Translate

Monday, December 16, 2019

శివ ప్రదక్షిణ విధానము

వృషం చండం వృషంచైవ సోమసూత్రం పునర్వ్రుషమ్ । 
చండంచ సోమసూత్రంచ పునశ్చండం పునర్వ్రుషమ్ ॥ 
శివ ప్రదక్షిణే చైవ సోమసూత్రం న లంఘయేత్ । 
లంఘనాత్సోమసూత్రస్య నరకే పతనం ధ్రువమ్ ॥

విశేష ఫలితములను అనుగ్రహించు శ్రీ శివ ప్రదక్షిణ విధానము :

ధ్వజస్తంభము నుండి సవ్యంగా చండీశ్వరుని వద్దకు వెళ్ళి నమస్కరించవలెను.
మరల, ధ్వజస్తంభము వద్దకు వచ్చి నమస్కరించుకొని, సోమసూత్రము వరకు వెళ్ళవలెను.
అదే విధంగా, ధ్వజస్తంభము వద్దకు వచ్చి నమస్కరించుకొని, చండీశ్వరుని చేరవలెను.
మరల ధ్వజస్తంభము మీదుగా (మధ్యలో ఆగకుండా) సోమసూత్రమును చేరవలెను.
అదే విధంగా, ధ్వజస్తంభము మీదుగా (మధ్యలో ఆగకుండా) చండీశ్వరుని చేరి నమస్కరించవలెను.
మరల, ధ్వజస్తంభము వద్దకు వచ్చి నమస్కరించుకోనిన  ప్రదక్షిణ పూర్తి యగును.
(ధ్వజస్తంభము లేని యడల, నందీశ్వరుని నుండి ఈ ప్రదక్షిణ చేయవచ్చును.)
శివ ప్రదక్షిణ చేయునప్పుడు సోమసూత్రమును దాటరాదని తెలిసికొనవలెను.
జగత్కళ్యాణ కారకులైన శ్రీ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహము చేత, జనులందరూ ధర్మాచరణ కల్గినవారై, ఆనందమగు జీవితమును పొందుదురు గాక !
విశ్వస్య కళ్యాణమస్తు :)

No comments: