Translate

Sunday, September 13, 2020

షడ్ర్గహ స్వక్షేత్రస్థితి



అందరికీ నమస్కారం ప్రస్తుతం స్వక్షేత్ర గ్రహస్థితి గురించి అరుదైన చర్చ జరుగుతోంది.
అయితే స్వక్షేత్ర గ్రహస్థితి కొన్ని వందల సంవత్సరాల వరకు ఏర్పడదు ? ఇప్పుడే ఇది లభించింది మరలా ముందుకు వెళ్ళినా రెండుమూడు వందల సంవత్సరాలకు లేదు వెనక్కు రెండు వందల సంవత్సరాలు వెళ్ళినా లేదు? ఇది వాస్తవ మేనా?

ఇక్కడ మనం ముందుగా గ్రహములయొక్క గమనాన్ని ఆలోచించాలి.

🌞సూర్యుడుని గమనిస్తే ప్రతినెలకు ఒకరాశిలో సంచరిస్తాడు సంవత్సరకాలంలో 12 రాశులు సంచరిస్తాడు ప్రతి సంవత్సరం అగష్డు 16 తేది షుమారు ఒకరోజు అటు ఇటుగా తన స్వక్షేత్రమైన సింహ రాశిలోకి వస్తాడు.🌞

🌝చంద్రుడు షుమారు రెండురోజుల ఒకపూట ఒక్కొక్క రాశిలో ఉంటూ నెలలోనే పన్నెండు రాశులను పూర్తి చేస్తాడు అలా నెలకు ఒకసారి తన స్వక్షేత్రంలోకి వస్తాడు 🌝

🌸ఆగష్టు 16 తర్వాత పునర్వసు నాలుగోపాదం నుంచి ఆశ్లేష నక్షత్రం వెళ్ళేవరకు చంద్రుడు కర్కాటకంలో రవి సింహంలో ఉంటారు వీరిద్దరూ ప్రతిసంవత్సరం వారివారి స్వక్షేత్రాలలో ఒకేసారి ఉండటం  జరుగుతుంది.🌸
              

బుధుడు ఒకరాశిలో నెల రోజులు ఉంటాడు రోజుకి ఒకడిగ్రీ సంచరిస్తాడు సూర్యసంక్రమణానికి దగ్గరలో షుమారు ఒకటిరెండు రోజుల వ్యవధి తో ఒక పది రోజులలోపు బుధ సంక్రమణం జరుగుతూ ఉంటుంది.

అలా చూసినప్పుడు రవి చంద్ర బుధులు ప్రతి సంవత్సరం వారి వారి స్వక్షేత్రాలలో ఏక కాలంలో  ఉండటం జరుగుతుంది.

గురుడు సంవత్సరానికి ఒకరాశిలోనికి మారతాడు ఇలా గురుడు తన స్వక్షేత్రములయిన ధనస్సు మీనములలోకి ఒకసారి వస్తే మళ్ళీ రావటానికి 12 సంవత్సరాలు పడుతుంది.
            

🌸ఇలా పన్నెండు సంవత్సరాలకు ఒకసారి చంద్ర, బుధ, రవి, గురులు తప్పక ఒకేకాలంలో వారి స్వక్షేత్రాలలో కలిసే అవకాశం ఉన్నది.🌸

📍శని ఒక్కొక్క రాశిలో రెండున్నర సంవత్సరములు ఉంటాడు   తన స్వక్షేత్రములైన మకర కుంభములందు ఐదు సంవత్సరములు ఉంటాడు. తదుపరి మరలా మకరానికి రావటానికి తిరిగి మరలా ఇరవై ఏడున్నర సంవత్సరాలు పడుతుంది.📍

ఇక్కడ శని గురు చంద్ర రవి బుధులు  ఒకేసారి స్వక్షేత్రాలలో కలిసే అవకాశం తక్కువగా ఉంటుంది.
              

కుజుడుని పరిశీలిస్తే ఒకరాశిలో 45 రోజులు ఉంటాడు తన స్వక్షేత్రములయిన మేష వృశ్చికములో ఉన్న సమయంలో కొన్ని గ్రహాలు స్వక్షేత్రంలో ఏక కాలంలో ఉండే అవకాశం ఉంటుంది.

అలానే శుక్రుడు రోజుకు ఒకడిగ్రీ సంచరించి ఒకరాశిలో నెల రోజులు ఉంటాడు తన స్వక్షేత్రములయిన వృషభ తులలలో  ఉన్న సమయంలో కొన్ని గ్రహములు స్వక్షేత్రములో ఏక కాలంలో ఉండే అవకాశం ఉంటుంది.

🌹ఏవైనా మూడు నాలుగు గ్రహముల  వరకు వాటి వాటి స్వక్షేత్రములలో ఏక కాలంలో అతి తక్కువ కాలంలోనే  మనకు కనబడే అవకాశం ఉన్నది.🌹


📍అయితే ఇలా శని గురులు కూడా కలిసి ఉండటం కొద్ది అరుదుగా ఎక్కువ కాలం తీసుకుంటే గాని ఈ  అవకాశం లభించదు‌. అటువంటి అవకాశం ఈసంవత్సరం ఈనెలలో మనకు లభించింది.


🌹సూర్యభగవానుడు సింహరాశిలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నారు

🌹చంద్రుడు కర్కాటక రాశిలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నారు

🌹కుజుడు మేష రాశిలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నారు.

🌹బుధుడు కన్య రాశిలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నారు.

🌹గురువు ధనస్సు రాశిలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నారు

🌹శని మకర రాశిలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నారు

ఈ కాలాన్ని అందరూ దైవ పరంగా సద్వినియోగం చేసుకంటం మంచిదా ? 
               

🌹ఒకటవ యోగం: 13వ తేదీ వృశ్చిక లగ్నం మరియు వృశ్చిక నవాంశ అనగా వర్గోత్తమాంశకాలం ఉదయం 11:36 నుండి 11:51 వరకు. 

🌹రెండవ యోగం: 14వ తేదీ వృశ్చిక లగ్నం మరియు వృశ్చిక నవాంశ అనగా వర్గోత్తమాంశకాలం ఉదయం 11:32 నుండి 11:47 వరకు. 

🌹మూడవయోగం: 15 వ తేదీ వృశ్చిక లగ్నం మరియు వృశ్చిక నవాంశ అనగా వర్గోత్తమాంశకాలం ఉదయం 11:28 నుండి 11:43 వరకు. 

🌸ఈకాలంమంచిదా అంటే మంచిదే.
ఈ సమయంలో చేసే దీపారాధన, ధ్యానము, జపం పూజ, అధిక ఫలితాలనుకలిగిస్తాయా అంటే భగవంతునికి ఎప్పుడు చేసినా విశేషమే. భక్తితో ఎప్పుడు చేసినా ఆఫలితాలు కలుగుతాయి. 

కాని మనందరి నైజం ఏదో ఒక ప్రత్యేకత దానివలన ఏదో వస్తుంది అంటే అప్పుడు భగవధ్యానం పూజ చేస్తాం. ఇలా మంచి గ్రహ స్థితిలో అయినా అందరూ ప్రార్ధిస్తే ఆలాభం కలుగుతుంది అని చెప్తారు పెద్దలు.🌸

ఇక్కడ ఈ అరుదయిన స్థితి జాతక భాగానికి చెప్పినదే కాని ప్రత్యేకంగా శాస్త్రంలో ఆరాధనా విధానాలకు ఈ కాంబినేషన్ కు సంబంధం చెప్పలేదు. 

జ్యోతిష్య పరంగా మనం ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనే సదుద్దేశ్యంతో అందరూ సుఖంగా శుభంగా ఉండాలనే సద్భావనతో కొద్దిగా  విశేషంగా కొన్ని వందల సంవత్సరాలకు గానీ లభించదూ అని చెప్తారు.
అయితే ఈ అవకాశం మాత్రం అరుదుగా లభించేదే.

2020 సెప్టెంబర్ 3 తారీఖు నుండి స్వక్షేత్ర పంచ గ్రహ కూటమి మొదలైంది. 2020 సెప్టెంబర్ 16 వరకు ఈ పంచ గ్రహ కూటమి ఉంటుంది.
13,14,15లలో షడ్గ్రహ కూటమి ఉంది.

No comments: