ఈమె దశమహా విద్యలలో ఏడవది ధూమావతి
దశమహావిద్యలలో అతి విచిత్రమైన అవతారం ఇది.ఈమె ఒక వితంతువుగా తంత్ర శాస్త్రంలో పేర్కొనబడినది. ఈమెను దూమ్రావతి అని కూడా అంటారు. యోగనిద్రా స్వరూపిణి అంటే యోగులైనవారిని యోగనిద్రలో ఉంచేటువంటి శక్తి. ఈమె ఉగ్రదేవత.
ఒక నాడు పరమశివుడు ధ్యానంలో ఉండగా పార్వతీదేవి ఆకలిగా ఉంది అని అడుగగా శివుడు వేచి ఉండమనెను, మరల కొంత సమయం గడిచాక పార్వతిదేవి శివుని చూచి ఆకలి అని అడుగగా శివుడు మరల వేచి ఉండమని చెప్పెను, అది విని పార్వతిదేవి మిక్కిలి కోపంతో శివుని మ్రిగేసింది. ఆమెలో ఉన్న శివుడు కోపంతో మూడోకన్ను తెరచి పార్వతిదేవితో ఇట్లనెను “ఈ లోకంలో పురుషుడు అనే వాడు ఉండడు అనెను” దాని ప్రతిఫలమే ఆమె వితంతువు రూపం. శివుడు మూడో కన్ను తెరువగా ఆమెలో నుండి పొగ రాసాగింది అందువల్లనే ఆమెకు ధూమవతి అని పేరు.
దశ మహావిద్యలకు జ్యోతిష శాస్త్ర సారుప్యత దృష్ట్యా ధూమవతి కేతుగ్రహాదిష్టాన దేవత. ఈమె చూడటానికి వికారంగా, చేతిలో చాటతో, పొగసూరిన బట్టలతో, మెల్లకళ్ళతో, గుర్రంలేని బండిపై కూర్చుని ఉంటుంది.ధూమవతి సిద్ధిని ప్రసాదించే తల్లి.
యత్ర అగ్నిః తత్ర ధూమః – అవిద్య నుండి విద్యను, విద్యాతత్త్వాన్ని అనుభూతి చేయగలది ధూమావతి. మానవుని నిద్రా, నిద్రారాహిత్యాలు ధూమవతి యొక్కవైభవము
ధూమావతి అంటే ఉపాసనా పరంగా మహామౌనమని కూడా అర్థం. ఉపనిత్తులలో పేర్కొన్న భూమావిద్య. ఇది పూర్ణవిద్య మరియు అపూర్ణవిద్య కూడా – విద్యాఽవిద్యా స్వరూపిణి
లౌకికంగా ఆలోచిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ముందు జ్యేష్టాదేవి కృపతో అలక్ష్మిని తొలగించికోవాలి, జ్యేష్టాదేవి దయ ఉంటేనే లక్ష్మీదేవి ప్రాసాదించే సంపద మనకు దక్కుతుంది. ధూమావతి మంత్రాలలో జ్యేష్టాదేవి మంత్రంకూడా వుంది. లోకంలో సంపద ఉంచాలన్నా తీసేయాలన్నా ఈమే కారణం.
7వ మహా విద్య
దశ మహావిద్యలలో 7వ మహావిద్య.. ధూమ వర్ణంతో దర్శనమిచ్చే శ్రీ ధూమవతీ దేవికి చెందింది. జ్యేష్ఠమాసం శుక్లపక్ష అష్టమీతిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైంది. ఈ దేవతకి ఉచ్చాటనదేవత అని పేరు. తన ఉపాసకుల కష్టాల్ని, దరిద్రాల్ని ఉచ్చాటన చేసి అపారమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ ధూమవతీదేవి ఆరాధనవల్ల సాధకుడికి వివిధ వ్యాధుల నుంచి, శోకాల నుంచి విముక్తి లభిస్తుంది.
