నిరంతరం సత్యాన్వేషణ జరుపుతూ, అనుక్షణం విద్య గరుపుతున్న నిత్య విద్యార్థుల కోసం ఏర్పాటు చేయబడిన బ్లాగ్ ఇది. ఇందులో నా ఆలోచనలు, భావాలతో పాటు, వివిధ రకాల ఉపయుక్త సమాచారాన్ని పొందుపరుస్తాను, మీ సూచనలు, సలాహాలు సదా అభిలషణీయం. - డా. వేణు మాధవ శర్మ This blog is for the eternal seeker, always striving to learn and grow. I share reflections and insights, blending devotion with wisdom, along with practical guidance for your spiritual and educational path. Dr. M. Venu Madhava Sharma
Translate
Tuesday, September 22, 2020
హనుమంతుడికి తమలపాకులతో పూజ
శ్మశానవాసి (హిందూ ధర్మం వాట్సాప్ గ్రూప్ నుండి)
Saturday, September 19, 2020
పెళ్లి లో కన్యను గంప లో మేనమామ ఎందుకు తెస్తాడు
Friday, September 18, 2020
అధిక ఆశ్వయుజమాసం లో ద్వాదశ రాశులు వాళ్ళు చదవాల్సిన శ్లోకాలు
Sunday, September 13, 2020
హనుమాన్ చాలీసా
సకల బాధా నివారణకు నవగ్రహపీడాహరస్తోత్రం
రాశి ఫలాలు (సెప్టెంబరు 13-19)
మేషం
శుభయోగాలున్నాయి. అనేక విధాలుగా కలసి వచ్చే కాలం నడుస్తోంది. మంచి పనులు చేసి అధికారుల ప్రశంసలు పొందుతారు. వ్యాపార బలం పెరుగుతుంది. స్వయంకృషితో మంచి ఫలితాలను సాధిస్తారు. పదిమందికీ ఉపయోగపడే పనులు చేస్తారు. సంకల్పం ముందుకు నడిపిస్తుంది. ఆరోగ్యంపైన దృష్టి నిలపండి. సూర్యస్తుతి ఉత్తమం.
శ్రమ పెరుగుతుంది. ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. కాలం సహకరించడంలేదు. ఓర్పుతో లక్ష్యాన్ని చేరాలి. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రద్ధ చూపండి. అవసరాలకు ధనం లభిస్తుంది. అపార్థాలకు అవకాశం ఉంది. మొహమాటంతో సమస్యలొస్తాయి. ముందస్తు ప్రణాళిక కాపాడుతుంది. ఒత్తిడిని జయించగలిగితే ఫలితం వస్తుంది. గణపతి ధ్యానం మంచిది.
సర్వ శ్రేష్టమైన ఫలితాలు ఉంటాయి. కాలాన్ని అభీష్టసిద్ధికై ఉపయోగించండి. ఉద్యోగ, వ్యాపారాలు అద్భుతంగా ఉంటాయి. అదృష్టవంతులు అవుతారు. గృహ, భూ, వాహనాది యోగాలు సిద్ధించే కాలమిది. పనుల్లో పురోగతి ఉంటుంది. వారం మధ్యల్లో శుభవార్త వింటారు. ప్రయాణాలు కలిసివస్తాయి. ఇష్టదైవస్మరణ మేలు చేస్తుంది.
ప్రతి అడుగూ ఆలోచించి వేయాలి. ఒత్తిడిలో పొరపాటు జరిగే అవకాశముంది. ఉద్యోగ ఫలితం మిశ్రమం. వ్యాపార నష్టం సూచితం. ముఖ్యకార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. మిత్రుల వల్ల లాభపడతారు. ఖర్చు పెరిగే అవకాశముంది. నూతన బాధ్యతలు వస్తాయి. కొన్ని విషయాల్లో స్పష్టత లోపిస్తుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. సూర్యధ్యానం సదా రక్షిస్తుంది.
అదృష్టవంతులవుతారు. అద్భుతమైన శుభయోగాలున్నాయి. మంచి భవిష్యత్తు లభిస్తుంది. మీ కృషి ఫలిస్తుంది. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. పదవీ లాభం సూచితం. వ్యాపారం బాగుంటుంది. కలసివచ్చే నిర్ణయం తీసుకుంటారు. ఇంటా బయటా గుర్తింపు లభిస్తుంది. కొన్ని ఆటంకాల నుంచి త్వరగా బయటపడతారు. శివారాధన శ్రేష్ఠం.
ముఖ్య కార్యాల్లో శ్రద్ధ పెంచాలి. ఆవేశపరిచే సంఘటనలు ఉన్నాయి. వారం మధ్యలో ఆర్థికలాభం సూచితం. విజయావకాశాలు పెరుగుతాయి. ఉద్యోగంలో తగినంత గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవుతాయి. వారం చివర శుభం జరుగుతుంది. ఆరోగ్య పరిరక్షణ అవసరం. ఆదిత్య హృదయం చదివితే మనశ్శాంతి లభిస్తుంది.
పనులు పూర్తికావాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. సొంత నిర్ణయం మేలుచేస్తుంది. ఉద్యోగంలో మంచి ఫలితముంది. వ్యాపారపరంగా విఘ్నాలు ఎదురవుతాయి. ఆటుపోట్లు తట్టుకుని అద్భుతమైన భవిష్యత్తును సాధిస్తారు. వారం మధ్యలో ఒక ప్రమాదం నుండి బయటపడతారు. ఇష్టదేవతను స్మరించండి. కోరిక నెరవేరుతుంది.
అద్భుతమైన శుభ ఫలితాలుంటాయి. అన్ని విధాలాపైకి వచ్చే యోగముంది. గొప్ప కార్యాలు సాధించే అవకాశముంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. నూతన ప్రయత్నాలు సత్ఫలితాన్నిస్తాయి. బంధుమిత్రుల సూచనలు పనిచేస్తాయి. చంచలత్వం లేకుండా మనోబలంతో ముందుకు సాగండి. మేలు జరుగుతుంది. దుర్గాధ్యానం శుభప్రదం.
ముఖ్యకార్యాల్లో కార్యసిద్ధి ఉంటుంది. ధైర్యంగా ముందడుగు వేయండి. ఆర్థికస్థితి మెరుగుపడుతుంది. ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. శాంతంగా మాట్లాడాలి. మిత్రులద్వారా శుభం జరుగుతుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. వారాంతంలో కార్యసిద్ధి లభిస్తుంది. ఆంజనేయస్వామి స్మరణ మేలుచేస్తుంది.
విఘ్నాలను అధిగమిస్తారు. ఆర్థికనష్టం జరగకుండా చూడాలి. నిదానంగా నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగపరంగా ఆటంకాలు ఎదురైనా శుభమే జరుగుతుంది. వ్యాపారంలో విఘ్నాలు పెరుగుతాయి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. విశ్రాంతి అవసరం. ఇబ్బంది పెట్టేవారున్నారు. మౌనం రక్షిస్తుంది. వారాంతంలో విజయం లభిస్తుంది. శనిధ్యానం శుభప్రదం.
అదృష్టయోగముంది. కొన్ని పనుల్లో కార్యసిద్ధి లభిస్తుంది. తెలివితేటలతో పెద్దలను మెప్పిస్తారు. ఉద్యోగంలో అనుకున్నది జరుగుతుంది. శత్రుదోషం తొలగుతుంది. వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం. మిత్రబలం పెరుగుతుంది. శాశ్వతమైన కీర్తి లభిస్తుంది. ఇంట్లో ప్రశాంతతతో ఉత్తమ జీవితాన్ని అనుభవిస్తారు. ఇష్టదైవాన్ని స్మరించండి. మనశ్శాంతి లభిస్తుంది.
అన్నీ శుభాలే ఉన్నాయి. మంచి భవిష్యత్తు లభిస్తుంది. ఉద్యోగఫలం అద్భుతం. ధనధాన్య లాభాలుంటాయి. రుణ సమస్యలు రానీయకండి. విఘ్నాలను సమర్థంగా ఎదుర్కొంటారు. కృషికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. గృహ, వాహన లాభాలు సూచితం. సుఖ సౌఖ్యాలుంటాయి. మంచి భవిష్యత్తును పొందుతారు. ఈశ్వరారాధన మంచిది.