా? ఐతే చూడండి.
శ్లో:-విశ్వామిత్రాహి పశుషు - కర్దమేషు జలేషుచ
అంధే తమసి వార్థక్యే - దండం దశగుణం భవేత్.
అర్థం:-
1. వి =* పక్షి
2. శ్వా =* కుక్క
3. అమిత్ర = శత్రువు
4. అహి =* పాము
5. పశుషు = పశువులు
6.కర్ద మేన =బురద
7. జలేనచ = నీటి యందు
8.అంధః = గుడ్డితనమందు
9.తమసి = చీకటిలో
10. వార్థక్యము = ముసలితనమునందు దండము కర్ర ఉపయోగపడును
భావము:-
పక్షులు, కుక్కలు, శత్రువులు,పాములు, పశువులు, వీటిని పారద్రోలుటకున్ను, బురదలో, నీళ్ళలో, చీకటిలో,గ్రుడ్డితనంలో, ముసలితనంలో అవలంబనంగానున్ను చేతి కర్ర పనికి వస్తుంది.అందుచేతనే దండం దశ గుణం భవేత్ అంటారు.
Source : వేద వ్యాసుడు. (వాఁట్సాప్ గ్రూప్ నుండి సేకరణ)
No comments:
Post a Comment