*||శ్లోకం||*
*అత్యుచ్చా మలినాంబరాఖిలజనోద్వేగావహా దుర్మనా*
*రూక్షాక్షి త్రితయా విశాలదశనా సూర్యోదరీ చంచలా|*
*ప్రస్వేదామ్బుచితా క్షుధాకులతను: కృష్ణా తిరూక్ష ప్రభా*
*ధ్యేయా ముక్త కచా సదాప్రియకలిర్ధూమావతీ మంత్రిణా|*
దుఃఖదాయకమైన పరివర్తనాన్ని ధూమవతిగా చెప్పారు. *జ్యేష్ట శుక్ల అష్టమి* రోజున ఈమె జయంతి జరుపుతారు. ధూమవతి రాత్రిని *దారుణ రాత్రిగాను,* అక్కడ శివుడిని కాలభైరవునిగానూ వర్ణిస్తారు. స్థిత ప్రజ్ఞతకు ధూమవతి ప్రతీక. ఈమెది కాకి వాహనం. వాసనాగ్రస్త మనసుకు ప్రతీక. అంతరం లేని మనసుకు, అసంతృప్తికి ప్రతీక. ఆమెకు ఉన్న ధూమశరీరం, తమో మయమైన బుద్ధికి అవివేకానికి చిహ్నం. జీవునికి (సాధకునికి) జన్మలో లభించిన దీనావస్థలన్నీ అంటే బుభుక్షా, పిపాస, కలహా, దారిద్య్రాది వ్యసనాలే ధూమవతి కార్యకలాపాలు.
వేదవిద్యలో లభించే క్రదువు అనే మాటకు అసురత్వ భూమికలైన వృక్షస్తేన, అహి, వృతభృతులను ఇది ఉత్పత్తి చేస్తుంది. తంత్ర గ్రంధాలలో ధూమవతి ఉగ్రతారగా వర్ణితమైనది. ఆమె ధూమ్రత్వమే ఆమెకు ఆ పేరు తెచ్చిపెట్టి సార్థకం చేసింది.
దేవి ప్రసన్నంగా ఉన్నప్పుడు ఏ విధంగా రోగాలను నయం చేస్తుందో కుపితగా మారితే సమస్త సుఖాలను, కామమును హరించి వేస్తుంది. దేవి శరణుపొందిన మానవులకు విపత్తులు ఉండవు. సంపద ప్రాప్తిస్తుంది. ఇతరులకు సహాయపడే శక్తి లభిస్తుంది.
ఋగ్వేద సూక్తంలో దేవి “సుతారా” అని వ్యవహరితమైంది. అంటే సుఖ పూర్వ యోగ్యదాయిని అని అర్థం. తారా తారిణి అనే పేర్లతో వర్ణించారు.
ఋణాన్ని దూరం చేసేది అంటే ఆ భావాన్ని, సంకటాన్ని దూరం చేసే ధనంగాను, సుఖాన్నిచ్చే తల్లిగాను అవతరించింది. కనుక ఈమెకు “భూతి” అనే పేరు కూడా ఉంది.
భగవద్గీతలో “ధూమే న వ్రియతేవహ్నిః” అని ఉంది. అంటే జ్ఞానం, అజ్ఞానం అనే ధూమం చేత ఆవరింపబడి ఉంటుంది అనీ, జ్యోతి స్వరూపిణి అయిన దేవి దానిని విచ్ఛిన్నం చేసి మోక్షాన్ని ఇస్తుందని అర్థం. ధూమవతి వికృతి శక్తిగా చెప్పబడింది. ముసలమ్మ దేవత చావుపుట్టుకల గూర్చిన పాఠాలను ధూమవతి బాగా చెబుతుంది. ఆమె తన దివ్య స్వప్నాలకు స్వస్తిపలికి వ్యక్తంగాని యువస్వప్నాలలోని నిజాలను ముసుగు తీసి ప్రదర్శిస్తుంది. ధూమం అంటే పొగ. పొగతో నిండేది ప్రకాశం కాదు. ఆమె స్వభావం అంతర్థానం. తెలివిని అంతర్థానం చేసి దాని (లోతున) చాటున ఉన్న నిజాన్ని లాగి చూపిస్తుంది. ప్రళయ కాలంలో యోగనిద్ర యుక్త పురుషులలో నిత్యానంద నిద్ర ధూమవతీ లక్షణం. సంసారంలో చిక్కుకుని ఉన్నవాళ్ళను నిద్ర, మూర్ఛ, మరపులాంటి ఏ అజ్ఞానం కప్పి ఉండటం వల్ల సంసారులు ఆత్మను వెతుక్కోలేక పోతున్నారో అది కూడా ధూమవతియే.!! 🙏💖🌷
1 comment:
mee site bagundi.. music background is very simple super.. its good.. i saw the article of dhumavati
Post a Comment